హైకోర్టు దృష్టికి ‘సదావర్తి’ భూమి మాయం
రెండో సారి వేలంలో 4 ఎకరాలు మినహాయించారన్న ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, హైదరాబాద్ : సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల అత్యంత విలువైన భూముల్లో 79 ఎకరాలకే వేలం నిర్వహిస్తున్న ఏపీ సర్కార్ తీరును వైఎస్సార్‌సీపీ మంగళ గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా 4 ఎకరాలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో సర్కార్‌ను సంజాయిషీ కోరాలని ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టు ను అభ్యర్థించారు.
దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తర్వాత తాము ఏపీ సర్కార్ వివరణ కోరుతామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఈ లోగా వేలం ప్రక్రియను కొనసాగనివ్వాలంది.