![Minister Shankar Narayana Comments On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/10/Minister-Shankar%E2%80%8C-Narayana.jpg.webp?itok=javI6VSg)
సాక్షి, అనంతపురం: బీసీ నేత, రిటైర్డ్ జడ్డి ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. ఏబీఎన్ కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కనుసన్నల్లో ఏబీఎన్ నడుస్తుందని, బీసీ నేతలపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. (ఏబీఎన్ కథనాలన్నీ ఊహాజనితాలే)
బీసీలు హైకోర్టు జడ్జీలు కాకుండా అడ్డుకున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఓట్లు వేయలేదన్న అక్కసుతో బీసీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బీసీలకు ప్రాధాన్యత లభిస్తోందని శంకర్ నారాయణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment