కోర్టు కట్టమన్న మొత్తం కట్టేశా: ఆర్కే | MLA Alla Ramakrishna Reddy ready to pay Rs10 crore | Sakshi
Sakshi News home page

కోర్టు కట్టమన్న మొత్తం కట్టేశా: ఆర్కే

Published Sat, Jul 29 2017 1:48 AM | Last Updated on Tue, Oct 30 2018 4:08 PM

కోర్టు కట్టమన్న మొత్తం కట్టేశా: ఆర్కే - Sakshi

కోర్టు కట్టమన్న మొత్తం కట్టేశా: ఆర్కే

సాక్షి, హైదరాబాద్‌:  హైకోర్టు ఆదేశాల మేరకు సదావర్తి భూముల విషయంలో కోర్టుకు చెల్లించాల్సిన రూ. 27 కోట్ల 44 లక్షల 625 రూపాయలు మొత్తాన్ని చెల్లించానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన రూ. 10 కోట్లు కట్టేశానని, మిగిలిన మొత్తం రూ.17,44,12,625 శుక్రవారం ఏపీ దేవాదాయ కమిషనర్‌కి ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు తెలిపారు. దీనిపై వచ్చే సోమవారం కోర్టు జడ్జిమెంట్‌ ఇస్తుందని చెప్పారు.

గతంలో సదావర్తి భూములకు సంబంధించి జరిగిన వేలంపాటలో అవకతవకలకు జరిగాయని ఎమ్మెల్యే ఆర్కే కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గతంలో విక్రయించిన ధర కంటే మరో ఐదు కోట్లు అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని.. ఆ భూమిని తనకే కేటాయించాలని ఆయన హైకోర్టును కోరగా అందుకు కోర్టు సమ్మతించింది. దానికి సంబంధించి చెల్లించాల్సిన మొత్తాన్ని (రూ. 27.44 కోట్లు) రెండు విడతలుగా చెల్లించాలని కోర్టు సూచించింది. గతంలోనే పది కోట్లు చెల్లించిన ఆర్కే  శుక్రవారం మిగిలిన మొత్తాన్ని చెల్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement