
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం ఆదివారం బయటపడింది. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మత ఆధ్వర్యంలో చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పిల్లలను పోషించలేని తల్లిదండ్రులకు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి.. పుట్టిన వెంటనే ఇతరులకు విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఇద్దరు ఆశావర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్ తిరుమల ఈ ముఠాకు సహకరిస్తున్నారని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మీడియాకు తెలిపారు.
(చదవండి: లభించని సింధూజ రెడ్డి ఆచూకీ)
‘పిల్లల అక్రమ రవాణా కేసులో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండి నర్మత సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశాం. విశాఖలోని జడ్పీ జంక్షన్ వద్ద గల యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ముఠా ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసినట్టు వెల్లడైంది. కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’అని సీపీ పేర్కొన్నారు. గతంలోనూ సృష్టి హాస్పిటల్‌లో మోసాలు జరగడంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్‌గా పేరు మార్చి చిన్నారుల అక్రమ రవాణాకు తెరతీశారు.
(పరువు కోసం కూతుర్ని హతమార్చిన తండ్రి)
Comments
Please login to add a commentAdd a comment