సాక్షి, విశాఖపట్నం : గతంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ శనివారం తప్పతాగి అసభ్యంగా మాట్లాడుతూ అందర్ని తిట్టారని పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా తెలిపారు. నిన్న సాయంత్రం 3.45 నిమిషాల సమయంలో పోర్టు ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై ఒక వ్యక్తి కారుపై వచ్చి తప్పతాగి గొడవ చేస్తున్నాడంటూ 100కి కాల్ వచ్చిందని ఆయన అన్నారు. గొడవ చేస్తున్న ఆయనను నియంత్రించడానికి స్ధానికులే తాళ్లు కట్టారని చెప్పారు. డాక్టర్ సుధాకర్ తప్పతాగి వీరంగం సృష్టించిన ఘటనపై ఆదివారం ఆర్‌కే మీనా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘100కు ఫోన్ రాగానే 4వ పట్టణ పోలీసులు వేంటనే అక్కడికి చేరుకున్నారు. సుధాకర్ షర్ట్ తీసి విసిరేసి, రోడ్డు మీద వీరంగం సృష్టించాడు. పోలీసులు అతన్ని అపే ప్రయత్నం చేసినా అతను ఆగలేదు. హైవేపై ఏర్పాటు చేసిన స్టాపర్స్ తీసివేస్తూ గొడవ సృష్డించాడు. దాదాపు 45 నిమిషాల పాటు గందరగోళం సృష్టించాడు. ( అనస్థీషియా వైద్యుడి వీరంగం )
ఆ సమయంలో అతను సుధాకర్ అని కానిస్టేబుళ్లకి తెలియదు. తాగి గొడవ చేస్తుండటంతో పాటు లారీ క్రిందకి వెళ్లాడు. స్థానికుల సాయంతో పోలీసులు అతనిని ఆపే ప్రయత్నం చేశారు. అక్కడినుంచి అతనిని కేజీహెచ్‌కి తరలించారు. అతని బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ మెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశాం. అతని ఆరోగ్య పరిస్ధితిపై కుటుంబ సభ్యులకి చెప్పే మానసిక చికిత్సాలయానికి తరలించాం. అతను తాగిన మైకంలో లారీ క్రింద పడబోతే రక్షించామ’’ని అన్నారు. ( చంద్రబాబు పప్పులు ఉడికే పరిస్థితి లేదు )
Comments
Please login to add a commentAdd a comment