సాక్షి, గుంటూరు: సామాజిక న్యాయం.. బహుశా దీని గురించి చంద్రబాబు హయాంలో ఎవరూ విని ఉండరు. ఎందుకంటే.. ఆయన తన కులం గురించి తప్పా ఇతర వర్గాల గురించి ఆయన ఆలోచించలేదు కాబట్టి. కానీ, గత నాలుగున్నరేళ్లలో అదెంటో ఏపీ ప్రజలు కళ్లారా చూస్తున్నారు. పదవుల్లో, పథకాల్లో అన్నింటా అన్ని వర్గాలకూ సమ న్యాయం చేస్తోంది ఇప్పుడు జగనన్న ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారిప్పుడు.
పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని అధికార పక్షానికి చంద్రబాబు సవాల్ విసిరుతున్నారు. అది సీఎం జగన్ సొంత నియోజకవర్గం. మరి పులివెందులలో ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టే దమ్ము టీడీపీకి ఉందా?. ఎన్నికలొస్తున్నాయి కదా అందుకే చంద్రబాబు స్వరం మారింది. బీసీలను ఉద్ధరించేవాడిలా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారాయన.
►చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు కూడా బీసీలనే దెబ్బకొట్టారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. అక్కడ ఓడిపోగానే.. బీసీలు ఎక్కువగా ఉండే కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన బీసీల నోట్లో మట్టి కొడుతూ వస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తనయుడ్ని అదే బాటలో నడిపిస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే మంగళగిరి నుంచి పోటీ చేయిస్తున్నాడు.
►బీసీ అంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బలంగా నమ్మారు. అందుకే బీసీలకు, అదే విధంగా ఇతర సామాజికవర్గాలకూ పెద్ద పీట వేశారు. ఇప్పుడు కులాలవారీగా ఏపీ ప్రజలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్న చంద్రబాబు (2014-2019)తన హయాంలో ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? అలాగే సీఎం జగన్ తన హయాంలో సముచిత స్థానం కల్పించారో లెక్కలు చూస్తే..
1)మంత్రి పదవులు
- చంద్రబాబు పాలనలో బీసీలు -8
- వైఎస్ జగన్ పాలనలో బీసీలు-11
- బాబు పాలనలో ఎస్సీలు -2
- జగన్ పాలనలో ఎస్సీలు-5
2)స్పీకర్
- బాబు పాలనలో కోడెల-కమ్మ సామాజిక వర్గం
- జగన్ పాలనలో తమ్మినేని సీతారాం - బీసీ
- శాసనమండలి ఛైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు
3)రాజ్యసభ ఎంపీలు
- బాబు పాలనలో బీసీలు-0
- జగన్ పాలనలో బీసీలు-4 (50 శాతం)
4)ఎమ్మెల్సీ పదవులు
- బాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు -18 (37 %)
- జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు-29 (68 %)
5) సీఎం జగన్ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురు (80 శాతం) బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లే.
6)13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో ఒక్క బీసీలకే 6 (46 శాతం) ఇచ్చారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి ఏకంగా 9 జడ్పీ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు.
7) రాష్ట్రంలో 14 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తే..
14 మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే ఇచ్చారు
8 ) 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే..
- అందులో 84 మున్సిపాల్టీలలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
- ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకు(53 శాతం) ఇచ్చారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలవర్గాలకు కలిపి 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు.
9) వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇచ్చారు.
- ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు.
10) 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి... 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే అందులో 201 పదవులు బీసీలకు(41 శాతం) ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు.
11) బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులూ ఇచ్చారు.
ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపుగా 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503... అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. ఈ లెక్కలు చాలావా? జగనన్న పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని చెప్పడానికి.
‘‘నాయీ బ్రహ్మణుల తోక కత్తిరిస్తా’’
‘‘మత్స్యకారుల తోలు తీస్తా’’
‘‘దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’’
ఇలాంటి కులహంకార వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు కాదా?.. దశాబ్దాల తరబడి రాజకీయ అనుభవం.. సీఎంగా ఉండి కూడా ప్రజలకు సామాజిక న్యాయం ఎందుకు అందించలేకపోయారు?.. అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ అది చేస్తా.. ఇది చేస్తా.. అంటూ చిడతలు వాయిస్తున్నారిప్పుడు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన చంద్రబాబు- సామాజిక న్యాయం అందిస్తున్న సీఎం జగన్ ఒక్కటేనా?.. ఆయన బావమరిది బాలయ్య స్టైల్‌లోనే చెప్పాలంటే.. ‘‘బాబూ.. బోత్ ఆర్ నాట్ సేమ్’’.
Comments
Please login to add a commentAdd a comment