malagundla Shankaranarayana
-
అనంతపురం జిల్లా నాయకుల్ని అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: శాసనసభ సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రహదారులు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలో ఘనవిజం సాధించినందుకు మంత్రి శంకరనారాయణను, జిల్లా పార్టీ నేతలను సీఎం జగన్ అభినందించారు. కాగా, పెనుకొండ నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడిన, ప్రలోభపెట్టినా ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారు. ఫలితంగా 20 వార్డులున్న నగర పంచాయతీలో ఏకంగా 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ జిల్లా నేతలంతా పెనుకొండలోనే మకాం వేసి కుట్ర రాజకీయాలు చేసినా ఆ పార్టీ రెండు స్థానాల (1,3వార్డులు)ను మాత్రమే దక్కించుకోగలిగింది. చదవండి: (ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన సీఎం జగన్) చదవండి: (అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారు: సీఎం జగన్) -
‘చంద్రబాబు కనుసన్నల్లో ఏబీఎన్’
సాక్షి, అనంతపురం: బీసీ నేత, రిటైర్డ్ జడ్డి ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. ఏబీఎన్ కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కనుసన్నల్లో ఏబీఎన్ నడుస్తుందని, బీసీ నేతలపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. (ఏబీఎన్ కథనాలన్నీ ఊహాజనితాలే) బీసీలు హైకోర్టు జడ్జీలు కాకుండా అడ్డుకున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఓట్లు వేయలేదన్న అక్కసుతో బీసీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో బీసీలకు ప్రాధాన్యత లభిస్తోందని శంకర్ నారాయణ పేర్కొన్నారు. -
'బలహీన వర్గాలకు బలం సీఎం జగన్'
తాడేపల్లి: బీసీల అభ్యునతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం జగన్ అధ్యయన కమిటీ వేశారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కుల్లో, మహిళల పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం బీసీలకు పెద్ద పీఠ వేసింది. క్యాబినెట్లో కూడా బీసీలకు పెద్ద పీఠ వేశారు. బీసీల కోసం 28 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీసీలకు నేడు పండుగ రోజు. అందులో భాగంగా 30వేల జనాభా మించిన కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మెన్ , డైరెక్టర్లను నియమిస్తారు. గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంది. అందుకే బీసీలు గత ఎన్నికల్లో టీడీపీకి బుద్ది చెప్పారు. బీసీలంతా వైఎస్ జగన్ వెంట ఉన్నారు. ఆయనకు బీసీలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని శంకర నారాయణ తెలిపారు. బీసీలంటే బిజినెస్ క్యాస్ట్‌గా టీడీపీ చూసింది - ధర్మాన 2014 ఎన్నికల్లో బీసీలు టీడీపీకి సపోర్ట్ చేస్తే చంద్రబాబు బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అయితే వైఎస్ జగన్ తన పాదయత్రలో బీసీల బాధలు తెలుసుకొని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మాటప్రకారం బీసీల కోసం 28 కార్పొరేషన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్‌గా కాకుండా బిజినెస్ క్యాస్ట్‌గా చూసింది. అందుకే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని ధర్మాన పేర్కొన్నారు. (బీసీ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష) బలహీన వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డే బలం చంద్రబాబు బీసీలను వాడుకున్నారు తప్ప బీసీల బాగోగులు చూడలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బీసీల కష్టాలు చూశారు. 30వేల జనాభా దాటిన ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీనిచ్చారు. సీఎం అయిన వేంటనే బీసీల సంక్షేమంపై దృష్టి పెట్టారు. మాటలు కాకుండా చెప్పిన ప్రతి హామీని సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో సంక్షేమానికి 43వేల కోట్లు ఖర్చు పెడితే అందులో రూ. 22వేల కోట్లు బీసీలకు ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ జగన్‌ది. ప్రతి కులం రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఎదగాలని చెప్పే వ్యక్తి జగన్ అని జంగా కృష్ణమూర్తి అన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే బీసీ,ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల అభ్యున్నతికి అనేక చట్టాలు చేసింది. బలహీన వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డే బలమని అన్నారు. (‘వైజాగ్ ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా’) -
హుందాతనం చాటుకున్న గోరంట్ల మాధవ్
సాక్షి, అనంతపురం: ఏడాది కిందట కురుబ సంఘం ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల వేదికగా జరిగిన కనకదాస జయంతి వేడుకల్లో గోరంట్ల మాధవ్ రాకను అప్పటి టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి అక్షేపించారు. ఆ రోజుల్లో కదిరిలో సీఐగా గోరంట్ల మాధవ్ పనిచేసేవారు. తనకు ఆహ్వానం లేకపోయినా.. కులం మీద అభిమానంతో సభకు ఒక సాధారణ వ్యక్తిగా హాజరైన మాధవ్ పట్ల వేలాదిమంది కురుబలు అభిమానం వ్యక్తం చేస్తూ భుజాలపై ఎత్తుకుని సభావేదిక వద్దకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి.. సభావేదికపై నుంచే మాధవ్‌పై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడు. కనకదాస జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న మంత్రి శంకరనారాయణ దీంతో కాస్త గందరగోళం నెలకొని ముఖ్యఅతిథిగా విచ్చేసిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం.. వైఎస్సార్ సీపీ తరుఫున హిందూపురం ఎంపీగా పోటీ చేసి తిరుగులేని విజయాన్ని అందుకోవడం విదితమే. ఆదివారం అదే ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కనకదాస జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే పార్థసారథిని ఎంపీ మాధవ్ స్వయంగా వెళ్లి ఆహ్వానించి, తన హుందాతనాన్ని చాటుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోతున్నట్లు పార్థసారథి పేర్కొన్నారంటూ మాధవ్ సభావేదికపై నుంచి ప్రకటించారు. సమావేశానికి హాజరైన కురుబలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ.. రాష్ట్రంలో వెనుకబడిన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారంటూ బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ కొనియాడారు. కనకదాస రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనంతపురంలో ఆదివారం నిర్వహించింది. ముందుగా గుత్తి రోడ్డులోని కనకదాస విగ్రహానికి మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి వెండి రథంలో కనకదాస చిత్రపటాన్ని ఉంచి జూనియర్ కళాశాల వరకూ శోభాయాత్రగా తీసుకొచ్చారు. చదువు ఒక్కటే మార్గం జూనియర్ కళాశాలలో అధికారికంగా నిర్వహించిన కనకదాసు జయంతి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కురబలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి శంకరనారాయణ మాట్లాడారు. కవిత్వం, సాహిత్యంతో సమాజాన్ని మేల్కోల్పిన గొప్ప మహనీయుడు భక్త కనకదాసని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. ఇతర కులాలతో పోటీ పడాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. ప్రతి కుటుంబంలోనూ పిల్లలను బాగా చదివించాలని కోరారు. ఓటు బ్యాంక్‌గా చూశారు కనకదాస జయంతిని అధికారికంగా చేపట్టాలని 15 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోలేదని శంకరనారాయణ గుర్తు చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే టీడీపీ చూస్తూ వచ్చిందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వచ్చారన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో 50 శాతానికి పైగా బలహీన వర్గాల వారికే అవకాశం కల్పించడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ రామారావు, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు వశికేరి లింగమూర్తి, రిటైర్డ్ జడ్జి కిష్టప్ప, మాజీ మేయర్ రాగే పరుశురాం, రాజహంస శ్రీనివాసులు, బోరంపల్లి ఆంజనేయులు, నెమలివరం ఈశ్వరయ్య, లలిత కళ్యాణి, బిల్లే మంజునాథ్, కేవీ మారుతీప్రకాష్, బ్యాళ్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
బండి మొరాయిస్తున్నా.. బాగు చేయించుకోలేని స్థితిలో ఒకరు. ఇన్సూరెన్స్ ప్రీమియం గడువు ముగిసినా.. రెన్యూవల్ చేయించుకోలేని దుస్థితిలో ఇంకొకరు. ఇంట్లో డబ్బునంతా బండి ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్‌సీ) కోసం ఖర్చు చేసి దసరా ముందు దిగాలుగా మరొకరు. అలాంటి వారందరి మోముల్లో నవ్వులు వికసించాయి. కష్టజీవుల హర్షధ్వానాలు.. ఆనందబాష్పాలకు అనంతపురంలోని అంబేడ్కర్ భవన్ వేదికైంది. శుక్రవారం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ లబ్ధిదారులకు మంత్రి శంకరనారాయణ అర్హత పత్రాలు అందజేయగా వారంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇంతవరకు ఏ ఒక్కరూ తమ గురించి పట్టించుకోలేదని.. తమ కష్టం తెలిసిన జగనన్న ఏటా రూ.10 వేలు ఇస్తానని మాట ఇవ్వడమే కాకుండా.. అధికారంలోకి వచ్చిన నెలల కాలంలోనే చేసి చూపారని ఈల వేసి చెప్పడం విశేషం. సాక్షి, అనంతపురం : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని అంబేడ్కర్‌భవన్‌లో ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం కింద ఆటో, మ్యాక్సి డ్రైవర్లకు అర్హత పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనరంజకమైన పథకాల అమలు వైఎస్ కుటుంబంతోనే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలు చరిత్రలో నిలిచిపోయాయన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా లక్షలాది మంది పేద ప్రజలకు పునర్జన్మ ప్రసాధించిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకున్న విద్యార్థులు నేడు ఇంజినీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని కొనియాడారు. వైఎస్సార్ తరహాలోనే ఆయన తనయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ కట్టుబడి ఆటోడ్రైవర్లకు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. అత్యవసర సమయాల్లో నిరుపేదలను ఆదుకుంటున్నారని కొనియాడారు. ఆటోడ్రైవర్ల కష్టాలు తీర్చేందకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నార్నారు. కలెక్టర్ ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ మొత్తంతో ఇన్సూరెన్స్, వాహన రిపేర్లు చేయించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. కర్టాటక నుంచి ఆటో, మ్యాక్సి క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికి కూడా లబ్ధి కలిగిస్తున్నామన్నారు. త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లోకే రూ.10 వేలు జమ అవుతుందని వివరించారు. వాహన మిత్ర పథకానికి జిల్లాలో 7,687 మంది దరఖాస్తు చేసుకోగా 7,486 మంది అర్హత సాధించారని ఉప రవాణా కమిషనర్ శివరాంప్రసాద్ తెలిపారు. మాటకు కట్టుబడిన సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆటోడ్రైవర్ల కష్టాలను తెలుసుకుని వారిని ఆదుకుంటానని మాటిచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10 వేలు సాయం ప్రకటించడం గొప్ప విషయం. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే వైఎస్ కుటుంబం మాట తప్పదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన తప్పే వ్యక్తి కాదు. ప్రస్తుతం ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే పాటిస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటనీ అధికారంలోకి వచ్చిన నాలుగునెలల్లోనే నెరవేరుస్తున్నాడు. – తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే సంఘ మిత్రుడు ఆటోడ్రైవర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. ఆటోడ్రైవర్ అంటే సంఘమిత్రుడు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రూ.10 వేల సాయం ఆటో కార్మికులకు ఉపయోగకరం. – గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రజాసంక్షేమ ప్రభుత్వమిది గత ఐదేళ్లు రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని చూశాం. ఇప్పుడు ప్రజా సంక్షేమ ప్రభుత్వం వచ్చింది. అధికారంలోకి వచ్చి నాలుగు నెలల వ్యవధిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థికసాయం అందజేస్తున్నారు. అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తాం. – అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మా సమస్యను గుర్తించిన నేత జగన్ పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసిన ఆటో డ్రైవర్లకు ఆనాడు మాట ఇచ్చాడు. ఈనాడు ముఖ్యమంత్రి అయ్యాక నెరవేర్చి మాట నిలుపుకున్న నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఊపిరి ఉన్నంత వరకూ ఆటో డ్రైవర్లు వైఎస్ జగన్‌ను మరువరు. – ఈశ్వరయ్య, ఆటో డ్రైవర్ -
ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యమందిస్తాం
సాక్షి, హిందూపురం(అనంతపురం) : రాష్ట్రంలోని పేదలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే ప్రభుత్వ కర్తవ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ అన్నారు. మంగళవారం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వమోవృద్ధులకు ప్రత్యేక వార్డు, గుండెజబ్బుల ఐసీయూ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. వార్డుల్లోని రోగులను మంత్రి ప్రత్యేకంగా పరామర్శించి వైద్యసేవలు, సదుపాయల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేస్తున్న దాతలను అభినందిస్తూ వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సంరద్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీకి ప్రత్యేక స్థానం కల్పిస్తూ.. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేని విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. హిందూపురం ఆసుపత్రిలో వృద్ధులకు, గుండె జబ్బుల వారికి ఐసీయూ, డయాలసిస్ వంటి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని చెప్పారు. వైద్య సిబ్బందిని నియమిస్తాం... హిందూపురం ఆసుపత్రిలో మాతశిశు కేంద్రంలో, ఇతర విభాగాల్లో వైద్యుల కొరతను దృష్టిలో పెట్టుకుని అవసరమైన వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. హిందూపురం ఆసుపత్రిలో రెఫరల్ ఆసుపత్రిగా కాకుండా మెరుగైన వైద్యం అందించేలా జిల్లా స్థాయి వైద్య సదుపాయలు కల్పిస్తామన్నారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్ఓ రామసుబ్బారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ దివాకర్, డీసీహెచ్ రమేశ్‌నాథ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ కేశవులు, ఆర్ఎంఓ రుక్మిణమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు శ్రీరాంరెడ్డి, మైనార్టీ నాయకులు ఫజుల్ రెహమాన్, మాజీ కౌన్సిలర్లు ఆసిఫుల్లా, రెహమాన్, నాయకులు బసిరెడ్డి, ఉదయ్, సోమశేఖర్‌రెడ్డి, గంగిరెడ్డి, బండ్లపల్లి జబీ, శివశంకర్‌రెడ్డి, తిమ్మారెడ్డి, ఉమర్‌ఫరూక్, పరిగి నాయకులు బాలాజి, గజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. మంత్రికి పలు వినతులు హిందూపురం ఆసుపత్రిలో వార్డు ప్రారంబోత్సవానికి విచ్చేసిన బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణకు పలువురు వినతిపత్రాలు అందించి సమస్యలు పరిష్కారించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వం డిసెంబర్ నుంచి తమకు వేతనాలు నిలిపివేసిందని, ఇప్పటి వరకు పది నెలల వేతనాలు అదలేదని బ్లడ్‌బ్యాంకులో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తిరిగి ఇప్పించడానికి సహాయం చేయాలని మంత్రిని కోరారు. 70 ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇళ్ల వద్ద మున్సిపల్ అధికారులు కనీసం రోడ్డు, డ్రైనేజీలు నిర్మించలేదని తమపై వివక్ష చూపుతున్నారని బాపూజీ మరిజన యువజన సేవా సంఘం నాయకులు వాపోయారు. ఈ విషయమై పలుమార్లు ఎమ్మెల్యే, గత మున్సిపల్ పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. తమకు మౌళిక సదుపాయలు కల్పించాలని సంఘ నాయకులు నాగరాజు, అశోక్, పవన్ వినతిపత్రం అందించారు. -
‘కొందరిలోనే సమాజసేవ ఆకాంక్ష’
సాక్షి, హిందూపురం : సమాజ సేవ చేయాలనే ఆకాంక్ష కొందరిలోనే ఉంటుందని, అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని రాష్ట్ర మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వారు సమాజ సేవకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. స్థానిక పంచజన్య శ్రీనివాసభారతి చారిటుబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్స్ వెల్ఫర్ అసిసోయేషన్, బెంగళూరు పీపుల్స్ ప్రీ హాస్పిటల్స్ సౌజన్యంతో పంచజన్య స్కూల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఏటా మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదలకు నాణ్యమైన వైద్య చికిత్సలను ఉచితంగా అందజేస్తున్న పంచజన్య శ్రీనివాస్ సేవలను అభినందించారు. ఇతర దేశాల్లో స్థిరపడ్డ వైద్యులను ఇక్కడకు రప్పించి, వారి చేత వైద్య సేవలు అందించడం చాలా గొప్ప విషయమన్నారు. కేవలం వైద్య శిబిరాలే కాకుండా ఇతర సామాజిక సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి సారించాలని కోరారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆస్పత్రి వైద్య నిపుణులు 15 మందిని ఒక చోట చేర్చి అన్నిరకాల రోగాలకు ఉచితంగా పరీక్షలు చేయించడంతో పాటు మందులూ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి శంకరనారాయణ వైద్యశిబిరంలో పర్యటిస్తూ రోగులకు పంపిణీ చేస్తున్న మందుల వివరాలు, చికిత్స విధానాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి అతి«థులుగా ప్రీపుల్స్ హాస్పిటల్ సీఈఓ చంద్రశేఖర్, మునియప్ప, మున్సిపల్ కమిషనర్ మోహన్‌రావు, ఎంఈవో గంగప్ప, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పుల్లారెడ్డి హాజరయ్యారు. శిబిరంలో సుమారు 1,500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచజన్య స్కూల్ కోశాధికారి నందకిషోర్, ఏఓ భాస్కర్, హెచ్ఎం గాయత్రి, ఏహెచ్ఎంలు విజయేంద్ర, శశికళ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు వేణుగోపాల్, రియాజ్, ముస్తఫా అలీఖాన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డెయిరీలను ముంచింది చంద్రబాబే
హెరిటేజ్ డెయిరీని లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వ డెయిరీలను మూతదిశగా నడిపించిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. పరిగి మండలం ఊటుకూరులో ఆరేళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం డెయిరీని శుక్రవారం ఆయన పునఃప్రారంభించారు. సాక్షి, అనంతపురం(పరిగి) : తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ డెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చుకునేందుకు ప్రభుత్వ డెయిరీలను నిర్వీర్యం చేసిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. పరిగి మండలం ఊటుకూరులో ఆరేళ్ల కిందట మూతపడిన ప్రభుత్వ పాల డెయిరీని మంత్రి శుక్రవారం పునఃప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. జాబు కావాలంటే బాబు రావాలన్న నినాదంతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు తన కుమారుడికి మాత్రమే జాబు కల్పించి యువతను నిలువునా మోసం చేశారని విరుచుకుపడ్డారు. ప్రైవేటు డెయిరీలను ప్రోత్సహించి ప్రభుత్వ డెయిరీలను నష్టాల్లోకి నెట్టేశారని, దీనంతటికీ చంద్రబాబే కారణమని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టి, ప్రజలకు అవినీతిరహిత పాలన అందించడానికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టారన్నారు. పారదర్శక పాలనే లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. గ్రామ వలంటీర్ల నియామకంతో ప్రతి ఇంటికీ రాజకీయాలకు, పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించనున్నట్లు తెలిపారు. త్వరలోనే రైతులు, ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయని మంత్రి పేర్కొన్నారు. మడకశిర బ్రాంచి కెనాల్ నుంచి ప్రధాన చెరువులను నింపుతామన్నారు. పరిగి చెరువులకు నడింపల్లి వద్ద నుంచే కాలువ ద్వారా నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 వేలు ఆర్థిక సాయంతో ఊరట ఆటో డ్రైవర్లకు, రజకులకు, నాయీబ్రాహ్మణులకు, టైలర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించే పథకానికి ఇటీవలే నోటిపికేషన్ విడుదలైందని, అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సౌజన్యలక్ష్మీ, ఎంపీడీఓ సుహాసినమ్మ, ఏపీ పాల డెయిరీ జిల్లా డీడీ శ్రీనివాసులు, మేనేజర్ బాలరాజు, పశుసంవర్థక శాఖ ఏడీ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాదరణ లేకే టీడీపీ నేతల్లో ఆందోళన
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు నెలల పాలనపై ప్రజల్లో వస్తున్న స్పందన చూసి టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. ప్రజాదారణ పూర్తిగా కోల్పోయామనే భావన వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోందని ఎద్దేవా చేశారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు దిగజారుడు ఆరోపణలు చేస్తూ వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అధికారులను తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారన్నారు. అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారన్నారు. రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఐదేళ్లు రాక్షస పాలన సాగించిన టీడీపీకి ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారని అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు దిగజారుడు ఆరోపణలు మానుకుని, సంక్షేమ పాలనలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు. గత ప్రభుత్వ నిర్వాకంతోనే గండ్లు : అనంతపురం: గత ప్రభుత్వం హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు నాసికరంగా చేపట్టడం వల్లే ఈరోజు ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నాయని మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. గండ్లు పడిన చోట్ల యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేత పనులు చేపట్టి నీటివృధాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. హెచ్చెల్సీ స్థితిగతులపై సోమవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డితో కలిసి అధికారులతో ఆయన సమీక్షించారు. లైనింగ్, వెడల్పు పనులు చేపట్టారు కాని, కట్టడాలు నిర్మించకపోవడంతో గండ్లు పడుతున్నాయంటూ అధికారులు వివరించారు. కాంట్రాక్టర్‌కు లాభసాటిగా ఉన్న పనులు సత్వరమే చేపట్టారు తప్ప స్ట్రక్చర్స్ నిర్మించలేకపోయారని, ఫలితంగానే గండ్లు పడుతున్నాయని మంత్రి తేల్చి చెప్పారు. కాలువ వెంబడి బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. -
‘అది నిజంగా గొప్ప విషయం’
సాక్షి, పశ్చిమగోదావరి : యాభై రోజుల్లోనే అనేక హామీలు అమలు చేయటం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమని బీసీ సంక్షేమ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. తణుకు కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడుతూ శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కమిషన్ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించటంతో రాజన్న రాజ్యం వచ్చిందన్నారు. చంద్రబాబు పేదల కష్టాల పట్ల అవగాహన లేని మనిషని ఆయన విమర్శించారు. మహిళలకు చంద్రబాబు చేసినంత ద్రోహం ఏ నాయకుడు చేయలేదని, బాబుకి కేవలం ఎన్నికలప్పుడే మహిళలు గుర్తుకొస్తారని మండిపడ్డారు. ‘ సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం.. రాష్ట్రం లోటు బడ్జేట్‌లో ఉన్నప్పటికి మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేయటం గొప్ప విషయం’ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్యశ్రీ నుంచి బాబు అనేక జబ్బులను తొలగించారని పేర్కొన్నారు. సభ ముగిసిన ఆనంతరం పలువురు మంత్రులు.. మహిళలకు కుట్టు మిషన్లను, యువకులకు టూల్ కిట్లను పంపిణీ చేశారు. -
చంద్రబాబు వైఫల్యంతోనే...
దిగజారుడు రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదని, ఆయన వైఫల్యంతోనే అభివృద్ధి తిరోగమన దిశగా పయనించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. సాక్షి, పరిగి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యంతో రాష్ట్రంలో అభివృద్ధి తిరోగమనంలో పడిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. శనివారం హొన్నంపల్లిలో బహిరంగ సమావేశం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నిర్వాకంతోనే ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడానికి ఒప్పుకోలేదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో 5 ఏళ్లుగా భ్రమరావతిని సృష్టించి నిధులన్నీ వెనక్కి వెళ్లేందుకు కారణమయ్యాడని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్‌లో ఉన్న భూముల్లో కంపచెట్లను కూడా తొలగించలేదని విమర్శించారు. విసుగు తెప్పిస్తున్న చంద్రబాబు విమర్శలు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవక ముందే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లేందుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. జగనన్న పాలనపై చంద్రబాబు విమర్శలు ప్రజలకు విసుగుతెప్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఆయన బీసీ సంక్షేమ శాఖలోనే దాదాపు రూ.1432 కోట్ల అప్పులు చేశారన్నారు. కనీసం స్కాలర్షిప్లు, కాస్మొటిక్ బిల్లులు కూడా ఇవ్వని టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులు ఏ మోహం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. గడిచిన ఐదేళ్లలో కనీస సౌకర్యాలు కల్పించలేని టీడీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురైందన్నారు. ఖాళీ ఖజానాను మిగిల్చిపోయిందని టీడీపీ, మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సీఎం జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించడమే కాకుండా అమలు చేస్తున్నారని తెలిపారు. జగనన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలుజరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జయరాం, మంత్రి సోదరుడు మాలగుండ్ల రవీంద్ర, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి డీవి రమణ, మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి, పెనుకొండ మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మారుతీరెడ్డి, మారుతీశ్వరావు తదితరులు పాల్గొన్నారు. కియా భూముల చదును పేరుతో ప్రజాధనం వృథా పెనుకొండలో కియా పరిశ్రమ ఏర్పాటు సమయంలో కేవలం చదును చేయడానికి రూ.177 కోట్ల ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృథా చేయడమే కాకుండా అక్రమాలకు పాల్పడి రైతులకు మోసం చేశారని మంత్రి విరుచుకుపడ్డారు. చంద్రబాబు 1995లో సొంత మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచి, 1999లో వాజ్‌పేయి, 2014లో నరేంద్రమోదీ పేర్లు చెప్పుకుని ముఖ్యమంత్రి అయ్యారని, ఏనాడు సొంతంగా అధికారం చేపట్టలేదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా విదేశాల పేరుతో కోట్ల డబ్బుని వృథా చేయడమే కాకుండా దర్శకుడు రాజమౌళితో రాజధాని కట్టించాలని పుణ్యకాలమంతా గడిపేశారని ఆరోపించారు. ఇలాంటి అబద్ధపు పాలనతోనే వరల్డ్ బ్యాంకు రుణం ఇవ్వకుండా వెనకడుగు వేసిందన్నారు. ప్రజలను అన్నింటా ఇలా మోసం చేసి అప్పులను మోపిన ఘనత బాబుకే దక్కిందన్నారు. -
అర్హులందరికీ నవరత్నాలు
సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని, అర్హులందరికీ నవరత్నాలను అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. శనివారం ఆయన జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాక్షి, అనంతపురం అర్బన్: ‘జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి. సుపరిపాలన పాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం. ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత సంక్షేమ పాలన అందించే దిశగా ముందుకెళుతోంది. ‘నవరత్నాల’ ఫలాలు అర్హులైన ప్రతి పేదవానికి అందాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేసి ప్రజా ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిద్దాం’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధ్యక్షతన తొలిసారిగా జిల్లా అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, కరువుతో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ఈ నేపథ్యంలో పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. జిల్లా రైతులకు రూ.1,007 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఈ క్రమంలోనే రైతులను ఆదుకునేందుకు 2014 నుంచి వారికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.2,000 కోట్లు ఇచ్చేందుకు తొలి కేబినెట్లోనే ఆమోదం తెలిపారన్నారు. ఇందులో జిల్లా రైతులకు రూ.1,007 కోట్లు అందనుందని తెలిపారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మఒడి ద్వారా రూ.15 వేలు, రైతు భరోసా ద్వారా పేద రైతులకు పెట్టుబడికి ఏటా రూ.12,500 ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పకృతి వైపరిత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో పకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. ప్రతి పేదవానికి ఇల్లు, వృద్ధులకు దశలవారీగా పింఛన్ రూ.3 వేలకు పెంపు, పింఛన్ అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, నిత్యావసరాలను ఇంటికే చేర్చడం, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి), సీపీఎస్ రద్దు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు వేతనం, రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లాంటి కీలకమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్నారని గుర్తు చేశారు. తాగునీరు, వ్యవసాయం, విత్తన పంపిణీ, ఉద్యన పంటలు, తదితర అంశాలపై సమీక్షించారు.సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్, ఎమ్మెలేలు వై.వెంకటరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉరవకొండలో నీటి ఎద్దడి ఉరవకొండ పట్టణంలో తొమ్మిది రోజులుగా నీటి సరఫరా లేదు. నిర్వహణ లోపం కారణంగా ఈ సమస్య వచ్చింది. వారంలోగా సమస్య పరిష్కరించాలి. పంటల బీమాలో మార్పు తేవాలి. వాతావరణ బీమా వల్ల రైతుకు ప్రయోజనం కలగడం లేదు. గ్రామం యూనిట్‌గా బీమా వర్తించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలి. – పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే ఎస్కేయూలో నీటి ఎద్దడి పరిష్కరించాలి శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలి. నగర పాలక సంస్థలో ఉపాధ్యాయులకు సంబంధించి రూ.36 లక్షలు దుర్వినియోగమయ్యాయి. విచారణ చేసి వారి ఖాతాల్లో జమ చేయాలి. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు కొన్ని పాఠశాల్లో నీటి సమస్య ఉంది. అలాంటి చోట ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి. – కత్తినరసింహారెడ్డి, ఎమ్మెల్సీ రిజర్వాయర్‌తో శాశ్వత పరిష్కారం నియోజకవర్గానికి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు వెచ్చించి జీడిపల్లి, పీఏబీఆర్ నుంచి పైప్‌లైన్ ద్వారా ఆత్మకూరు మండల కేంద్రానికి నీటిని ఇవ్వవచ్చు. పీఏబీఆర్ పైన్లైన్ ద్వారా కక్కలపల్లి, నారాయణపురం, రాజీవ్‌కాలనీ, ఇలా మరికొన్ని పంచాయతీలకు నీటిని ఇవ్వడం ద్వారా ఎద్దడి నివారించవచ్చు. – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు జరగాలి. ప్రత్యేకంగా బెంగుళూరు, తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలను ఒక చోటకు చేర్చి సదస్సు నిర్వహించాలి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఆ దిశగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలి. బుక్కపట్నం, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజ్ ఉండేలా చూడాలి. ఇందుకు స్లూయిజ్ గేట్లు ఏర్పాటు చేయాలి. – దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే జేసీ నాగిరెడ్డి పథకం పూర్తి చేయాలి తాడిపత్రిలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. పెన్నా, చిత్రావతిలో ఇసుక తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. ఇసుకు అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా జేసీ నాగిరెడ్డి పథకాన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి. – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే తాగునీటి ఎద్దడి అధికం మా నియోజకర్గలోని 120 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నీరు ఇవ్వకుండా తుమ్మలూరుకు తీసుకెళ్లడం ఏమిటి. శ్రీరామిరెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలి. రోడ్డు విస్తరణలో భాగంగా బాలికల పాఠశాల కూల్చేశారు. – డాక్టర్ తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే నీటి సమస్య తీవ్రంగా ఉంది మా నియోజకవర్గం పరిధిలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. సత్యసాయి పైప్‌లైన్–2 ద్వారా నీటిని అందించాలి. సీపీడబ్లూ స్కీమ్ ద్వారా ట్యాంక్‌లు నింపాలి. నీటి ఎద్దడి అధికంగా ఉన్న గ్రామాల్లో తక్షణం నీరు సరఫరా చేయాలి. తీవ్ర వర్షాభావంతో మామిడి చెట్లు ఎండిపోతున్నాయి. – డాక్టర్ సిద్ధారెడ్డి, కదిరి ఎమ్మెల్యే శాశ్వత చర్యలు చేపట్టాలి జిల్లావ్యాప్తంగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలి. శింగనమల చెరువు చాలా పెద్దది. పైనున్న వారు నీటిని తమ ప్రాంతాలకు మళ్లిస్తుండడంతో ఈ చెరువుకు నీరు రావడం లేదు. ఈసారి తప్పకుండా చెరువు నింపాలి. బీసీ హాస్టల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. – శమంతకమణి, ఎమ్మెల్సీ -
మనోధైర్యంతో జీవించండి
రొద్దం/సోమందేపల్లి/పెనుకొండ : ‘బిడ్డల భవిష్యత్ బాగుండాలని ఎన్నో కలలు కన్నారు. కానీ మీ కలలు కల్లలయ్యాయి. ఎవరూ ఊహించని ఘటన లో మీ కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిలింది. మీ ప్రాణాలకంటే ఎక్కువగా ప్రేమించిన బిడ్డలు మీకు దూరమయ్యారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మీకు తోడుగా ఉండాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. మీ కష్టాల్లో పాల్పంచుకోవాలని సూచించారు. కన్నీటిని కొంత వరకైనా తుడవాలని మీ కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. మనోధైర్యంతో జీవించండి. మీకు అండగా మేం ఉంటాం’’ అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి పెనుకొండ బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ నెల 7న పెనుకొండ-మడకశిర ఘాట్ రోడ్డులో మడకశిరకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై 16 మంది మృతి చెందారు. పెనుకొండ మండలం మావటూరుకు చెందిన ఆరుగురు, బండపల్లిలో ఇద్దరు, నాగలూరులో ఇద్దరు, రొద్దం మండలం చెరుకూరులో ఒకరు, బొమ్మరెడ్డిపల్లిలో ఒకరు, సోమందేపల్లి మండలం ఆనందాపురంలో ఒక విద్యార్థి మృతి చెందారు. వీరి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు సోమవారం పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఉదయం రొద్దం మండలం చెరుకూరుకు చేరుకున్న నేతలు విద్యార్థిని అనిత తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేసి వారిలో మనోస్థైర్యం నింపారు. ఆ తర్వాత గొబ్బిరంపల్లి చేరుకుని విద్యార్థి కురుబ మురళి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం సోమందేపల్లి మండలం ఆనందపురం చేరుకుని విద్యార్థి అశోక్‌కుమార్ తల్లిదండ్రులు రామాంజినప్ప, ఆనందమ్మలను పరామర్శించారు. నేతలను చూడగానే వారు కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కగానొక్క కొడుకు లేకుండా పోయాడని విలపించారు. ఆ తర్వాత గాయపడిన భానుప్రసాద్, సాయిప్రసాద్‌లను పరామర్శించి చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. అనంతరం పెనుకొండ మండలం మావటూరు చేరుకున్నారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈ సమయంలో బాధితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ బిడ్డలను తలచుకుని కంటతడి పెట్టుకున్నారు. తమ జీవితాలు అంధకారంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గంగాధర్ తల్లి సుశీలమ్మ స్పృహ తప్పి పడిపోగా గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని నేతలు మౌనం పాటించారు. అనంతరం బండ్లపల్లి, నాగలూరు గ్రామాలకు వెళ్లి మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందించారు. అదేవిధంగా మావలూరు, నాగలూరులో తీవ్రంగా గాయపడిన విద్యార్థులకు కూడా వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం చేశారు. ఆయా సందర్భాల్లో నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని వుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. ఘటనలో డ్రైవర్ తప్పిదం లేదని ఆర్టీసీ యంత్రాంగం చెబుతోందని, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం విషయంలో అన్యాయం చేస్తే బాధితుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. పరిహారం పెంపు విషయంపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సైతం తమ అధినేత వాణి విన్పిస్తారన్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ఎస్.నరసింహులు, రొద్దం మండల పార్టీ కన్వీనర్ బి.నారాయణరెడ్డి, సింగిల్ విండో డెరైక్టర్ మారుతిరెడ్డి, జిల్లా అధికార పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిపి శ్రీనివాసులు, నేతలు లక్ష్మినారాయణరెడ్డి, రవిశేఖర్‌రెడ్డి,ఆర్టీసీ రిటైర్డ్ కంట్రోలర్ జాఫర్, రాజారెడ్డి, నల్లూరు ఈశ్వరప్ప, సూరి,రంగయ్య, ఉప్పర మూర్తి, సోమందేపల్లి మండల కన్వీనర్ వెంకటరత్నం, కంబాలప్ప, నజీర్, నాయని శ్రీనివాసులు, శ్రీరాములు, అబ్దుల్లా, సిద్దగంగప్ప, కొత్తపల్లి శ్రీనివాసులు, కిష్టప్ప, పెనుకొండ నాయకులు గుట్టూరు శ్రీరాములు, న్యాయవాది భాస్కరరెడ్డి, కన్వీనర్ వెంకటరామిరెడ్డి , మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరుబాబు, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, శ్రీకాంతరెడ్డి, చలపతి, రాజగోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, ఉమర్పారూక్, అనితా శ్రీనివాసరెడ్డి, రహంతుల్లా, మురళి, మాజీ కన్వీనర్ నీరగంటి వెంకటరాముడు, మునిమడుగు శ్రీనివాసులు, నాగలూరు భాస్కరరెడ్డి కుమారుడు బాబు, కొండలరాయుడు, శంకరరెడ్డి, జాఫర్, ఇలియాజ్, అమర్, కర్రా సంజీవరెడ్డి, మొబైల్స్ ఫణి, జయప్ప, శ్యాంనాయక్, ఈశ్వర్, యస్బి.శీనా, రత్నాలు, గిరి, లక్ష్మేనాయక్, గౌస్, గోరంట్ల నాయకులు కన్వీనర్ ఫక్రొద్దీన్, జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు గంపల వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి, టవ్వాల్గోపాల్, కొత్తపల్లి శీనప్ప, పుట్టపర్తి కన్వీనర్ గంగాధర్, రొద్దం నరశింహులు, చంద్రశేఖర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. రూ.లక్ష ఆర్థిక సాయం పొందిన కుటుంబాల వివరాలు మృతి చెందిన విద్యార్థి పేరు తల్లిదండ్రులు గ్రామం మండలం నరేంద్ర చిన్న అంజినప్ప, లక్ష్మినరసమ్మ మావటూరు పెనుకొండ బోయ నరసింహమూర్తి అంజినప్ప,రామాంజినమ్మ మావటూరు పెనుకొండ మాల అశోక్‌కుమార్ క్రిష్టప్ప,జయమ్మ మావటూరు పెనుకొండ అనిల్ ప్రకాష్, రామక్క మావటూరు పెనుకొండ కోతెమ్మగారి గంగాధర్ సజ్జప్ప, సుశీలమ్మ మావటూరు పెనుకొండ దాసరి గంగాధర్ రామన్న, వెంకటరత్నమ్మ మావటూరు పెనుకొండ హనుమంతరాయుడు కుళ్లాయప్ప,సావిత్రమ్మ బండపల్లి పెనుకొండ కురుబ గంగాధర ప్రభాకర్,హనుమక్క బండపల్లి పెనుకొండ శేఖర్ {Mిష్టప్ప,రామలక్ష్మమ్మ నాగలూరు పెనుకొండ మాల లక్ష్మినారాయణ నరసింహమూర్తి, నరసమ్మ నాగలూరు పెనుకొండ అశోక్‌కుమార్ రామాంజినప్ప,ఆనందమ్మ ఆనందపురం సోమందేపల్లి అనిత గంగాధర్ చెరుకూరు రొద్దం కురుబ మురళి వెంకటేశు గొబ్బిరంపల్లి రొద్దం -
విద్యుత్‌పై ‘బాబు’ శ్వేతపత్రం బూటకం
మీ తొమ్మిదేళ్ల పాలనలో ఘోరాలనూ చేర్చి ఉంటే బాగుండేది.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరుబాట సాగిస్తాం.. వైఎస్సార్సీపీ కన్వీనర్ శంకరనారాయణ, ఎమ్మెల్యే విశ్వ, మాజీ ఎంపీ అనంత, నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి ధ్వజం అనంతపురం జిల్లా పరిషత్తు: రాష్ర్టంలో విద్యుత్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం ఒట్టి బూటకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. గురువారం సాయంత్రం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, నాయకుడు బీ.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడారు. ఈ శ్వేతపత్రంలో గతంలో ఆయన హయాంలో చోటుచేసుకున్న అనేక అంశాలను పొందుపరిచి ఉంటే స్వాగతించే వారమన్నారు. కరెంటు అడిగిన పాపానికి బషీర్‌బాగ్‌లో పోలీసుల చేత అత్యంత పాశవికంగా కాల్పులు జరిపించి రైతులను పొట్టన పెట్టుకున్న ఘటనను, కరెంటు బిల్లులు కట్టలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతుల నుంచి బలవంతంగా సొమ్ము వసూలు చేసిన విషయాన్ని, కట్టకుంటే బోరుబావుల దగ్గరకు పోలీసులను ఉసిగొల్పి మోటార్లను తొలగించి వాటిని పోలీస్ స్టేషన్లలో పెట్టుకున్న సందర్భాలున్నాయన్నారు. అలాగే కేసులు నమోదు చేసి రైతులను జైలుపాలు చేయడం, ప్రతి ఏటా కరెంటు చార్జీల పెంచి ప్రజల నడ్డి విరిచిన చేదు ఘటనల్ని కూడా పొందుపరిచి ఉంటే సముచితంగా ఉండేదని వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రతి యూనిట్‌ను కొలిచి నిర్ధాక్షిణ్యంగా ప్రజల నుంచి బిల్లులు వసూలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని నేతలు ధ్వజమెత్తారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత ఉచిత కరెంటు ఇస్తానంటే... బట్టలు ఆరేసుకునేందుకు కరెంటు తీగలు పనికొస్తాయంటూ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హేళన చేయడాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి శ్వేతపత్రం విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు పరిశ్రమలు, గృహ అవసరాలకు 24 గంటల కరెంటు, రైతులకు తొలుత 7 గంటలు, తర్వాత కొద్ది నెలలకే నిరంతరంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తామని గొప్పగా హామీలు ఇచ్చారని, వాటి నుంచి తప్పుకునేందుకే శ్వేతపత్రం విడుదల చేశారని వారు దుమ్మెత్తి పోశారు. ఇక పరిస్థితులు బాగోలేవంటూ విద్యుత్ చార్జీలు పెంచక తప్పదనే సంకేతాన్ని పంపేందుకు, ప్రపంచ బ్యాంకును సంతృప్తి పరచడానికి ఇలాంటి కుటిల యత్నాలు, ఎత్తుగడలకు తెర లేపారని మండిపడ్డారు. మరోవైపు ఖరీఫ్‌లో రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై పోరాటానికి పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రైతులు, అన్ని వర్గాల ప్రజలతో కలిసి పోరుబాట సాగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాలరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, కార్యాలయ కార్యదర్శి సాకే ఆదినారాయణ పాల్గొన్నారు.