వైఎస్ జగన్ను కలిసిన నిజ నిర్థారణ కమిటీ | ysrcp truth commitee members met ys jagan over sadavarthi lands issue | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ను కలిసిన నిజ నిర్థారణ కమిటీ

Published Mon, Jul 4 2016 11:59 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ను కలిసిన నిజ నిర్థారణ కమిటీ - Sakshi

వైఎస్ జగన్ను కలిసిన నిజ నిర్థారణ కమిటీ

హైదరాబాద్ : సదావర్తి సత్రం భూములపై ఏర్పాటు చేసిన నిజ నిర్థారణ కమిటీ సోమవారం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సత్రం భూములపై నివేదిక అందచేశారు. అమరావతి, చెన్నైలో పర్యటించిన నిజ నిర్థారణ కమిటీ సభ్యులు ఈ నివేదిక రూపొందించారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  అమరావతి సదావర్తి సత్రం భూముల్లో వేలకోట్ల రూపాయల కుంభకోణం జరిగిన నేపథ్యంలో... ప్రతిపక్ష పార్టీ దీనిపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన వైఎస్ఆర్ సీపీ నిజ నిర్థారణ కమిటీని ఏర్పాటు చేసింది.  ఏపీ సర్కార్ 81 ఎకరాల సదావర్తి భూములను ఎకరం రూ. 27 లక్షలకే అధికారులు కట్టబెట్టిన విషయం తెలిసిందే. (చదవండి ...సదావర్తి సత్రంలో వెయ్యి కోట్లు లూటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement