hod
-
మెడికో ప్రీతి ఘటన.. హెచ్ఓడీపై బదిలీ వేటు.. పనిష్మెంటా? ప్రమోషనా?
సాక్షి, వరంగల్: మెడికో ప్రీతి ఘటన నేపథ్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆసుపత్రి అనస్తీసియా హెచ్ఓడీ నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను భూపాలపల్లి మెడికల్ కాలేజీకి అనస్తీసియా ప్రొఫెసర్‌గా బదిలీ చేస్తూ తెలంగాణ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీతి ఆత్మహత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాగార్జున రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను వేధించిన సైఫ్‌పై ప్రీతి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే నాగార్జున రెడ్డి గత కొంతకాలంగా భూపాలపల్లి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లే భూపాలపల్లికి బదిలీ కావడంతో ఇది ప్రమోషనా? లేక పనిష్మెంటా అనే చర్చ జరుగుతోంది. చదవండి: నిందితుడు హరిహరకృష్ణకు వారం రోజుల పోలీస్ కస్టడీ.. -
ప్రత్యేక గుర్తింపు ఉంటేనే న్యాయవాదికి భవిష్యత్తు
నాగార్జున వర్సిటీ న్యాయ విభాగాధిపతి డాక్టర్ జయశ్రీ కాకినాడ లీగల్ (కాకినాడ సిటీ) : న్యాయ విద్యార్థిగా పట్టా పొందడం గొప్పకాదని, న్యాయవాదిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నవారికే భవిష్యత్తు ఉంటుందని నాగార్జున యూనివర్సిటీ న్యాయ విభాగాధిపతి డాక్టర్ జయశ్రీ అన్నారు. జేఎన్టీయూకే ఆడిటోరియంలో ఆదివారం రాష్ట్ర స్థాయి న్యాయ విద్యార్థుల సదస్సు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ–ఐలు) జిల్లా అధ్యక్షుడు మేడపాటి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి న్యాయ విద్యార్థుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ క్లాస్‌లకు హాజరుకాకుండా పరీక్షలు రాసేవారికి లా పట్టా వస్తుందే తప్ప ‘లా’ రాదన్నారు. ఇంటర్నెట్పై కంటే టెక్టŠస్బుక్ను చదివితేనే అవగాహన వస్తుందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఐలు రాష్ట్ర అధ్యక్షుడు, బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుం దన్నారు. అనంతపురం ఎస్కేడీ వర్సిటీ ప్రొఫెసర్ ఎస్వీ పుల్లారెడ్డి మాట్లాడుతూ లా విద్యకు పెట్టిన వయసు నిబంధన మంచిదేనన్నారు. బార్ కౌన్సిల్ మెంబర్ గోకుల్‌కృష్ణ మాట్లాడుతూ అన్ని రంగాలపై అవగాహన ఉంటేనే కేసును వాదించగలరన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు రాజేష్ మాట్లాడుతూ సంపద ఆశించకుంటే భవిష్యత్తు ఉంటుందన్నారు. రాజీవ్ గాంధీ లా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చిన్నస్థాయి లా కళాశాలల్లో ఎక్కువగా పేద విద్యార్థులే చేరతారని, వారిని దృష్టిలో పెట్టుకుని వెసులుబాటు కల్పించాలన్నారు. ఐలు జిల్లా అధ్యక్షుడు ధర్మారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక, కేరళ రాష్ట్రాల మాదిరిగా జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాలని కోరతామన్నారు. కాకినాడ సీనియర్ న్యాయవాది జవహర్‌ఆలీ మాట్లాడుతూ న్యాయవాదికి సేవాదృక్పథం ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు సదస్సులో పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థినిపై హెచ్‌వోడీ అత్యాచారం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. వైద్య విద్యార్థినిపై రిమ్స్ సాధారణ వైద్య విభాగం హెచ్‌వోడీ డాక్టర్ సందీప్ అత్యాచారం చేశారు. ఆ విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు వెల్లడించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
హెచ్ఓడీ తిట్టాడని... ఆత్మహత్యాయత్నం
గజ్వేల్(మెదక్): ఇంటర్నల్ పరీక్షల్లో భాగంగా రికార్డులు సమర్పించకపోవడంతో.. ఇంజనీరింగ్ కళాశాల హెచ్ఓడీ, బీటెక్ విద్యార్థిని మందలించాడు. హెచ్ఓడీ తనను అవమానించాడంటూ మనస్తాపానికి గురైన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లోని సయ్యద్ హషీమ్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం చోటుచేసుకుంది. కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌రెడ్డి(19) స్థానిక కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్ పరీక్షల్లో భాగంగా అతడు రికార్డులు సమర్పించలేదు. ఈ క్రమంలో రికార్డులు ఎందుకు రాయలేదంటూ.. హెచ్ఓడీ ప్రవీణ్‌రెడ్డిని గట్టిగా మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.