
సాక్షి, హైదరాబాద్ : చిన్నపిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గ్యాంగ్ సభ్యులను రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బీహార్ నుంచి తెలంగాణకు చిన్న పిల్లలను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ముఠాలో మొత్తం పదకొండు మంది ఉండగా ప్రస్తుతం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 54 మంది చిన్నారులకు విముక్తి కలిగించారు. 15 రోజుల వ్యవధిలో మొత్తం 150 మంది చిన్నారులకు విముక్తి కలిగించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.
-