anasthasia
-
మెడికో ప్రీతి ఘటన.. హెచ్ఓడీపై బదిలీ వేటు.. పనిష్మెంటా? ప్రమోషనా?
సాక్షి, వరంగల్: మెడికో ప్రీతి ఘటన నేపథ్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రి అనస్తీసియా హెచ్ఓడీ నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను భూపాలపల్లి మెడికల్ కాలేజీకి అనస్తీసియా ప్రొఫెసర్‌గా బదిలీ చేస్తూ తెలంగాణ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీతి ఆత్మహత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాగార్జున రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను వేధించిన సైఫ్‌పై ప్రీతి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే నాగార్జున రెడ్డి గత కొంతకాలంగా భూపాలపల్లి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లే భూపాలపల్లికి బదిలీ కావడంతో ఇది ప్రమోషనా? లేక పనిష్మెంటా అనే చర్చ జరుగుతోంది. చదవండి: నిందితుడు హరిహరకృష్ణకు వారం రోజుల పోలీస్ కస్టడీ.. -
కొద్దిసేపు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారాలను భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(57)కు శుక్రవారం కొద్దిసేపు బదిలీ చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వడమే ఇందుకు కారణం. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా బైడెన్ రికార్డుకెక్కారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 79వ పడిలోకి ప్రవేశించారు. వాషింగ్టన్ శివారులోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో చేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు స్పృహలో లేనిపక్షంలో ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. బైడెన్‌కు శుక్రవారం మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆయన కొంతసేపు స్పృహలో లేరు. ఈ సమయంలో కమలా హ్యారిస్ వైట్‌హౌస్ వెస్ట్‌వింగ్‌లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు. అణ్వాయుధాల నియంత్రిత వ్యవస్థలతో కూడిన బాక్సు కూడా ఆమె సొంతమైనట్లు తెలుస్తోంది. పరీక్షల అనంతరం బైడెన్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాలన్నీ మళ్లీ ఆయనకే సంక్రమించాయి. 2002, 2007లో అప్పటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఇలాగే కలనోస్కోపీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు సందర్భాల్లో తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షుడు డిక్ చెనీకి బదిలీ చేశారు. -
అనస్థీషియా వైద్యుడు సుధాకర్ గుండెపోటుతో మృతి
సాక్షి విశాఖ క్రైం: వివాదాస్పద అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్ శుక్రవారం గుండెపోటుతో విశాఖలో మరణించారు. గురువారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కింగ్ జార్జి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. గతేడాది నర్సీపట్నం ప్రభుత్వ వైద్యశాలలో మాస్కులు పంపిణీ చేయడం లేదంటూ దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విమర్శలు చేసి సస్పెండయ్యారు. ఆ తర్వాత రోడ్డుపై మద్యం మత్తులో నానా యాగీ చేసి పీఎంను, సీఎంను తీవ్రంగా దూషించారు. కొంతకాలానికి తాను తప్పు చేశానని.. సీఎం వైఎస్ జగన్ తనని క్షమించాలని వేడుకున్నారు. -
భర్త, పిల్లలకు మత్తుమందు ఇచ్చి..ఆపై
నాగ్‌పూర్(మహారాష్ట్ర): భర్త, పిల్లలకు మత్తుమందు ఇచ్చి తర్వాత మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ సుష్మారాణె, ఆమె భర్త ధీరజ్ (42), ఇద్దరు పిల్లలు ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు. దంపతుల మధ్య ఎలాంటి కలహాలు లేవని, వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారని స్థానికులు, బంధువులు తెలిపారు. ధీరజ్ కాలేజీ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తుండగా ఆయన భార్య సుష్మారాణె స్థానిక అవంతి ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం కూతురితో కలిసి ఆస్పత్రికి వెళ్లిన ఆమె తిరిగి వచ్చేటప్పుడు మత్తుమందు ఇంజెక్షన్లను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఏం జరిగిందో ఏమో కానీ భర్త, ఇద్దరు పిల్లలకు అధిక మోతాదులో ఉన్న మత్తుమందును ఇచ్చి తర్వాత ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దంపతుల మధ్య కలహాలు లేవని తెలుస్తోంది. డాక్టర్ సుష్మ ఇంట్లో రెండు సిరంజీలు, ఖాళీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధిక మోతాదులో మత్తుమందు తీసుకోవడం వల్లే చనిపోయినట్లు తేలింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. (కుటుంబ సభ్యులే హంతకులు) -
సర్కారు ఆస్పత్రిలో నిర్లక్ష్యపు ‘మత్తు’!
సాక్షి, కోల్‌సిటీ(రామగుండం) : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఓ నిండు చూలాలుకు వైద్యులు ప్రసవం చేయకుండా నిరాకరించారు. మత్తుడాక్టర్ అందుబాటులో లేడనేసాకుతో కరీంనగర్‌కు రెఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. మీడియా రంగప్రవేశం చేయడంతో, నిర్లక్ష్యం వీడిన వైద్యులు సదరు గర్భిణిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి ప్రసవం నిర్వహించారు. మత్తుడాక్టర్ లేడని.. గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రాంతానికి చెందిన బొల్లు రమ్య భర్తతో కలిసి కర్నాటక రాష్ట్రంలో ఉంటున్నారు. రెండోకాన్పు కోసం కర్నాటక నుంచి రమ్య పుట్టింటికి వచ్చింది.శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు పెరగడంతో ఆస్పత్రికి తల్లి తీసుకొచ్చింది. సాయంత్రం వరకు ప్రసవం జరిపిస్తామని చెప్పిన వైద్యులు, సబ్బు నీళ్లుకూడా తాగించారు. చివరికి అనస్థీషియా డాక్టర్ అందుబాటులోలేరని, కరీంనగర్‌కు రెఫర్ చేశారు. మీడియా ప్రవేశంతో ఉలిక్కిపాటు... రమ్యను కరీంనగర్ తీసుకెళ్లడానికి ఆమె భర్త అందుబాటులో లేరని, తండ్రి కూడా ఊరెళ్లాడని ఒక్కదాన్ని అంత దూరం వెళ్లలేనని, ఇక్కడే ప్రసవం జరిపించాలని తల్లి విమల ఆవేదన వ్యక్తం చేసింది. అనస్థీషియా లేకుంటే తామేమీ చేయలేమని వైద్యసిబ్బంది చేతులెత్తేశారు. అప్పటికే ఒక గర్భిణీకి ప్రసవం చేసిన వైద్యులు, రమ్యకు ప్రసవం చేపట్టకుండా వెళ్లిపోయారని గర్భిణి తల్లి ఆరోపించింది. చివరికి మీడియా ప్రతినిధులు బాధితురాలి సమస్యపై వివరాలు సేకరిస్తుండడంతో, అప్పటి వరకు ప్రసవం చేయలేమని చెప్పిన వైద్యులు, హుటాహుటిన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయారు. వైద్యులు ఆపరేషన్ చేయడంతో రమ్య బాబుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారు. వీడని వైద్యుల నిర్లక్ష్యం... ఆస్పత్రిలో ముగ్గురు అనస్థీషియా వైద్యులు, ముగ్గురు గైనకాలజిస్టులు ఆస్పత్రిలో సేవలందిస్తున్నప్పటికీ, రమ్యకు ప్రసవం చేయడానికి నిరాకరించడం నిర్లక్ష్యమేనని ఆరోపణలు వస్తున్నాయి. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే ఒక్క గర్భిణిని కూడా బయటకు రెఫర్ చేయవద్దని, గతనెల 19న ఆస్పత్రిలో తనిఖీ చేయడానికి వచ్చిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అదనపు సంచాలకులు డాక్టర్ అశోక్‌కుమార్ ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వాస్పత్రిలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ కూడా పని చేయడం లేదని, వైద్యుల్లో నిర్లక్ష్యం వీడలేదని ఈ సంఘటనతో తేటతెల్లడైంది. వైద్యుల నిర్లక్ష్యం లేదు గర్భిణీకి ప్రసవం చేయకుండా వైద్యులు నిరాకరించలేదు. వైద్యులు, సిబ్బందికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. అందుకే ప్రసవం చేయడంలో కాస్త ఆలస్యం జరిగింది. నాకు విషయం తెలియడంతోనే వెంటనే వైద్యులతో చర్చించాను. వైద్యులు కూడా స్పందించి రమ్యకు ఆపరేషన్ ద్వారా ప్రసవం జరిపించారు. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. – డాక్టర్ రమాకాంత్, సూపరింటెండెంట్ -
బాయ్‌ఫ్రెండ్‌ను ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో పెట్టింది..
మాస్కో, రష్యా : బాయ్ ఫ్రెండ్ అత్యంత క్రూరంగా హత్య చేసిన అనస్తేసియా ఒనేజినా(21)ను రష్యా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అనస్తేసియా వెల్లడించిన వివరాలు విని పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. బాయ్ ఫ్రెండ్ డ్మిటీ సింకీచ్(24)ను అనస్తేసియా హత్య చేసిన తీరు పోలీసులను గగుర్పాటుకు గురి చేసింది. సింకీచ్ కొన్నేళ్ల పాటు పోలీసుగా పని చేసి వ్యక్తిగత కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనస్తేసియా, సింకీచ్లు కొద్ది ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వేలెంటైన్స్ డే సందర్భంగా సింకీచ్ ఇంటికి వచ్చిన అనస్తేసియా సింకీచ్ను కిరాతకంగా చంపింది. కిచెన్ కత్తితో సింకీచ్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపింది. అనంతరం బాడీ నుంచి తల, కాళ్లు, చేతులు, మర్మాంగం, చెంపలు వేరు చేసినట్లు చెప్పింది. హత్య జరిగిన ప్రదేశంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇంట్లో హుక్స్‌కు వేలాడుతున్న సింకీచ్ శరీర భాగాలను చూసి కంగుతిన్నారు. ఫ్రిజ్‌లో ప్యాకెట్ల రూపంలో సింకిచ్ ప్రైవేట్ పార్ట్స్‌ను అనస్తేసియా దాచినట్లు చెప్పారు. అనస్తేసియాకు గతంలోనే వివాహమైంది. పెళ్లైనా కొద్దిరోజులకే అనస్తేసియా భర్త అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.