‘అది నిజంగా గొప్ప విషయం’ | BC Minister Shankar Narayana Speech At Tanuku | Sakshi
Sakshi News home page

50 రోజుల్లోనే హామీలు అమలు చేసిన సీఎం!

Published Fri, Jul 26 2019 8:26 PM | Last Updated on Fri, Jul 26 2019 8:36 PM

BC Minister Shankar Narayana Speech At Tanuku - Sakshi

మంత్రి మాలగుండ్ల శంకర్‌ నారాయణ

సాక్షి, పశ్చిమగోదావరి : యాభై రోజుల్లోనే అనేక హామీలు అమలు చేయటం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే సాధ్యమని బీసీ సంక్షేమ మంత్రి మాలగుండ్ల శంకర్‌ నారాయణ అన్నారు. తణుకు కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడుతూ శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కమిషన్‌ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్‌లు కల్పించటంతో రాజన్న రాజ్యం వచ్చిందన్నారు. చంద్రబాబు పేదల కష్టాల పట్ల అవగాహన లేని మనిషని ఆయన విమర్శించారు. మహిళలకు చంద్రబాబు  చేసినంత  ద్రోహం ఏ నాయకుడు చేయలేదని, బాబుకి  కేవలం ఎన్నికలప్పుడే  మహిళలు గుర్తుకొస్తారని మండిపడ్డారు. ‘ సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం.. రాష్ట్రం  లోటు బడ్జేట్‌లో ఉన్నప్పటికి మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేయటం గొప్ప విషయం’ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్యశ్రీ నుంచి బాబు అనేక జబ్బులను తొలగించారని పేర్కొన్నారు. సభ ముగిసిన ఆనంతరం పలువురు మంత్రులు.. మహిళలకు కుట్టు మిషన్‌లను, యువకులకు టూల్‌ కిట్లను పంపిణీ చేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement