తీర్పుపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ
ఆ తర్వాత వర్గీకరణకై కమిటీ కోసం సీఎంకు విజ్ఞప్తి
మంత్రి దామోదర రాజనర్సింహ
సనత్‌నగర్ (హైదరాబాద్): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై వాదన లు వినిపించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను పంపించి బలమైన వాదనలు వినిపించేలా చేశారని గుర్తు చేశారు. ‘ఎస్సీ వర్గీకరణ–మాదిగల భవిష్యత్తు’ అనే అంశంపై శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో మాదిగ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మేధావుల సమావేశం జరిగింది.
ప్రొఫెసర్ జి.మల్లేశం అధ్యక్షతన జరిగిన సమావే శానికి హాజరైన దామోదర రాజనర్సింహ మాట్లాడు తూ, రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణను చేసుకో వచ్చని తీర్పు రావడం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టులో వాదనలకు పూర్తిగా సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసిందన్నారు. న్యాయనిపుణులతో ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేసిన నివేదిక సీఎంకు అందజేస్తామని చెప్పారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రిని మాదిగ ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక కమిటీ వేయాల్సిందిగా కోరతామని, ఆ కమిటీ సూచనల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకు రావాలన్నారు. అంతేకాకుండా త్వరలో పెద్దఎత్తున మాదిగల సమ్మేళనం పేరుతో ఒక బహిరంగ సభను ఏర్పాటుచేసి సీఎంను ఆ సభకు ఆహ్వానించి సన్మా నించనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేవరకు జాతి పెద్దలుగా అందరం కలసిక ట్టుగా ముందుకుసాగుదామన్నారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, మాదిగ లకు తగిన ప్రాధాన్యతనిచ్చి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మొట్టమొదటి నేత ఎన్టీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్య నారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వేముల వీరేశం, మందుల సామేల్, లక్ష్మీకాంతరావు, కాలే యాదయ్య, ప్రొఫెసర్ కాశీం, కొండ్రు పుష్పలీల, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment