
సాక్షి, వరంగల్: మెడికో ప్రీతి ఘటన నేపథ్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రి అనస్తీసియా హెచ్ఓడీ నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను భూపాలపల్లి మెడికల్ కాలేజీకి అనస్తీసియా ప్రొఫెసర్‌గా బదిలీ చేస్తూ తెలంగాణ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీతి ఆత్మహత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాగార్జున రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను వేధించిన సైఫ్‌పై ప్రీతి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
అయితే నాగార్జున రెడ్డి గత కొంతకాలంగా భూపాలపల్లి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లే భూపాలపల్లికి బదిలీ కావడంతో ఇది ప్రమోషనా? లేక పనిష్మెంటా అనే చర్చ జరుగుతోంది.
చదవండి: నిందితుడు హరిహరకృష్ణకు వారం రోజుల పోలీస్ కస్టడీ..