child trafficking
-
విశాఖలో మైనర్ పిల్లల అక్రమ రవాణా.. రక్షించిన పోలీసులు
-
విశాఖలో శిశు విక్రయాల కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు
-
సంచలనం రేపుతున్న చిన్నపిల్లల అమ్మకాలు
-
చిన్నారుల అక్రమ రవాణాలో యూపీ టాప్
న్యూఢిల్లీ: దేశంలో చిన్నారుల అక్రమ రవాణాలో ఉత్తరప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. కోవిడ్ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో 68 శాతం పెరుగుదల నమోదైంది. 2016–22 సంవత్సరాల మధ్య గణాంకాల ఆధారంగా ప్రభుత్వేతర సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. జిల్లా వారీగా చూస్తే.. దేశంలోనే అత్యధికంగా జైపూర్ సిటీలో అత్యధికంగా చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు నమోదవుతున్నాయి. టాప్ నాలుగు జిల్లాల్లో దేశ రాజధాని ఢిల్లీ ఉండటం గమనార్హం. 2016–22 మధ్య 18 ఏళ్లలోపు 13,549 మంది చిన్నారులను అక్రమ రవాణా నుంచి రక్షించగలిగారు. వీరిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 2 శాతం మంది ఉండటం ఆందోళన కలిగించే అంశమని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. చిన్నారులను అత్యధికంగా పరిశ్రమల్లోనే వినియోగిస్తున్నట్లు తేలింది. హోటల్, ధాబాల్లో ఉండే సిబ్బందిలో 15.6% మంది, రవాణారంగంలో 13% మంది, వస్త్ర రంగంలో 11.18% మంది చిన్నారులు పనిచేస్తున్నారు. కాస్మెటిక్స్ పరిశ్రమల్లో 5, 8 ఏళ్ల బాలల్ని వాడుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. కోవిడ్ అనంతరం చిన్నారులను పనిలో పెట్టుకోవడం అనేక రెట్లు పెరిగింది. కర్ణాటకలో చైల్డ్ ట్రాíఫికింగ్ 18 రెట్లు ఎక్కువైనట్లు వెల్లడించింది. -
బాలల అక్రమ రవాణా చాలా తీవ్రమైన విషయం
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా.. ముఖ్యంగా చిన్న పిల్లల అక్రమ రవాణా చాలా తీవ్రమైన వ్యవహారమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ విషయంలో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాంను కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా నియమిస్తున్నట్లు తెలిపింది. మానవ అక్రమ రవాణా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, మార్గదర్శకాలను తెలియజేయాలని శ్రీరఘురాంను కోరింది. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు చిన్నారుల అక్రమ రవాణాపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టులో సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇద్దరు చిన్నారులను విక్రయించిన ఘటనలో క్రిమినల్ చర్యల గురించి ధర్మాసనం ఆరా తీసింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ, ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, 11 మందిని నిందితులుగా చేర్చారని తెలిపారు. వారంతా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని, బెయిల్ ఇచ్చేందుకు కింది కోర్టు నిరాకరించిందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ అక్రమ రవాణాను ఆపేందుకు ఏం చేయాలని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కోర్టుకు సహకరించాలని సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాంను ధర్మాసనం కోరింది. మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా చిన్నారుల అక్రమ రవాణా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తెలిపింది. ఈ వ్యాజ్యాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను శ్రీరఘురాంకు అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 2021లో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ప్రస్తుత సుమోటో వ్యాజ్యాలను వాటితో కలిపి విచారించాలని సుమన్ కోరారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందిస్తూ తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. గతంలో దాఖలైన వ్యాజ్యాలతో ఈ వ్యాజ్యాలను కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
శిశు విక్రయాలపై హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: శిశు విక్రయాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా మలిచిన హైకోర్టు బుధవారం వాటిపై విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), రాష్ట్ర డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే శిశువు ఆరుసార్లు విక్రయం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మెడబలిమి మనోజ్ తన మూడు నెలల ఆడ శిశువును నల్గొండ జిల్లా కొండప్రోలు గ్రామానికి చెందిన మేఘావత్ గాయత్రికి రూ.70 వేలకు విక్రయించాడు. తరువాత ఆ శిశువును పలువురు కొనుగోలు చేశారు. చివరకు ఏలూరుకు చెందిన వర్రే రమేశ్ రూ.2.50 లక్షలకు కొనగా.. ఆ దశలో శిశువు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను చదివిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఈ కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీంతో రిజిస్ట్రీ ఆ కథనాన్ని పిల్‌గా మలిచింది. స్పందించిన జువెనైల్ జస్టిస్ కమిటీ ఇదే రీతిలో ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన జి.చిలకమ్మ అనే మహిళకు పుట్టిన శిశువును తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో విక్రయించారు. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వడ్డిబోయన సుజాతలతో కూడిన జువెనైల్ జస్టిస్ కమిటీ స్పందించింది. ఈ కథనాన్ని సుమోటో పిల్‌గా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ రెండు సుమోటో వ్యాజ్యాలు బుధవారం సీజే ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. -
శిశు శోకం: ఏమైందో తెలియదు.. వీళ్లెవరో నన్నెత్తుకొచ్చారు..
‘ఆకలైనప్పుడల్లా పాలు తాగాను. నువ్విచ్చే ముద్దులతో మురిసిపోయాను. నీ ఒడిలో ఆడుకున్నాను. నీ వెచ్చని స్పర్శతో హాయిగా నిద్రపోయాను. ఏమైందో తెలియదు గానీ.. వీళ్లెవరో నన్నెత్తుకొచ్చారు. అంగట్లో బొమ్మలా.. నన్ను వేరొకరికి అమ్మారు. నాకేదో ప్రాణాంతక వ్యాధి ఉందని డాక్టర్లు చెప్పడంతో.. తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు నాకే తెలియని లోకమైన శిశుగృహలో ఉన్నాను. నీ ఒడి చేరాలనుంది. నీ చనుబాలు తాగాలనుంది.’ అని ఆ శిశువుల ఆక్రందనలు వింటే అర్థమవుతోంది. తల్లికి దూరమైన ఇద్దరు శిశువులు గుక్క పట్టి ఏడుస్తున్నారు. – సాక్షి, వరంగల్ ఓరుగల్లు కేంద్రంగా అంతర్రాష్ట అక్రమ రవాణా ముఠా సభ్యులు శిశువులను విక్రయిస్తున్నారని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. శిశువులను సంరక్షించారు. నెలల వయసు లేని ఆ పసిబిడ్డలు ఆక్రందనలు చేస్తున్నా.. తల్లుల ఆచూకీ ఇంకా దొరక్కపోవడం విచారకరం. గత నెల 14న శిశువుల విక్రయ ముఠాను పట్టుకున్నా.. ఇప్పటివరకు ఆ శిశువుల తల్లులెవరో తెలుసుకునే దిశగా ఇంతేజార్గంజ్ పోలీసులు అడుగు ముందుకేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో వరంగల్ వాసులు రుద్రారపు స్వరూప, ఓదెల అనిత, విజయవాడ వాసి శారదతోపాటు గుజరాత్, మహారాష్ట్రకు చెందిన అనురాధ అక్షయ్ కోరి, సల్మా యూనిస్ షేక్ అలియాస్ హారతి, పాట్నీ శైలబేన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించి ఆ శిశువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసుకొని వారి వద్దకు చేర్చాల్సి ఉంది. కానీ పోలీసులు ఆ కేసును పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ శిశువులను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చామని పట్టుబడిన నిందితులు చెప్పినప్పటికీ పోలీసులు ఆ దిశగా విచారణ చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని ప లువురు విమర్శిస్తున్నారు. తీగ లాగితే.. డొంక కదులుద్ది! వరంగల్ కేంద్రంగా అంతర్రాష్ట అక్రమ రవాణా ముఠా కదలికలున్నాయని పోలీసులకు ఈ అరెస్టుతో తెలిసినా.. వాటి మూలాలను వెలికితీసే దిశగా చొరవ చూపడం లేదు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తే ఇక్కడి లోకల్ ఏజెంట్ల గుట్టు రట్టవుతుంది. ఆశ వర్కర్ స్వరూప, స్వయం సహాయక మహిళా సంఘం లీడర్ అనితతోపాటు ఇతర రాష్ట్ర నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే.. ముఠాకు సంబంధించిన వివరాలు దొరికే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరిస్తే ముఠా మూలాలు, శిశువుల తల్లులు దొరికే అవకాశం ఉందని పలువురు పేర్కొటున్నారు. -
చైల్డ్ ట్రాఫికింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు
-
నిజామాబాద్ జిల్లాలో శిశు విక్రయం
-
పిల్లల అక్రమ రవాణా.. ఆస్పత్రి ఎండీ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం ఆదివారం బయటపడింది. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మత ఆధ్వర్యంలో చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పిల్లలను పోషించలేని తల్లిదండ్రులకు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి.. పుట్టిన వెంటనే ఇతరులకు విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఇద్దరు ఆశావర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్ తిరుమల ఈ ముఠాకు సహకరిస్తున్నారని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మీడియాకు తెలిపారు. (చదవండి: లభించని సింధూజ రెడ్డి ఆచూకీ) ‘పిల్లల అక్రమ రవాణా కేసులో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండి నర్మత సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశాం. విశాఖలోని జడ్పీ జంక్షన్ వద్ద గల యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ముఠా ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసినట్టు వెల్లడైంది. కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’అని సీపీ పేర్కొన్నారు. గతంలోనూ సృష్టి హాస్పిటల్లో మోసాలు జరగడంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్‌గా పేరు మార్చి చిన్నారుల అక్రమ రవాణాకు తెరతీశారు. (పరువు కోసం కూతుర్ని హతమార్చిన తండ్రి) -
150 మంది చిన్నారులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్ : చిన్నపిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గ్యాంగ్ సభ్యులను రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బీహార్ నుంచి తెలంగాణకు చిన్న పిల్లలను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ముఠాలో మొత్తం పదకొండు మంది ఉండగా ప్రస్తుతం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 54 మంది చిన్నారులకు విముక్తి కలిగించారు. 15 రోజుల వ్యవధిలో మొత్తం 150 మంది చిన్నారులకు విముక్తి కలిగించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. - -
ప్రభుత్వాస్పత్రులే అడ్డాగా.. పిల్లల అక్రమ రవాణా!
రాజమహేంద్రవరం క్రైం: తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వాస్పత్రులే అడ్డాగా పిల్లల అక్రమ రవాణా సాగుతోందా అంటే.. జరుగుతున్న పరిణామాలు అవుననేలాగానే ఉన్నాయి. ఓ బాలుడి అదృశ్యం వ్యవహారంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి గుత్తుల వెంకటసుబ్బారావు(సుభాష్)ను హైదరాబాద్ చాంద్రాయణగుట్ట (తెలంగాణ) పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనూ కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్ ఘటన తెలిసిందే. ఆడుకుంటూనే అదృశ్యం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖుబా కాలనీలో నివసిస్తున్న షేక్ ఫజల్‌కు ఇద్దరు కుమారులు. రెండున్నరేళ్ల చిన్న కుమారుడు షేక్ సోఫియన్ మార్చి 25న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులు తొలుత రాజమహేంద్రవరం, అక్కడి నుంచి విశాఖపట్నం తిరిగి ఏలూరు ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ సుభాష్‌ను నిందితుల్లో ఒకడిగా గుర్తించారు. ఈ నెల 17న అతడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్ తరలించారు. బాలుడిని అమలాపురంలో రూ.3 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించినట్లు సమాచారం. దీనిపై ఇక్కడి పోలీసులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రి అడ్డాగా పిల్లల అక్రమ రవాణా సాగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో సుభాష్‌కు మరింతమంది ఆస్పత్రి సిబ్బంది సహకరించినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుభాష్ పనిచేస్తున్న ల్యాబ్‌లోని కొంతమందిని కూడా పోలీసులు విచారించారు. మరింతమందిని విచారిస్తే పిల్లల అక్రమ రవాణా ముఠాలో ఎంతమంది ఉన్నారో బయటపడే అవకాశాలున్నాయి. గతంలో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పసికందును కిడ్నాప్ చేసిన ఘటన తర్వాత.. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి అడ్డాగా పిల్లల అక్రమ రవాణా సాగుతున్నట్లు వెల్లడి కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానిక వైద్య సిబ్బంది హస్తం ఉండొచ్చు.. పిల్లల అక్రమ రవాణా వెనుక సుభాష్ ఒక్కడే కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంది. మొదటి నుంచీ సుభాష్ వివాదాస్పద వ్యక్తి. ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తూనే గతంలో బయట బ్లడ్ బ్యాంక్ పెట్టి ఇక్కడి రోగులకు రక్త పరీక్షలు బయటే చేసి డబ్బులు తీసుకునేవాడు. దీనిపై ఫిర్యాదు కూడా చేశాం. విచారణ జరిపిన అధికారి అతడికి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. దీంతో సుభాష్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రస్తుత ఘటనపై కూడా విచారణ సాగుతోంది. – డాక్టర్ టి.రమేష్ కిషోర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, తూర్పు గోదావరి జిల్లా -
అక్రమ రవాణాలో బాలికలే టార్గెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకవైపు చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు బలంవంతపు వ్యభిచారం రొంపిలో మైనర్లను దించి వ్యాపారం చేసే ధోరణి పెచ్చుమీరుతోంది. మానవ అక్రమ రవాణా ముఠాలు ప్రధానంగా మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్నాయి. చిన్నపిల్లలైతే ప్రతిఘటించలేరనే ధీమాతో వారిని భయపెట్టి ఏ పని అయినా చేయించవచ్చనే ఉద్దేశంతో అక్రమ రవాణా ముఠాలు దారుణాలకు ఒడిగడుతున్నాయి. వ్యభిచార గృహాలు, పరిశ్రమలు, ఇళ్లల్లో, దుకాణాల్లో, ఇటుక బట్టీలు, హోటళ్లలో పని చేసేందుకు చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నారు. ఇటీవల చిన్నారులతో వ్యభిచారానికి గిరాకీ పెరిగిందని పలు సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. గడిచిన మూడేళ్లలో నమోదైన కేసులు, చిన్నారుల విముక్తిని పరిశీలిస్తే రాష్ట్రంలో మైనర్ల అపహరణ కేసులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 2015లో 40 కేసుల్లో 40 మందికి, 2016లో 49 కేసుల్లో 67 మందికి, 2017లో 77 కేసుల్లో 84 మందికి విముక్తి లభించింది. ఏదో మొక్కుబడిగా అన్నట్టుగా గుంటూరులో 2017లో ఒక కేసు, రాజమహేంద్రవరంలో 2016లో ఒకటి, 2017లో నాలుగు కేసులు నమోదు చేశారు. విజయవాడలో 2016లో ఒకటి, 2017లో 2 కేసులు నమోదు చేశారు. విశాఖపట్నం 2015లో 2, 2017లో ఒకటి, శ్రీకాకుళంలో 2015 ఒకటి కేసు మాత్రమే నమోదు చేశారు. తూర్పు గోదావరిలో 2017లో మూడు కేసులు, పశ్చిమ గోదావరిలో ఒకటి, ప్రకాశం జిల్లాలో ఒక కేసు మాత్రమే నమోదు చేశారు. చాలా జిల్లాల్లో కనీసం మైనర్ బాలల అక్రమ రవాణాపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మైనర్ బాలల అక్రమ రవాణాపై, బాలల వెట్టి చాకిరిపై దృష్టి పెట్టాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. -
మదర్ థెరిసా మిషనరీలో దారుణం
రాంచీ : ‘సేవే పరమావధిగా భావించి అనాధలను అక్కున చేర్చుకొని, వారికో జీవితాన్ని ఇచ్చి ఎందరికో తల్లిగా మారారు ‘ మదర్ థెరిసా’. అనాథలను, అభాగ్యులను ఆదుకోవడానికి ఆ మాతృమూర్తి స్థాపించినదే ‘మదర్ థెరిసా మిషనరి చారిటి’. ప్రజలకు సేవ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ చారిటిలకు ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటు చేసే ఈ చారిటిలకు కూడా డబ్బు జబ్బు పట్టుకుంది. ప్రజలకు తమ పై ఉన్న నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే చారిటిలో చేరిన అనాథలను డబ్బు కోసం విక్రయిస్తున్నారు. ఎటువంటి దత్తత పత్రాలు లేకుండానే ఈ తంతు కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా చారిటిలో అనాథ పిల్లలు ఒక్కొక్కరు మిస్ అవుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ చారిటి సభ్యులు పోలీస్ విచారణకు అంగీకరించకపోవడం వల్ల అధికారులు కూడా ఏమి చేయ్యలేక పోయారు. తాజాగా ఓ కుటుంబం ఇచ్చిన పిర్యాదు మేరకు అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల.. ప్రకారం మదర్ థెరిసా చారిటి, నిర్మల్ హృదయ్ రాంచీ శాఖలో 13 మంది బాలికలు, 22 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓ కుటుంబం బిడ్డను పెంచలేని స్థితిలో ఉండటం చేత తమ బిడ్డ బాగోగులను చూడమని నిర్మల్ హృదయ్ మిషనరి సంస్థలో అప్పగించి వెళ్లారు. కానీ తర్వాత మనసు మార్చుకుని బిడ్డను పెంచుకోవాలనుకున్నారు. దాంతో చారిటికి వెళ్లి తమ బిడ్డను తిరిగి ఇవ్వమని కోరారు. కానీ చారిటి సభ్యులైన సిస్టర్ కోన్సాలియా, సేవకురాలు అనిమా ఇంద్వార్ బిడ్డ తమ దగ్గర లేదని చెప్పారు. దాంతో సదరు కుటుంబం తమకు న్యాయం చేయమంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే నిర్మల్ హృదయ్ చారిటి సంస్థ మీద ఇలాంటి పిర్యాదు రావడం ఇదే ప్రథమం కాదు. గతంలోనూ నలుగురు చిన్నారులు తప్పిపోయారనే పిర్యాదులు వచ్చాయి. కానీ చారిటిల మీద నమ్మకంతో అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాక చారిటి సభ్యలు ‘పోలీసులను లోపలికి వచ్చి దర్యాప్తు చేయనిచ్చే’వారు కాదన్నారు డీపీ సింగ్. అంతేకాక గతంలో ఒక కేసు విచారణ నిమిత్తం చారిటి లోపలికి వెళ్లి దర్యాప్తు నిర్వహించినప్పటికి, తప్పు జరిగినట్టు అనిపించే అనుమానస్పద అంశాలేవి తమ దృష్టికి రాలేదన్నారు. కానీ ఈ సారి మాత్రం బిడ్డను కోల్పోయిన కుటుంబం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టదలుచుకోలేదు. అందుకే వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటిని కలిసారు. ఈ విషయం గురించి మాలిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటి అధ్యక్షుడు ‘ఆ కుటుంబం ఇచ్చిన పిర్యాదు మేరకు నిర్మల్ హృదయ్ చారిటి మీద అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా సిస్టర్ కొన్సాలియా, సేవకురాలు అనిమా ఇంద్వార్ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చారిటి వారు బాధిత కుటుంబం బిడ్డను 1.2 లక్షల రూపాయలకు వేరేవారికి అమ్మినట్లు ఒప్పుకున్నార’న్నారు. పోలీసులు వీరి మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. క్రైస్తవ మిషనరిల్లో కూడా పిల్లలను అమ్మేస్తున్నారనే వార్తలు రావడంతో షాక్ తిన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర దాస్ వెంటనే మిగతా చారిటీలు, సేవా సంస్థల్లో కూడా తనిఖీలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయం గురించి కోల్‌కతాలో ఉన్న ‘ మదర్ హౌస్ చారిటి’ ముఖ్య కేంద్రం అధికార ప్రతినిధి సునిత కుమార్ మేము ‘ఈ విషయాన్ని ఇంకా నమ్మలేక పోతున్నాము. మా సంస్థలోని సభ్యులు ఇలాంటి పనులు ఎన్నటికి చేయరు. విచారణలో వారి మీద నేరం రుజువయితే అప్పుడు మేము తగిన చర్యలు తీసుకుంటామ’న్నారు. -
డేగలు తిరుగుతున్నాయి లేగలు తప్పిపోతున్నాయి
భారతదేశంలో మహిళలు, చిన్నపిల్లల అక్రమ రవాణా సమస్య తీవ్ర రూపం దాల్చడం పట్ల ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్త్రీలను, బాలికలను మాయమాటలు చెప్పి, మోసం చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాలు కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. బాధితులు ప్రాథమిక గుర్తింపు, జాతీయత అనేవి కూడా తుడిచిపెట్టుకు పోయేలా చేస్తూ, చివరకు భారత పౌరులుగా కూడా వారి గుర్తింపు, మనుగడే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారు! ఉపాధి పేరుతో నరకంలోకి! ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. విదేశాల్లో మంచి జీతమొచ్చే ఉద్యోగం ఉందంటూ స్థానిక ఏజెంట్లు నమ్మించి మహిళలు, అమ్మాయిలను ఇతర దేశాలకు తీసుకెళుతున్నారు. చైనా, థాయ్‌లాండ్, సింగపూర్, మయన్మార్ తదితర దేశాల్లో ఇళ్లల్లో పనిమనిషిగా లేదా చిన్న పిల్లల సంరక్షణ వంటి పనులు చేసే వారికి డిమాండ్ ఉందని, ఆహారంతో పాటు వసతి కల్పిస్తామనీ చెబుతూ, మంచి జీతాన్ని ఎరగా చూపుతున్నారు. స్థానికంగా అంతగా ఉపాధి అవకాశాలు లేని కారణంగా ఈ మోసపు మాటల పట్ల అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. ముందుగా ఈ ప్రాంతాల నుంచి వారిని మయన్మార్‌కు తీసుకెళుతున్నారు. మిజోరం బాలికలనైతే సరిహద్దులోని మయన్మార్ గ్రామానికి, మణిపూర్‌కు చెందిన వారిని మరో పట్టణానికి తరలిస్తున్నారు. వీరిని అతి సులభంగా ద్విచక్రవాహనాలపై సరిహద్దు దాటించేస్తున్నారు. మూడంచెల మాయా వ్యూహం భారత్, మయన్మార్, గమ్యస్థాన దేశం ఇలా మూడు అంచెల్లో ఈ ఏజెంట్ల నెట్వర్క్ వ్యవస్థ పనిచేస్తోంది. వారు అక్కడకు చేరుకోగానే ఆధార్‌కార్డు, మొబైల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లను ఏజెంట్లు తీసేసుకుంటున్నారు. యాంగాన్, తదితర చోట్లకు చేరాక ఈ అమ్మాయిలను వారి రూపురేఖల ఆధారంగా విభజిస్తున్నారు. అందంగా ఉన్న వారిని బ్యూటీపార్లర్లలో, ఇతరులను ఇళ్ల పనుల్లో శిక్షణ నిచ్చి అక్కడి నుంచి మరో దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. సింగపూర్, థాయ్‌లాండ్‌లకు వెళ్లేందుకు వీలుగా బర్మా భాషలో వారికి శిక్షణనిచ్చి వారికి మారుపేర్లతో మయన్మార్ పాస్‌పోర్టులు సిద్ధంచేస్తున్నారు. మరో దేశానికి చేరిన వెంటనే ఏజెంట్లు వారి పాస్‌పోర్టులు సైతం లాగేసుకుంటున్నారు. కనిపెట్టడం కష్టమౌతోంది! బాధితులు ఎక్కడున్నారు, ఏమి చేస్తున్నారనే విషయాన్ని కనుక్కోవడం కూడా వారి కుటుంబసభ్యులకు అసాధ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ విధంగా తీసుకెళుతున్న మహిళలు లేదా బాలికల్లో అధికశాతం మందిని ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. బాధితులు తమ గుర్తింపును కోల్పోయి, కొత్త పేర్లతో చెలామణీ అవుతుండడంతో అధికారులు వారిని కనిపెట్టడం అసాధ్యం అవుతోంది. ఈ విధంగా మిజోరం నుంచి సింగపూర్‌కు వెళ్లిన 17 ఏళ్ల మెర్సీ ఆత్మహత్యకు పాల్పడితే, ఆమె భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకురాలేక పోయారు! ఆమె తల్లితండ్రులు కూడా పేదవారు కావడంతో అక్కడకు వెళ్లేందుకు డబ్బులతో పాటు పాస్‌పోర్టు లేక కనీసం చివరిచూపు కూడా దక్కించుకోలేకపోయారు. మెర్సీ మయన్మార్ పాస్‌పోర్టుపై అక్కడకు వెళ్లినట్టు అప్పుడే బయటపడింది.మహిళలు, బాలికల అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం చేయాల్సింది చేస్తూనే ఉన్నా.. పరదేశీ ‘ఎర’లకు చిక్కుకోకుండా, తమను, తమ పిల్లల్ని ఎవరికివారు జాగ్రత్తగా కాపాడుకోవలసిన పాడు కాలం వచ్చేసింది. – కె.రాహుల్, సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అంగట్లో ఆడబిడ్డ..!
తల్లి ఒడిలో ఓలలాడాల్సిన చంటి‘పాప’.. అంగట్లో సరుకుగా మారుతోంది. ఆడ పిల్లగా ఈ దాత్రిపైకి రావడమే పాపమన్నట్లు ఈ సమాజం చిన్నచూపు చూస్తోంది. కుటుంబం గడవని స్థితిలో తల్లిదండ్రులు సైతం కన్నపేగును అంగట్లో బేరానికి పెడుతూ తమ బంధాన్ని తెంచుకుంటున్నారు. జిల్లాలో పెరిగిపోతున్న ఆడ శిశువుల విక్రయాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, వరంగల్ రూరల్: ఆడ పిల్ల ఇంటికి దీపం. ఓపిక.. సహనం.. సాహసానికి ప్రతిరూపం. ఎక్కడ చూసినా ఆడవాళ్లదే పైచేయి. రంగం ఏదైనా పురుషులతో సమానంగా పోటీ పడుతున్న నేటి సమాజంలో అక్కడక్కడా ఆడ పిల్లలను అంగడిలో సరుకును చేస్తున్న ఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా కన్నవారే ఆడబిడ్డలను దూరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా లంబాడా తండాలు ఆడ పిల్లల విక్రయాలకు అడ్డాలుగా మారుతున్నాయి. నాలుగు నెలల్లో.. నాలుగు ఘటనలు జిల్లాలో నాలుగు నెలల్లో నలుగురు ఆడ శిశువుల విక్రయాలు జరిగాయి. శిశు సంక్షేమ శాఖ తనిఖీల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లోని ఓ కుటుంబానికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మళ్లీ ఆడ పిల్ల పుట్టడంతో మధ్యవర్తి ద్వారా 2017 సెప్టెంబర్ 25న విక్రయించారు. విషయం ఆ నోట ఈ నోట బయటపడడంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు వెళ్లి పరిశీలించగా నిజమని తేలింది. రాయపర్తి మండలం పెరికవేడు గ్రామానికి చెందిన వారికి ఆడ పిల్ల పుట్టడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన వారికి 2017 అక్టోబర్ 20న విక్రయించారు. చెన్నారావుపేట మండలంలో ఖాదర్‌పేట గ్రామ శివారు గొల్లబామ తండాకు చెందిన ఓ దంపతులు ఆడ శివువును మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లికి చెందిన దంపతులకు 2017 నవంబర్ 28న అమ్మారు. వర్ధన్నపేట మండలం డీసీ తండాకు చెందిన దంపతులకు మూడో సంతానంగా ఆడ శిశువు జన్మించింది. దీంతో 2018 ఫిబ్రవరి 14న మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన వారికి విక్రయించారు. కన్నవారే కాదనుకుంటున్నారు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంరక్షణ కోసం అ నేక పథకాలు అమలు చేస్తున్నా.. బాలికలపై వివక్ష కొ నసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నా.. శిశువు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి తండాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక కుటుంబానికి ఇద్దరు ఆడ పిల్లలుండగా మగ బిడ్డ కోసం వేచి చూస్తున్నారు. మళ్లీ ఆడ పిల్లే పుట్టడటంతో వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. డెలివరీకి వెళ్లిన ఆస్పత్రులో ఉండగానే కు టుంబ సభ్యులు బేరం పెడుతున్నారు. ఇందుకు ఆస్పత్రుల్లోని కొంతమంది సిబ్బంది మధ్యవర్తులుగా వ్యవహరించి విక్రయాలకు సహకరిస్తున్నారు. వివాహం అయి ఏళ్ల తరబడి పిల్లలు కాని వారి గురించి ఆరా తీసిపెట్టుకుంటుని ఎవరైనా ఆడపిల్లను ఇస్తామని చెప్పగా నే పిల్లలు లేని వారికి సమాచారం చేరవేస్తున్నారు. అక్రమంగా దత్తత తీసుకోవద్దు ఆక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారమే తీసుకోవాలి. ఆడపిల్లలను అక్రమంగా విక్రయించిన, కొనుగోలు చేసినా, బ్రూణ హత్యలు చేసినా, బాల్య వివాహాలు చేసిన శిక్షార్హులే. చట్టరీత్యా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. – మహేందర్‌రెడ్డి, డీసీపీఓ -
ఇక వారికి పెరోల్ ఇవ్వరట
ముంబయి: హత్యలు చేసినవారికి, అత్యాచారాలకు పాల్పడినవారికి పెరోల్ ఇవ్వకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు బాలకాలికల అక్రమ రవాణాలకు పాల్పడే వారికి కూడా ఈ పెరోల్ సౌకర్యం ఉండదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర హోమంత్రిత్వశాఖ గతవారం పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు తమను పెరోల్‌పై విడుదల చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. వాటిపై నిర్ణయం తీసుకోకుండా నిలిపి ఉంచింది. లైంగిక దాడి కేసుల్లో, హత్య కేసుల్లో నిందితులకు పెరోల్ ఇవ్వకూడదనే నిర్ణయంపై అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే ప్రస్తుతం వచ్చిన పెరోల్ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోనుంది. కుప్పలుకుప్పలుగా పెరోల్ అప్లికేషన్లు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
ఏడాదికి 40వేలమంది బాలికల అక్రమ రవాణా
న్యూఢిల్లీ: భారతదేశంలో బాలికల అక్రమ రవాణాపట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2014 లో వెల్లడైన ఓ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ఏడాదికి 40 వేలమంది బాలికల అక్రమ రవాణా జరుగుతోంది. వీరిలో 11వేలమంది జాడ కనిపించకుండా పోతున్నారు. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక బాలిక కనిపించకుండా పోతుందని తమ వద్ద నివేదికలు ఉన్నాయని, ఈ సమస్యను పట్టించుకోకుంటే తీవ్రంగా మారుతుందని హక్కుల కమిషన్ హెచ్చిరించింది. ఇలా అక్రమ రవాణా చేసిన వారిని భిక్షాటనకు, వేశ్యా గృహాలకు తరలిస్తున్నారని, క్లబ్బుల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగేళ్ల బాలికల నుంచి ఆ పైడిన వారి వరకు ఎవరినీ వదలకుండా అక్రమ రవాణా చేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఈ సమస్యను పట్టించుకోవాలని సూచించింది. -
మైనర్ల అక్రమ రవాణా గుట్టురట్టు
-
మైనర్ల అక్రమ రవాణా గుట్టురట్టు
విశాఖ : పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో పెద్ద సంఖ్యలో పిల్లలను తరలిస్తుండగా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సుమారు 50 మంది పిల్లలను కోల్‌కతా నుంచి హుబ్లీకి తీసుకెళ్తుండగా విశాఖలో ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు. కాగా పిల్లలను తరలిస్తున్న వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లల అక్రమ రవాణా వెనుక గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిన్నారుల అక్రమ రవాణాపై కేంద్రం నిర్లక్ష్యం: సుప్రీం
న్యూఢిల్లీ: చిన్నారుల అక్రమ రవాణా, వ్యభిచారాలను నిరోధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం సాధించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టు గురువారం ఆక్షేపించింది. ఆ దారుణాలను అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వాలు చేపట్టిన చర్యల వివరాలు తెలుసుకోవాలంటూ తామిచ్చిన ఆదేశాల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసేందుకే కేంద్రానికి నెల రోజులకు పైగా సమయం పట్టిందని విమర్శించింది. గత సంవత్సరం అక్టోబర్ 30న తాము ఆదేశాలిస్తే డిసెంబర్ 12న.. నెల రోజుల తరువాత రాష్ట్రాలకు ఆ సమాచారాన్ని పంపించారని జస్టిస్ అనిల్ ఆర్ దవే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిగిన సమాచారం ఇవ్వని రాష్ట్రాలపై తీసుకున్న చర్యలనూ కేంద్రం కోర్టుకు తెలియపర్చలేదని పేర్కొంది. వ్యభిచారం పేరుతో లైంగిక దోపిడికి గురైన బాధితుల కోసం ‘విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రొటోకాల్’ను ఏర్పాటు చేయాలన్న స్వచ్ఛంద సంస్థ ‘ప్రజ్వల’ చేసిన సూచనలపై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. -
ఆ రాత్రి ఏం జరిగింది?
ఒక రాత్రిలో ఇద్దరమ్మాయిల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనే అంశంతో చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో రూపొందిన ఓ తమిళ చిత్రం ‘ఒక రాత్రిలో ఇద్దరమ్మాయిలు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. బాలాజి.కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్తాఫ్ విడుదల చేస్తున్నారు. పూజా రామచంద్రన్, మాళవిక, వినోద్, కృష్ణ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అల్తాఫ్ మాట్లాడుతూ -‘‘ఓ సాయంత్రం ప్రారంభమై, మర్నాడు తెల్లవారుజాము ముగిసే కథతో ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే రిలీజ్’’ అని చెప్పారు. -
వ్యభిచార గృహాల్లో ఉన్నవాళ్లు బాధితులే: సుప్రీం
వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న యువతులను పోలీసులు అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బలవంతంగా వ్యభిచార రొంపిలోకి వెళ్లిన బాలికలు, యువతులను అరెస్టు చేయడం తగదని వ్యాఖ్యానించింది. వాళ్లను బాధితులుగానే చూడాలి తప్ప నేరస్థులుగా చూడకూడదని అన్నారు. బాలికలు, యువతులను ఇలా బలవంతంగా కొంతమంది రొంపిలోకి దించుతున్నారని, ఇలాంటి అక్రమ తరలింపులను అడ్డుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెంటనే తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.