RK Meena
-
అంకుల్ సలహానే టర్నింగ్ పాయింట్..
సాక్షి, విశాఖపట్నం: ఎటువంటి బాల్ నైనా కూల్‌గా బౌండరీ దాటించే ఈ కెప్టెన్ ఆటలో ఎపుడూ అసహనం కనిపించదు. లక్ష్యం వైపే గురి.. అవరోధాలను అవలీలగా అధిగమించి విజయం సాధించే గడుసరి. అపుడు క్రికెట్ కెప్టెన్‌గా – ఇపుడు సిటీ పోలీసు టీమ్ కెప్టెన్‌గా ఒకటే పనితీరు– కూల్.. కూల్. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యనైనా– తనదైన స్టైల్లో సామరస్యంగా పరిష్కరించడం.. తప్పు జరిగితే తుప్పు వదిలించడం కూడా ఆయనకే సాధ్యం. కెరీర్ ‘సరిలేరు నీకెవ్వరూ’– అంటూ సాగుతున్న సిటీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా హృదయరాగం ఈ సండే స్పెషల్. టర్నింగ్ పాయింట్ ప్రాథమిక స్థాయి నుంచే టాపర్‌గా ఉన్న ఆర్.కె.మీనా ఇంటర్ నుంచి కామర్స్ సబ్జెక్ట్‌పై ఆసక్తి పెంచుకున్నారు. కామర్స్‌లోనే ఇంటర్, డిగ్రీ, పీజీ (ఎం.కామ్) పూర్తి చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం కూడా పొందారు. అలా ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ.. జీవితం సాగిపోతున్న వేళ.. ఆయన మామయ్య భగవత్ ప్రసాద్ మీనా ఇచ్చిన సలహా సీపీ జీవితాన్నే మార్చేసింది. ఆర్.కె.మీనాకు సమస్యలపై స్పందించే గుణం ఉండడం, సామాజిక పరిస్థితులు, స్థితిగతులు, జనరల్ నాలెడ్జ్, సేవాతత్వం, రాజకీయ పరిణామాలపై ఆసక్తి ఉండటాన్ని ఆయన గమనించారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఆయన ప్రస్థానం ఆగిపోకూడదని భావించి.. ‘సివిల్స్ సాధించే సత్తా నీలో ఉంది.. సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వు.. ఐపీఎస్ సాధించు‘ అని ఆర్.కె.మీనాకు సలహా ఇచ్చారు. ఆయన సలహానే ‘స్ఫూర్తిగా’ తీసుకుని సివిల్స్‌లో ఆర్.కె.మీనా ఉత్తమ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యారు. ఉత్తమమైన పని తీరు కనబరుస్తూ.. అందరిచేత ప్రశంసలు పొందారు. అడిషనల్ డీజీగా పదోన్నతి పొందిన రాజీవ్‌కుమార్ మీనా విశాఖ సీపీగా తన ముద్ర వేసుకున్నారు. కుటుంబ నేపథ్యం ఆర్.కె.మీనా తల్లిదండ్రులు దప్పోదేవి మీనా, భగవాన్ సాహీ మీనా. అతని తండ్రి ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. తమ్ముడు ఢిల్లీలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద చెల్లి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా, చిన్న చెల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. ఆయనది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఆర్.కె.మీనా తాతయ్యకు వ్యవసాయం అంటే ఇష్టం. అప్పుడప్పుడు ఈయన కూడా తాతకు వ్యవసాయంలో సాయం చేసేవారు. మీనాకు పశువుల పెంపకం అంటే ఇష్టం. ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటూనే.. వాటి పెంపకం చేపడుతున్నారు. విద్యాభ్యాసం ఆర్.కె.మీనా సొంత గ్రామం రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ పట్టణం. అల్వార్‌లోని ప్రభుత్వ నెహ్రూ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు, 9వ తరగతి నుంచి 10 వరకు అల్వార్‌లోని ప్రతాప్ సెకండరీ స్కూల్, ఇంటర్ యశ్వంత్ హైయర్ సెకండరీ స్కూల్, డిగ్రీ, పీజీలు రాజ్ రిషి కళాశాలలో పూర్తి చేశారు. యు.కె.లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఇన్ పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ చదివారు. అనామికాతో కల్యాణం ఇన్కమ్ ట్యాక్స్ అధికారి పనిచేస్తున్న సమయంలోనే జైపూర్‌కు చెందిన అనామికా మీనాను సీపీ వివాహం చేసుకున్నారు. ఆమె ఎమ్మెస్సీ పూర్తి చేశారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. క్రికెట్, ఫుట్‌బాల్, రన్నింగ్ అంటే ఇష్టం ఆర్.కె.మీనాకు అవుట్డోర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఆయన ఎక్కువగా ఆటలు ఆడేవారు. స్కూల్, కాలేజీల్లో ఫుట్‌బాల్, క్రికెట్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించేవారు. పరుగుపందెంలో ఎన్నో బహుమతులు సాధించారు. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నప్పుడు రన్నింగ్‌లో(10కె) మొదటి బహుమతి గెలుపొందారు. తెలుగులో శ్రీరామదాసు సినిమా ఇష్టం శ్రీ రామదాసు సినిమా అంటే చాలా ఇష్టం. అందులో హీరో నాగార్జున నటన చాలా బాగుంటుంది. సంగీతం కూడా అద్భుతం. నేను ఖమ్మం ఎస్పీగా ఉన్న సమయంలో ఆ సినిమా ఆడియో రిలీజ్ భద్రాచలంలో నాచేతుల మీదుగా జరిగింది ఈ సినిమా రిలీజ్ బెనిఫిట్ షోకి వెళ్లాను. సినిమా చూసిన వెంటనే హీరో నాగార్జునకి ..మూవీ బావుందని చెప్పాను. ముంబై లాంటిది విశాఖ.. 2014 సంవత్సరంలో 16వ బెటాలియన్ ఐజీగా పనిచేస్తున్నప్పుడు విశాఖజిల్లా ఆనందపురం మండలంలోని పేకేరు గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. అప్పటి నుంచి విశాఖ నగరమంటే అమితమైన ప్రేమ. ఉద్యోగ జీవితంలో చాలా చోట్ల పని చేశాను. ...నాకు నచ్చిన ప్రాంతం విశాఖనగరం. ఇది ఓ అందమైన నగరం. దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహా అన్ని వనరులున్న ఏకైక నగరం ఇది. అంకుల్ సలహానే టర్నింగ్ పాయింట్ సామాజిక పరిస్థితులు, రాజకీయాలపై నాకున్న అవగాహన గమనించిన మామయ్య భగవత్ మీనా ప్రసాద్.. సివిల్స్ సాధించే సత్తా నాలో ఉందని స్ఫూర్తి నింపారు. ఆయన ఇచ్చిన సలహాలతోనే ఇన్కమ్ ట్యాక్ ఆఫీసర్‌గా ఉన్న నేను.. సివిల్స్‌కు ప్రిపేర్ అయి ఐపీఎస్ సాధించాను. హిందీ సినిమాలు ఎక్కువగా చూస్తారు ఆర్.కె.మీనా హిందీ సినిమాలు ఎక్కువగా చూస్తారు. అయితే ఇష్టమైన సినిమా మాత్రం రాజస్థానీ(హిందీ) మూవీ ‘ఖామోషీ’. హీరో సంజీవ్ కుమార్, హీరోయిన్ వహీదా రెహమాన్‌లకు ఆయన అభిమాని. సమర్థ పనితీరుకు ప్రశంసలు ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ములుగుకు ఏఎస్పీగా తొలుత బాధ్యతలు స్వీకరించాను. తర్వాత నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబాబాద్, ఖమ్మంలో కూడా పనిచేశాను. అనంతరం యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించాను. ఆ సమయంలో సమర్థవంతమైన విధులు నిర్వహించినందుకు గానూ ప్రశంసలు పొందాను. నా ఉద్యోగ జీవితంలో ఆ క్షణాలు మరిచిపోలేను’ అని సీపీ గుర్తు చేసుకున్నారు. తప్పుదారి పడుతున్న సమాజాన్ని సన్మార్గంలో నడిపించే నాయకులను ఆయన ఆరాధిస్తారు. సీపీకు బి.ఆర్.అంబేడ్కర్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంటే అమితమైన గౌరవం. అదే తరహాలో సమాజంలో మార్పునకు విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటే అభిమానం, ఇష్టమని సీపీ తెలిపారు. బెస్ట్ ఫ్రెండ్ ఉమేష్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సమయంలో సహచర ఉద్యోగి ఉమేష్‌కుమార్‌తో ఆయనకు స్నేహం ఏర్పడింది. ఆర్.కె.మీనాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయనే. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైనా సమస్య గానీ, ఆలోచన గానీ, సంతోషంగానీ కుటుంబ సభ్యుల తర్వాత ఆయనతోనే పంచుకుంటారు. గ్రామాల దత్తత ఆర్.కె.మీనా ఢిల్లీలో ఐటీ మంత్రికి పీఎస్‌గా పనిచేస్తున్న సమయంలో అల్వార్ మండలంలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ రెండు గ్రామాల్లో ప్రజలకు విద్య, వైద్య భవనాల నిర్మాణం, పిల్లల చదువులకు పుస్తకాలు, పాఠశాలకు సామగ్రి అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014లో 16వ బెటాలియన్ ఐజీగా పని చేస్తున్నప్పుడు విశాఖ జిల్లాలో ఆనందపురం మండలంలోని పీకేరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. యువతా మేలుకో.. ‘చేతనైతే సాయం చేయి.. సాయం చేసే వారిని విమర్శించొద్దు’. అని ఆర్.కె.మీనా పిలుపునిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో పేదలకు సాయం చేసిన దాతలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు. ‘సమయాన్ని వృథా చేసుకోకుండా.. నిజాయితీతో పనిచేయండి. కష్టపడి లక్ష్యాన్ని చేరుకోండి.. లక్ష్యసాధనలో గెలుపు మనదైతే.. పది మందికి సాయం చేసే స్థాయికి మనం ఎదుగుతాం’ అని ఆర్.కె.మీనా యువతకు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు: దప్పో దేవి మీనా, భగవాన్ సాహి మీనా భార్య: అనామికా మీనా పిల్లలు: హర్షుల్ మేవాల్ (ఐఐటీ ఢిల్లీ), యశి్వన్ మేవాల్ (10వతరగతి, టింపనీ స్కూల్, విశాఖపట్నం) ఇష్టమైన క్రీడ: ఫుట్‌బాల్, క్రికెట్, రన్నింగ్, బ్యాడ్మింటన్ ఇష్టమైన క్రికెటర్ : వినోద్ కాంబ్లీ ఇష్టమైన సినిమా : ఖామోషీ (రాజస్థానీ మూవీ) ఇష్టమైన హీరో: సంజీవ్ కుమార్ హీరోయిన్: వహీదా రెహమాన్ ఇష్టమైన ఆహారం: ఖీర్, దాల్బాటి, చుర్మా (రాజస్థానీ వంటకాలు) ఇష్టమైన భాష: హిందీ, తెలుగు ఇష్టమైన నగరాలు: విశాఖపట్నం, జైపూర్ ఇష్టమైన పుస్తకాలు: ప్రేమ్‌చంద్ చారిత్రక పుస్తకాలు హిందీలో ‘కర్మభూమి’ అలవాట్లు: ఉదయం వాకింగ్, వ్యాయామం చేయడం అవార్డులు: ఇండియా పోలీస్ మెడల్ (ఐపీఎం) -
రెండు రోజులే కస్టడీకి అనుమతి
సాక్షి, విశాఖపట్నం : చిన్నారుల అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను విచారించడానికి మహారాణిపేట పోలీసులు మూడు రోజుల కస్టడీ కోరారు. అయితే రెండు రోజులకస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. ఈ మేరకు రెండవ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు అనుమతితో నేటి నుంచి రెండు రోజులపాటు డాక్టర్ నమ్రతను పోలీసులు విచారించనున్నారు. దీంతో చిన్నారుల అక్రమ రవాణాలో పలు కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. (అనారోగ్యంగా ఉందంటూ జైలులో హంగామా..) ఆస్పత్రి ముసుగులో పసికందులతో వ్యాపారం సాగించిన యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత ఎ 1 నిందితురాలిగా విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్రమాలపై పోలీసుల సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఆరుగురు పసిపిల్లలను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చిన్నారుల అక్రమ రవాణాపై సెక్షస్ 468,471తో సహా జువైనల్ జస్టిస్ యాక్ట్ 2005కింద పలు కేసులను పోలీసులు నమోదు చేశారు. (‘సృష్టి’ తీగలాగితే.. ‘పద్మశ్రీ’ డొంక వెలుగులోకి... ) -
సెంట్రల్ జైలులో డాక్టర్ నమ్రత హంగామా
సాక్షి, విశాఖపట్నం: ఆస్పత్రి ముసుగులో పసికందులతో వ్యాపారం సాగించిన యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత అక్రమాలపై పోలీసుల సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఆరుగురు పసిపిల్లలను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. పసిపిల్లల అక్రమ రవాణాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. కోర్టు అనుమతితో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో రెండు బృందాలతో తనిఖీలు చేస్తున్నాం. పేషెంట్ల వివరాలు, రికార్డులు, డాక్యుమెంట్లు అన్నీ పూర్తిగా తనిఖీ చేస్తున్నాం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాము. డాక్టర్ నమ్రతని విచారిస్తే పసిపిల్లల అక్రమ రవాణా రాకెట్ కి సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయి' అని రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో ప్రధాన ముద్దాయిగా అరెస్టయి విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న డాక్టర్ నమ్రతా అస్వస్థత పేరుతో బుధవారం హైడ్రామాను కొనసాగించారు. తనకి అనారోగ్యంగా ఉందంటూ జైలులో హంగామా సృష్టించారు. దీంతో ఆమెని జైలు సిబ్బంధి కేజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం కేజీహెచ్‌లో వైద్య పరీక్షల సమయంలో కూడా నమ్రత హడావిడి చేశారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కర్ణాటక దావణగిరిలో అదుపులోకి తీసుకునే సమయంలోనూ తనకు కరోనా ఉందంటూ పోలీసులని భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా తేలింది. తాజాగా అనారోగ్యం పేరుతో మరో డ్రామాకు తెరలేపింది. కాగా.. హైకోర్టులో డాక్డర్ నమ్రత ముందస్తు బెయిల్ పిటీషన్ డిస్మిస్ కావడంతో బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. (డాక్టర్ పచ్చిపాల నమ్రత అరెస్ట్) మరోవైపు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సెర్చ్ వారెంట్‌తో మధ్యాహ్నం నుంచి సృష్టి ఆస్పత్రి అణువణువునా తనిఖీ చేస్తున్నారు. మహారాణి పేట పీస్ సీఐ సోమశేఖర్, టూటౌన్ సీఐ వెంకట్రావుల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. సరోగసి కోసం వచ్చిన పేషేంట్ల వివరాలతో పాటు ఒక్కొక్క డెలివరీ కేసు వివరాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే గడిచిన ఏడాది కాలంలో ఈ ఆస్పత్రి నుంచి 56 శిశు జననాలపై జీవీఎంసీ నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. కేజీహెచ్‌కి చెందిన ఇద్దరు వైద్య నిపుణులు తనిఖీలలో పోలీసులకు సహకరిస్తున్నారు. తనిఖీలు అనంతరం కోర్డు అనుమతితో ఆసుపత్రి సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. (నమ్రత అక్రమాలపై సమగ్ర దర్యాప్తు) -
పిల్లల అక్రమ రవాణా.. ఆస్పత్రి ఎండీ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం ఆదివారం బయటపడింది. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మత ఆధ్వర్యంలో చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పిల్లలను పోషించలేని తల్లిదండ్రులకు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి.. పుట్టిన వెంటనే ఇతరులకు విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఇద్దరు ఆశావర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్ తిరుమల ఈ ముఠాకు సహకరిస్తున్నారని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మీడియాకు తెలిపారు. (చదవండి: లభించని సింధూజ రెడ్డి ఆచూకీ) ‘పిల్లల అక్రమ రవాణా కేసులో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండి నర్మత సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశాం. విశాఖలోని జడ్పీ జంక్షన్ వద్ద గల యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ముఠా ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసినట్టు వెల్లడైంది. కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’అని సీపీ పేర్కొన్నారు. గతంలోనూ సృష్టి హాస్పిటల్లో మోసాలు జరగడంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్‌గా పేరు మార్చి చిన్నారుల అక్రమ రవాణాకు తెరతీశారు. (పరువు కోసం కూతుర్ని హతమార్చిన తండ్రి) -
వీడిన విశాఖ కిడ్నాప్ కేసు మిస్టరీ
-
విశాఖ కిడ్నాప్ కేసు: ఇద్దరు అరెస్టు
సాక్షి, విశాఖపట్నం: రియల్ఎస్టేట్ వ్యాపారి సురేష్ కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. నిందితులు పల్లపు ప్రసాద్, ప్రతాప్‌రెడ్డిలను విశాఖ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వ్యాపార లావాదేవీలు, రైస్ పుల్లింగ్ వ్యవహారాలే కిడ్నాప్‌నకు ప్రధాన కారణమని తేలింది. విశాఖ కమిషనర్ ఆర్కే మీనా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రియల్ఎస్టేట్ వ్యాపారి సురేష్‌ను నలుగురు కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. కత్తి, తుపాకీతో సురేష్‌ను బెదిరించారు. డబ్బులు లేవని బంగారం ఉందని అతను కిడ్నాపర్లకి చెప్పాడు. సురేష్ తనభార్యకి ఫోన్ చేసి బంగారం తీసుకు రమ్మన్నాడు. అతని భార్య బంగారం తీసుకువచ్చిన తర్వాత భార్యాభర్తలు గొడవలు పడ్డారు. అదే సమయంలో సురేష్ కొడుకు డయల్ 100 కి ఫోన్ చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో నిందితులు పారిపోయారు. (చదవండి: వ్యాపారి కిడ్నాప్ కేసు దర్యాప్తు ముమ్మరం) నిందితులు పల్లపు ప్రసాద్ (ఎ 1), ప్రతాప్‌రెడ్డి (ఎ 2)లను అరెస్టు చేశాం. ఈ కేసులో మొత్తం ఏడుగురి పాత్ర గుర్తించాం. మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. అరెస్ట్ అయినవారిపై రైస్ పుల్లింగ్ తో పాటు పలు కేసులు ఉన్నాయి. నిందితులలో కొంతమందితో సురేష్ కి రైస్ పుల్లింగ్ ద్వారా పరిచయం ఉంది. సురేష్ పైన కూడా కేసులు ఉన్నాయి. కేసులతో పాటు డబ్బులు ఉన్నవ్యక్తిని కిడ్నాప్ చేస్తే త్వరగా డబ్బులు వస్తాయని నిందితులు ఊహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్ పై మూడు కేసులు ఉన్నాయి. మరో నిందితుడు ప్రతాప్‌రెడ్డిపై నాలుగు కేసులు ఉన్నాయి. గతంలో ప్రసాద్ కూడా రైస్ పుల్లింగ్ వ్యవహారంలో కిడ్నాప్ కి గురై మోసపోవడంతో ఈజీ మనీ కోసం అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. (విభేదాలే కిడ్నాప్‌కి కారణమా..?) -
డ్రగ్స్ కేసుపై లోతైన విచారణ : విశాఖ సీపీ
సాక్షి, విశాఖపట్నం : నగరంలో వెలుగుచూసిన డ్రగ్స్ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసుకు సంబంధించి నలుగురు నిందితుల్లో ఒకరైన మానుకొండ సత్యనారాయణ గతంలో రేవ్‌పార్టీ కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. సత్యనారాయణ, అతని స్నేహితుడు అజయ్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్టు గుర్తించామని వెల్లడించారు. వీరు తీసుకొచ్చిన డ్రగ్స్‌కు మూలాలు బెంగళూరులో ఎక్కడున్నాయో గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ కేసులో బెంగళూరు, గోవా పోలీసులు సహకారం తీసుకుంటామని చెప్పారు.(చదవండి : విశాఖ డ్రగ్స్ కేసు: వెలుగులోకి కొత్తకోణాలు) ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడతామన్నారు. నగరంలో జరిగే పుట్టిన రోజు పార్టీలకు సరఫరా చేసేందుకు డ్రగ్స్ తీసుకువచ్చినట్టుగా తెలుస్తోందన్నారు. నిందితులు యువతను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నారని చెప్పారు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారిని గుర్తించి వారికి డీఎడిక్షన్ సెంటర్లో చికిత్స అందిస్తామని తెలిపారు. సత్యనారాయణ కదలికలపై నిఘా పెట్టడం వల్లే డ్రగ్స్ ముఠా గుట్టురట్టైందన్నారు. సత్యనారాయణపై మూడు కేసులు ఉన్నాయని వెల్లడించారు. -
దివ్య హత్య అత్యంత క్రూరమైంది..
-
దివ్య హత్య అత్యంత క్రూరమైంది..
సాక్షి, విశాఖ : నగరంలో దారుణంగా హత్యకు గురైన దివ్య హత్య కేసులో రెండవ రోజు విచారణ కొనసాగుతుంది. ప్రధాన నిందితురాలు వసంత, ఆమెకు సహకరించిన గీత అలియాస్ కుమారి లను పోలీసులు కస్టడీ లో తీసుకుని విచారిస్తున్నారు. వసంత ఫోన్ కాల్ డేటా ను తీసుకున్నారు. అయితే దివ్యను చంపిన తర్వాత నిందితురాలు వసంత మొబైల్లో ఉన్న కాల్ డేటా మొత్తాన్ని ఓ మొబైల్ దుకాణానికి తీసుకు వెళ్లి డిలీట్ చేయించినట్లు ఇంటరాగేషన్‌లో తేలింది. దీంతో సదరు మొబైల్ దుకాణ యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. (దివ్య హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్) ఈ సందర్భంగా దివ్య హత్యకేసు విచారణపై నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా గురువారమిక్కడ మాట్లాడుతూ.. నిందితులు వసంత, గీతను కస్టడీకి తీసుకున్నాం. మిగిలిన నలుగురు నిందితులను కూడా పోలీస్ రిమాండ్‌కు అప్పగించమని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. న్యాయస్థానం అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుంటాం. దివ్య హత్య అత్యంత క్రూరమైంది. ఆమెకు ఆరురోజుల పాటు తిండి పెట్టకుండా చాలా హింసించారు. (కస్టడీకి దివ్య హత్య కేసు నిందితులు!) ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో ఆరా తీస్తున్నాం. దివ్య తల్లి, సోదరుడు, అమ్ముమ్మ ఓ రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైనట్లు నిందితులు చెబుతున్నారు. అయితే వాళ్లు హత్యకు గురయ్యారా? లేక అదృశ్యమయ్యారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.’ అని తెలిపారు. సీపీ అంతకు ముందు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు) -
డాక్టర్ సుధాకర్ వ్యవహార శైలిపై సీపీ ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: అనస్థీషియా డాక్టర్ సుధాకర్ వ్యవహార శైలిపై విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైకోర్టులో విచారణలో ఉన్న కేసును సీబీఐకు అప్పగించామన్నారు. డాక్టర్ సుధాకర్ కేసుకు సంబంధించి ఫైల్, స్వాధీనం చేసుకున్న ప్రొపర్టీ మొత్తాన్ని సీబీఐకు అప్పగించామన్నారు. సుధాకర్‌కు స్థానిక పోలీసు స్టేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని, హైకోర్ట్ ఆదేశాలను తాము పాటిస్తున్నామన్నారు. హైకోర్టు తీర్పుపై సుధాకర్‌కు గౌరవం లేదా అని, సీబీఐ విచారణ మీద నమ్మకం లేదా అని ఆర్కే మీనా ప్రశ్నించారు. (డాక్టర్ సుధాకర్‌పై 3 సెక్షన్ల కింద సీబీఐ కేసు) సీబీఐ విచారణ జరుగుతున్నప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ ముందు సుధాకర్ మీడియా సమావేశం పెట్టడమేంటని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడే ముందు సుధాకర్ రాజకీయ నాయకులను సంప్రదించి వస్తున్నారని, స్థానిక పోలీసులపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇది పోలీసులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలా ఉందని, సుధాకర్ తీరుపై సీబీఐకు ఫాక్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. సీబీఐ కూడా సుధాకర్ ఎవరెవరిని సంప్రదిస్తూన్నారో, అతని వెనక ఉన్న వారెవరో ధృవీకరించాలన్నారు. (ఎన్ఐఆర్ఎఫ్-2020; టాప్‌లో ఐఐటీ మద్రాస్) -
దివ్య హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్య హత్యపై విశాఖ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. దివ్య హత్యకేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. కాగా 2018లో వీరబాబు అనే వ్యక్తితో పెళ్లి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దివ్యతో పెళ్లి తర్వాత మూడు నెలల పాటు కాపురం చేసిన వీరబాబు వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చేవాడు. కాగా వీరబాబుకు దివ్య పిన్ని కాంతవేణి కూడా తోడయి ఆమెను ఒత్తిడికి గురి చేశారు. వీరి ఒత్తిడిని తట్టుకోలేకనే విశాఖపట్నంకు వచ్చిన దివ్య.. గీత, వసంత వద్దకు వచ్చినట్లు తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. కాగా హత్య సమయంలో నిందితులు దివ్య వద్ద సెల్‌ఫోన్ లేకుండా చేశారని తెలిపారు. (పోలీసు కస్టడీకి దివ్య హత్య కేసు నిందితులు!) విశాఖ పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. 'దివ్య హత్య కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు నిందితులని అరెస్ట్ చేయడానికి రెండు బృందాలతో గాలింపుచర్యలు చేపట్టాం. దివ్యకి గతంలో పెళ్లి జరిగినట్లు గుర్తించాం. నిందితులందరినీ పూర్తిస్ధాయిలో విచారించడానికి పోలీసు కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్ వేస్తాం. దివ్యను అతి క్రూరంగా హింసించి హత్య చేశారు. దివ్య శరీరంపై అనేక గాయాలున్నాయి' అంటూ వివరించారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు) -
అసభ్యంగా మాట్లాడుతూ.. అందర్ని తిట్టాడు
-
‘సుధాకర్‌ను స్థానికులే తాళ్లతో కట్టేశారు’
సాక్షి, విశాఖపట్నం : గతంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ శనివారం తప్పతాగి అసభ్యంగా మాట్లాడుతూ అందర్ని తిట్టారని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. నిన్న సాయంత్రం 3.45 నిమిషాల సమయంలో పోర్టు ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై ఒక వ్యక్తి కారుపై వచ్చి తప్పతాగి గొడవ చేస్తున్నాడంటూ 100కి కాల్ వచ్చిందని ఆయన అన్నారు. గొడవ చేస్తున్న ఆయనను నియంత్రించడానికి స్ధానికులే తాళ్లు కట్టారని చెప్పారు. డాక్టర్ సుధాకర్ తప్పతాగి వీరంగం సృష్టించిన ఘటనపై ఆదివారం ఆర్కే మీనా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘100కు ఫోన్ రాగానే 4వ పట్టణ పోలీసులు వేంటనే అక్కడికి చేరుకున్నారు. సుధాకర్ షర్ట్ తీసి విసిరేసి, రోడ్డు మీద వీరంగం సృష్టించాడు. పోలీసులు అతన్ని అపే ప్రయత్నం చేసినా అతను ఆగలేదు. హైవేపై ఏర్పాటు చేసిన స్టాపర్స్ తీసివేస్తూ గొడవ సృష్డించాడు. దాదాపు 45 నిమిషాల పాటు గందరగోళం సృష్టించాడు. ( అనస్థీషియా వైద్యుడి వీరంగం ) ఆ సమయంలో అతను సుధాకర్ అని కానిస్టేబుళ్లకి తెలియదు. తాగి గొడవ చేస్తుండటంతో పాటు లారీ క్రిందకి వెళ్లాడు. స్థానికుల సాయంతో పోలీసులు అతనిని ఆపే ప్రయత్నం చేశారు. అక్కడినుంచి అతనిని కేజీహెచ్‌కి తరలించారు. అతని బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ మెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాం. అతని ఆరోగ్య పరిస్ధితిపై కుటుంబ సభ్యులకి చెప్పే మానసిక చికిత్సాలయానికి తరలించాం. అతను తాగిన మైకంలో లారీ క్రింద పడబోతే రక్షించామ’’ని అన్నారు. ( చంద్రబాబు పప్పులు ఉడికే పరిస్థితి లేదు )