
ఆ రాత్రి ఏం జరిగింది?
ఒక రాత్రిలో ఇద్దరమ్మాయిల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనే అంశంతో చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో రూపొందిన ఓ తమిళ చిత్రం ‘ఒక రాత్రిలో ఇద్దరమ్మాయిలు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. బాలాజి.కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్తాఫ్ విడుదల చేస్తున్నారు. పూజా రామచంద్రన్, మాళవిక, వినోద్, కృష్ణ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అల్తాఫ్ మాట్లాడుతూ -‘‘ఓ సాయంత్రం ప్రారంభమై, మర్నాడు తెల్లవారుజాము ముగిసే కథతో ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే రిలీజ్’’ అని చెప్పారు.