తన భర్తను అన్యాయంగా బదిలీ చేశారనీ, సీఈఎల్ (సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్)లో అనేక అన్యా యాలు జరుగుతున్నాయని సుప్రియాకుమారి నాటి మంత్రి వైఎస్ చౌదరికి వినతిపత్రం సమర్పిం చారు. దానిపై ఏ చర్యలు తీసుకుకున్నదీ చెప్పాలని నిజనిర్ధారణ కమిటీ నివే దిక ప్రతి కావాలని, దానిపై వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా విభాగం తీసుకున్న చర్యలు వివరించా లని ఆమె అడిగారు. నివేదిక ప్రతిని, వివరాలను ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆర్టీఐ కింద అడిగితే ఈ నివేదిక ఇవ్వవలసి ఉంటుందని సీపీఐఓ సలహా ఇచ్చారు. ఆ నివేదిక ప్రతికి సంబం ధించిన దస్తావేజులున్న మరో శాస్త్రవేత్త ఇవ్వడానికి నిరాకరించారు. దానికి ఆయన ఎంచుకున్న మిష ప్రైవేటు సమాచారం అని. ఎవరి వ్యక్తిగత సమాచా రం? నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఇస్తే ఎవరి ప్రైవసీ దెబ్బ తింటుందనే వివరణ లేదు. సీఈ ఎల్‌లో అవక తవకలపై విచారించిన ఆ కమిటీ ఏం తేల్చిందని అడిగితే, ఆ శాస్త్రవేత్త ఏమీ రుజువు కాలేదని జవా బిచ్చారు. ఇందులో దాచవలసింది ఏమీలేదని, పూర్తి సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారో కార ణాలు వివరించి, సమర్థించుకోవలసిన బాధ్యత ఆ శాస్త్రవేత్తపైన ఉందని మొదటి అప్పీలు అధికారి తన ఆదేశంలో వివరించారు. అయినా ఆ శాస్త్రవేత్త విన లేదు. ఆ దశలో కూడా సీపీఐఓ ఈ సమాచారం ఇవ్వాలని సూచించారు. అయినా శాస్త్రవేత్త ఇవ్వను పొమ్మన్నారు. రెండో అప్పీలును సమాచార కమిషన్ ముందుకు తెచ్చారు. ఈ నిజనిర్ధారణ నివేదికతో పాటు కొన్ని పత్రాలను సీఈఎల్ తమ న్యాయవాదికి ఇచ్చిందని, కనుక ఈ నివేదిక ప్రతి లాయర్ కిచ్చిన ప్రివిలేజ్ ప్రతి అవుతుందని కనుక ఇవ్వడానికి వీల్లే దని అన్నారు. కమిషన్ విచారణలో ఆయన మరో కొత్త కారణం తెరమీదకు తెచ్చారు. ఈ నివేదికలో వ్యాపార రహస్యాలున్నాయని, వాటిని వెల్లడిస్తే తమ సంస్థ పోటీలో దెబ్బతింటుందని, అలాంటి సమాచారం ఇవ్వకూడదని శాస్త్రవేత్త వాదించారు.
సీఈఎల్‌లో అవకతవకలున్నాయని టెలికాం లైవ్ అనే పత్రికలో వ్యాసం వచ్చిందని, సీఏజీ(కాగ్) నివేదికలో కొన్ని అభ్యంతరాల ఆధారంగా ఆ వ్యాసంలో చేసిన విమర్శలు, ఆరోపణలపై విచారణ జరిపించి తీరాలని కోరారు. నిజనిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదిక సమాచార హక్కు చట్టం సెక్షన్ 2(ఎఫ్) కింద సమాచారం అనే నిర్వచనంలోకి ఖచ్చి తంగా వస్తుందని, ఆ నివేదికను దాచిపెట్టడం చట్ట వ్యతిరేకమని విమర్శించారు. ఇదివరకు మరో ఆర్టీఐ అప్పీలులో సీఐసీ ఈ నిజ నిర్ధారణ నివేదికలో కొన్ని భాగాలను దాచి మిగిలిన నివేదిక కాపీలను ఇవ్వ డానికి అనుమతించిందని డీమ్డ్ సీపీఐఓ శాస్త్రవేత్త అన్నారు. ఈ కేసులో కూడా పూర్తి నివేదిక ఇవ్వ నవసరం లేదని ఆయన తెలిపారు. మరోసారి సీపీఐఓ ఈ నివేదిక ఇవ్వాలని ఉత్తరం రాసినా ఈ శాస్త్రవేత్త ఇవ్వనందున ఆయనపై జరిమానా విధిం చాలని కోరారు. ఎవరి వ్యక్తిగత సమాచారం అందులో లేదని, అయినా ఎందుకు దాస్తున్నారని అడిగారు. మొత్తం దస్తావేజులను రాతపూర్వక వాదాలను పరిశీలిస్తే శాస్త్రవేత్త సమాచార నిరాకర ణకు ఏ ఆధారమూ కనిపించడం లేదని కమిషన్ భావించింది. ప్రతిసారి ఏదో ఒక సెక్షన్‌ను ఉదహ రించి సమాచారం ఇవ్వనంటున్నారేగాని అది వర్తి స్తుందో లేదో ఆలోచించడమే లేదని, సీపీఐఓ అధి కారి విచక్షణను ఉపయోగించకుండా నిర్ణయాలు తీసుకోవడం న్యాయంకాదని కమిషన్ వివరించింది.
మొత్తం నివేదికను పరిశీలించి వాణిజ్య సంబం ధమైన అంశాలు నిజంగా పోటీని దెబ్బతీస్తే, వాటిని మినహాయించి మిగతా భాగం ఇవ్వాలని ఆదేశిం చింది. తర్వాత ఈ శాస్త్రవేత్త ఆ నివేదికలో చాలా ముఖ్య భాగాలను, మినహాయించి పనికి రాని భాగా లను ఇచ్చారని, అధికారుల పేరు రాగానే దానిపైన నలుపు సిరా పూసేశారని విమర్శించారు. దాంతో కమిషన్ మొత్తం నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది. దానిలో వాణిజ్యపరంగా దాచవలసిన అంశాలేవీ కనిపించలేదు. పైగా, మొదటి అప్పీలు ఆధికారి ఆదేశాలను కూడా పాటించకుండా వదిలే యడం చట్ట వ్యతిరేకం. మొదటి అపెల్లేట్ అధికారి స్థానంలో ఉన్న శాస్త్రవేత్త ఈ నివేదిక మళ్లీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది. ఆ తర్వాత నివేదిక ప్రతి ఇచ్చారు. ఇన్నాళ్లూ సమా చారం ఇవ్వకుండా అన్యాయంగా దాచినందుకు ఎందుకు శిక్ష విధించకూడదో కారణాలు వివరించా లనే నోటీసు ఇచ్చింది. దానికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో శాస్త్రవేత్తకు రూ. 5 వేల జరిమానా విధించాలని కమిషన్ ఆదేశించింది. (ఇఐఇ/ఈౖ ఐ ఖ/అ/2018/104889 కేసులో 13.9.2018న సీఐసీ ఆదేశం ఆధారంగా)
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్,professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment