
ముంబై: ఇద్దరి వ్యక్తుల మధ్య మొదలైన చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి క్షణికావేశంలో ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. దాభా ప్రాంతంలోని ఓ గ్యారేజీలో రాజు నందేశ్వర్ (35), దేవాన్ష్ వఘోడే (26) మేకానిక్‌లుగా గతకొంత కాలం నుంచి పనిచేస్తున్నారు. వీరిద్దరు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
అయితే గత శనివారం రాత్రి ఎదో విషయమై వీరి మధ్య చిన్న పాటి వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా పెద్దదిగా మారడంతో దేవాన్ష్ చేతికి దొరికిన ఓ పదునైన వస్తువుతో రాజును బలంగా కొట్టాడు. దీంతో రాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాసేపు అనంతరం అతడు చనిపోయినట్లు తెలుసుకున్న దేవాన్ష్ ఆ మృతదేహాన్ని మాయం చేయడానికి ప్లాన్ వేశాడు. తాను అనుకున్న ప్రకారం ఓ బహిరంగా ప్రదేశంలో ఆ మృతదేహాన్ని పాతిపెట్టాడు. అనంతరం తిరిగి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా గదినంతా శుభ్రం చేసి ఏమీ జరగనట్లు ప్రశాంతంగా పడుకున్నాడు. అయితే కొందరు స్థానికులు ఆ మృతదేహాన్ని గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు దేవాన్ష్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment