Warangal KMC Medico Preethi Sister Pooja Get HMDA Job, Details Inside - Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ చొరవ.. మెడికో ప్రీతి సోదరికి హెచ్‌ఎండీఏలో ఉద్యోగం

Published Sat, May 20 2023 6:45 PM | Last Updated on Sat, May 20 2023 6:59 PM

Medico Preethi Sister Pooja Get HMDA Job - Sakshi

ప్రీతి సోదరి పూజ(కుడివైపు)

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ వేధింపులు భరించలేక పాయిజన్‌ ఇంజెక్షన్‌తో ఆత్మహత్య చేసుకున్న కేఎంసీ మెడికో ప్రీతి ఉదంతం అందరికీ తెలిసిందే. అయితే ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రీతి సోదరికి ఇప్పుడు ఉద్యోగం ఇప్పించింది తెలంగాణ ప్రభుత్వం.  

డాక్టర్‌ ధరావత్ ప్రీతి నాయక్ సోదరి పూజకు hmda(హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ)లో సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూజకు ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్‌ బేసిస్‌లో ఈ ఉద్యోగం ఇచ్చినట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది హెచ్‌ఎండీఏ. ఈ సందర్భంగా.. ప్రభుత్వం తరపున ఇచ్చిన మాట నిలుపుకున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. 

ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని నాడు చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పరిహారంతో పాటు పార్టీ తరపున సేకరించిన విరాళాలను కలిపి ప్రీతి కుటుంబానికి అందించాం. అదే సమయంలో తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించమని వాళ్లు కోరారు. ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాం.  సానుకూలంగా స్పందించిన ఆయన.. ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తన పరిధిలోని హెచ్‌ఎండీఏలో ప్రీతి సోదరికి ఉద్యోగం ఇప్పించారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement