
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫుల్‌స్టాప్ పెట్టారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్ మీడియాతో పాటు యెల్లో బ్యాచ్ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారాయన.
సోమవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు పాల్గొన్న సమావేశంలో సీఎం జగన్.. తాజా రాజకీయ ప్రచారాలపై మాట్లాడారు.
షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన సీఎం జగన్.. మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయన్న ఆయన.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: గేరు మార్చండి.. జెట్ స్పీడ్‌తో పని చేయండి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment