నేనూ టాటా ‘ఉప్పు’ తిన్నా! | Telangana Additional DG Mahesh remembers Ratan Tata | Sakshi
Sakshi News home page

నేనూ టాటా ‘ఉప్పు’ తిన్నా!

Published Sat, Oct 12 2024 9:53 AM | Last Updated on Sat, Oct 12 2024 10:12 AM

Telangana Additional DG Mahesh remembers Ratan Tata

సాక్షి, హైదరాబాద్‌: టాటా ‘ఉప్పు’ తిన్న ప్రముఖుల్లో రాష్ట్ర అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ కూడా ఉన్నారు. అదెలా అనే అంశాన్ని ఆయన శుక్రవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాకు చెందిన భగవత్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం పుణెలోని టాటా మోటార్స్‌లో 1993–94లలో ఉద్యోగిగా పని చేశారు. ఆ తర్వాత 1995లో ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 

ఉద్యోగిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రతన్‌ టాటాను కలిసే అవకాశం మహేష్‌ భగవత్‌కు రాలేదు. అయితే.. టాటా ఏరోస్పేస్‌ సెంటర్‌ను ప్రారంభించడానికి 2018లో టాటా ఆదిభట్లకు వచ్చారు. ఆ సమయంలో మహేష్‌ భగవత్‌ రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదిభట్ల రాచకొండ పరి«ధిలోకే రావడంతో తన విధి నిర్వహణలో భాగంగా ప్రారం¿ోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. 

అక్కడ రతన్‌ టాటాను కలిసిన మహేష్‌ భగవత్‌ వాణిజ్య ప్రకటనను ఉటంకిస్తూ ‘హమ్నే భీ టాటా కా నమక్‌ ఖాయా హై’ (నేను కూడా టాటా ఉప్పు తిన్నాను.. వారిచి్చన జీతం) అంటూ వ్యాఖ్యానించారు. అదేంటని టాటా ఆరా తీయగా... అసలు విషయం ఆయనకు వివరించారు. దీంతో నవ్వుతూ భగవత్‌ భుజం తట్టిన రతన్‌ టాటా.. ఇప్పుడు నాకు భద్రత కల్పిస్తున్నావు అని పేర్కొన్నారని మహేష్‌ భగవత్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement