ఇంటర్నల్ పరీక్షల్లో భాగంగా రికార్డులు సమర్పించకపోవడంతో.. హెచ్‌ఓడీ అవమానించాడని మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
గజ్వేల్(మెదక్): ఇంటర్నల్ పరీక్షల్లో భాగంగా రికార్డులు సమర్పించకపోవడంతో.. ఇంజనీరింగ్ కళాశాల హెచ్‌ఓడీ, బీటెక్ విద్యార్థిని మందలించాడు. హెచ్‌ఓడీ తనను అవమానించాడంటూ మనస్తాపానికి గురైన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లోని సయ్యద్ హషీమ్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం చోటుచేసుకుంది.
కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌రెడ్డి(19) స్థానిక కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్ పరీక్షల్లో భాగంగా అతడు రికార్డులు సమర్పించలేదు. ఈ క్రమంలో రికార్డులు ఎందుకు రాయలేదంటూ.. హెచ్‌ఓడీ ప్రవీణ్‌రెడ్డిని గట్టిగా మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.