
భర్త, పిల్లలతో డాక్టర్ సుష్మారాణె (ఫైల్)
నాగ్‌పూర్(మహారాష్ట్ర): భర్త, పిల్లలకు మత్తుమందు ఇచ్చి తర్వాత మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ సుష్మారాణె, ఆమె భర్త ధీరజ్ (42), ఇద్దరు పిల్లలు ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు. దంపతుల మధ్య ఎలాంటి కలహాలు లేవని, వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారని స్థానికులు, బంధువులు తెలిపారు. ధీరజ్ కాలేజీ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తుండగా ఆయన భార్య సుష్మారాణె స్థానిక అవంతి ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.
మంగళవారం ఉదయం కూతురితో కలిసి ఆస్పత్రికి వెళ్లిన ఆమె తిరిగి వచ్చేటప్పుడు మత్తుమందు ఇంజెక్షన్లను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఏం జరిగిందో ఏమో కానీ భర్త, ఇద్దరు పిల్లలకు అధిక మోతాదులో ఉన్న మత్తుమందును ఇచ్చి తర్వాత ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దంపతుల మధ్య కలహాలు లేవని తెలుస్తోంది. డాక్టర్ సుష్మ ఇంట్లో రెండు సిరంజీలు, ఖాళీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధిక మోతాదులో మత్తుమందు తీసుకోవడం వల్లే చనిపోయినట్లు తేలింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. (కుటుంబ సభ్యులే హంతకులు)
Comments
Please login to add a commentAdd a comment