Chabdrababu Naidu
-
‘చంద్రబాబు దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం’
సాక్షి, విశాఖపట్నం : అవినీతి రహిత సమాజమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమని పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నర్సీపట్నంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నియోజకవర్గ గ్రామ స్థాయి వాలంటీర్, వార్డ్ వాలంటీర్ల పరిచయ వేదికను అవంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చేసిన తప్పులు చేయోద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వం కృత్రిమ వరదలను సృష్టించిందనడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని మంత్రి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలోనే లక్షల ఉద్యోగాలు చూపెట్టిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదని తెలిపారు. -
‘అది నిజంగా గొప్ప విషయం’
సాక్షి, పశ్చిమగోదావరి : యాభై రోజుల్లోనే అనేక హామీలు అమలు చేయటం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమని బీసీ సంక్షేమ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. తణుకు కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడుతూ శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కమిషన్ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించటంతో రాజన్న రాజ్యం వచ్చిందన్నారు. చంద్రబాబు పేదల కష్టాల పట్ల అవగాహన లేని మనిషని ఆయన విమర్శించారు. మహిళలకు చంద్రబాబు చేసినంత ద్రోహం ఏ నాయకుడు చేయలేదని, బాబుకి కేవలం ఎన్నికలప్పుడే మహిళలు గుర్తుకొస్తారని మండిపడ్డారు. ‘ సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం.. రాష్ట్రం లోటు బడ్జేట్‌లో ఉన్నప్పటికి మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేయటం గొప్ప విషయం’ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్యశ్రీ నుంచి బాబు అనేక జబ్బులను తొలగించారని పేర్కొన్నారు. సభ ముగిసిన ఆనంతరం పలువురు మంత్రులు.. మహిళలకు కుట్టు మిషన్లను, యువకులకు టూల్ కిట్లను పంపిణీ చేశారు. -
‘ఏబీఎన్ రాధాకృష్ణ చెప్పిన వారికే టీడీపీ సీట్లు, కోట్లు’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పివారికే టీడీపీ సీట్లు, కోట్లు ఇచ్చారని ఆ పార్టీకి చెందిన కాపు ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించడానికి టీడీపీ కాపు ప్రజాప్రతినిధులు గురువారం కాకినాడలో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ టార్గెట్‌గా సాగినట్టు తెలుస్తోంది. లోకేశ్ తన సొంత సామాజిక వర్గానికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని నేతలు విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌లు కాపులను అవమానంగా చూసేవారని తెలిపారు. ఎన్నికల సమయంలో నిధులు కూడా ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా ఇచ్చారని తెలిపారు. కాపు ప్రజా ప్రతినిధులను కలవడానికి కూడా సమయం ఇవ్వలేదన్నారు. సూటు బూటు వేసుకున్న వారికే లోకేశ్ ఎక్కువ సమయం కేటాయించే వారని మండిపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నేతల కంటే కమ్మ సామాజిక వర్గం వారికే పార్టీ ఫండ్ ఎక్కువగా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
జగన్‌కు ప్రజామోదం– బాబుకు జైలు జీవితం
ప్రొద్దుటూరు : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో ప్రజామోదం చంద్రబాబుకు జైలు జీవితం తప్పదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని నంగనూరు పల్లె గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ డేటా చోరీ, ఓటుకు నోటు కేసు తదితర చట్టవిరుద్ధమైన నేరాల చిక్కుల్లో చిక్కి చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రజలే కాకుండా ప్రకృతి సైతం బాబుకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఇలాంటి నేతలు జైలుకు వెళ్లినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం బతికి బట్ట కడుతుందన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్షగట్టి జైలుకు పంపారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ కు ప్రజామోదం, చంద్రబాబుకు జైలు జీవితం తప్పదని, ఇది నూటికి నూరు పాళ్లు నిజమవుతుందన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మల్లేల రాజారామ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, పార్టీ నేతలు పోరెడ్డి నరసింహారెడ్డి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి ఓబయ్య యాదవ్, జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, మాజీ కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, మల్లిఖార్జున ప్రసాద్,పోతిరెడ్డి మురళీనాథరెడ్డి, చేనేత విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, రామాపురం యాకోబ్, తిరుపాల్, మండల మైనార్టీ సెల్ కన్వీనర్ ఖాదర్‌బాషా పాల్గొన్నారు. -
రెండు నెలల తుగ్లక్ పాలన
హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నెలల పాలన తుగ్లక్ పాలనలా ఉందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. 9 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే బాబు రాజధాని నిర్మాణమంటూ హుండీలు పెట్టి రాష్ట్ర పరువును బజార్లో పెడుతున్నారన్నారు. హుండీలు పెట్టే హక్కు దేవాదాయశాఖకు మాత్రమే ఉందన్నారు. చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి 30 కోట్ల రూపాయలు, చాంబర్ కోసం 23 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు ఓటేసింది హుండీలు పెట్టి, డబ్బు అడగటం కోసం కాదన్నారు. మంచి పరిపాలన అందిస్తారని ఓట్లేశారన్నారు. ఆయన రెండు నెలల పరిపాలనకే ప్రజలకు విసుగెత్తిందని అంబటి పేర్కొన్నారు.