
వ్యభిచార గృహాల్లో ఉన్నవాళ్లు బాధితులే: సుప్రీం
వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న యువతులను పోలీసులు అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బలవంతంగా వ్యభిచార రొంపిలోకి వెళ్లిన బాలికలు, యువతులను అరెస్టు చేయడం తగదని వ్యాఖ్యానించింది. వాళ్లను బాధితులుగానే చూడాలి తప్ప నేరస్థులుగా చూడకూడదని అన్నారు.
బాలికలు, యువతులను ఇలా బలవంతంగా కొంతమంది రొంపిలోకి దించుతున్నారని, ఇలాంటి అక్రమ తరలింపులను అడ్డుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెంటనే తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.