
సాక్షి విశాఖ క్రైం: వివాదాస్పద అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్ శుక్రవారం గుండెపోటుతో విశాఖలో మరణించారు. గురువారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కింగ్ జార్జి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. గతేడాది నర్సీపట్నం ప్రభుత్వ వైద్యశాలలో మాస్కులు పంపిణీ చేయడం లేదంటూ దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విమర్శలు చేసి సస్పెండయ్యారు. ఆ తర్వాత రోడ్డుపై మద్యం మత్తులో నానా యాగీ చేసి పీఎంను, సీఎంను తీవ్రంగా దూషించారు. కొంతకాలానికి తాను తప్పు చేశానని.. సీఎం వైఎస్ జగన్ తనని క్షమించాలని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment