justice eswaraiah
-
కులరహిత వ్యవస్థకు తొలి అడుగు
కులగణనపై అనేక మంది అనేక వ్యాఖ్యలు చేస్తూ తమ అసలు రూపం ప్రకటిస్తున్నారు. కులగణన చాలామందికి గొంతు దిగని పచ్చివెలక్కాయలా మారిందనిపిస్తుంది. తెలంగాణలో కులగణన, సమగ్ర కుటుంబ సర్వే ప్రశ్నాపత్రంపై కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. కనీస సదుపాయాల లభ్యత పరంగా వివిధ సముదాయాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలియాలంటే సమగ్ర కుటుంబ సర్వే అవసరం. అసెంబ్లీ, పార్లమెంటులు కాదు, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్నడూ ప్రాతినిధ్యం లభించని కొన్ని సముదాయాలున్నాయి. రాజకీయ ప్రాతినిధ్యం ఏ వర్గానికి, ఏ సముదాయానికి ఎంత ఉందో తెలుసుకోకుండా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి రాజకీయ అనే పదం గురించిన అభ్యంతరాలు అర్థం లేనివి.కుటుంబ సర్వేలో ఆస్తుల వివరాలు ఎందుకు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. ఇదేదో వ్యక్తిగత హక్కులకు భంగమైనట్లు వాదిస్తున్నారు. సంపాదన వివరాలు తెలియజేసి ఆదాయపన్ను చెల్లించడం పౌరుల బాధ్యత కాదా? వివిధ సముదాయాల ఆర్థిక స్థితి గతులు తెలుసుకోవడం కూడా సర్వే ముఖ్యమైన లక్ష్యం. కాబట్టి పక్కా ఇంట్లో ఉంటున్నారా? పూరిగుడిసెలో ఉంటున్నారా అనే ప్రశ్నలు అడగవలసినవే. ఆస్తులే మున్నాయి? అసలున్నాయా? ఇల్లు ఉందా లేదా? ఎక్కడ తలదాచు కుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ అవసరమైనవే. ఈ ప్రశ్నలకు జవాబుల్లోనే ఏ సముదాయం ప్రజలకు ఆదాయవనరులు అందుబాటులో లేవు, ఎవరికి విద్యావసతి అందుబాటులో లేదు వంటి వివరాలు తెలుస్తాయి. రాజ్యంగం ప్రకారం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం లభించాలి. అవసరమైన గణాంకాలు లేకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఎలా సాధించగలం?ఉండవలసిన ప్రశ్నలుఇది ప్రాచీన దేశం. వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఉనికిలోకి వచ్చాయి. విభిన్న సముదాయాల స్థితిగతుల్లో చాలా తేడా కనిపిస్తుంది. అర్ధసంచార జాతులు, సంచార జాతులు, డినోటిఫైడ్ ట్రైబ్స్ అనేకం ఉన్నాయి. వారికి సంబంధించిన గణాంకాలు లేకపోతే, ప్రభుత్వం ప్రణాళికా రచన ఎలా చేయగలదు? అందువల్లనే రాహుల్ గాంధీ తన న్యాయ్ యాత్రలో ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పారు. డాటా లేకపోతే వెనుకబాటును నిర్ధారించి రిజర్వేషన్లు కల్పించడం ఎలా సాధ్యం? వెనుకబడిన వర్గాలన్నీ పేదవర్గాలు కాకపోవచ్చు. వారందరికీ రిజర్వేషన్లు అవసరం లేకపోవచ్చు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించాలంటే డాటా కావాలి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాల్లో ఏ సముదాయం ఎంత శాతం కలిగి ఉంది? రాజ్యంగంలోని అధికరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం అందరికీ ఉండాలి. రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం కాని, సామాజిక, ఆర్థిక సంక్షేమ చర్యలు చేప ట్టడం కాని ఏది చేయాలన్నా డాటా అవసరం. రాజ్యాంగంలోని అధి కరణ 17 ప్రకారం అంటరానితనం నేరం. సమాజంలో ఏదో ఒక రూపంలో అంటరానితనం ఉంది కాబట్టి ఈ సర్వేలో దానికి సంబంధించి ఒక ప్రశ్న ఉండవలసింది. విద్యాహక్కు అందరికీ ఉంది. కానీ ఎంతమందికి విద్య అందు బాటులో లేదు? అధికరణ 23 హ్యూమన్ ట్రాఫికింగ్‌ను నిషేధిస్తుంది. వెట్టిచాకిరిని నిషేధిస్తుంది. సర్వే జరగకపోతే ఎంత మంది వెట్టిచాకిరిలో ఉన్నారు? అనే వివరాలు ఎలా తెలుస్తాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న కూడా ప్రస్తుత సర్వేలో లేదు. మహానగరాల రెడ్ లైట్ ఏరియాల్లో, ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎంతమంది మగ్గిపోతున్నారు? వెట్టిచాకిరి, హ్యూమన్ ట్రాఫికింగ్, బాలకార్మికులు వంటి సమస్యలు పరిష్కరించాలంటే డాటా కావాలి. సంపద కొందరి చేతుల్లోనే పోగుపడరాదు. ఆర్థిక వ్యవస్థ పుంజు కోవాలంటే, సంపదకు సంబంధించిన డాటా ఉండాలి. ఎవరు ఎంత భూమి కలిగి ఉన్నారు? ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు? ఏ కులం పరిస్థితి ఎలా ఉంది? ఎవరి బ్యాంకు ఎక్కౌంట్లు ఎలా ఉన్నాయి?వంటి ప్రశ్నలకు సమాధానాలు వస్తేనే ఎవరు సంపన్నులు, ఎవరు బాగా బతుకుతున్నారు? ఎవరు ఇతరుల వాటాను కబళిస్తున్నారు? వంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అందుకే దోపిడీ శక్తులు కులగణనను వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకిస్తున్న వారంతా అగ్రవర్ణాలకు చెందినవారే అన్నది గమనించాలి. దురదృష్టవశాత్తు కొందరు అభివృద్ధి చెందిన వెనుకబడిన కులాలవారు, అభివృద్ధి సాధించిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగల వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం కూడాను. ఎందుకు అవసరం?ఇందిరా సాహ్ని కేసుతో సహా అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయమై స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చింది. 1966లో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు కోర్టులు ఈ ప్రతిపాదనను డాటా లేనందువల్ల కొట్టేశాయి. సర్వేలు ఏవీ జరగ లేదు. మురళీధర్ కమిషన్ విషయంలోనూ ఇదే జరిగింది. మురళీధర్ కమిషన్ ఈ సర్వే నిర్వహించలేదు. డాటా లేదన్న కారణంతో కోర్టులు కమిషన్ సిఫారసులను కొట్టేశాయి. భారతదేశంలో ఇప్పుడు లభి స్తున్న రిజర్వేషన్లకు కారణం బ్రిటిషు వారి కాలంలో, 1931లో చేసిన కులగణన. దీని ఆధారంగానే మండల్ కమిషన్ రిపోర్టు ఇవ్వడం జరిగింది. మండల్ కమిషన్ రిపోర్టులో బీసీ జనాభా 52 శాతంగా నిర్ధారించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ కులగణన చేయించలేదు. కులగణన అనేది రాజ్యాంగబద్ధమైన అవసరం.అధికరణ 38 ప్రకారం ప్రభుత్వం సోషల్ ఆర్డర్‌ను కాపాడటం ద్వారా ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలి. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ న్యాయాలు సాధించాలి. ఇందులో రాజకీయ న్యాయాన్ని కూడా మరిచిపోరాదు. పురుషులు, మహిళలకు సమానంగా తగిన జీవనోపాధి హక్కు, భౌతిక వనరుల యాజమాన్యం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణకు దారి తీయకుండా చూడటం, సమాన పనికి సమాన వేతనం గురించి ప్రభుత్వాలకు నిర్దేశాలున్నాయి. గణాంకాలతోనే సామాజిక న్యాయంస్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. అదే అధికరణ 243 డి 6. ఈ అధికరణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది. 1992లో ఈ అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు పంచాయితీల్లో, చైర్పర్సన్ల ఎన్నికల్లో తమ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పొందే హక్కు ఉంది. అయితే వెనుకబడిన వర్గాలు రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన రిజ ర్వేషన్లు పొందగలరు. అందువల్లనే అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో పంచా యత్ రాజ్ చట్టం 1994 తీసుకువచ్చారు. ఆ విధంగా స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లు 1994 నుంచి గత ఎన్నికలకు ముందు వరకు లభిస్తూ వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు క్యాప్ 50 శాతం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మిగిలిన స్థానాల లభ్యతను బట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే కుల సముదాయాల డాటా అందుబాటులో లేకపోవడం వల్లనే. అందు వల్లనే కులగణన అవసరం.సమగ్ర కుటుంబసర్వేలో కానీ, కులగణనలో కానీ ఉన్న ప్రశ్నలు పాతవే. 2011లో జరిగిన సర్వేలో ఉన్న ప్రశ్నలే ఇప్పుడూ అడుగు తున్నారు. అప్పుడు ఎవ్వరు అభ్యంతరాలు చెప్పలేదు. నిజానికి, గణాంకాల చట్టం ఉంది. అధికరణ 342 ఏ (3) ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. శ్రీశ్రీశ్రీ రవిశంకర్ దేశంలో కులగణన జరిగితే తిరుగుబాట్లు జరుగుతాయని మాట్లాడారు. కులగణన జరగకపోతేనే అణగారిన వర్గాలు తిరగబడి అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. కులరహిత వ్యవస్థ ఏర్పడాలంటే కులగణన తప్పనిసరి అవసరం. బడుగు బలహీనవర్గాలు సామాజికంగా కాస్త పైస్థాయికి చేరుకున్న ప్పుడే కులాంతర వివాహాలు జరుగుతాయి. ఆ విధంగా కులనిర్మూ లన జరుగుతుంది. అందువల్ల అందరూ కులగణనకు సహకరించా లని కోరుతున్నాను. కులగణన సమగ్ర ప్రగతి వికాసాలకు తోడ్పడే మొదటి అడుగు.జస్టిస్ వి.ఈశ్వరయ్య వ్యాసకర్త జాతీయ బీసీ కమీషన్ మాజీ చైర్మన్ -
పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి
ఉన్నత న్యాయస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీల నుంచి న్యాయమూర్తుల ప్రాతినిధ్యం తగినంతగా లేదు. ఆధిపత్య కులాలకు చెందిన వారికి అందుబాటులో ఉండే వృద్ధి అవకాశాలను వెనుకబడిన వర్గాలకు చెందినవారు పొందడం లేదన్నది వాస్తవం. ఉమ్మడి రాష్ట్ర న్యాయమూర్తుల్లో వీరి ప్రాతినిధ్యం సుమారు ఇరవై శాతమే. అదే సమయంలో జనాభాలో ఇరవై శాతం ఉన్నవారికి హైకోర్టు జడ్జీలుగా సుమారు ఎనభై శాతం ప్రాతినిధ్యం లభించింది. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో ఎలాంటి రిజర్వేషనూ లేదు. ఈ నేపథ్యంలో జడ్జీల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే వ్యవస్థాగత వివక్షకు గురవుతున్న కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం లేని స్థితిని అధిగమించవచ్చు. భారత ప్రభుత్వం తరపున జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చైర్పర్సన్ (2013–2016)గా, అదే సమయంలోనే అఖిల భారత వెనుకబడిన వర్గాల సమాఖ్య చైర్‌పర్సన్‌గా వ్యవహరించాను. నా మూడేళ్ల పదవీ కాలంలో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు చెందిన నేతల నుంచి వందలాది ఉత్తరాలను అందుకున్నాను. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి న్యాయమూర్తుల ప్రాతినిధ్యం తగినంతగా లేని దుఃస్థితిని వారు నా దృష్టికి తెచ్చారు. సుప్రీం కోర్టులో, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టేలా చూడాలని ఈ వర్గాల ప్రతినిధులు కోరారు. ఆధిపత్య కులాలతో పోలిస్తే సాపేక్షికంగా ప్రతిభా సామర్థ్యాలు తక్కువగా ఉన్న కారణంగానే కోర్టుల్లో వెనుకబడిన వర్గాల ప్రాతి నిధ్యం లేదనేదాన్లో నిజం లేదని వీరి భావన. అణచివేయబడిన కమ్యూనిటీలకు చెందిన యువ న్యాయవాదులకు హై–ప్రొఫైల్ చాంబర్ లేదా సంస్థలో అరుదుగా చోటు లభిస్తోందని వీరు భావిస్తు న్నారు. విజయవంతమైన లాయర్ల కార్యాలయాల్లో వారి సామాజిక వర్గాలకు చెందిన సభ్యుల ఆధిపత్యమే నడుస్తోందని వీరు గమనిం చారు. సీనియర్లు కూడా వారికి విజయవంతమైన లాయర్లు కావడంలో తోడ్పాటు అందిస్తున్నారని వీరి అభిప్రాయం. ఇలా ఎదిగి వచ్చిన లాయర్లలో చాలామంది తర్వాత జడ్జీలుగా మారుతుంటారు. ఆధిపత్య కులాలకు చెందిన వారికి అందుబాటులో ఉండే వృద్ధి అవకా శాలను వెనుకబడిన వర్గాల అడ్వకేట్లు పొందడం లేదన్నది వాస్తవం. న్యాయస్థానంలో ఉన్న జడ్జీల సామాజిక నేపథ్యానికి చెందిన వాడు తమ కేసు వాదిస్తున్న లాయర్ అయితే కేసు త్వరగా విచారణకు వచ్చే అవకాశం ఉందని లిటిగెంట్ పబ్లిక్‌లో ఒక అభిప్రాయం ఉందని నాకు ఉత్తరాలు పంపిన వెనుకబడిన వర్గాల ప్రతినిధులు భావించారు. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో అమలవుతున్న న్యాయమూర్తుల నియామక ప్రక్రియ... వివక్షకు ముగింపు పలకటం లేదనీ, న్యాయ మూర్తుల నియామకాల్లో కొన్ని సామాజిక బృందాల ఆధిపత్యాన్ని బద్దలు చేయడం లేదనీ వెనుకబడిన వర్గాల ప్రతినిధుల భావన. జ్యుడీషియల్ నియామకాల్లో రిజర్వేషన్లు ప్రస్తుతం ఎగువ, దిగువ స్థాయి జిల్లా న్యాయస్థానాలకు మాత్రమే వర్తిస్తుండటం గమనించాలి. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో ఎలాంటి రిజర్వేషన్ లేదు. బార్, జిల్లా జడ్జీలకు చెందిన అడ్వకేట్లను ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే ఉన్నత స్థానాల్లో నియమిస్తున్నారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు అడ్వ కేట్లను కూడా రిజర్వేషన్లు లేకుండానే ఉన్నత స్థానాల్లో నియమి స్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియా మకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే వ్యవస్థాగత వివక్షకు గురవుతున్న కమ్యూనిటీలు ప్రాతినిధ్యం లేని స్థితిని అధిగమించవచ్చనే అభిప్రాయం ఉంటోది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రాతినిధ్య పరమైన వాస్తవికతను అంచనా వేయడానికి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సామాజిక నేపథ్యానికి చెందిన డేటాను సేకరించడమైనది. అలాగే విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు చెందిన డేటా కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ డేటాను సమర్పించడంలో జడ్జీల సామాజిక నేపథ్యానికీ... వారి ప్రతిభ, పనితీరు లేదా న్యాయ దృక్పథాలు, నిర్ణయాలకు మధ్య సహసంబంధం ఉందని చెప్పే ఉద్దేశం లేదని గమనించాలి. సరైన ప్రాతినిధ్యాలకు హామీ ఇవ్వడానికి రాజ్యాంగబద్ధ న్యాయ స్థానాల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని సమర్థించడమే ఈ డేటా సేకరణ మౌలిక ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా పేరు మార్చిన హైదరాబాద్ కోర్టును రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం, 1956 నవంబర్ 5న నెలకొల్పారు. 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో హైదరా బాద్ చేరిక తర్వాత, భాషా ప్రాతిపదికన తెలుగుప్రజల కోసం ఏర్పర్చిన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. 1956 నుంచి 2014 దాకా హైదరా బాద్ ప్రధాన కేంద్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు సేవలం దించింది. 1956లో హైకోర్టు జడ్జీల సంఖ్య 12 కాగా, 2014 నాటికి అది 61కి పెరిగింది. 2014లో రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికీ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కూ ఉమ్మడి హైకోర్టుగా ఇది నాలుగేళ్లపాటు పనిచేసింది. 2018 డిసెంబర్ 26న భారత రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కేంద్రంగానూ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి కేంద్రంగానూ హైకోర్టులను పునర్ వ్యవస్థీకరించారు. 2019 జనవరి 1న తెలంగాణకు 24 మంది జడ్జీలను, ఆంధ్రప్రదేశ్‌కి 37 మంది జడ్జీలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టుకు ప్రమోషన్‌పై వెళ్లిన న్యాయ మూర్తుల సంఖ్య 16. వీరిలో ఏడుగురు రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారు. ముగ్గురు కమ్మ కమ్యూనిటీకీ, ఇద్దరు బ్రాహ్మణ కమ్యూనిటీకి, ఇద్దరు క్షత్రియ కమ్యూనిటీకి చెందివారు (వీరిలో ఒకరు వెలమ, మరొకరు రాజు). ఒకరు ముస్లిం కమ్యూనిటీకి, ఇంకొకరు షెడ్యూల్డ్ కులానికి చెందినవారు. అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లిన జడ్జీల్లో ఒక్కరు మాత్రమే ఎస్సీ! ఎస్టీలు, ఓబీసీలకు అసలు అవకాశమే లభించలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభమైనప్పటి నుంచీ ఇంతవరకు 45 మంది ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. ఇందులో 16 మంది బ్రాహ్మణ, 5 మంది రెడ్డి, 5 మంది వైశ్య కులానికి చెందినవారు. ముగ్గురు కాయస్థులు, ముగ్గురు క్షత్రియులు (వెలమ, రాజు, రాజ్ పుత్), ఇద్దరు కమ్మవారు, ఇద్దరు ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు. మరో ఇద్దరు పంజాబీలు, ఒకరు మాహేశ్వరి, ఒకరు నాయర్, ఒకరు మరాఠా, మరొరు క్రిస్టియన్. వీరిలో ముగ్గురు ప్రధాన న్యాయ మూర్తులు మాత్రమే ఓబీసీలకు చెందినవారు. ఈ ముగ్గురిలో ఒకరు కేరళకు, మరొకరు తమిళనాడుకు చెందిన వారు కాగా ఒకరు తెలం గాణ వాసులు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినవారు ఒక్కరూ లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు నెలకొల్పినప్పటి నుంచీ నేటి వరకు 253 మంది జడ్జీలు సేవలందించారు. ఇందులో ఓబీసీల నుంచి 43 మంది, ఎస్సీల నుంచి 10 మంది, ఇద్దరు ఎస్టీలు హైకోర్టు జడ్జీలుగా పనిచేశారు. వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 80 శాతం పైగా జనాభా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు చెందినవారే. రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో వీరి ప్రాతినిధ్య 21.73 శాతం మాత్రమే. అదే సమయంలో జనాభాలో 20 శాతం కంటే తక్కువగా ఉన్నవారికి హైకోర్టు జడ్జీలుగా 78.26 శాతం ప్రాతినిధ్యం లభించింది. ఈ డేటా ప్రకారం తెలంగాణ హైకోర్టులో ఎస్సీ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించినవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముస్లిం కమ్యూనిటికీ చెందిన జడ్జి ఒక్కరు కూడా లేరు. వెనుకబడిన వర్గాలు ముస్లింలు, క్రిస్టియన్లకు చెందిన ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నప్పటికీ వీరికి హైకోర్టులోనూ, సుప్రీకోర్టులోనూ న్యాయమైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. (క్లిక్: ముమ్మాటికీ తప్పును సరిదిద్దుకోవాలి) కాబట్టి, జనాభాలోని 80 శాతానికి పైగా వెనుకబడిన వర్గాల కమ్యూనిటీలకు, ఇతర మతపరమైన మైనారిటీ కమ్యూనిటీలకు రాజ్యాంగబద్ధ న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు కల్పించాలనీ, వారికి తగిన స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించాలనీ వీరు గౌరవ న్యాయ స్థానాలను, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ డేటా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీల ఆందోళనను నిర్ధారిస్తోంది. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో జడ్జీల నియామకానికి జాతీయ న్యాయ కమిషన్ ద్వారా తాజాగా శాసనం రూపొందించాలని వీరు కోరుతున్నారు. - జస్టిస్ వి. ఈశ్వరయ్య అధ్యక్షుడు, అఖిల భారత వెనుకబడిన వర్గాల సమాఖ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి -
‘చంద్రబాబు కనుసన్నల్లో ఏబీఎన్’
సాక్షి, అనంతపురం: బీసీ నేత, రిటైర్డ్ జడ్డి ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. ఏబీఎన్ కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కనుసన్నల్లో ఏబీఎన్ నడుస్తుందని, బీసీ నేతలపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. (ఏబీఎన్ కథనాలన్నీ ఊహాజనితాలే) బీసీలు హైకోర్టు జడ్జీలు కాకుండా అడ్డుకున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఓట్లు వేయలేదన్న అక్కసుతో బీసీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో బీసీలకు ప్రాధాన్యత లభిస్తోందని శంకర్ నారాయణ పేర్కొన్నారు. -
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి నేరపూరిత కుట్ర
సాక్షి, హైదరాబాద్ : వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలన్న లక్ష్యంతోనే తాను పని చేస్తున్నానని, తన ప్రతి శ్వాస లోనూ బీసీ భావజాలమే ఉందని అఖిల భారత వెనుకబడిన వర్గాల ఫెడరేషన్ ఫౌండర్ చైర్మన్, హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య స్పష్టం చేశారు. బీసీలు, అణగారిన వర్గాల గొంతుకగా ఉన్న తనపై తప్పుడు కథనాలను ప్రచురిం చడం వెనుకబడిన వర్గాలపై దాడిగానే భావించాలన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడు తూ గత రెండు రోజులుగా తన ఆత్మ గౌరవాన్ని కించపర్చేలా, బీసీల మనో భావాలను దెబ్బతీసే విధంగా ఆంధ్ర జ్యోతి, ఏబీఎన్ కల్పితాలు, కట్టుకథలతో కూడిన ఊహాజనితమైన వార్తలను అదేపనిగా ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఎడిట్, ట్యాంపర్ చేశారు.. – కొన్నాళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణను ఊరడించేందుకు మాత్రమే ఆయనతో మాట్లాడా. నినా సంభాషణను ఎడిట్, ట్యాంపర్ చేశారు. వాస్తవాలు వెల్లడవుతాయనే పూర్తి ఆడియో బయట పెట్టలేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణను ఏబీఎన్, ఆంధ్రజ్యోతి తప్పుడు ఉద్దేశంతో బయట పెట్టి నేరపూరిత కుట్రతోవ్యవహరిస్తున్నాయి. – నాకు రాజకీయాలతో సంబంధం లేదు. న్యాయవ్యవస్థతోపాటు అన్ని రంగాల్లో బీసీలకు సముచిత స్థానం లభించాలన్న ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నా. – బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిగా, సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా, బలహీన వర్గాలకు చెందిన జడ్జితో మాట్లాడిన సంభాషణను రికార్డు చేసి నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కుట్రపూరితంగా ట్యాంపరింగ్, ఎడిట్ చేసి ప్రసారం చేయడం ఆక్షేపణీయం. బీసీలు జడ్జీలుగా తగరా? – గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి... ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియరీలో వారి జోక్యం గురించి నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించి ఏబీఎన్ ప్రసారం చేసింది. వారి గురించి నేను మాట్లాడడం మొదటిసారి కాదు. మొదటి వ్యక్తిని కూడా కాదు. బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ చంద్రబాబు, సదరు న్యాయమూర్తి రాసిన లేఖలపై గతంలో విశాఖపట్నంలో నేను మీడియా సమావేశం నిర్వహించి బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు జడ్జిలుగా ఎందుకు పనికిరారని ప్రశ్నించా. ఆనాటి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి విన్నవించా. వాటిని చేర్చవలసిన చోటికి చేరుస్తా.... – రామకృష్ణతో సంభాషణ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన కొంత సమాచారం ఆయన నాకు పంపించారు. ఈ విషయాన్ని నేను బయటకు వెల్లడించక ముందే జడ్జి రామకృష్ణ అభద్రతాభావానికిలోనై నా సంభాషణను రికార్డు చేసి ఏబీఎన్, ఆంధ్రజ్యోతికి ఇచ్చినట్లుగాభావిస్తున్నా. ఆ సంభాషణను ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ట్యాంపరింగ్, ఎడిట్ చేసి ప్రసారం చేసాయి. గౌరవ సుప్రీంకోర్టు జడ్జి మీద నేను చేసిన వ్యాఖ్యలు ఏవీ వినిపించకుండా ప్రసారం చేశారు. రామకృష్ణ పంపించిన పత్రాలు, ఆధారాలు, సాక్ష్యాలు నా వద్ద భద్రంగా ఉన్నాయి. త్వరలో వాటిని చేర్చవలసిన చోటికి చేరుస్తా. ఆ పుస్తకంలోనూ ప్రస్తావించారు.. – గౌరవ న్యాయమూర్తికి సన్నిహితులు, వారి సమీప బంధువర్గానికి చెందిన దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రైవేటు సంభాషణలను రికార్డు చేస్తే ప్రస్తుత సుప్రీంకోర్టు జడ్జి, శ్రీనివాస్ బినామీ ఆస్తులను కాపాడుకోవడానికి ఎలా పనిచేశారో, ఎలా లావాదేవీలు చేశారో తెలిసేది. సదరు న్యాయమూర్తితో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి అవసరానికి మించి ఉన్న సాన్నిహిత్యంపై ’క్యాస్ట్ క్యాప్చర్స్ ది ఇనిస్టిట్యూషన్స్’ పుస్తకంలో కూడా ఉంది. – విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ మీడియా విభాగం చైర్మన్ వడ్డేపల్లి రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏబీఎన్ కథనాన్ని ఖండించిన జస్టిస్ ఈశ్వరయ్య
సాక్షి, అమరావతి: ఏబీఎన్‌లో తనపై వచ్చిన కథనాలన్నీ ఊహాజనితాలేనని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీఎన్ తనపై ప్రసారం చేసిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బడుగు, బలహీన వర్గాల ప్రతినిధి అయిన తన ప్రతిష్టకు ఏబీఎన్ భంగం కలిగేలా కథనాలు ప్రసారం చేస్తోందని మండిపడ్డారు. ‘‘తనపై, బీసీ వర్గాలపై ఏబీఎన్ బురద జల్లుతుంది. తన పరువుకు భంగం కలిగేలా కుట్రలు చేసింది. తన వాయిస్ ఏబీఎన్ ట్యాంపరింగ్ చేసింది. గతంలో మీడియా సమావేశం పెట్టి బలహీనవర్గాలకు చెందిన వ్యక్తులు జడ్జిలుగా ఎందుకు పనికిరారని ప్రశ్నించా?. జడ్జి రామకృష్ణతో జరిపిన సంభాషణలు ఓ బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి అన్యాయం జరిగిందన్న కోణంలో చేసినవి. నా వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి అంటగట్టడం దురుద్దేశపూర్వకమేనని’’ ఆయన పేర్కొన్నారు. రామకృష్ణతో నేను మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి వాడారని, న్యాయవ్యవస్థలో వెనుకబడిన వర్గాలకు ప్రాతినిథ్యం ఉండాలని కోరుకునే వ్యక్తినని తెలిపారు. ఓ రాజకీయ పార్టీ ప్రోద్బలంతో ఏబీఎన్ తనపై బురద జల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్ ఓ రాజకీయ పార్టీ కోసం పనిచేస్తోందన్నారు. తాను పదవిలో ఉన్నప్పుడు, ఇప్పుడు న్యాయవ్యవస్థపై గౌరవంతోనే ఉన్నానని జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. -
చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ప్రతి విషయంలోనూ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సర్వసాధారణంగా మారిపోయిందని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య దుయ్యబట్టారు. బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్ధక ఆస్తుల విక్రయానికి గతంలో జీఓలు ఇవ్వడమే కాకుండా టీటీడీ బోర్డుతో తీర్మానాలు కూడా చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు వాటితోనే ప్రస్తుత ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడెక్కడో ఇతర రాష్టాల్లో ఉన్న చిన్న స్థలాలు నిరర్థకంగా ఉండి, ఆక్రమణలకు గురవుతున్నాయని, వీటిని పరిరక్షించడం కూడా టీటీడీకి భారంగా మారిందని గతంలో పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు మాటమార్చడం సిగ్గుచేటన్నారు. కాగా వైద్యవిద్యా కోర్సు సీట్ల భర్తీలో మెరిట్ కోటాలో సీటు పొందిన రిజర్వుడ్ అభ్యర్థి తన కేటగిరీలోని మరో సబ్జెక్టులో సీటు పొందినప్పుడు ఖాళీ అయ్యే మెరిట్ కోటా సీటును అదే రిజర్వుడ్ అభ్యర్థితో భర్తీ అయ్యేలా చర్యల కోసం సీఎం వైఎస్ జగన్‌కి విన్నవించానని ఈశ్వరయ్య తెలిపారు. ఇందుకు అనుగుణంగా జీఓలో మార్పులు చేయడానికి సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. -
ఆంగ్ల మాధ్యమంతోనే విద్యార్థులకు మేలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయిస్తేనే మన పిల్లలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకోగలుగుతారని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, ఉమ్మడి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. ‘ప్రపంచంలో ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉన్న వారికే అన్ని అవకాశాలు దక్కుతున్నాయి. మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవారు, ఇక్కడే పరిశ్రమలు పెట్టినవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడిన వారందరూ చిన్నప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న వారేనన్న విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల మాతృభాష తెలుగుకు ఎలాంటి ముప్పు రాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీనవర్గాలు, నిరుపేదలకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందితేనే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమం ఉండాలో ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు బంగారు భవిష్యత్తు పొందాలంటే ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమం ఎంత అవసరమో తల్లిదండ్రులందరూ గుర్తించాలి’ అని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ► స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లయినా ఇప్పటికీ బడుగు, బలహీనవర్గాలు, పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు తెలుగు మాధ్యమంలోనే కొనసాగుతున్నాయి. ► డబ్బున్న వారి పిల్లలకే ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం దక్కేలా కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఆంగ్ల మాధ్యమంలో స్కూళ్లు ఏర్పాటు చేసుకోవడానికి గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చాయి. ► ఉన్నత వర్గాల వారు ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే ఎందుకు చదువుకుంటున్నారు? మాతృభాషకు ఏదో అయిపోతుందని అంటున్న వారంతా తమ పిల్లలను ఎందుకు ఆంగ్ల మాధ్యమ స్కూళ్లలో చదివిస్తున్నారో చెప్పాలి. ► తెలుగు తప్పనిసరిగా నేర్పిస్తూ ఆంగ్ల మాధ్యమం పెట్టడం వల్ల భాష మరింత అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా పిల్లలు తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ► ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఆంగ్లంలో ప్రావీణ్యం చూపకపోవడానికి కారణం వారు చిన్నప్పుడు తెలుగు మాధ్యమంలో చదువుకోవడమే. ► ప్రైవేటు స్కూళ్లలో కంటే ప్రభుత్వ స్కూళ్లలో ఎంతో నైపుణ్యం ఉన్న టీచర్లున్నారు. ► ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఉన్నా ప్రమాణాలు శూన్యం. ► ప్రైవేటు స్కూళ్లను ఏ జీవో ప్రకారం ఆంగ్ల మాధ్యమాలుగా కొనసాగిస్తున్నారో ప్రభుత్వం కూడా అదే జీవో ప్రకారం విద్యార్థుల అభిప్రాయాలకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమాలుగా మార్పు చేస్తే సరిపోతుంది. ఇంగ్లిష్ వచ్చినవారికే ఉద్యోగాలు ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ఆంగ్ల మాధ్యమం కావాలని అడుగుతున్నారు. ఇంతకుముందే పేరెంట్స్ కమిటీలు ఈ మేరకు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందించాయి. వారి అభీష్టం ప్రకారం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలి. గతంలో కూడా ఇంగ్లిష్ వచ్చినవారికే ఉద్యోగాలు, ఉపాధి లభించాయి. మాతృభాషను ఇంట్లో నేర్చుకుంటారు ఏ మాతృభాషనైన ఇంటిలో అమ్మానాన్న, ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఎలాగూ నేర్చుకుంటారు. దాన్ని స్కూళ్లలో మాధ్యమాలుగా పెట్టనక్కరలేదు. దాన్ని తప్పనిసరి సబ్జెక్టుగా నేర్పిస్తే చాలు. చాలా భాషలకు లిపి కూడా లేదు. ఆ పిల్లలంతా వారి మాతృభాషలోనే చదువుతున్నారా? వారికి ఇతర భాషా మాధ్యమంలోనే బోధిస్తున్నారు కదా! -
కాలేజీ ఫీజులు పెరగవు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల పెంపు ఉండదని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. గతంలో కన్నా తగ్గినా తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన కమిషన్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, కమిషన్ సభ్య కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి. వైస్ చైర్మన్ ప్రొఫెసర్ భార్గవరామ్, సభ్యులు ప్రొఫెసర్ విజయ ప్రకాశ్, ప్రొఫెసర్ డి.ఉషారాణి (అకడమిక్) కె.విజయాలు రెడ్డి (ఫైనాన్స్) తదితరులతో చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి కేవలం విద్యా సంబంధ అంశాలకు అయ్యే ఖర్చులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని (గతంలో ఇతర ఖర్చులూ కలిపే వారు) ఫీజులు నిర్ణయిస్తున్నామని చెప్పారు. ఆయా కాలేజీలు అందించిన నివేదికలు, తమ బృందాల పరిశీలనలో వెల్లడైన అంశాల మధ్య వ్యత్యాసం ఉందని.. వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఫీజులు నిర్ణయిస్తామన్నారు. కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఆయన ఇలా వివరించారు. ఇవీ కమిషన్ నిర్ణయాలు.. - ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలు, సౌకర్యాలు ఇతర విద్యా సంబంధ వసతులను దృష్టిలో పెట్టుకొని ఫీజులుంటాయి. ఏకరూప ఫీజులు ఉండవు. ఫీజులపై ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆయా కాలేజీల వాదనలు వింటాం. ఫిబ్రవరి మధ్యలో ఫీజులు ప్రకటిస్తాం. - మెడికల్, ఫార్మా కాలేజీల్లో కూడా కమిషన్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయి. వీటిలో ఫీజుల శ్లాబ్ విధానం ఎలా ఉండాలన్న దానిపై వచ్చే సమావేశంలో నిర్ణయం. - యూజీ, పీజీ, డిగ్రీ కోర్సులు, లా కోర్సులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల ఫీజులను కూడా ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల. - ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఆయా కాలేజీలు ఫీజుల నివేదికలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. - ఈ ఏడాది ఫీజుల నిర్ణయం ఆలస్యమైంది. అందువల్ల 2020–21, 2022–23 విద్యా సంవత్సరాలకు ఈ ఫీజు నిర్ణయం ఉంటుంది. - డిగ్రీ, పీజీ కోర్సులకు ఒకేరకమైన ఫీజుల అమలు. - కన్వీనర్ కోటా లేదా మేనేజ్మెంటు కోటాలో కమిషన్ నిర్ణయించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. దీనిపై ఫిర్యాదుల కోసం త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌తో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు. - ఏ కళాశాల అయినా విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకోరాదు. కేవలం ఫొటోస్టాట్ కాపీలను సరిపోల్చుకోవడానికి తీసుకుని, పరిశీలించిన వెంటనే వెనక్కు ఇవ్వాలి. ఈ విషయమై విద్యార్థులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. - కనీస సదుపాయాలు కూడా లేని కాలేజీలకు కొంత సమయం ఇస్తాం. లోపాలు సరిదిద్దుకోకపోతే వాటిపై చర్యలకు సిఫార్సు చేస్తాం. -
పేదలకు ఇంగ్లిష్ మీడియం అందకుండా కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధిక శాతం మంది ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద, బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య దక్కుతుందనే దుగ్ధతో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సంపన్న వర్గాలవారు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ.. బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో విద్య అందకుండా అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. తద్వారా పేదలకు సమానత్వం దక్కకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బలహీనవర్గాల పిల్లలు అభివృద్ధి చెందకూడదనేలా వీరి వైఖరి ఉందని ధ్వజమెత్తారు. మెరుగైన ఉపాధి అవకాశాలు పొందడానికి ఇంగ్లిష్ మాధ్యమం దోహదపడుతుందన్నారు. ఎనిమిదో శతాబ్దంలో సంస్కృతంలో బోధించేవారని.. నాడు కింది స్థాయి వర్గాలకు సంస్కృత బోధన ఉండేది కాదని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను న్యాయస్థానాలు గౌరవించాలని, గతంలో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడంపై సర్వే నిర్వహించామన్నారు. ఇందులో ఎక్కువమంది ఇంగ్లిష్ మాధ్యమాన్ని కోరుకున్నారన్నారు. ఉన్నతవిద్య అభివృద్ధికి ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి ఇంగ్లిష్ మీడియంలో చదివితేనే వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందుతారని, కాస్త దృష్టి పెడితే తెలుగు భాష కంటే ఇంగ్లిష్ నేర్చుకోవడమే సులువని జస్టిస్ ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. పేదరికంతో చాలామంది తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను పెంచి.. ఇంగ్లిష్‌లో బోధిస్తామని తెలిపారు. ఉన్నత విద్య అభివృద్ధి చెందాలంటే ఇంగ్లిష్ మీడియం తప్పనిసరన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మ్యానిఫెస్టోలోనే స్పష్టం చేశారని గుర్తు చేశారు. తాను ఇంగ్లిష్ మీడియంలో విద్యనభ్యసించి ఉంటే సుప్రీంకోర్టు జడ్జినయ్యే అవకాశం ఉండేదన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష అత్యవసరమన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు, పాఠశాలలు వారికయ్యే ఖర్చులను మాత్రమే విద్యార్థులు వద్ద ఫీజులుగా వసూలు చేయాలని కోరారు. కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా ఫీజులను వేర్వేరుగా నిర్ణయిస్తామని, వీటి నియంత్రణపై ప్రతిపాదనల్ని ఫిబ్రవరి నాటికి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. -
‘సంపన్న వర్గాలే సీఎం నిర్ణయానికి వ్యతిరేకం’
సాక్షి, అమరావతి : మెజారిటీ ప్రజలు అభీష్టం మేరకే ఆంగ్ల విద్యావిధానం ప్రవేశపెడుతున్నామని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. కేవలం సంపన్న వర్గాలకు చెందిన వారు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చాలా మంది పేదలు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివించలేకపోతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకులను పెంచి.. ఇంగ్లీష్ విద్యను పిల్లలకు అందిస్తామని తెలిపారు. ఉన్నత విద్య అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళ పిల్లలను తెలుగులోనే చదివిస్తున్నారా..? అని ప్రశ్నించారు. సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలు పిల్లలు చదువుకుని అభివృద్ధి చెందకుడదనేలా కొందరి వైఖరి ఉంది. ఇంగ్లీషు మీడియంలో చదివితే వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందుతారు. రాష్ట్రంలో ఆంగ్ల విద్యావిధానం తీసుకువస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మ్యానిఫెస్టోలోనే స్పష్టం చేశారు.ప్రపంచీకరణ నేపధ్యంలో ఆంగ్లభాష అవసరం. ప్రైవేట పాఠశాలలు విద్యార్థులు వద్ద ఫీజులు ఎక్కువగా తీసుకోవద్దు. కాలేజీలకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఫీజులు తగ్గించాలి. ఫిబ్రవరి నాటికి ఫీజులు నియంత్రణపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. తెలుగు భాష కంటే ఆంగ్లం నేర్చుకోవడం సులభం’ అని అన్నారు. -
ఏపీలో సామాజిక న్యాయం దిశగా విప్లవాత్మక పథకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా విప్లవాత్మక పథకాలు అమలు చేస్తోందని, మిగతా అన్ని రాష్ట్రాలూ వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అఖిల భారత బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో ‘పూలే, అంబేడ్కరీ గౌరవ్శాలీ ఔర్ ఆదర్శ్వాదీ ముహిమ్(పగామ్)’ సంస్థ, అఖిల భారత బీసీ సమాఖ్య (ఏఐబీసీఎఫ్), వివిధ రాష్ట్రాల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు కలిసి నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రానికి ముందు 200 ఏళ్లు బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్న వివక్ష, స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు అందకపోవడంపై జస్టిస్ ఈశ్వరయ్య విశ్లేషించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కాంగ్రెస్ హయాంలోగానీ, బీజేపీ హయాంలో గానీ అమలు కాలేదని పేర్కొన్నారు. ‘సామాజిక న్యాయం అందాలంటే విద్య ఒక్కటే మార్గమని పూలే, అంబేడ్కర్ ఏనాడో చెప్పారు. సామాజిక న్యాయం అందాలంటే దేశ సంపద సమానంగా పంపిణీ కావాలి. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే బీసీలు చట్టసభల్లోకి రావాలి. కేంద్ర సచివాలయంలో ఓబీసీ వర్గానికి చెందిన ఒక్క కార్యదర్శి కూడా లేరు. కేంద్ర కేబినెట్లో ఒక్క ఓబీసీ కూడా మంత్రిగా లేరు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉండాలంటే 15 శాతం కూడా అమలు కాలేదు. క్రీమీలేయర్ అని పెట్టి అన్యాయం చేస్తున్నారు’ అని జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. బీసీలు రాజ్యమేలిన చోటా అందనన్ని ఫలాలు ఏపీలో అందుతున్నాయి.. బీసీలు రాజ్యాధికారం చేపట్టిన రాష్ట్రాల్లోనూ సమన్యాయం జరగడం లేదని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. యూపీలో మాయావతి రాజ్యమేలినా బీసీలకు, ఎస్సీలకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ అధికారం చేపట్టినప్పుడు కొన్ని బీసీ కులాలకే న్యాయం జరిగిందన్నారు. బీసీలు రాజ్యమేలిన రాష్ట్రాల్లోనూ అందని ఫలాలను ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తోందన్నారు. మంత్రివర్గంలో బీసీలకు 60 శాతం, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు పీజీ వరకూ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ‘నాణ్యమైన విద్యను మాకందించండి.. ఎటువంటి రిజర్వేషన్లూ అవసరం లేదు’ అని పూలే, అంబేడ్కర్ అన్నారని, అటువంటి విద్య అందిస్తున్న జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నవరత్నాల పేరిట సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపించే తల్లులకు రూ.15 వేలు అందిస్తున్నారని, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని వివరించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, పీజీ విద్యార్థులకు వసతి కోసం ఆర్థిక సాయం.. ఇలా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా పనిచేస్తోందని, విద్య, ఆరోగ్యం, రాజకీయం.. ఇలా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ తరహా కార్యక్రమాలు అమలుచేయాలంటూ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు.. ఏపీ సీఎం నవరత్నాల పేరిట సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపించే తల్లులకు రూ.15 వేలు అందిస్తున్నారని, రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారని వివరించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, పీజీ విద్యార్థులకు వసతి కోసం ఆర్థిక సాయం.. ఇలా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా పనిచేస్తోందని, విద్య, ఆరోగ్యం, రాజకీయం.. ఇలా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ తరహా కార్యక్రమాలు అమలుచేయాలంటూ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
‘కాలేజీలు నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని కాలేజీలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. గురువారం ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్‌తో సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషన్ చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు ప్రజంటేషన్ ఇచ్చారు. అలాగే కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పిల్లలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వబోతున్నామని మరోసారి స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలతోపాటు పేద పిల్లలు చాలా మంది దీనివల్ల లబ్ధి పొందుతారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా డిగ్రీ, ఆపై కోర్సులు చదువుతున్న వారికి ఏడాదికి రూ. 20వేల వసతి, భోజన ఖర్చుల కోసం ఇవ్వబోతున్నట్టు తెలిపారు. కోర్సుల పాఠ్యప్రణాళిక మార్చబోతున్నట్టు తెలిపిన సీఎం వైఎస్ జగన్.. ఉద్యోగం, ఉపాధి కల్పించేలా రూపొందించబోతున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఏడాది పాటు అదనంగా అప్రెంటిస్ ఉంటుందని.. అందువల్ల వీటిని మాములు డిగ్రీలుగా కాకుండా ఆనర్ డిగ్రీలుగా పరిగణించాలని సూచించారు. ఒక ఏడాది అనుభవంతో కూడిన డిగ్రీకి మంచి విలువ ఉంటుందని.. సరైన ప్రాక్టికల్ అనుభవం లేకపోతే పోటీ ప్రపంచంలో నిలవలేరని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కోసం దేశంలో కానీ, ప్రపంచంలో కానీ తీవ్రమైన పోటీ నెలకొందని గుర్తుచేశారు. అన్ని కాలేజీలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. లంచాలు ఇస్తే సరిపోతుందనే భావన కనిపించకూడదని తెలిపారు. నిర్దేశించుకున్న ప్రమాణాలను కాలేజీలు తప్పకుండా పాటించాలని అన్నారు. అందుకోసం అవసరమైతే కాలేజీలకు ఆరు నెలల సమయం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయన్న సందేశం వినిపించాలని అన్నారు. నియమాలు, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవనే భయం ఉండాలన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాలేజీలకు ఎలాంటి బకాయిలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిందంతా చేద్దామని చెప్పారు. కాలేజ్‌ల్లో తనిఖీల సందర్భంగా గుర్తించిన అంశాలను కమిషన్ సభ్యులు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. కాలేజీల్లో ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం క్వాలిఫైడ్ స్టాఫ్ లేరని కమిషన్ సభ్యులు తెలిపారు. ప్రయోగశాలల్లో పరికరాలు సరిగ్గాలేవని గుర్తించామన్నారు. టీచర్లు, స్టూడెంట్స్ హాజరు రిజిస్టర్లు కూడా సరిగా లేవని చెప్పారు. ఫైనాన్స్, జీతాల చెల్లింపులకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని.. చాలా కాలేజీల్లో ఆడ్మిషన్లు చాలా స్వల్ఫంగా ఉన్నాయని వివరించారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నందుకు ధన్యవాదాలు.. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నందుకు సీఎం వైఎస్ జగన్‌కు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తోన్న కార్యక్రమాలపై దేశం మొత్తం చూస్తోందన్నారు. తన చిన్నతనంలో ఒక ముక్క ఇంగ్లిష్ మాట్లాడితే గొప్పగా చూసేవాళ్లమని గుర్తుచేశారు. అలాంటిది పేదపిల్లలకు చిన్నప్పటి నుంచే ఇంగ్లిషులో బోధన ద్వారా ఉత్తమ విద్య అందించాలన్న సంకల్పం చాలా గొప్పదని అన్నారు. వాళ్లు ఒకటి పాటించి.. వేరేవాళ్లు ఇంకోటి చేయాలన్న రీతిలో ఇంగ్లిష్ మీడియంపై కొందరు మాట్లాడటం సరికాదని సూచించారు. -
మద్యపాన నియంత్రణలో ప్రభుత్వం భేష్
గుంటూరు ఎడ్యుకేషన్: కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మద్యపానాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భేష్ అని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య తెలిపారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. మద్యపాన నియంత్రణకు సీఎం వైఎస్ జగన్ మహత్తరమైన చర్యలు చేపడుతున్నారన్నారు. వ్యాపారమయంగా మారిన పాఠశాల విద్యను ప్రక్షాళన చేసేందుకు రెగ్యులేటరీ కమిషన్‌తో పాటు తన అధ్యక్షతన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ వేశారని చెప్పారు. లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో అతి ముఖ్యమైన మద్యపాన నియంత్రణపైనే మిగిలిన అన్ని పథకాల అమలు ఆధారపడి ఉందని అన్నారు. తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ తీసుకువచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారని విమర్శించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ మద్యానికి బానిసలుగా మారడంతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్న పరిస్థితులను చూసిన సీఎం మద్యపాన నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు. -
దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి జగన్
సాక్షి, తిరుపతి: దేశంలో ఏ ప్రభుత్వం.. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు అన్నింటా ప్రాధాన్యత కల్పించిన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ ఉన్నతవిద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య కొనియాడారు. దేశంలోనే ఆయన ఆదర్శ ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. తిరుపతిలో ఆదివారం జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎ.శంకర్ నారాయణ, ప్రాథమిక విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ రెడ్డి కాంతారావుకు ప్రశంస, అభినందన సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు ఏళ్ల తరబడి కులవృత్తులతో సామాజిక సేవ చేశారని.. వీరికి హక్కులు కల్పించడంలో మాత్రం ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే స్పందించారన్నారు. ఎన్నికలకు ముందు బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఆయనకు నివేదిక సమర్పించామన్నారు. దళితులు, బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేయడంతోపాటు వారికి హక్కులతోపాటు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కలి్పస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారం చేపట్టిన మూడు నెలలకే చరిత్రలో ఎవరూ చేయని విధంగా బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వాటికి చట్టబద్ధత కూడా కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌తోపాటు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించి గౌరవించారన్నారు. పేద బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రాథమిక విద్య, వైద్యం అందించిన మహనీయుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. -
పూలే వెలుగులో..అంబేడ్కర్ అడుగుజాడల్లో..
సామాజిక న్యాయం దిశగా.. ‘మాటలు కంటే ఆచరించి చూపడం ముఖ్యం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం విషయంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతికి బాటలు వేస్తున్నారని నేను విశ్వసిస్తున్నా. జ్యోతిరావ్ పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా వారు చూపిన దారిలో పయనిస్తున్నారు. పేదలకు, అణగారిన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానం కచ్చితంగా లబ్ధిచేకూర్చుతుందనడంలో సందేహంలేదు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ నాణ్యమైన ఉచిత విద్యను అందించడంతో పాటు ఉన్నత విద్యను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పవచ్చు’. కమిషన్లకు ఉండే అధికారాలు ఏమిటంటే.. ►పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షక సంఘాలన్నీ సహజంగా విద్యా ప్రమాణాల పెంపునకు కృషిచేస్తుంటాయి. ►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నియంత్రణ సంస్థలు ఎప్పటికప్పుడు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా మౌలిక వసతులు, ప్రవేశాలు, బోధన, పరీక్షలు, పరిశోధన, అధ్యాపకుల అర్హత ప్రమాణాలు పెంపొందిస్తాయి. ►పాఠశాల, ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు ఈ సంఘాలకు అధికారాలు ఉంటాయి. ►ఉపాధ్యాయ సర్వీస్ కమిషన్లను నియంత్రించే అధికారం ఉంటుంది. ►విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరిస్తుంటాయి. ఈ కమిషన్లు ఇచ్చే ఆదేశాలను అమలుచేయించడంతో పాటు జరిమానాలు విధించే అధికారాలు కూడా వీటికి ఉంటాయి. ►ఒక మాటలో చెప్పాలంటే సివిల్‌కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. సమన్లు జారీ చేయడం మొదలు సాక్ష్యాధారాలను రాబట్టే వరకు కమిషన్ల పరిధి ఉంటుంది. ఉన్నత ప్రమాణాలే లక్ష్యం.. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఉన్నత విద్యలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తా. ఆయన నాపై ఉంచిన విశ్వాసాన్ని నెరవేరుస్తా. ఏపీ లోకాయుక్త చట్టానికి సవరణ తీసుకువచ్చి లోకాయుక్తను సమర్ధంగా అమలుచేసి అవినీతి రహిత ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటుచేసేలా ఆ వ్యవస్థకు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించడం హర్షణీయం’. జగన్ బడుగుల పక్షపాతి.. ‘సీఎంగా వైఎస్ జగన్ తీసుకున్న పలు చర్యలు ఆయన బీసీల పక్షపాతి అని నిరూపిస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ అభ్యున్నతికి నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం, ఆలయాలలో ట్రస్టీలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం, వర్క్ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు వంటివి అనేకం ప్రస్తావించవచ్చు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాహసోపేత నిర్ణయం’. ‘బడుగుల కల నెరవేరబోతోంది.సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి రానుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల అమలు దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. బీసీలకు ఉచితంగా, నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలే ఇందుకు నిదర్శనం. వీటితోపాటు రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల సమస్యలపైనా దృష్టిసారించారు. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం’.. అని ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ వంగల ఈశ్వరయ్య గౌడ్ అభిప్రాయపడ్డారు. ఆయనతో ‘సాక్షి ప్రతినిధి’ ముఖాముఖి.. – సాక్షి ప్రతినిధి, అమరావతి -
‘విద్య పరమైన రిజర్వేషన్లకు జాతి గణన’
సాక్షి, అమరావతి: సమాజంలో నేటికీ జాతి వివక్ష కు గురవుతూ ఎంతో మంది అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. దేశంలో పౌరులందరికీ సమానత్వం అందించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని, కానీ ఇప్పటికీ చాలా కులాలు వెనుకబడి ఉన్నాయని ఆయన ఆవేదన చెందారు. ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా హాజరైన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. దేశంలో కుల వైషమ్యాలు పోవాలంటే మంచి విద్య విధానం అవసరమన్నారు. అందరూ మనుషులే.. కాని జాతి పేరుతో మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య పరమైన రిజర్వేషన్ అమలు చేయాలంటే జాతి గణన చేయాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. ‘దేశంలో జాతి గణన జరగాలి. కులాల పరంగా ఎంత మంది వెనుకబడ్డారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని గతంలో నేను నివేదిక ఇచ్చాను. జాతి గణన జరగనందు వల్లే నేటికీ వర్గీకరణ జరగలేదు. ఆల్మన్ రాజు ను, వెంకటేశ్వరరావు లను బీసీ ఫెడరేషన్ ఎపి శాఖ బాధ్యతలు అప్పగించాను. బీసీలు ఉన్న హక్కులు, అధికారాలను సాధించుకోవాలి. భావి తరాలను దృష్టిలో ఉంచుకుని అందరూ పోరాడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం రెండు కమిషన్లు వేయడం శుభపరిణామం. బీసీ సంఘాలన్నీ అలాగే ఉంటూ.. మరోవైపు ఫెడరేషన్ తరపున పోరాటాలు చేసి లక్ష్యాన్ని సాధించుకోవాలి. కులవృత్తుల వారు ఎదగకుండా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. అటువంటి వాటిని ఎదుర్కొని మన హక్కులు ఐక్యంగా సాధించుకోవాలి. నేడు ఎవరి కులాలను వారే చూసుకుంటున్నారు. అందుకే మాయావతికి చెందిన బీస్పీ దేశ వ్యాప్తంగా ఓటమి చెందుతోంది’ అని పేర్కొన్నారు. -
‘సివిల్ కోర్టు అధికారాలు ఈ కమిషన్‌కు ఉంటాయి’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని, అందరికి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వివక్షను రూపుమాపవచ్చని అన్నారు. మెరుగైన విద్య లక్ష్యంతో కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు, సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కోర్టు ఆదేశాల తరహాలో ప్రాసిక్యుషన్ చేసే విధంగా సివిల్ కోర్టు అధికారులు కూడా కమిషన్‌కు ఉంటాయని వెల్లడించారు. తమ ఆదేశాలను పాటించకుంటే ఇనిస్టిట్యూట్ కూడా రద్దు చేయవచ్చని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలను కూడా కమీషన్ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. చదవండి : ఆంధ్రప్రదేశ్ కీలక పదవిలో జస్టిస్ ఈశ్వరయ్య -
జస్టిస్ ఈశ్వరయ్యకు కీలక పదవి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య రెగ్యులటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి... సభ్యులుగా ఉంటారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించిన మీదట, రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఈశ్వరయ్యను కమిషన్ చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ జారీ అయ్యాయి. కాగా స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్.కాంతారావును ప్రభుత్వం నియామకం చేసింది. ఐటీ (టిక్నికల్) సలహాదారులుగా అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ (టిక్నికల్) సలహాదారులుగా శ్రీనాథ్ దేవిరెడ్డి, జె. విద్యాసాగర్‌రెడ్డిను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా ఏపీ ఐటీ (పాలసీ అండ్ ఇన్వెస్ట్మెంట్) సలహాదారునిగా కె. రాజశేఖర్‌రెడ్డిని నియమించింది. -
ఎల్లో మీడియాపై జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి ముసుగులో చంద్రబాబు నాయుడు, ఆయన ముఠా ఎంత దోచుకున్నారో లెక్క చూసి, ప్రజలకు తెలియజెప్పడం కూడా తప్పంటే ఎలా? అని అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ ఎల్లో మీడియాను ప్రశ్నించారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న విచారణ కమిటీలు, విజిలెన్స్ దర్యాప్తులతో బెంబేలెత్తిన చంద్రబాబు, ఆయన అనుచరుల తీరు చూస్తుంటే ఇంటి యజమానే దొంగతనం చేసి నా ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయారన్నట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు బృందానికి తానా అంటే తందాన అనే చందంగా ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోందని, జగన్ ఏదో కాని పని చేసినట్టుగా దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంట్లో దొంగలు పడినప్పుడు ఎంత సొమ్ము ఉందో, ఎంత పోయిందో లెక్క చూసుకుని ప్రజలకు చెప్పాల్సిన పని లేదా? అని నిలదీశారు. పోయిన సొత్తు ఎంతో ప్రజలకు చెబితే అభివృద్ధి ఆగిపోయినట్టా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన బృందం, వారికి మద్దతు ఇస్తున్న మీడియా చేస్తున్న ప్రచారం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ విధానాలు ఆదర్శనీయం రాష్ట్ర శాసనసభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అద్భుతమైన బిల్లులు తీసుకువచ్చి, సామాజిక న్యాయం కోసం బాటలు వేసిందని జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ కొనియాడారు. నిధుల్లో, నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, మహిళలకు 50 శాతం కేటాయించిన తీరు ప్రశంసనీయమని తెలిపారు. ఇంతకు మించిన సమన్యాయం ఏముంటుందని అన్నారు. ప్రాధమిక విద్యతోనే అభివృద్ధి అని గుర్తించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని ఆయన అనుచరులు భయపడుతున్నారని తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న జగన్మోహన్రెడ్డి విధానాలు దేశంలో ఎందరికో ఆదర్శనీయమని జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ పేర్కొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన మాజీ జడ్జి
సాక్షి, తాడేపల్లి: హైకోర్టు మాజీ న్యాయమూర్తి, అఖిల భారత బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి అభినందించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, పలువురు బీసీ నాయకులు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఏపీ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేయడమే కాకుండా బలహీన వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బీసీ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు బలహీన వర్గాలకు ఐదు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ తన కేబినెట్లో 60 శాతానికిపైగా బీసీలకు స్థానం కల్పించారు. (చదవండి: బీసీలకు ఏపీ సర్కార్ బంపర్ బొనాంజా) -
చంద్రబాబు బీసీ వ్యతిరేకి : జస్టిస్ ఈశ్వరయ్య
సాక్షి, అమరావతి : చంద్రబాబు బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి. బీసీలు, ఎస్సీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాపులకు ప్రకటించిన 5శాతం రిజర్వేషన్ న్యాయస్థానాల్లో నిలవదని బాబుకు కూడా తెలుసు. కాపులపై ఆయనకు చిత్తశుద్ధిలేదు. అందుకే కాపులు కూడా చంద్రబాబును నమ్మరు. రాజధానిగా అమరావతి ఎంపిక, హైదరాబాద్‌లో హైటిక్ సిటీ వెనుకా.. చంద్రబాబు సామాజిక వర్గ ప్రయోజనాలే తప్ప, పేద ప్రజలు ఆయనకు పట్టరు. బాబు న్యాయవ్యవస్థను నియంత్రణలో పెట్టుకోవడానికి చేయని ప్రయత్నంలేదు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పచ్చిగా దొరికిపోయాడు. ఇదీ అసలైన క్విడ్ ప్రో కో కేసు! చంద్రబాబు పేరును చేర్చి అదనపు చార్జిషీట్ వేయాలి. ఎవరి ఓటు ఉంచాలో, ఎవరిది తీసివేయాలో తెలుసుకోవడం కోసమే డేటా చోరీ. ఎవరేమిటో తెలుసు కోవడానికే ఆ డేటా కావాల్సి వచ్చింది. లేకుంటే డేటాతో ఏం పని? అందుకే చంద్రబాబు తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేయాలి అంటున్న.. జస్టిస్ ఈశ్వరయ్యతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.. అతి సాదాసీదా కుటుంబంలో పుట్టి.. వీధి లైట్ల వెలుగులో చదివి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగి బడుగు బలహీన వర్గాల తరఫున పని చేస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య నిర్మొహమాటి. సామాజిక న్యాయమే ధ్యేయమంటారు. వ్యవస్థలను ధ్వంసం చేయడంలో పాలకులు పోటీపడుతున్నారని చెప్పే ఆయన... దేశంలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న విపరీత పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాబు, వెంకయ్య, రామోజీ.. అందరూ ఒకే గూటి పక్షులు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హోదాలో నేను మూడేళ్లు ఢిల్లీలో ఉన్నా. కేంద్ర క్యాబినెట్ హోదా అది. వెంకయ్య నాయుడు నిర్వహించే ఉగాది వేడుకలకు సుప్రీంకోర్టులోని కమ్మ జడ్జీలను మాత్రమే పిలిచేవారు. వాళ్ల కులపిచ్చికి ఇది పరాకాష్ట. అయితే ప్రతిచోటా ఉన్నట్టే జస్టిస్ చలమేశ్వర్, ఎల్.నాగేశ్వరరావు లాంటి వాళ్లు అందుకు మినహాయింపు. సామాజిక న్యాయానికి కట్టుబడిన వాళ్లు. బీజేపీలో ఉండి కూడా వెంకయ్య నాయుడు తన కులం వాళ్లను పరిరక్షించుకుంటారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, రామోజీరావు లాంటి వాళ్లందరి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మాలాంటి సామాజిక నిర్మాణానికి పని చేస్తున్న వారిని మాత్రం దూరం పెడతారు. జస్టిస్ భట్‌ను బదిలీ చేయించింది బాబే చంద్రబాబు తీరుకు ఇటీవల జరిగిన మంచి ఉదాహరణ మీకు చెబుతా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ ఎస్వీ భట్ అని మంచి న్యాయమూర్తి ఉన్నారు. చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయన్ను ఈ మధ్య బదిలీ చేశారు. ఆయనపై ఎటువంటి ఆరోపణలు లేవు. కానీ నేను విన్నదేమిటంటే.. ఆయన (చంద్రబాబు) న్యాయవ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇదంతా చేస్తున్నారు. భట్ కొలీజియంలో నెంబర్ 2గా ఉన్నారు గనుక తమ మనుషుల్ని ప్రమోట్ చేయరేమోనని, నిష్పక్షపాతంగా ఉంటాడని, వాళ్ల కేసుల్లో ఫేవర్ చేయడేమోనని భావించి.. న్యాయవ్యవస్థను నియంత్రణలో పెట్టుకోవడానికి ఆయన్ను బదిలీ చేయించారని నాకు తెలిసింది. అందుకే జస్టిస్ భట్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కేరళ హైకోర్టుకు బదిలీ చేశారు. జడ్జీల ఎంపిక ఎలా ఉంటుందంటే.. కొలీజియం సిఫార్సు చేసిన తర్వాత ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర న్యాయశాఖ, సుప్రీంకోర్టులకు కాపీలు (పేర్లున్న ప్రతులు) వెళ్తాయి. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆయా జడ్జీలపై ఏమైనా కేసులు, ఆరోపణలు, ఇతర వివరాల గురించి ఐబీ ద్వారా ఆరా తీస్తుంది. గవర్నర్, ముఖ్యమంత్రి ఆయా వ్యక్తులపై ఉన్న కేసుల వివరాలను ఆధారాలతో సహా నోట్లో కామెంట్ రాసే అధికారమే ఉంది. కాని పలానా వాళ్లను జడ్జీలుగా నియమించవద్దని రాసే అధికారం లేదు. అయితే చంద్రబాబు మాత్రం ఐదుగురు జడ్జీలపై నిరా«ధారమైన ఆరోపణలు రాసి వారిని అడ్డుకున్నారు. ఇప్పుడేమో భట్‌ను బదిలీ చేయించారు. బీసీలను జడ్జీలుగా తిరస్కరిస్తూ కేంద్రానికి బాబు లేఖ చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని చెప్పడానికి ఒక బలమైన కారణముంది. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ, ఒక బ్రాహ్మణుడిని న్యాయమూర్తులుగా సిఫార్సు చేసినప్పుడు.. వాళ్లందర్నీ తిరస్కరిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి లేఖ రాశారు. న్యాయవ్యవస్థపై ఆధిపత్యం చెలాయించుకునేందుకే వారిని రికమెండ్ చేయలేదు. చంద్రబాబు కుట్రతో అభ్యంతరాలు రాయించారని, వీటిని ఒప్పుకోకూడదని జస్టిస్ చలమేశ్వర్ కామెంట్ రాయడంతో వారంతా హైకోర్టు న్యామూర్తులయ్యారు. నాడు బీసీలు ఇద్దరు, ఎస్సీ ఒకరు న్యాయమూర్తులయ్యారు. నేను కొలీజియంలో ఉన్నప్పుడు జడ్జీలుగా నియమించిన వారిలో ఒకరైన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. నేను రిటైర్ అయిన తర్వాత నా జూనియర్‌ను రికమెండ్ చేస్తే.. దానిపైనా చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారు. మాకు నీతి, నిజాయితీ లేదట. నా జూనియర్‌కు ఇంటిగ్రిటీ, క్యాలిబర్ లేదట. హైకోర్టు న్యాయమూర్తి అయ్యే అర్హత లేదట. ఇంకో బీసీ మీద కూడా అలాగే రాశారు. అభినవ్ కుమార్ అనే బ్రాహ్మణుడి మీద, గంగారామ్ అనే ఓ ఎస్సీ జడ్డీ మీద కూడా ఇలాగే రాశారు. ప్యానల్లో ఉన్నది ఒక్క ఎస్సీ జడ్డీ అయితే ఆయన మీద ఎందుకు అభ్యంతరం చెప్పారో విచిత్రం. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే ఇలాంటి వాళ్లు న్యాయమూర్తులు కాకూడదన్నది చంద్రబాబు లెక్క. కాపులకు నమ్మక ద్రోహం ఈ మధ్యన చంద్రబాబు రిజర్వేషన్లు ఆయన సొంత జాగీరయినట్లు జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిని వారికి కేంద్రం కల్పించిన 10 శాతంలో.. 5 శాతం కాపులకు ఇస్తానని చెబుతూ గెజిట్ కూడా ఇచ్చాడు. చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్లని తెచ్చిన చట్టం రాజ్యాంగపరంగా చెల్లదు. ఆ విషయం చంద్రబాబుకు తెలిసినా కాపులకు నమ్మక ద్రోహం మోసం చేస్తున్నాడు. చంద్రబాబు సామాజికంగా వెనుకబడిన తరగతుల వారి మీద ఒలకబోస్తున్నది నిజమైన ప్రేమ కాదు. కాపులు కూడా ఆయన్ను నమ్మరు. వారికి కూడా తెలుసు ఇది (రిజర్వేషన్లు) నిలవదని. నెహ్రూ కుటుంబాన్నైనా మరచిపోతారేమో గాని వైఎస్సార్‌ను మరువరు.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా సంక్షేమ పథకాలను అమలు చేసి దేశం మొత్తాన్నీ ప్రభావితం చేశారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలలో నన్ను బాగా ప్రభావితం చేసింది ఆరోగ్య శ్రీ. ఎంతోమంది పేదలు ఉచితంగా వైద్య సేవలు పొందారు. రాజశేఖరరెడ్డి పథకాలను ఎవరూ మరచిపోరు. నెహ్రూ కుటుంబాన్ని అయినా మరచిపోతారేమో గాని వైఎస్‌ను ప్రజలు మరచిపోరు. నాడు హైటెక్ సిటీ పేరుతో దోపిడీ హైటెక్ సిటీ ఎక్కడ వస్తుందో తన కులస్తులకు, వర్గస్తులకు చంద్రబాబు ముందే చెప్పారు. ఎంతోమంది పేదలవి, అమాయకులవి ప్రత్యేకించి లంబాడీ ప్రజల భూములను కారు చౌకగా కొల్లగొట్టారు. నిజమైన పాలకుడైతే, దూరదృష్టి ఉన్న నాయకుడైతే.. పేదలకు ముందుగా హైటెక్ సిటీ వస్తుందని చెప్పి, భూములు అమ్ముకోవద్దు, మంచి రేటు వస్తుందని చెప్పి ఉండాల్సింది. కానీ చంద్రబాబు తన దూరదృష్డిని పేదల్ని మోసగించి కుట్రపూరితంగా తన వర్గం బాగు కోసం ఉపయోగించారు. అలాగే రింగ్‌రోడ్డు విషయంలోనూ తనకు కావాల్సిన వాళ్ల భూములున్న చోటల్లా అలైన్మెంట్ మార్చి లబ్ధి చేకూర్చారు. నేడు అమరావతి పేరుతో దోపిడీ ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులకు, ఇండిపెండెంట్ కమిటీకి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరించాడు. నూజివీడని, దొనకొండని ఏవేవో పుకార్లు పుట్టించి.. అమాయకులందరూ అటువైపు భూములు కొనుక్కునేలా చేశాడు. ఆ తర్వాత తన కులం వాళ్లందరూ అమరావతిలో భూములు కొనుగోలు చేసిన తర్వాత రాజధానిని ప్రకటించారు. చంద్రబాబు సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సారవంతమైన భూముల్ని బలిపెట్టారు. ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయడంలో చిత్తశుద్ధి గానీ, నిజాయితీగానీ, పారదర్శకత గానీ లేదు. హైటెక్ సీటీ అయినా.. రింగ్ రోడ్డయినా.. అమరావతి రాజధాని అయినా.. ఆయన తన వర్గం ప్రయోజనాలను మాత్రమే కాపాడారు. సామాన్యులకు చేసింది ఏమీ లేదు. డేటా చోరీ దుర్మార్గం ఇప్పుడు ఎలాగూ బ్యాలెట్ పేపర్లు రావు గనుక అసలు ఓట్లనే గల్లంతు చేసే సరికొత్త పద్ధతులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తనకు వ్యతిరేకంగా ఉన్నోడి ఓటే తీసేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత కన్నా దుర్మార్గం, దౌర్భాగ్యం ఉంటుందా? నిజానికి ఓట్ల చేర్పింపుపై విస్తృతంగా ప్రచారం చేయాలి. ఓట్లు తొలగించడంలో భాగమే డేటా చోరీ. ఎవరి ఓటు ఉంచాలో, ఎవరిది తీసివేయాలో తెలుసుకోవడం కోసమే ఈ డేటా చోరీ. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆధార్ సమాచారాన్నీ, ఎన్నికల కమిషన్ సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం తన చేతిలో ఉంది కదా అని ప్రైవేటు సంస్థలకు అప్పగించడమంటే ఓట్లను తొలగించడానికే. ఎవరేమిటో తెలుసుకోవడానికే చంద్రబాబుకు ఆ డేటా కావాల్సి వచ్చింది. అందుకే వీరు తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. అసలైన క్విడ్ ప్రో కో ఓటుకు కోట్లు కేసు ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పచ్చిగా దొరికిపోయాడు. ఒకవేళ ఆ కేసులో ఏమీ పస లేదనుకుంటే.. విచారణ కోరి చంద్రబాబు తన నీతి నిజాయితీని నిరూపించుకోవచ్చు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ కుమ్మక్కైపోయారు అప్పుడు. వాస్తవానికి అసలైన క్విడ్ ప్రో కో ఇది! కిందకు వస్తుందిది. ఇద్దరూ కూడబలుక్కుని ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవద్దని అనుకుని ఉంటారని.. కేంద్రంలో ఉన్న పెద్ద బుర్రలు ఈ ఇద్దర్నీ కూర్చోబెట్టి రాజీ చేయడం వల్ల సహజ రీతిలో చార్జిషీట్ వేసి విచారణ జరగాల్సిన కేసు మూలపడిందన్నది నా అనుమానం. పార్టీ ఫిరాయింపులు క్విడ్ ప్రో కో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తున్నారు, కార్లు, బంగళాలు ఇస్తున్నారు. అంటే.. దానర్థం ఏమిటీ? మీరు పార్టీ ఫిరాయించండి, మేము లబ్ధి చూపిస్తామనే కదా. ఇది కచ్చితంగా క్విడ్ ప్రో కో. పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు వేయడం.. ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం వేరు కథ. దాని చట్టం వేరు. క్విడ్ ప్రో కో చట్టం వేరు. కానీ వైఎస్సార్ సీపీ వాళ్లు ఏమి చేశారంటే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించమని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాకాకుండా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద చర్య తీసుకోమని గవర్నర్‌కు ఫిర్యాదు చేసి.. వాళ్లను ప్రాసిక్యూట్ చేయమని అడగాలి. బీసీలకు తీవ్ర అన్యాయం చంద్రబాబు చర్య వెనుకబడిన తరగతుల(బీసీలకు) వారందరికి వ్యతిరేకం. అందుకే వెనుకబడిన తరగతుల వారంతా ఆయన మీద కోపంగా ఉన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నీట్)లో ఎంబీబీఎస్ యూజీ సీట్లలో సెంట్రల్ పూల్ కింద కేటాయించిన 15 శాతం సీట్లలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. దీనిపై బీసీలు చంద్రబాబును కలసి రిజర్వేషన్లు కల్పించాలని ఫిర్యాదు చేసినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో నేనే సుప్రీంకోర్టులో పిటిషన్(డబ్లు్యపీ నెంబర్ 323/2019) వేశా. త్వరలోవిచారణకు రానుంది. చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారు. గ్రామ పంచాయితీల రిజర్వేషన్ల విషయంలోనూ అన్యాయంగానే వ్యవహరిస్తున్నారు. సర్కారీ సొమ్ముతో ఓట్ల కొనుగోలు అన్నిటి మాదిరే రాజకీయమూ వ్యాపారమైంది. తెలంగాణలో రాజ్యమేలుదామని మొన్న తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు పెద్దఎత్తున డబ్బు, దస్కాన్ని పెట్టి ప్రచారం నిర్వహించి దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఆంధ్రలో ఆయన సీటు ఉంటుందో ఊడుతుందో, కుప్పం పోవాల్సివస్తుందో తెలియదు గాని, తెలంగాణలో మాత్రం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్నాడని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. చంద్రబాబే పెట్టుబడి పెట్టి, కులాలను విడదీసి, డబ్బులిస్తూ గెలవాలనుకుంటున్నారు. ప్రజల్ని ఎప్పుడూ బిచ్చగాళ్లుగానే ఉండాలని చూస్తున్నారు. ఇదో పెద్ద కుంభకోణం. వాస్తవానికి రాజకీయం అంటే ప్రజాసేవ. రాజకీయ నాయకులు అంటే ప్రజా సేవకులు. జడ్జీలైనా, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, గవర్నమెంటు ఉద్యోగులయినా, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినా వారందరూ ప్రజా సేవకులు. వారికి ప్రజలే అధిపతులు. కానీ వీళ్లెవరయినా ప్రజా సేవకులమని అనుకుంటున్నారా? ప్రజల్ని భక్షించే వాళ్లు కనబడుతున్నారు గాని రక్షించే వాళ్లు లేకుండా పోయారు. ఆ మాటతో బాబు ఖంగు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ప్రకాశరావు ఉన్నప్పుడు ఎవరో ఒక కేసు వేశారు. అదేమిటంటే ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి పనులను అడ్డం పెట్టుకుని కొందరు పారిశ్రామికవేత్తలు–వైఎస్ జగన్ పెట్టే సాక్షి దినపత్రికలో క్విడ్ ప్రో కింద పెట్టుబడులు పెట్టారని ఆరోపణ చేశారు. దాన్ని జస్టిస్ ప్రకాశరావు నా వద్దకు పంపారు. నిజానికి ఆ రోజు ఒక్క న్యాయవాది కూడా జగన్‌కు వ్యతిరేకంగా వాదించేందుకు ముందుకు రాలేదు. సీబీఐ వకీలు గానీ, అడ్వకేట్ జనరల్ గానీ మరెవ్వరూ గాని వ్యతిరేకించలేదు. అయినా కూడా నా మనస్సాక్షి ప్రకారం.. ఇదేదో ఆరోపణ వచ్చింది.. ఏ తప్పూ చేయని సీత మీదనే ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె తన పాతివ్రత్యాన్ని ఎలా నిరూపించుకుందో.. అదే విధంగా ఈ ఆరోపణల్లో నిజమేమిటో నిగ్గు తేల్చాలని ఆవేళ నోటీసులు ఇచ్చా. ఆ తర్వాత వైవీ చౌదరి కుమార్తె పెళ్లిలో చంద్రబాబు కలిసి.. అన్నా, మీరు బాగా చేస్తున్నారన్నా అన్నాడు. అప్పుడు నేనన్నా.. ఆ ప్లేస్‌లో మీరున్నా (చంద్రబాబు) నేను అదే పని చేసి ఉండేవాణ్ణి అన్నా. అంతే చంద్రబాబు కంగుతిన్నాడు. నిజాయతీపరుడైతే స్టే తెచ్చుకోకుండా ఉండాల్సింది వైఎస్ విజయమ్మ వేసిన కేసు విషయానికి వస్తే– జస్టిస్ రోహిణీ, అశుతోష్ మహంతో బెంచ్‌కు ఈ పిల్ వస్తే వాళ్లు కొట్టి వేశారు. ఆ తీర్పు సమంజసం కాదని నేను గట్టిగా చెబుతా. ఎందుకంటే.. విజయమ్మ ఒక ఆరోపణ చేశారు. నిజంగా చంద్రబాబు ఏమీ తప్పు చేయకుంటే, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించకుంటే.. తన పవిత్రతను నిరూపించుకోవాలనుకుంటే ఆ కేసును ఎదుర్కోవాల్సింది. ఈవేళ జగన్ ఎదుర్కొంటున్నట్టే ఎదుర్కోవాల్సింది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా తమ బాధ్యతను విస్మరిస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా అంతా చంద్రబాబును, వాళ్ల వర్గ సామ్రాజ్యాన్నికాపాడడానికే పని చేస్తోందనడం వాస్తవం. వాస్తవాలను అణచివేసి చంద్రబాబును విపరీతంగా హైప్ చేసేందుకు తాపత్రయపడుతున్నది. ఏ రోజన్నా ఆ పత్రికలు చంద్రబాబు చేసిన తప్పుల గురించి రాసిన పాపాన పోలేదు. రాత్రికి రాత్రే రిపోర్టు రాయించుకున్నారు.. కాపులపై ఆయన చిత్తశుద్ధి ఎంతటిదో చూడండి. మంజునా«ధ్ కమిషన్ వేశారు. ఆయన కాపుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై డేటా సేకరించారు. చంద్రబాబు ఆ డేటాను ఎందుకు ప్రచురించలేదు? మంజునాధ్ హైకోర్డు జడ్జిగా పని చేశారు. మంచి పేరున్న వ్యక్తి. మంజునాధ్ నివేదిక ఇవ్వడానికి ముందే ఐదుగురు సభ్యులున్న కమిషన్‌లో ముగ్గురు సభ్యులను చంద్రబాబు మేనేజ్ చేసి.. రాత్రికి రాత్రి వారితో ఒక రిపోర్టు రాయించుకుని, చైర్మన్‌ను పక్కన పెట్టి పక్కదోవ పట్టించి నివేదిక తీసుకున్నారు. ఇదే కమిషన్ రిపోర్టని చెప్పుకున్నారు. కనీసం మరి దాన్నైనా ఎందుకు పబ్లిష్ చేయలేదు? హైకోర్టు ఏర్పాటువివాదంపై రాష్ట్ర విభజన తర్వాత 10, 15ఏళ్లు హైదరాబాద్‌లోనే హైకోర్టు ఉండే వెసులుబాటు ఉంది. అయితే కొందరు హైకోర్టు న్యాయవాదులు 2015లో కోర్టులో కేసు వేశారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్తా ఆదేశాలిస్తూ.. పూర్తిగా భవనాలు, మౌలిక వసతులు కల్పించే వరకు ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు. చంద్రబాబు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇస్తూ.. 2018 డిసెంబర్ 15లోగా అన్ని భవనాలు, సౌకర్యాలు పూర్తి చేస్తానని పేర్కొన్నారు. దాని ఆధారంగా రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చారు. 2019 జనవరి 1న ఏపీలో హైకోర్టును ప్రారంభిస్తున్నట్టు నోటిఫికేషన్ వెలువడింది. తీరా అక్కడకు వెళితే భవనాలు పూర్తి కాకపోవడంతో తాత్కాలికంగా విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోనే కోర్టు ఏర్పాటయింది. ఈలోగా తాత్కాలికంగా ఒకటి పూర్తయిందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసుకువచ్చి ప్రారంభోత్సవం అంటూ హడావిడి చేశారు. అంటే తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని మభ్యపెట్టడానికి రాష్ట్రపతిని,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సైతం పక్కదోవ పట్టించగలడు ఈ పెద్దమనిషి. రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా చార్జీషీట్లో పేరు లేకపోవడమేంటి? ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పేరును వందసార్లు చెప్పి.. చార్జిషీట్లో ఆయన పేరు లేకుండా వేస్తే దాన్ని ఏమనుకోవాలి? అసలదేమి చార్జిషీట్. వీళ్లు చేయకపోయినా జడ్డి అయినా ఆ పని చేయవచ్చు. ఇప్పుడైనా చంద్రబాబు పేరును చేర్చి అదనపు చార్జిషీట్ వేయాలి. కేసు విచారణ జరపాలి. వాస్తవానికి సాక్ష్యాలను, ఆధారాలను బట్టి కేసు ఉంటుంది. కానీ అవన్నీ ఈవేళ మ్యానేజ్ అవుతున్నాయి కదా. ఇంత రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా.. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేసు వేయకపోవడం ఏమిటో అర్థమే కావడం లేదు. నిజాయితీని నిరూపించుకున్నప్పుడే కదా ప్రజలలో క్రెడిబులిటీ ఉండేది, ఆ పని చంద్రబాబు చేయలేదు. ఓటును అమ్ముకోవద్దు ‘‘ప్రధానమంత్రి ఓటుకైనా.. కూలీ ఓటుకైనా ఒకటే విలువ. ఎవరైతే మీకు మంచి చేస్తారో వారికే ఓటు వేయాలి. డబ్బుకు, మద్యానికి ఆ ఓటును అమ్ముకోవద్దు. ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేయండి. సామాజిక న్యాయం ఎవరుకల్పిస్తారో.. ప్రజల మధ్య ఉంటూ.. ప్రజలతోనే తన జీవితాన్నికొనసాగిస్తున్న వ్యక్తులకే ఓటు వేయాలి. నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించాలి’’ పాఠశాల విద్యను జాతీయం చేయాలి.. పాఠశాల విద్యను జాతీయం చేయాలని నేను జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రాధమిక విద్య ఎంత బాగుంటే ..భావితరం అంత బాగుంటుంది. విద్య, వైద్యం, పెన్షన్ల వంటి వాటిని జగన్ నవరత్నాల్లో ప్రకటించారని పేపర్లలో చదివా. జగన్‌కు నా విజ్ఞప్తి ఏమిటంటే.. చట్టసభలలో ఇంతవరకు అడుగుపెట్టని కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి. – ఆకుల అమరయ్య, సాక్షి ప్రతినిధి -
అనుభవం అని చెప్పుకునే పార్టీకి ఓటెయ్యొద్దు
సాక్షి, తిరుపతి : పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప పథకాలు ప్రవేశ పెడితే.. చంద్రబాబు ఏమో ప్రజలను మోసం చేయడానికి పథకాలను ప్రకటిస్తున్నారని బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య విమర్శించారు. చంద్రబాబు పెట్టిన ప్రతి పథకంలో ఒక కుంభకోణం ఉందని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. కాపులను మోసగించడానికి బీసీలకు అన్యాయం చేసున్నారని ఆరోపించారు. బీసీలు న్యాయమూర్తులుగా అవసరం లేదని చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గం అన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్ అనేది బూటకమన్నారు. అనుభవం అనిచెప్పుకొంటున్న పార్టీకి ఓటెయద్దని బీసీలకు పిలుపునిచ్చారు. తాను ఏ రాజకీయ పదవి కోరుకోవడంలేదని, సమసమాజ స్థానపనే తన లక్ష్యం అన్నారు. లేనివాడికి కూడా అధికారం ఇవ్వాలన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ బీసీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారని ప్రశంసించారు. 41 మందికి ఎమ్మెల్యే టిక్కెట్లు, 7మందికి ఎంపీ టికెట్లు కేటాయించడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ మీద ఉన్న కేసుల్లో పసలేదని, అవి నిలబడే కేసులు కాదన్నారు. ఐఏఎస్ అధికారులకు క్లిన్‌చిట్ వచ్చిన తర్వాత జగన్ దోషి ఎలా అవుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీలకు అందరు మద్దతు ఇవ్వాలని కోరారు. -
మోసగించిన పార్టీలకు గుణపాఠం
హైదరాబాద్: ఎన్నికల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆలిండియా బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య మండిపడ్డారు. మోసం చేస్తున్న పార్టీలకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలతో సంబంధం లేకుండా బీసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి బీసీ ఉద్యమించాలని కోరారు. దోమలగూడలోని బీసీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయపార్టీలు ప్రజాసంక్షేమం కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా బీసీలకు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బీసీలకు చాలా వరకు న్యాయం చేశారని, 41 ఎమ్మెల్యే, 7 ఎంపీ సీట్లు కేటాయించారని గుర్తుచేశారు. పార్లమెంటు స్థానాల్లో బీసీ అభ్యర్థి ఉన్నచోట ఆయనకే మద్దతు ఇచ్చి గెలిపించా లని, బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించిన పార్టీలకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, మంత్రివర్గంలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని విమర్శించా రు. బీసీల ఆశీర్వాదం పేరిట రెండోసారి అధికారం లోకి వచ్చిన కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు శఠగోపం పెట్టారని బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ గురించి కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పారని, 1956 నుంచి రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రిత్వ శాఖను కనుమరుగు చేశారని అన్నారు. బీసీలకు 8 ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు జనాబా దామా షా ప్రకారం రాజాకీయ ప్రాతినిధ్యం కల్పించక పోవ డం శోచనీయమని ఆలిండియా బీసీ ఫెడరేషన్ కో ఆర్డినేటర్ సాంబశివరావు అన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు విజయ్‌భాస్కర్, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక మహిళ తప్ప సభ్యులంతా నేరస్థులే
హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌లో ఒక మహిళా సభ్యురాలు తప్ప మిగతా వారంతా నేరస్థులేనని బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ ఆరోపించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన క్రాంతి మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పరివర్తన యాత్ర ముగింపు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీసీ కమిషన్‌లో ఉన్న సభ్యుల వల్ల హక్కులు రక్షించబడతాయనే నమ్మకం లేకుండా పోయిందని చెప్పారు. బీసీ కమిషన్‌ను నిర్వీర్యం చేసి ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తున్నారని విమర్శించారు. విద్య, ఆరోగ్యం ప్రైవేటు సంస్థల చేతుల్లో మగ్గుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 4 శాతం ఉన్న అగ్రకులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని.. దీని వల్ల బలహీన వర్గాల వారికి పూర్తిగా అన్యా యం జరుగుతుందని మండిపడ్డారు. మెడికల్ సీట్లలో బీసీలకు 13 శాతం రిజర్వేషన్లు కూడా అమలు కావడం లేదన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఎన్నికలు చట్టబద్ధంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు యంత్రాంగమే ప్రభుత్వానికి అనుకూలంగా డబ్బులు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. బహుజన క్రాంతి మోర్చా జాతీయ కోఆర్డినేటర్ వామన్ మేస్రామ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బొమ్మకు మురళి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌కు బీసీ ఫెడరేషన్ వినతిపత్రం
-
ఈబీసీ కోటాకు వ్యతిరేకంగా ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా
-
అగ్రవర్ణ రిజర్వేషన్ రాజ్యాంగ స్వభావానికి విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వత్యిరేకిస్తూ బీసీ సంఘాలు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై మండిపడ్డారు. అగ్రకుల పేదల పేరుతో అగ్రకుల ధనికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, చాతుర్వర్ణ వ్యవస్థను శాశ్వతంగా ఉంచేందుకే ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. రాజ్యాంగ మూల స్వభావానికి విరుద్ధంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని అన్నారు. సమానత్వానికి విరుద్ధంగా అగ్రకుల రిజర్వేషన్ల బిల్లు తెచ్చారని విమర్శించారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ నియామకాల్లో 13 పాయింట్ల రిజర్వేషన్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కులాలవారీగా జనగణన శాస్త్రీయంగా జరగాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. అణగారిన వర్గాలను బానిసలుగా అణగదొక్కేందుకే 10 శాతం ఈబీసీ రిజర్వేషన్‌ను తీసుకొచ్చారని మండిపడ్డారు. -
ఈబీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ: కేంద్రం ఈబీసీలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ బీసీ సమైక్య జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తు బుధవారం జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి అధ్యయనం లేకుండా రిజర్వేషన్లు కల్పిస్తే రాజ్యాంగ స్పూర్తి దెబ్బతింటుందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. -
బీసీ జనాభా లెక్కలు వెల్లడించాలి
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నిలుపుకోవాలంటే ముందుగా వారి జనాభా లెక్కలు వెల్లడించాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలందరికీ న్యాయం జరిగేలా ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నా జనాభా లెక్కలే ప్రామాణికమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు – భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై ఆదివారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో పలువురు బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 24 ఏళ్లుగా బీసీలకు 34%గా ఉన్న రిజర్వేషన్లను 24శాతానికి కుదించడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రశ్నించలేని దుస్థితిలో బీసీ కమిషన్ ఉండటం శోచనీయమన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఒక్కరోజులో పూర్తిచేయగలిగిన ప్రభుత్వానికి బీసీ జనాభా లెక్కలను వెలికి తీయడం ఎంతసేపని ప్రశ్నించారు. బీసీలు 52% కన్నా తక్కువగా లేరని, వారిని ఏబీసీడీలుగా వర్గీకరిస్తేనే పంచాయతీ ఎన్నికల్లో సమన్యాయం జరుగుతుందని సూచించారు. అధికారులే నిర్వీర్యం చేస్తున్నారు ఈ సమావేశంలోనే బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నికైన జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ...స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు, ఎన్నికల శాఖ అధికారులు రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో అడిషనల్ ఏజీపీతో వాదనలు వినిపించడం వల్లే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. న్యాయనిపుణులు, సామాజిక ఉద్యమకారులతో చర్చించి రిజర్వేషన్ల పంచాయతీకి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. రిజర్వేషన్ల పరిరక్షణకు అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. సామాజిక విశ్లేషకులు ఉ.సాంబశివరావు మాట్లాడుతూ.. బీసీ లెక్కలు లేకపోవడానికి పాలకులే కారణమన్నారు. బీసీలకు 54% రిజర్వేషన్లు ఇవ్వాలని పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కె.గణేశ్‌చారి, ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు నర్సింహ్మ సగర, బీసీ,ఎస్సీ,ఎస్టీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ప్రొఫెసర్ రమ, ఎస్.లక్ష్మి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టసభల్లో రిజర్వేషన్లతోనే బీసీల అభ్యున్నతి
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో 75 శాతానికి పైగా ఉన్న బీసీలు ఎవరికి వారే పోరాడుతుండటం వల్ల అభివృద్ధి ఫలాలు దక్కడం లేదు. బీసీలంతా సంఘటితమైతేనే ప్రజాస్వామ్య ఫలితాలు లభిస్తాయి. చట్టసభల్లో రిజర్వేషన్లతోనే బీసీల అభ్యున్నతి సాధ్యం’ అని అఖిల భారత బీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు జస్టిస్ వి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. బీసీ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య అధ్యక్షతన ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా వెనుబడిన వర్గాలు నేటికీ అభివృద్ధి చెందలేదన్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే విలువలతో కూడిన సమసమాజ స్థాపన కోసం.. దేశంలోని అన్ని రంగాల్లోనూ బీసీలకు తగినంత ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమాఖ్య రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తోందన్నారు. వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లభించాలన్న లక్ష్యంతో ‘పీపుల్స్ అజెండా–2019’కు రూపకల్పన చేశామని, ఓటుతోనే ఈ అజెండా అమలు సాధ్యమవుతుందన్నారు. ప్రాథమిక విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాలని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న నీరు, భూమి, అటవీ వనరులపై వారికే పూర్తి హక్కులు కల్పించాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ పెట్టుబడులు ప్రభుత్వమే భరించాలని జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అనంతరం బీసీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ ముద్రించిన కరపత్రాలను జస్టిస్ ఈశ్వరయ్య విడుదల చేశారు. సమావేశంలో నాయకులు దువ్వారపు రామారావు, ఎంవీవీఎస్ మూర్తి, వై.కోటేశ్వరరావు, గూడూరి వెంకటేశ్వరరావు, కె.ఆల్మన్ రాజు, నమి అప్పారవు, వి.వి.గిరి, ఎన్.వి.రావు, బుద్దా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్ ఈశ్వరయ్య ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
రాజ్యాధికారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటి వరకు సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన బీసీ సంఘం ఇకపై రాజ్యాధికారమే ఏకైక ఎజెండాగా పని చేయనున్నట్లు బీసీ రాజకీయ సమితి (బీఆర్ఎస్) ప్రకటించింది. రాయితీల నుంచి రాజ్యాధికారం వైపు బీసీలు దృష్టి సారించాలని పిలుపునిచ్చింది. ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో బీసీ రాజకీయ యుద్ధభేరి జరిగింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ భేరీకి ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ భబన్‌రావు థైవాడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మెన్రాజు, బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు కేశన శంకర్రావు, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, సినీ నటి రమ్యశ్రీ, సమాఖ్య అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్, బీసీ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు బి.యాదగిరి, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, రచయితల సంఘం అధ్యక్షుడు శేఖర్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుల్కచర్ల శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు కె.శ్యాం కురుమ, పూలే కమిటీ చైర్మన్ గణేషాచారి తదితరులతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి ఐదు వేల మందికిపైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. బీసీ రాజకీయ సమితికి ఏ పార్టీలతో కూడా సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ అయితే బీసీకి టికెట్ ఇస్తుందో.. ఆయా అభ్యర్థులకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీసీ అభ్యర్థులు లేని చోట బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 30 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. యుద్ధభేరి వేదికగా 9 మంది అభ్యర్థుల పేర్లను కూడా బీఆర్ఎస్ ప్రకటించింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీ ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్న బీసీ సంక్షేమ సంఘం... రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ రాజకీయ వేదికను ఏర్పాటు చేçసినట్లు ప్రకటించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచి బీఆర్ఎస్ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఆవిర్భవించనుందని తెలిపింది. విజన్ 2024 నాటికి పూర్తి రాజ్యాధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు వెల్లడించింది. ఖర్చుపై కమిటీ వేయాలి: జస్టిస్ ఈశ్వరయ్య ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు విలువలు, సేవ చేసే తత్వం ఉన్న అభ్యర్థుల కంటే బాగా ఖర్చు చేసే వారికే టికెట్లు ఇస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆయా అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. అభ్యర్థుల ఖర్చుపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. సేవకులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులకు టికెట్లు ఇస్తే.. చట్టసభలకు ఎన్నికైన తర్వాత వారు ప్రజలకేం సేవ చేస్తారు. తెలంగాణలో ఒకటి, అర శాతం ఉన్న కులాలు 56 శాతం జనాభా ఉన్న కులాలను పాలిస్తున్నాయి. రాజ్యాధికారంలో వాటా దక్కాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించుకోవాలి. రాష్ట్ర ఏర్పాటు తర్వాతే అన్యాయం: జాజుల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. పార్టీ పగ్గాలు, బీఫాంలను వారు తమ చేతిలో పెట్టుకుని గెలుపు గుర్రాలు, సిట్టింగ్‌ల పేరుతో టికెట్లు అమ్ముకుంటున్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు. అలాంటి పార్టీకు ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతాం. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు అదే ప్రతిపాదికన సీట్ల కేటాయింపు జరగాలి. లేదంటే ఆయా అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ఇవే చివరి ఎన్నికలవుతాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే... కొల్లాపూర్: మాచర్ల రామకృష్ణగౌడ్ నర్సాపూర్: సోమన్నగారి లక్ష్మక్క సూర్యాపేట: రాపర్తి శ్రీనివాస్‌గౌడ్ నర్సంపేట్: మధన్‌కుమార్ దేవరకద్ర: రాచాల యుగేందర్ గౌడ్ సిరిసిల్ల: పరిశ హనుమాండ్లు ఆలేరు: కాదూరి అచ్చయ్య భువనగిరి: సోము రమేష్‌కురుమ వరంగల్ తూర్పు: రవిశంకర్‌గౌడ్ -
జస్టిస్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జాతీయ ఓబిసీ ఫెడరేషన్ సమావేశం
-
బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జాతీయ ప్రెసిడెంట్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, టీడీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు. లోక్ సభలో బీసీలపై బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల కోసం కేంద్ర మంత్రులకు 2వేల లేఖలు రాశానని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం 11 సంవత్సరాలు పోరాటం చేశానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. బీసీల కోసం ప్రత్యేక పార్టీ అవసరం లేదు.. ప్రతి పార్టీలో బీసీ నేతలు ఉన్నారన్నారు. జ్యోతిరావు పూలే బీసీల కోసం గొప్ప పోరాటం చేశారని తెలిపారు. పూలే విగ్రహాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి, ఆయన భవనాలు కట్టించాలని కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. బీసీ భవన్ కోసం ఏర్పాటు చేసిని స్థలాలను బీసీ నాయకులే కబ్జా చేశారని పేర్కొన్నారు. కొంతమంది నేతలు రాజ్యాధికారం మా రక్తంలోనే ఉంది అన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్లు మాత్రమే బీసీలవి అధికారం మాత్రం ఎవరిదో అన్నట్లు ఉందన్నారు. కేసీఆర్ క్యాబినెట్లో ఎంత మంది బీసీలన్నారో చెప్పాలని ప్రశ్నించారు. టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్.రమణ మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం కోసం పోరాటం చెయ్యాలని అన్నారు. బీసీల ఓట్లను ఇతర నేతలు ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకొని వాటిని మన కోసం మన వైపు మళ్లించుకోవాలని రమణ పేర్కొన్నారు. బీసీ కులాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చెయ్యాలన్నారు.బీసీలకు అధికారం వచ్చేందుకు నా వంతు కృషిచేస్తానని రమణ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఓబీసీల అధికారం కోసం కృషిచేస్తున్న ఈశ్వరయ్యకు అభినందనలు తెలిపారు. బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా.. ఐకమత్యం లేదని, ఓబీసీలను దేశంలో చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఓబీసీ బిల్లు బీజేపీ ఆధ్వర్యంలో లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో మాత్రం పాస్ కాదని తెలిపారు. టీటీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి.. కానీ రాను రాను ఒకరిపై ఒకరు అజమాయిషీ చలాయించడం జరుగుతుందని అన్నారు. ఓటు హక్కు అనే విషయంపై సుదీర్ఘమైన చర్చ జరిగిన తరువాతే ఓటు హక్కును కల్పించారని తెలిపారు. ఈ రోజుల్లో కొంత మంది రాజుల తరహాలో ప్రవర్తిస్తున్నారు.. కానీ గతంలో ప్రతి ఒక్కరు అధికారులే, నాయకులేనని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజ్యాంగానికి లోబడే పని చెయ్యాలి.. కానీ ఎవ్వరూ రాజ్యాంగానికి లోబడి పనిచెయ్యడం లేదన్నారు. -
‘చట్టసభల్లో బీసీ ప్రతినిధుల సంఖ్య పెరగాలి’
సాక్షి, హైదరాబాద్ : చట్టసభల్లో బీసీ ప్రతినిధుల సంఖ్య పెరగాలని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన జాతీయ ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బండారు దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, ఎల్ రమణ, దేవేందర్ గౌడ్లతో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. చైతన్యం ద్వారానే మార్పు సాధ్యమని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో శాస్త్రీయత లేకుండా గత ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని విమర్శించారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు ఆ దిశలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీలంతా ఒకేతాటి పైకి రావాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నారు. ఓటుకు నోటు ఇస్తున్నారు.. అయినా బీసీ సామాజిక వర్గానికే ఓటు వేయాలని కోరారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒత్తిడి పనిచేస్తోంది.. ఒత్తిడితోనే మన హక్కులు సాధించుకోవాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు ఎదగాలని అకాంక్షించారు. -
జాతీయ ఓబీసీ ఫెడరేషన్ ఆవిర్భావం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల్లో పనిచేస్తున్న బీసీ సంఘాలను ఒకే గొడు గు కిందకు తెస్తూ జాతీయ బీసీ ఫెడరేషన్ ఆవిర్భవించింది. ఆదివారం ఢిల్లీలో జాతీయ ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ నుంచి బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు, అన్ని రాష్ట్రాల నుంచి ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల బీసీ సంఘాలను కలిపి ఒకే ఫెడరేషన్‌ను ఏర్పాటుచేశారు. దీనికి జాతీయ చైర్మన్‌గా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిజర్వేషన్లు దక్కేవరకు పోరాటం.. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణను శాస్త్రీయంగా చేపట్టాలని, బీసీ ఓటర్ల గణన శాస్త్రీయంగా జరగలేదని, సమగ్ర కుటుంబ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్ ఎత్తేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని, కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.50 వేల కోట్లు కేటాయించాలని, ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని పలు తీర్మానాలు చేశారు. ఓబీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమానత్వం కల్పించి ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన భాగం ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్ల సాధనకై వచ్చే నెలలో లక్ష మందితో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. -
‘చట్టసభల్లోకి వెళ్తెనే బీసీలకు న్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి, జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. చట్టసభల్లోకి వెళితేనే సమన్యాయం జరుగుతుందని పేర్కొనారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓబీసీ జాతీయ జాయింట్ కమిటీ సమావేశంలో 27 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. జస్టిస్ ఈశ్వరయ్యను జాతీయ ఓబీసీ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం, సమానత్వం రావాలంటే పార్లమెంట్, అసెంబ్లీలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, క్రిమీలేయర్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓటర్ల గణన శాస్త్రీయంగా జరగలేదని, పంచాయతీ రాజ్ ఎన్నికలవరకల్లా సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓబీసీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు యాక్షన్ కమిటీ కృషిచేస్తుందని పేర్కొన్నారు. యాక్షన్ కమిటీకి తోడుగా మండల స్థాయివరకూ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ, పార్లమెంట్, కోర్టుల్లో ప్రజాస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటును అమ్ముకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా బీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
ఇప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ ఔట్
♦ మనసులో మాట ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి పరాజయం తప్పదని మాజీ యాక్టింగ్ చీఫ్ జస్టిస్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్ ఈశ్వరయ్య తేల్చిచెప్పారు. ఏపీలో పాలన సామాజిక న్యాయానికి దూరమైంది కాబట్టే ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అర్చకులతో పాటు కమ్మ సామాజిక వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో చంద్రబాబు ప్రభుత్వానికి దూరమయ్యారని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో చేసిన రహస్య సర్వే ప్రకారం, ఏపీలో చంద్రబాబును ఇప్పటికే నూటికి 55 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ సర్వే ప్రకారం ఈ రోజు ఎన్నికలు పెట్టినా కూడా చంద్రబాబు గెలవలేరంటున్న జస్టిస్ ఈశ్వరయ్య అభిప్రాయం ఆయన మాటల్లోనే... న్యాయవాద వృత్తికి ఎలా వచ్చారు? ఎలాంటి మౌలిక వసతులూ లేనటువంటి చిన్న కుగ్రామంలో పుట్టాను. అక్కడినుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి అఆలూ, ఇఈలూ నేర్చుకున్నాను. నాన్న రైతు. పదోతరగతి వరకూ వలిగుండ మండలం నెమలికాలువ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను. పెద్దనాన్న చనిపోవడంతో బీఎస్సీ పరీక్ష రాయలేకపోయాను. తర్వాత లా పూర్తిచేసి ఆ వృత్తిలోనే కొనసాగాను. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో అబ్కారీ కేసులన్నీ నాకే వచ్చాయి. జడ్జీలు కూడా ఇతనయితే నిజం చెబుతాడు అనే నమ్మకంతో నాకే కేసుల ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండేవారు. ఒక్క క్లయింట్ వద్ద కూడా ఫీజు అడిగేవాడిని కాదు. వాళ్లు ఇచ్చినంత తీసుకునేవాడిని. న్యాయవ్యవస్థపై రాజకీయ బ్రోకరిజం పాత్ర ఎంత? ఇప్పుడయితే పూర్తిగా వ్యాపారమయం అయిపోయింది కానీ నిజంగానే లా అనేది ఒక విశిష్టమైన వృత్తి. కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నారెడ్డి హయాంలో ప్రభుత్వ ప్లీడర్ అయ్యాను. ప్రభుత్వ ప్రయోజనాలను పూర్తిగా కాపాడాను. తర్వాత కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తే జడ్జిగా అయ్యాను. బయట ప్రచారం చేసుకుంటున్నట్లుగా నేను జడ్జి కావడానికి చంద్రబాబు ప్రమేయం కానీ ఆయన సమ్మతి కానీ అణుమాత్రం లేదు. కానీ బాబు రాజకీయ బ్రోకర్‌గా అవతారమెత్తి ఏపీలో న్యాయమూర్తులు కానున్న వారికి వ్యతిరేకంగా అభిప్రాయం రాసి పంపిన చరిత్ర అయితే ఉంది. కానీ బాబు అభిప్రాయాన్ని కొలీజియం తోసిపుచ్చి వారినే న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ బ్రోకరిజం బలంగా ఉన్న ఏపీలో ఏం జరుగుతోందో కొలీజియంకు బాగా తెలుసు. బీసీల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది కదా? ఎందుకంటే ఆనాటి టీడీపీ ఇప్పుడు చచ్చిపోయింది. ఎన్టీరామారావు స్థాపించిన టీడీపీ బీసీలకు నిజం గానే పట్టం కట్టింది. దేవేందర్ గౌడ్, తలసాని యాదవ్, యనమల రామకృష్ణుడు, నరసింహులు ఇలా ఇప్పుడున్న బీసీ ప్రముఖ నేతలందరూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వారే. ఎన్టీఆర్ వల్లే లక్షలాది మంది బీసీలు టీడీపీ కార్యకర్తలుగా ఎదిగారు. న్యాయవ్యవస్థపై బాబుకు అంత పట్టు ఉందా? బాబుపై ఉన్న కేసులన్నీ మరుగున ఉన్నాయంటే కారణం ఉండాలి కదా. బాబు అడ్డంగా దొరికిన ఓటుకు నోటు కేసును కూడా హైకోర్టు విచారణ జరగకుండా కొట్టివేసిందంటే జనం అనుకుం టారా లేదా? పైగా ఏసీబీచే విచారణ చేయించమని అడిగితే దీంట్లో విచారించడానికి ఏముంది అని అడ్డుకున్నారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టు ఆదేశంపై స్టే విధించాల్సి వచ్చింది. బాబు అక్రమాస్తుల కేసుపై కూడా విచారణ దీర్ఘకాలంగా పెండింగులో ఉంది. ఓటుకు కోట్లు కేసుపై మీ అభిప్రాయం? ఆ కేసును విచారించిన సిట్టింగ్ జడ్జిలలో నేనూ ఒకరిని. కానీ సంచలనం కలిగించిన ఈ కేసులో కూడా విచారణ ఇంత పెండింగ్ జరుగుతోందంటే ప్రశ్నించాల్సిందే. కేసుల విచారణ నంబర్ల వారీగా సీరి యల్ పద్ధతిలో జరిగితే న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటుంది. న్యాయాన్ని కొంటుంటే, విచారణ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తుంటే న్యాయవ్యవస్థను ఎలా నమ్ముతారు? విచారణకు సిబ్బంది లేదంటే నమ్మేయడమేనా? అమెరికా తదితర దేశాల్లో చూస్తే అక్కడ న్యాయవ్యవస్థల్లో ఏరకమైన మేనేజ్మెంట్ వ్యవహారాలకూ తావుండదు. జస్టిస్ చలమేశ్వర్‌తోపాటు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో కేసులు విచారణ సూత్రబద్ధంగా, సహజ రీతిలో జరగటం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సీనియర్ న్యాయమూర్తుల విషయంలోనే పక్షపాతం ప్రదర్శిస్తున్నారని వారన్నారు. సుప్రీంకోర్టులో అత్యంత నిజాయితీ, నిబద్ధత కలిగిన న్యాయమూర్తులు ఆ నలుగురూ. వారే ముందుకొచ్చి తమ బాధ వ్యక్తం చేశారంటే మన న్యాయవ్యవస్థకు జవాబుదారీతనం ఎంత అవసరమో అర్థమవుతుంది. అందుకే న్యాయవ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన జరగాలి. బాబు కేసుపై విచారణ చేయాలని హైకోర్టు జడ్జి తీర్పు చెబితే, సుప్రీంకోర్టులో మరోరకంగా వచ్చింది కదా? కోర్టుల్లో తీర్పులు, ఆదేశాలు అనేవి న్యాయమూర్తుల అంతర్గత నాణ్యత, స్వచ్ఛత ప్రాతిపదికనే వస్తుం టాయి. అందుకే జడ్జీలకు స్వచ్ఛమైన హృదయం, మనస్సు ఉండాలి. కలుషిత మనస్సు ఉండరాదు. కానీ వాళ్లూ ఈ సమాజం నుంచే వచ్చారు కదా. ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. తప్పుడు ఆదేశాలు, తీర్పులు ఇస్తున్నారంటే అది ఆ జడ్జీల్లోని లోపమే కాని మొత్తం వ్యవస్థ లోపం కాదు కదా. జడ్జీల్లో ఆ అంతర్గత స్వచ్ఛత, పవిత్రత లేనందువల్లే న్యాయస్థానంలో కులం, మతం, పార్టీలు అన్నీ దూరిపోయాయి. అందుకే జడ్జీలకు కూడా అంతరాత్మను ప్రశ్నించే ఆధ్యాత్మిక విద్య అవసరమని నా ఉద్దేశం. ఏ కర్మ మనం చేస్తే ఆ కర్మను మనం తప్పించుకోలేం అనే భయం ఉంటే ఎవరూ తప్పు చేయరు, సాహసించరు కూడా. చంద్రబాబు, కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం? ఎన్ని లోపాలున్నా, కేసీఆర్ పాలనలో గొప్పగా చెప్పుకోవలసింది మిషన్ భగీరథ, విద్యుత్తు వంటి అనేక పథకాల ద్వారా ప్రజాప్రయోజనాలను చాలావరకు కాపాడుతున్నారు. అందుకే టీఆర్ఎస్ పాలన కుటుంబ పాలన అని విమర్శలు వస్తున్నా, ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు. కానీ ఏపీలో పాలన సామాజిక న్యాయానికి దూరమైంది కాబట్టే ముస్లింలు, ఎస్టీలు, బీసీలు, అర్చకులు ఇలా సకల సామాజిక వర్గాలూ టీడీపీ ప్రభుత్వానికి దూరమయ్యారు. మోదీ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో చేసిన సర్వేలో ఏపీలో చంద్రబాబును ఇప్పటికే నూటికి 55 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని తేలింది కూడా. ఈ రోజు ఎన్నికలు పెట్టినా కూడా చంద్రబాబు గెలవడని ఆ రహస్య సర్వే నివేదిక తేల్చిచెప్పేసింది. -
జస్టిస్ ఈశ్వరయ్యతో మనసులో మాట
-
బడుగుల ద్రోహి చంద్రబాబు: వి.ఈశ్వరయ్య
తిరుపతి అర్బన్: సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ద్రోహిగా మారారని హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని విమర్శించారు. చంద్రబాబు పాలన పట్ల రాష్ట్ర ప్రజల్లో 65 శాతం మంది వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. బాబు పాలనలో నీతి, నిజాయతీ, పవిత్రత, పారదర్శకత లేకుండా పోయాయని అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా తిరుపతిలో జనచైతన్య వేదిక, ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాజకీయాల్లో సామాజిక న్యాయం’ అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఈశ్వరయ్య, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ... 2011 లెక్కల ప్రకారం కులాల వారీగా జనాభా వివరాలను ప్రకటించాలని కోరారు. సుప్రీంకోర్టు జడ్జి చేతుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలుబొమ్మగా మారారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసేలా పాలకులు వ్యవహరిస్తే సామాన్యులకు న్యాయం జరగదన్నారు. అవినీతిని ప్రజలు ప్రశ్నించాలి 1953 పాలనా విధానాల ప్రకారం రాయలసీమలో హైకోర్టు గానీ, రాజధాని గానీ ఏర్పాటు చేయాల్సి ఉండగా, అధికార పార్టీ నేతలు స్వలాభం కోసం అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేస్తున్నారని జస్టిస్ ఈశ్వరయ్య మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేసి చంద్రబాబు ఏకపక్ష పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే సాగునీటి ప్రాజెక్ట్‌లు 90 శాతం పూర్తయ్యాయని, ఆ తరువాత 9 ఏళ్లకాలంలో 5 శాతం కూడా అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. అంతకుముందు జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావులు మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలో ప్రతి అక్షరమూ సత్యమేనన్నారు. అన్ని కులాలకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. న్యాయ వ్యవస్థలోనూ పెత్తందారీ విధానాలు ఆందోళనకరమని చెప్పారు. వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించి, సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తే ఆయనకు మంచి పేరొస్తుందనే ఉద్దేశంతోనే ఆయా పథకాలను తొమ్మిదేళ్లుగా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. -
రాజ్యాంగ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓబీసీలకు రాజ్యాంగ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ జాతీయ సంయుక్త కార్యాచరణ కమిటీ తీర్మానించింది. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో 12 రాష్ట్రాల బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ..సుప్రీంకోర్టు, హైకోర్టు, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగాల్లో రాజ్యాంగ పరంగా ఓబీసీలకు దక్కాల్సిన 27% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల హైకోర్టు నాయమూర్తుల నియామకంలో బీసీలు జడ్జీలుగా పనికిరారంటూ కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు నివే దికలు పంపారని గుర్తు చేశారు. సుప్రీం న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా అదే రీతిలో స్పందించడం సరికాదన్నారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా ప్రస్తుతం దేశంలో 14 శాతం కూడా అమలు కావడం లేదని చెప్పారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు జడ్జీలుగా బీసీలు పనికిరారంటూ ఇచ్చిన తప్పుడు నివేదికలపై బీసీలకు క్షమాపణలు చెప్పాలని సీఎం చంద్రబాబును తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో 69 మంది బీసీలు ఉండాల్సి ఉన్నా కేవలం 19 మందే ఉన్నారని, ఏపీలో 80 మంది బీసీలు ఉండాల్సి ఉన్నా 34 మందే ఉన్నారని తెలిపారు. సదస్సులో మహారాష్ట్ర మంత్రి మహదేవ్ జన్కెర్, ఏపీ నుంచి ఓబీసీ నేత జి.వెంకటేశ్వర్లు, ఉమ్మడి హైకోర్టు న్యాయవాది మెట్టా చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
బాబు తీరుపై భగ్గుమంటున్న బీసీలు
-
బీసీలకు బాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: ‘టీడీపీకి బీసీలే వెన్నుముక.. వారు లేనిదే టీడీపీ లేదు’.. అని పదే పదే నమ్మబలుకుతూ.. ఆ వర్గాల ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారంటూ హైకోర్టు రిటైర్డు జడ్జి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలకు సీఎం చంద్రబాబు వివరణ ఇవ్వకపోవడంపై రాజకీయ పార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వెనుకబడిన తరగతులకు చెందిన న్యాయవాదులను.. న్యాయమూర్తులు కానివ్వకుండా ఎందుకు అడ్డుకుపడ్డారని ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం.. సీట్ల కోసం బీసీలను చంద్రబాబు వాడుకుని, ఆ వర్గాల సంక్షేమానికి వచ్చేసరికి వదిలేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని ఎత్తిచూపుతున్నారు. బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ వర్గాలకు చెందిన నలుగురు న్యాయవాదులకు విషయ పరిజ్ఞానం, వ్యక్తిత్వంలేదని.. సచ్ఛీలురు కారని కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాసి, హైకోర్టు జడ్జిలు కానివ్వకుండా సీఎం చంద్రబాబు అడ్డుపడిన తీరును జస్టిస్ ఈశ్వరయ్య సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడం ఆ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు నివేదికలు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు సమాధానమివ్వాలి : ఆర్.కృష్ణయ్య ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్న చంద్రబాబు, ఆ తర్వాత వారి వెన్ను విరుస్తున్నారనడానికి జస్టిస్ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలు అద్దంపడతున్నాయని బీసీల సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య అభివర్ణించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే జస్టిస్ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, వెనుకబడిన వర్గాలకు చెందిన న్యాయవాదులను జడ్జిలు కాకుండా ఎందుకు అడ్డుపడ్డారో చెప్పాలంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ట్విట్టర్లో సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. తెలివి, పరిజ్ఞానం లేవంటూ బీసీ న్యాయవాదులను జడ్జిలుగా నియమించవద్దని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాసి.. ఆ వర్గాల ప్రజలపట్ల తనకు ఎంత చిత్తశుద్ధి ఉందన్నది చాటిచెప్పారంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య ఎద్దేవా చేశారు. బీసీలకు నమ్మకద్రోహం చేసిన సీఎం చంద్రబాబును ఆ వర్గానికే చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీసీలను రాజకీయంగా.. ఆర్థికంగా.. సామాజికంగా దెబ్బతీయడానికి సీఎం చంద్రబాబు కుతంత్రాలు పన్నుతున్నారన్నది మరోసారి తేటతెల్లమైందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. సామాజికంగా అభివృద్ధి చెందకుండా చేసేందుకే ‘ఆదరణ–2’ పేరుతో కులవృత్తుల పరికరాలు అంటకట్టి, ఆ వర్గాల ప్రజలకు హైకోర్టు జడ్జిలు వంటి ఉన్నత పదవులు దక్కకుండా అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిలదీస్తున్నా సీఎం చంద్రబాబు నోరుమెదపకపోవడంలో ఆంతర్యమేమిటని వారంతా ప్రశ్నిస్తున్నారు. వివాదం ఇదీ.. రాష్ట్రానికి చెందిన న్యాయవాదులు అమర్నాథ్ గౌడ్, అభినవ్‌కుమార్ చావలి, గంగారావు, డీవీ సోమయాజులు, విజయలక్ష్మి, కేశవరావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు జడ్జిల కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆ ఆరుగురు న్యాయవాదులపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని సీఎం చంద్రబాబును కేంద్ర న్యాయశాఖ కోరింది. బీసీ వర్గాలకు చెందిన అమర్నాథ్ గౌడ్, అభినవ్ కుమార్ చావలి, ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన డీవీ సోమయాజులకు విషయ పరిజ్ఞానం లేదని.. వ్యక్తిత్వం లేదని.. సచ్ఛీలుకారంటూ మార్చి 21, 2017న సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మి, వెలమ వర్గానికి చెందిన కేశవరావులకు అనుకూలంగా నివేదిక పంపారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఆరుగురు న్యాయవాదులపై కేంద్రం ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుంది. ఆరుగురు న్యాయవాదులకూ న్యాయమూర్తులుగా నియమించవచ్చునని కేంద్ర నిఘా వర్గాలు నివేదిక ఇవ్వడంతో.. ఆ మేరకు కేంద్రం వారిని హైకోర్టు జడ్జిలు నియమించింది. బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులు కానివ్వకుండా అడ్డుపడేందుకు కేంద్రానికి సీఎం చంద్రబాబు రాసిన లేఖలను సోమవారం జస్టిస్ ఈశ్వరయ్య బయటపెట్టడం తీవ్ర సంచలనం రేపింది. సీఎం చంద్రబాబు తీరుపై ప్రధాన రాజకీయ పార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. బీసీలు బుద్ధి చెబుతారు బీసీ న్యాయవాదులు జడ్జిలు కాకుండా వారికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీలు తగిన బుద్ధి చెబుతారు. బీసీ న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈశ్వరయ్య బయట పెట్టకుంటే దేశానికి తెలిసేది కాదు. ప్రధానమంత్రిగా బీసీ ఉంటే ఆయనను కూడా చంద్రబాబు తిట్టారు. గ్రామాల్లో పేద బీసీ పిల్లల గురించి సీఎం ఆలోచించడం లేదు. న్యాయవాదులకు రావాల్సిన స్కాలర్షిప్లు రాకుండా చేస్తున్నారు. ఇటువంటి వ్యవహారాలు చేసే వారిని ప్రజలు క్షమించరు. – పృథ్వీరాజ్, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నిజం కాబట్టే సీఎం స్పందించలేదు ఈశ్వరయ్య నిజం చెప్పారు కాబట్టి సీఎం స్పందించడంలేదు. బీసీలకు రాజకీయాల్లో సరైన ప్రాతినిధ్యం లేదు. స్థానిక సంస్థల్లో మాత్రమే ఉంది. చట్ట సభల్లో లేదు. ఎంబీసీలకు ఎదుగుదలే లేదు. ముస్లింలకు, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం బీసీలకు అన్యాయం చేయడమే. ముఖ్యమంత్రి ఎన్నికల్లో 116 వాగ్దానాలు చేశారు. ఒక్కటీ అమలుచేయడంలేదు. ఒకే సామాజికవర్గానికి ఎక్కువ పోస్టులు ఇస్తున్నారు. 2004, 2009, 2014ఎన్నికల్లో బీసీలకు సగం సీట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పారు. 40 సీట్లకు మించలేదు. వైఎస్ఆర్ 67 మందికి ఇచ్చారు. – రామకృష్ణయ్య, బీసీ సంఘం నేత -
చంద్రబాబు ఇదేనా మీ ప్రేమ : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను అణగదొక్కుతున్నారన్న విషయం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వెలుగులోకి తెచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు బీసీలంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం ఇద్దరు బీసీలు(అమర్నాథ్ గౌడ్, అభినవ కుమార్ చావల్లి)తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావులను సిఫార్సు చేస్తే.. అమర్నాథ్ గౌడ్, అభినవ కుమార్, గంగారావు, డీవీ సోమయాజులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ 2017 మార్చి 21న చంద్రబాబు తప్పుడు నివేదిక పంపించారని ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన లేఖలను కూడా ఆయన బయటపెట్టారు. ‘నోరు తెరిస్తే బీసీల సంక్షేమం అనే చంద్రబాబు ఎందుకు బీసీ న్యాయవాదులను జడ్జిలు కాకుండా అడ్డుకుంటున్నారు? వారి నియామకాలను అడ్డుకునేలా తప్పుడు ఫీడ్‌బ్యాక్ ఎందుకు ఇస్తున్నారు?’ అని ట్విటర్లో వైఎస్ జగన్ ప్రశ్నించారు. కాగా, చంద్రబాబు తీరుపై ఆంధ్రప్రదేశ్ బీసీ న్యాయవాద సంఘాలు భగ్గుమన్నాయి. ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీసీ న్యాయవాదుల బృందం రాష్ట్రపతికి చంద్రబాబు తీరుపై ఫిర్యాదు కూడా చేసింది. Recent disclosures by Justice Eswaraiah have exposed Naidu's so-called 'sincerity' towards BCs. @ncbn, you claim to accord priority to BC welfare, then why did you oppose the appointment of BC advocates as Judges? Why did you provide false feedback to prevent their appointment? — YS Jagan Mohan Reddy (@ysjagan) April 26, 2018 -
బీసీలపై చంద్రబాబుది అణచివేత ధోరణి
-
బీసీలపై చంద్రబాబుది అణచివేత ధోరణి
-
బాబూ!ఏమిటీ న్యాయం
-
బీసీలను చంద్రబాబు అణగదొక్కుతున్నారు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): సీఎం చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఆయన కులానికి చెందిన వారికి మాత్రమే న్యాయం జరుగుతోందని మండిపడ్డారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాలకు పరిమితి లేకుండా పోయిందన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో బాబు వ్యవహరించిన తీరు బీసీలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు రాసిన లేఖ హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఇద్దరు బీసీలు(అమర్నాథ్గౌడ్, అభినవకుమార్ చావల్లి)తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావును సిఫార్సు చేస్తే.. అమర్నాథ్గౌడ్, అభినవకుమార్, గంగారావు, డీవీ సోమయాజులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ 2017 మార్చి 21న చంద్రబాబు తప్పుడు నివేదిక పంపించారని ఆరోపించారు. హైకోర్టు జడ్జిగా అమర్నాథ్ గౌడ్ పనికిరారంటూ పలు ఆరోపణలు చేస్తూ పంపిన లేఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ తప్పుడు నివేదిక అందజేసి మోకాలడ్డేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో విచారణ చేపట్టి ఆ నలుగురిపై చంద్రబాబు ఇచ్చిన నివేదికలో వాస్తవం లేదని తేల్చడంతో వారు జడ్జీలుగా నియమితులయ్యారని చెప్పారు. తన వద్ద సాక్ష్యాలున్నాయంటూ.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు చంద్రబాబు రాసిన లేఖలను ఆయన మీడియాకు విడుదల చేశారు. బీసీలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని.. కానీ ఆ విలువలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిలుగా అభినవ్‌కుమార్, గంగారావు పనికిరారంటూ ఆరోపణలు చేస్తూ చంద్రబాబు పంపిన లేఖ స్వర్ణాంధ్రప్రదేశ్ చంద్రబాబు జాతి కులానికేనా? అని ప్రశ్నించారు. బాబు కులానికి చెందిన వారికి తప్ప ఇతర వర్గాలకు ఎలాంటి ప్రాజెక్టులు గానీ.. పనులు గానీ దక్కడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీ మంత్రులున్నప్పటికీ వారికి ఎలాంటి అధికారాలు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజా రక్షకుడిగా ఉన్న వ్యక్తే భక్షకుడిగా మారారని దుయ్యబట్టారు. బాబుకు వత్తాసు పలికిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి డీవీ సోమయాజులుపై కేంద్ర న్యాయశాఖ మంత్రికి చంద్రబాబు పంపిన లేఖ