మనోధైర్యంతో జీవించండి | That confidence | Sakshi
Sakshi News home page

మనోధైర్యంతో జీవించండి

Published Tue, Jan 20 2015 2:33 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

మనోధైర్యంతో జీవించండి - Sakshi

మనోధైర్యంతో జీవించండి

రొద్దం/సోమందేపల్లి/పెనుకొండ : ‘బిడ్డల భవిష్యత్ బాగుండాలని ఎన్నో కలలు కన్నారు. కానీ మీ కలలు కల్లలయ్యాయి. ఎవరూ ఊహించని ఘటన లో మీ కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిలింది. మీ ప్రాణాలకంటే ఎక్కువగా ప్రేమించిన బిడ్డలు మీకు దూరమయ్యారు. ఈ విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మీకు తోడుగా ఉండాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. మీ కష్టాల్లో పాల్పంచుకోవాలని సూచించారు.

కన్నీటిని కొంత వరకైనా తుడవాలని మీ కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. మనోధైర్యంతో జీవించండి. మీకు అండగా మేం ఉంటాం’’ అని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి పెనుకొండ బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ నెల 7న పెనుకొండ-మడకశిర ఘాట్ రోడ్డులో మడకశిరకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై 16 మంది మృతి చెందారు.

పెనుకొండ మండలం మావటూరుకు చెందిన ఆరుగురు, బండపల్లిలో ఇద్దరు, నాగలూరులో ఇద్దరు, రొద్దం మండలం చెరుకూరులో ఒకరు, బొమ్మరెడ్డిపల్లిలో ఒకరు, సోమందేపల్లి మండలం ఆనందాపురంలో ఒక విద్యార్థి మృతి చెందారు. వీరి కుటుంబ సభ్యులను వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సోమవారం పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఉదయం రొద్దం మండలం చెరుకూరుకు చేరుకున్న నేతలు విద్యార్థిని అనిత తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు.

అనంతరం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేసి వారిలో మనోస్థైర్యం నింపారు. ఆ తర్వాత గొబ్బిరంపల్లి చేరుకుని విద్యార్థి కురుబ మురళి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం సోమందేపల్లి మండలం ఆనందపురం చేరుకుని విద్యార్థి అశోక్‌కుమార్ తల్లిదండ్రులు రామాంజినప్ప, ఆనందమ్మలను పరామర్శించారు. నేతలను చూడగానే వారు కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కగానొక్క కొడుకు లేకుండా పోయాడని విలపించారు.  ఆ తర్వాత గాయపడిన భానుప్రసాద్, సాయిప్రసాద్‌లను పరామర్శించి చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం చేశారు.

అనంతరం పెనుకొండ మండలం మావటూరు చేరుకున్నారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈ సమయంలో బాధితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ బిడ్డలను తలచుకుని కంటతడి పెట్టుకున్నారు. తమ జీవితాలు అంధకారంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గంగాధర్ తల్లి సుశీలమ్మ స్పృహ తప్పి పడిపోగా గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని నేతలు మౌనం పాటించారు.

అనంతరం బండ్లపల్లి, నాగలూరు గ్రామాలకు వెళ్లి మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందించారు. అదేవిధంగా మావలూరు, నాగలూరులో తీవ్రంగా గాయపడిన విద్యార్థులకు కూడా వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం చేశారు. ఆయా సందర్భాల్లో నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని వుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. ఘటనలో డ్రైవర్ తప్పిదం లేదని ఆర్టీసీ యంత్రాంగం చెబుతోందని, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం విషయంలో అన్యాయం చేస్తే బాధితుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. పరిహారం పెంపు విషయంపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సైతం తమ అధినేత వాణి విన్పిస్తారన్నారు.

కార్యక్రమాల్లో రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ఎస్.నరసింహులు, రొద్దం మండల పార్టీ కన్వీనర్ బి.నారాయణరెడ్డి, సింగిల్ విండో డెరైక్టర్ మారుతిరెడ్డి, జిల్లా అధికార పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిపి శ్రీనివాసులు, నేతలు లక్ష్మినారాయణరెడ్డి, రవిశేఖర్‌రెడ్డి,ఆర్టీసీ రిటైర్డ్ కంట్రోలర్ జాఫర్, రాజారెడ్డి, నల్లూరు ఈశ్వరప్ప, సూరి,రంగయ్య, ఉప్పర మూర్తి, సోమందేపల్లి మండల కన్వీనర్ వెంకటరత్నం, కంబాలప్ప, నజీర్, నాయని శ్రీనివాసులు, శ్రీరాములు, అబ్దుల్లా, సిద్దగంగప్ప, కొత్తపల్లి శ్రీనివాసులు, కిష్టప్ప, పెనుకొండ నాయకులు గుట్టూరు శ్రీరాములు, న్యాయవాది భాస్కరరెడ్డి, కన్వీనర్ వెంకటరామిరెడ్డి , మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరుబాబు, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, శ్రీకాంతరెడ్డి, చలపతి, రాజగోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, ఉమర్‌పారూక్,  అనితా శ్రీనివాసరెడ్డి, రహంతుల్లా, మురళి, మాజీ కన్వీనర్ నీరగంటి వెంకటరాముడు, మునిమడుగు  శ్రీనివాసులు, నాగలూరు భాస్కరరెడ్డి కుమారుడు బాబు, కొండలరాయుడు,  శంకరరెడ్డి, జాఫర్, ఇలియాజ్, అమర్, కర్రా సంజీవరెడ్డి,  మొబైల్స్ ఫణి,  జయప్ప,  శ్యాంనాయక్, ఈశ్వర్, యస్‌బి.శీనా, రత్నాలు, గిరి,  లక్ష్మేనాయక్, గౌస్, గోరంట్ల నాయకులు కన్వీనర్ ఫక్రొద్దీన్, జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు గంపల  వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి,  టవ్వాల్‌గోపాల్, కొత్తపల్లి శీనప్ప, పుట్టపర్తి కన్వీనర్ గంగాధర్, రొద్దం నరశింహులు, చంద్రశేఖర్, నారాయణరెడ్డి  పాల్గొన్నారు.  
 
  రూ.లక్ష ఆర్థిక సాయం పొందిన కుటుంబాల వివరాలు
 మృతి చెందిన విద్యార్థి పేరు                    తల్లిదండ్రులు                                   గ్రామం           మండలం
 నరేంద్ర                                               చిన్న అంజినప్ప, లక్ష్మినరసమ్మ        మావటూరు    పెనుకొండ
 బోయ నరసింహమూర్తి                        అంజినప్ప,రామాంజినమ్మ                మావటూరు    పెనుకొండ
 మాల అశోక్‌కుమార్                          క్రిష్టప్ప,జయమ్మ                               మావటూరు    పెనుకొండ
 అనిల్                                               ప్రకాష్, రామక్క                               మావటూరు    పెనుకొండ
 కోతెమ్మగారి గంగాధర్                       సజ్జప్ప, సుశీలమ్మ                            మావటూరు    పెనుకొండ
 దాసరి గంగాధర్                                రామన్న, వెంకటరత్నమ్మ                మావటూరు     పెనుకొండ
 హనుమంతరాయుడు                       కుళ్లాయప్ప,సావిత్రమ్మ                     బండపల్లి          పెనుకొండ
 కురుబ గంగాధర                              ప్రభాకర్,హనుమక్క                         బండపల్లి         పెనుకొండ
 శేఖర్                                              {Mిష్టప్ప,రామలక్ష్మమ్మ                  నాగలూరు       పెనుకొండ
 మాల లక్ష్మినారాయణ                      నరసింహమూర్తి, నరసమ్మ                నాగలూరు       పెనుకొండ
 అశోక్‌కుమార్                                 రామాంజినప్ప,ఆనందమ్మ               ఆనందపురం     సోమందేపల్లి
 అనిత                                            గంగాధర్                                         చెరుకూరు        రొద్దం  
 కురుబ మురళి                               వెంకటేశు                                         గొబ్బిరంపల్లి    రొద్దం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement