
జస్టిస్ ఈశ్వరయ్య(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: కేంద్రం ఈబీసీలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ బీసీ సమైక్య జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తు బుధవారం జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి అధ్యయనం లేకుండా రిజర్వేషన్లు కల్పిస్తే రాజ్యాంగ స్పూర్తి దెబ్బతింటుందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు.