PRODDATUR mla
-
నీ శకం ముగిసింది బాబు..
-
బాబు శేషజీవితం ఇక సెంట్రల్ జైల్లోనే..!
-
చంద్రబాబు బెయిల్ పై ఎమ్మెల్యే రాచమల్లు సంచలన విషయాలు..
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరాలు
సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆయన నియోజకవర్గంలోని అంగన్వాడీ వర్కర్లపై వరాల జల్లు కురిపించారు. స్థానిక కేహెచ్‌ఎం స్ట్రీట్‌లోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో సోమవారం ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, తమ నియోజకవర్గంలో ఉన్న అంగన్వాడీ వర్కర్లలో 150 మందికి పైగా ముస్లింలు ఉన్నారని, జీతాలు ఇవ్వకుంటే మరో రెండు రోజుల్లో రానున్న రంజాన్ పండుగను ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. వీరంతా ఆనందంగా రంజాన్ జరుపుకోవడానికి తన సొంత నిధులతో వారికి ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అలాగే ప్రతి ఏడాది అంగన్వాడీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్ 21న కొత్త బట్టలు పంపిణీ చేస్తానని, ఈ సంవత్సరం జగన్ సీఎం అయ్యారు కనుక డిసెంబర్ వరకు ఆగకుండా మరో 15 రోజుల్లో బట్టల పంపిణీ చేస్తానని ఆయన అన్నారు. అంగన్వాడీ సిబ్బంది కుటుంబ ఆర్థిక భద్రత కోసం నియోజకవర్గంలోని 800 మంది వర్కర్లకు సొంత డబ్బుతో రూ. 1 లక్ష ఇన్సూరెన్స్ పాలసీని కడతానని చెప్పారు. ఎమ్మెల్యే రాచమల్లు వరాలు ప్రకటించడం పట్ల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు సతీమణి రాచమల్లు రమాదేవి, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
జగన్‌కు ప్రజామోదం– బాబుకు జైలు జీవితం
ప్రొద్దుటూరు : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో ప్రజామోదం చంద్రబాబుకు జైలు జీవితం తప్పదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని నంగనూరు పల్లె గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ డేటా చోరీ, ఓటుకు నోటు కేసు తదితర చట్టవిరుద్ధమైన నేరాల చిక్కుల్లో చిక్కి చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రజలే కాకుండా ప్రకృతి సైతం బాబుకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఇలాంటి నేతలు జైలుకు వెళ్లినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం బతికి బట్ట కడుతుందన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్షగట్టి జైలుకు పంపారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ కు ప్రజామోదం, చంద్రబాబుకు జైలు జీవితం తప్పదని, ఇది నూటికి నూరు పాళ్లు నిజమవుతుందన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మల్లేల రాజారామ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ దేవీప్రసాదరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, పార్టీ నేతలు పోరెడ్డి నరసింహారెడ్డి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి ఓబయ్య యాదవ్, జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, మాజీ కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, మల్లిఖార్జున ప్రసాద్,పోతిరెడ్డి మురళీనాథరెడ్డి, చేనేత విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, రామాపురం యాకోబ్, తిరుపాల్, మండల మైనార్టీ సెల్ కన్వీనర్ ఖాదర్‌బాషా పాల్గొన్నారు. -
పంది ఎంత బలిసినా నంది కాలేదు
సాక్షి, హైదరాబాద్: అనైతికతకు పాల్పడినట్లు స్వయంగా తానే అంగీకరించిన రాష్ట్ర మంత్రి సి. ఆదినారాయణరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఎంత మాత్రం లేదని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక ఫ్యాక్షనిస్టునని ఆయన ఘనంగా చెప్పుకోవడం దారుణమని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాచమల్లు మాట్లాడుతూ మంత్రి ఆది జగన్‌పై చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ప్రత్యేక హోదా ఇస్తే వైఎస్సార్ కాంగ్రెస్ బీజేపీకి మద్దతు నిస్తుందని జగన్ ఒక ఇంటర్యూలో చెబితే దానిని మంత్రి యాగీ చేయడం విడ్డూరమన్నారు. హోదా వస్తే మొత్తం రాష్ట్ర ప్రజలు బాగు పడతారని, తమ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కనుక హోదా ఇచ్చే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామన్నారు. ఇంతకూ మంత్రి ప్రత్యేక హోదాకు, అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఐదేళ్లు హోదా ఇస్తామంటే బీజేపీ పదేళ్లు ఇస్తామని చెప్పిందని, చంద్రబాబు 15 ఏళ్లు కావాలని కోరారన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేసి ప్రత్యేక హోదాను అటకెక్కించినా కూడా వైఎస్సార్సీపీ గట్టిగా పోరాడుతోందని గుర్తుచేశారు. ఆ పదాలకు అర్థం ఏమిటో... జగన్ క్రిస్టియన్ కాదని, క్రిటియన్ కూడా కాదని, ఆయన కస్టోడియన్ అని మంత్రి ఆదినారాయణరెడ్డి అర్థం లేని విమర్శలు చేశారన్నారు. కస్టోడియన్ అంటే కస్టడీకి (జైలుకు) వెళ్లేవాడేనే అర్థంతో ఆదినారాయణరెడ్డి చెప్పారని, అయితే మంత్రి అబద్ధాలు చెప్పబోయి సత్యాన్ని పలికారని రాచమల్లు అన్నారు. కస్టోడియనే... అంటే సంరక్షకుడు అని అర్థమని, ఈ రాష్ట్ర ప్రజలను సంరక్షించడానికి ఉధ్బవించినవాడు...’ అని మంత్రి గుర్తించాలని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో రుణ మాఫీ గురించి ఒక్క అబద్ధం ఆడితే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడని, కాని జగన్ అబద్ధాలకు దూరమన్నారు. జగన్ ఎలాంటి వాడు అనేది భవిష్యత్తే తేల్చుతుందన్నారు. 2009లో వైఎస్ వల్లనే 30 సీట్లు తగ్గాయని ఆది మాట్లాడారంటే ఆయన కడుపులో వైఎస్ కుటుంబంపై ఎంత విషయం ఉందో అర్థం అవుతోందన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్తున్నది చంద్రబాబేనని ఆయన అన్నారు. కేççసుల భయం వల్లనే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. తాను సీనియర్‌నని, చంద్రబాబు అనుభవజ్ఞుడని చెప్పుకోవడాన్ని రాచమల్లు తప్పు పడుతూ... ‘పంది పెంత బలిసినా...ఎప్పటికీ నంది కాలేదు... పంది పందే...’ అని వ్యాఖ్యానించారు. -
'ఆస్తుల కోసమే హత్యలు'
ప్రొద్దుటూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి కుటుంబ సభ్యులు ఆస్తి కోసమే హత్యలకు పాల్పడ్డారని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. ఆయన విలేకరులకు ఆయా ఘటనల గురించి వివరించారు. ‘విజయవాడలో ఆంధ్రపత్రిక స్థలాన్ని యజమాని శంభుప్రసాద్.. ఆడిటర్ చక్రపాణికి విక్రయించి, అదే స్థలాన్ని మస్తాన్‌రెడ్డి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించాడు. వరద రాజుల రెడ్డి కుటుంబీకులు తక్కువ ధరకు మస్తాన్‌రెడ్డి నుంచి కొనుగోలు చేశారు. మార్కెట్లో రూ.100 కోట్ల విలువైన ఈ ఎకరా స్థలానికి సంబంధించి టీడీపీ నేత వరదరాజులరెడ్డి మేనల్లుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డికి 35 శాతం, కుమారుడు నంద్యాల కొండారెడ్డికి 30 శాతం, మిగిలినదాంట్లో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శంకాపురం ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కుమారుడు బచ్చల ప్రతాప్, హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస ప్రసాద్‌కు వాటాలు ఉన్నాయి. అనంతరం వీరు 22 ఫిబ్రవరి, 2012లో హైదరాబాద్‌లో ఆడిటర్ చక్రపాణిని హత్య చేశారు. ఈ కేసులో వీరిపై అదే నెల 29న హైదరాబాద్‌లో కేసు నమోదైందని’ తెలిపారు. తర్వాత డబ్బు విషయంలో తేడా రావడంతో కటిక శివకుమార్‌ను గత నెల 7న హత్య చేశారని ఆరోపించారు. గతంలో వీరు తన హత్యకు కుట్ర పన్నారని, న్యాయవాది ఈవీ సుధాకర్‌రెడ్డిపై దాడి చేశారని, చెన్నమరాజుపల్లెకు చెందిన నడిపెన్న అనే వ్యక్తిని కూడా హత్య చేయించారని ఆరోపించారు. కేసు నుంచి బయట పడేందుకు రామచంద్రాపురం పోలీసులకు కోటి రూపాయల వరకు ముట్టజెప్పాలని ప్రయత్నించినట్లు రాచమల్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రొద్దుటూరుకు చెందిన ఓ సీఐ నుంచి రూ.40 లక్షలు అప్పుతీసుకున్నారన్నారు. -
'అధికారంలో ఉన్నాం... తలచుకుంటే ఏమైనా చేస్తాం'
కడప: మా ప్రభుత్వం అధికారంలో ఉంది... మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేస్తానంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్ఆర్ సీపీ నేతలను బెదిరించారు. శనివారం కడపలో జరిగిన జెడ్పీ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఎంపీ సీఎం రమేష్ జెడ్పీ సమావేశానికి ఎలా వస్తారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమళ్లు ప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించారు. జడ్పీ సమావేశంలో ఉండటానికి సీఎం రమేష్ అనర్హుడంటూ మినిట్స్‌లో రూల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే రూలింగ్ చేయడానికి జెడ్పీ చైర్మన్‌కు అధికారం లేదని జిల్లా కలెక్టర్... సీఎం రమేష్‌ను వెనకేసుకు వచ్చారు. దీంతో వైఎస్ఆర్ జడ్పీటీసీ సభ్యులు జెడ్పీ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆ క్రమంలో సీఎం రమేష్ ఆగ్రహంతో ఊగిపోతూ పై విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు ఏపీకి... అలాగే ఏపీకి చెందిన పలువురు ఎంపీలు తెలంగాణకు ఎంపికయ్యారు. సీఎం రమేష్ తెలంగాణకు కేటాయించారు. దీంతో తెలంగాణకు చెందిన ఎంపీ ఆంధ్రప్రదేశ్ జెడ్పీ సమావేశానికి ఎలా హజరవుతారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.