కొత్త నినాదంతో వైఎస్సార్‌సీపీ సిద్ధం | Impressive Election Campaign Of Ysrcp | Sakshi
Sakshi News home page

నాకు ఒక కల ఉంది.. కొత్త నినాదంతో వైఎస్సార్‌సీపీ సిద్ధం

Published Tue, Mar 5 2024 7:59 PM | Last Updated on Wed, Mar 6 2024 12:22 PM

Impressive Election Campaign Of Ysrcp - Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ.. కొత్త ప్రచార అస్త్రాన్ని రెడీ చేసింది. ఇప్పటి వరకు ‘సిద్ధం పేరుతో  హోర్డింగులు కనిపించగా, తాజాగా ‘నా కల..’ అంటూ ఆయా వర్గాల పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

ఈ నెల 10న జరగనున్న సిద్ధం సభ కోసం వైఎస్సార్‌సీపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సరికొత్త హోర్డింగ్‌లతో ఆకర్షనీయమైన ప్రచారానికి దిగింది. ప్రజల కల నెరవేర్చే దిశగా అడుగులు వేస్తానంటూ సీఎం జగన్‌ పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది వైఎస్సార్‌సీపీ. 

రైతుల కల- జగనన్న కల, కార్మికుల కల - జగనన్న కల, విద్యార్థుల కల - జగనన్న కల తదితర పేర్లతో రూపొందించిన హోర్డింగులు.. ఆయా వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును తెలుపుతున్నాయి. కొత్త ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement