roommate
-
భారత సంతతి విద్యార్థి హత్య.. రూమ్మేట్పైనే అనుమానం!
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతడితో పాటు రూమ్‌లో ఉంటున్న సహచరుడైన కొరియా విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పర్డ్యూ యూనివర్సిటీలో డేటాసైన్స్ విభాగంలో చదువుతున్న 20ఏళ్ల వరుణ్ మనీష్ చడ్డా అనే విద్యార్థి తీవ్ర గాయలతో రక్తపు మడుగులో పడి ఉండటం కలకలం రేపింది. అతడు వర్సిటీలోని మెక్‌కట్చెన్ హాల్లో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధంతో పొడవటంతో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి బాధితుడి రూమ్మేట్, దక్షిణ కొరియాకు చెందిన జి మిన్ షా (జిమ్మిషా)ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతడు సైబర్ సెక్యూరిటీ మేజర్, ఇంటర్నేషనల్ స్టూడెంట్. చడ్డా మృతి గురించి షానే అర్ధరాత్రి 12.45 సమయంలో 911కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం గమనార్హం. కాల్ వచ్చిన వెంటనే తొలుత జిమ్మిషాను అదుపులోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ఈ హత్యపై విశ్వవిద్యాలయ అధ్యక్షుడు మిచ్ డేనియల్స్ విచారం వ్యక్తం చేశారు. చడ్డా కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. విద్యార్థులు మొత్తం ఒక చోట సమావేశమై చడ్డాకు నివాళి అర్పించారు. చడ్డా హత్య జరిగిన రాత్రి విషయాలను స్నేహితులు గుర్తు చేసుకున్నారు. మరో 10 రోజుల్లో చాడ్డా 21వ జన్మదినం ఉందని అతడి స్నేహితులు తెలిపారు. ఆన్లైన్ కాల్లో అతడు అరుస్తున్నట్లు తమకు వినబడిందని చెప్పారు. ‘‘మంగళవారం రాత్రి చడ్డా ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ, మిత్రులతో మాట్లాడుతున్నాడు. అంతలో హఠాత్తుగా కాల్లో అతడి కేకలు వినిపించాయి. అయితే.. అక్కడేమి జరిగిందో తెలియలేదు. మర్నాడు నిద్రలేచే సరికి చడ్డా మరణవార్త తెలిసింది’’ అని స్నేహితడు అర్నబ్ సిన్హా పేర్కొన్నాడు. ఇదీ చదవండి: చైల్డ్ కేర్ సెంటర్‌పై తూటాల వర్షం.. 34 మంది మృతి -
చిన్న గొడవ.. ప్రాణం తీసి.. రూంలో ప్రశాంతంగా పడుకున్నాడు
ముంబై: ఇద్దరి వ్యక్తుల మధ్య మొదలైన చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి క్షణికావేశంలో ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. దాభా ప్రాంతంలోని ఓ గ్యారేజీలో రాజు నందేశ్వర్ (35), దేవాన్ష్ వఘోడే (26) మేకానిక్లుగా గతకొంత కాలం నుంచి పనిచేస్తున్నారు. వీరిద్దరు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే గత శనివారం రాత్రి ఎదో విషయమై వీరి మధ్య చిన్న పాటి వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా పెద్దదిగా మారడంతో దేవాన్ష్ చేతికి దొరికిన ఓ పదునైన వస్తువుతో రాజును బలంగా కొట్టాడు. దీంతో రాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాసేపు అనంతరం అతడు చనిపోయినట్లు తెలుసుకున్న దేవాన్ష్ ఆ మృతదేహాన్ని మాయం చేయడానికి ప్లాన్ వేశాడు. తాను అనుకున్న ప్రకారం ఓ బహిరంగా ప్రదేశంలో ఆ మృతదేహాన్ని పాతిపెట్టాడు. అనంతరం తిరిగి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా గదినంతా శుభ్రం చేసి ఏమీ జరగనట్లు ప్రశాంతంగా పడుకున్నాడు. అయితే కొందరు స్థానికులు ఆ మృతదేహాన్ని గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు దేవాన్ష్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
రూమ్మేట్ దారుణ హత్య..ఆ తరువాత
సాక్షి,ముంబై: క్షణికావేశంలో రూమ్మేట్ను దారుణంగా హత్య చేసి, గుట్టు చప్పుడు కాకుండా పూడ్చి పెట్టిన వైనం స్నేహం అన్న పదానికే కళంకాన్నిఆపాదించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని దాభా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. నాగ్‌పూర్‌లోని దాభా ప్రాంతంలోని ఓ గ్యారేజీలో రాజు నందేశ్వర్ (35), దేవాన్ష్ వఘోడే (26) పనిచేస్తున్నారు. ఇద్దరూ స్నేహితుల్లా ఒకే దగ్గర పని.. ఒకే గదిలో నివాసం. కలిసిమెలిసి ఉంటున్న వీరి మధ్య స్వల్ప విషయంలో వివాదం మొదలైంది. ఈ ఘర్షణ మరింత ముదిరి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో నందేశ్వర్‌ను తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కానీ ఏ మాత్రం పశ్చాత్తాపం లేని అతగాడు మృతదేహాన్ని గదికి సమీపంలోని ప్రదేశంలో పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్లు రూమ్‌లో ప్రశాంతంగా నిద్ర పోయాడు. ఆ ప్రదేశాన్ని చూసి అనుమానం వచ్చిన స్థానికులు ఆదివారం ఉదయం సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో దేవాన్ష్‌ను విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. చదవండి : Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి -
విద్యార్థి గురకపెడుతున్నాడని..
బీజింగ్: పక్కవారు గురకపెడుతుంటే నిద్రపట్టడం కొంచెం కష్టమే. గురక ఆపించడానికి గురకపెట్టేవారిని కొంచెం కదిలించడం లాంటి పనులు చేస్తుంటారు. అయితే చైనాలో మాత్రం ఓ విద్యార్థి గురకపెడుతున్నాడన్న కారణంతో తోటి విద్యార్థులు చావబాదారు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో పాటు వినికిడి సమస్యను కూడా ఎదుర్కొంటున్నాడు సదరు విద్యార్థి. వివరాల్లోకి వెళ్తే.. షాంగ్జీ ప్రావిన్సులోని మిడిల్ స్కూల్లో గ్రేడ్ వన్ చదువుతున్న మా గురుయ్(15)కి నిద్రలో గురకపెట్టే అలవాటు. అతడి రూమ్మేట్స్ 12 మందికి ఇది నచ్చకపోవటంతో చాలా సార్లు గురుయ్ను గురకపెట్టొద్దని హెచ్చరించారు. అయితే ఇటీవల గురుయ్ నిద్రపోతున్న సమయంలో మళ్లీ గురకపెట్టడంతో ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు గురుయ్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తలకు తీవ్రగాయం కావటంతో ఆసుపత్రికి తరలించగా.. గురుయ్ పుర్రెలో పెద్ద పగులు రావడంతో పాటు వినికిడి సమస్యను కూడా ఎదుర్కొంటున్నాడని వైద్యులు తేల్చారు. దీనిపై గురుయ్ తండ్రి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అకారణంగా తన కుమారుడిపై దాడి చేశారని వాపోయాడు. చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు కూడా స్కూల్ యాజమాన్యం నిరాకరించిందని తెలిపాడు. స్కూల్ యాజమాన్యం, దాడికి పాల్పడిన తోటి విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.