హైదరాబాద్: ఎన్నికల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆలిండియా బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య మండిపడ్డారు. మోసం చేస్తున్న పార్టీలకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలతో సంబంధం లేకుండా బీసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి బీసీ ఉద్యమించాలని కోరారు. దోమలగూడలోని బీసీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయపార్టీలు ప్రజాసంక్షేమం కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా బీసీలకు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనన్నారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు చాలా వరకు న్యాయం చేశారని, 41 ఎమ్మెల్యే, 7 ఎంపీ సీట్లు కేటాయించారని గుర్తుచేశారు. పార్లమెంటు స్థానాల్లో బీసీ అభ్యర్థి ఉన్నచోట ఆయనకే మద్దతు ఇచ్చి గెలిపించా లని, బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించిన పార్టీలకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, మంత్రివర్గంలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని విమర్శించా రు. బీసీల ఆశీర్వాదం పేరిట రెండోసారి అధికారం లోకి వచ్చిన కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు శఠగోపం పెట్టారని బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ గురించి కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పారని, 1956 నుంచి రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రిత్వ శాఖను కనుమరుగు చేశారని అన్నారు. బీసీలకు 8 ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు జనాబా దామా షా ప్రకారం రాజాకీయ ప్రాతినిధ్యం కల్పించక పోవ డం శోచనీయమని ఆలిండియా బీసీ ఫెడరేషన్ కో ఆర్డినేటర్ సాంబశివరావు అన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు విజయ్‌భాస్కర్, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment