
నంగనూరుపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో ప్రజామోదం చంద్రబాబుకు జైలు జీవితం తప్పదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని నంగనూరు పల్లె గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ డేటా చోరీ, ఓటుకు నోటు కేసు తదితర చట్టవిరుద్ధమైన నేరాల చిక్కుల్లో చిక్కి చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రజలే కాకుండా ప్రకృతి సైతం బాబుకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఇలాంటి నేతలు జైలుకు వెళ్లినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం బతికి బట్ట కడుతుందన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్షగట్టి జైలుకు పంపారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు.
ఈ ఎన్నికల్లో జగన్ కు ప్రజామోదం, చంద్రబాబుకు జైలు జీవితం తప్పదని, ఇది నూటికి నూరు పాళ్లు నిజమవుతుందన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మల్లేల రాజారామ్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, పార్టీ నేతలు పోరెడ్డి నరసింహారెడ్డి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి ఓబయ్య యాదవ్, జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, మాజీ కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, మల్లిఖార్జున ప్రసాద్,పోతిరెడ్డి మురళీనాథరెడ్డి, చేనేత విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, రామాపురం యాకోబ్, తిరుపాల్, మండల మైనార్టీ సెల్ కన్వీనర్ ఖాదర్‌బాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment