సాక్షి, విశాఖపట్నం: అనస్థీషియా డాక్టర్ సుధాకర్ వ్యవహార శైలిపై విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైకోర్టులో విచారణలో ఉన్న కేసును సీబీఐకు అప్పగించామన్నారు. డాక్టర్ సుధాకర్ కేసుకు సంబంధించి ఫైల్, స్వాధీనం చేసుకున్న ప్రొపర్టీ మొత్తాన్ని సీబీఐకు అప్పగించామన్నారు. సుధాకర్‌కు స్థానిక పోలీసు స్టేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని, హైకోర్ట్ ఆదేశాలను తాము పాటిస్తున్నామన్నారు. హైకోర్టు తీర్పుపై సుధాకర్‌కు గౌరవం లేదా అని, సీబీఐ విచారణ మీద నమ్మకం లేదా అని ఆర్‌కే మీనా ప్రశ్నించారు. (డాక్టర్ సుధాకర్‌పై 3 సెక్షన్ల కింద సీబీఐ కేసు)
సీబీఐ విచారణ జరుగుతున్నప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ ముందు సుధాకర్ మీడియా సమావేశం పెట్టడమేంటని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడే ముందు సుధాకర్ రాజకీయ నాయకులను సంప్రదించి వస్తున్నారని, స్థానిక పోలీసులపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇది పోలీసులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలా ఉందని, సుధాకర్ తీరుపై సీబీఐకు ఫాక్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. సీబీఐ కూడా సుధాకర్ ఎవరెవరిని సంప్రదిస్తూన్నారో, అతని వెనక ఉన్న వారెవరో ధృవీకరించాలన్నారు. (ఎన్‌ఐఆర్‌ఎఫ్-2020; టాప్‌లో ఐఐటీ మద్రాస్)
Comments
Please login to add a commentAdd a comment