Mahesh Bhagwat
-
నేనూ టాటా ‘ఉప్పు’ తిన్నా!
సాక్షి, హైదరాబాద్: టాటా ‘ఉప్పు’ తిన్న ప్రముఖుల్లో రాష్ట్ర అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేష్ మురళీధర్ భగవత్ కూడా ఉన్నారు. అదెలా అనే అంశాన్ని ఆయన శుక్రవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన భగవత్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం పుణెలోని టాటా మోటార్స్‌లో 1993–94లలో ఉద్యోగిగా పని చేశారు. ఆ తర్వాత 1995లో ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉద్యోగిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రతన్ టాటాను కలిసే అవకాశం మహేష్ భగవత్‌కు రాలేదు. అయితే.. టాటా ఏరోస్పేస్ సెంటర్‌ను ప్రారంభించడానికి 2018లో టాటా ఆదిభట్లకు వచ్చారు. ఆ సమయంలో మహేష్ భగవత్ రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదిభట్ల రాచకొండ పరి«ధిలోకే రావడంతో తన విధి నిర్వహణలో భాగంగా ప్రారం¿ోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ రతన్ టాటాను కలిసిన మహేష్ భగవత్ వాణిజ్య ప్రకటనను ఉటంకిస్తూ ‘హమ్నే భీ టాటా కా నమక్ ఖాయా హై’ (నేను కూడా టాటా ఉప్పు తిన్నాను.. వారిచి్చన జీతం) అంటూ వ్యాఖ్యానించారు. అదేంటని టాటా ఆరా తీయగా... అసలు విషయం ఆయనకు వివరించారు. దీంతో నవ్వుతూ భగవత్ భుజం తట్టిన రతన్ టాటా.. ఇప్పుడు నాకు భద్రత కల్పిస్తున్నావు అని పేర్కొన్నారని మహేష్ భగవత్ తెలిపారు. -
ఛేజ్ చేసి పట్టుకుంటే.. చాల్లే ఊరుకోమన్నారు!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీ సీసీసీ)లో శుక్రవారం జరిగిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్–2024కు అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్ ఎం.భగవత్ ప్యానల్ స్పీకర్‌గా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) క్యాడర్‌కు రావడానికి ముందు ఆయన కొన్నాళ్లు మణిపూర్‌లో పని చేశారు. వివాహాలకు సంబంధించి అక్కడ, భద్రత కోణంలో న్యూయార్క్‌లో తనకు ఎదురైన అనుభవాలను ఆయన పంచుకున్నారు. అక్కడ ఎస్పీ కూడా అలానే వివాహం చేసుకున్నారట...నేషనల్ పోలీసు అకాడమీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1997లో ట్రైనీ ఏఎస్పీ హోదాలో మణిపూర్‌లోని ఓ పోలీసుస్టేషన్‌కు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా పని చేశా. ఓ రోజు ఠాణాలో ఉండగా నలుగురు యువకులు ఓ యువతిని కిడ్నాప్ చేశారంటూ ఫోన్ చేసిన వ్యక్తి వాళ్లు వెళ్లిన వాహనం నెంబర్ కూడా చెప్పారు. వెంటనే అప్రమత్తమై అందుబాటులో ఉన్న సిబ్బందితో కలిసి రంగంలోకి దిగా. నాలుగు కిలోమీటర్లు ఛేజ్ చేసి కిడ్నాపర్ల వాహనాన్ని పట్టుకుని యువతిని రెస్క్యూ చేశాం. వాళ్లను ఠాణాకు తీసుకువచి్చన తర్వాత మా ఎస్పీకి ఫోన్ చేసి పెద్ద ఆపరేషన్ చేశానని చెప్పాం.దీనికి ఆయన ఫక్కున నవ్వుతూ తానూ అలాంటి గాంధర్వ వివాహమే చేసుకున్నానని అన్నారు. అలాంటప్పుడు ఫిర్యాదు, కేసు ఎందుకని ప్రశ్నించా. ‘‘అది అక్కడ ప్రొసీజర్ అని, కేసు పెట్టి ఇరుపక్షాలను ఠాణాకు పిలవాల్సిందేనని’’అన్నారు. ‘‘ఆపై యువతీయువకులు తమ సర్టిఫికెెట్లు చూపించి మేజర్లుగా నిరూపించుకుంటారు. వారి కుటుంబీకులకు కౌన్సెలింగ్ చేసి అప్పగిస్తే మూడునాలుగు రోజులకు మరోసారి ఘనంగా వివాహం చేస్తారు ’’అని ఎస్పీ చెప్పడంతో నాకు ఆశ్చర్యమేసింది. అమెరికాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడిగితే అనుమానించారు...అమెరికాలో వ్యాపార ఆసక్తి కంటే దేశ భద్రతపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. 2001లో జరిగిన 9/11 ఎటాక్స్ తర్వాత ఇది చాలా పెరిగింది. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం యాంటీ టెర్రరిజం శిక్షణ కోసం ఓ పోలీసు బృందాన్ని అమెరికా పంపింది. ఆ బృందంలో నేను కూడా ఉన్నా. అప్పట్లో నక్సలిజం చాలా ఎక్కువగా ఉండటంతో భద్రతాపరంగా అనేక చర్యలు తీసుకునేవాళ్లం. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడిగా. విక్రయించనంటూ నిర్మొహమాటంగా చెప్పేసిన దాని యజమాని బయటకు వచ్చి నేను వినియోగించిన వాహనం నెంబర్ కూడా నోట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరైనా అలాంటి ఓ దుకాణానికి వెళ్లి అడిగితే.. వారి వద్ద లేకపోయినా పది నిమిషాలు కూర్చోమంటూ ఎన్ని కావాలంటే అన్ని తెచ్చి ఇస్తామంటారు. ఈ ధోరణి మారి వ్యాపార ఆసక్తి కంటే దేశ భద్రతపై ఆసక్తి పెరగాలి. ప్రజలను చైతన్యవంతం చేయడమే సవాల్... ఇక్కడ నివసిస్తున్న ప్రజలను నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడేలా మోటివేట్ చేయడమే పెద్ద సవాల్. నగరంలో ఉన్న హుస్సేన్‌సాగర్‌లో సరాసరిన రోజుకో ఆత్మహత్య చొప్పున జరుగుతూ ఉంటుంది. ఇలా ఆత్మహత్యకు యత్నించిన వారిని రక్షించడానికి పోలీసు విభాగం తరఫున సుశిక్షితులైన సిబ్బంది పని చేస్తున్నారు. అయితే ఆ ఉదంతం జరిగే ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న వాళ్లు మాత్రం స్పందించరు. తొలి ప్రాధాన్యం వీడియో చిత్రీకరించడానికే ఇస్తారు. తాము ఫస్ట్ సేవర్ కావాలని ఆశించడం కన్నా సోషల్‌మీడియాలో పెట్టడానికి ఫస్ట్ రికార్డర్ కావాలని భావిస్తుంటారు. దీనికి భిన్నంగా ప్రజలను మోటివేట్ చేయడమే ప్రస్తుతం సమాజంలో ఉన్న పెద్ద సవాల్. -
మహేష్ భగవత్ కృషి ఫలించింది
సాక్షి,హైదరాబాద్: తాజాగా విడుదలైన సివిల్స్ పరీక్షల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ గైడెన్స్ మంచి ఫలితాలను ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ పొందుతున్న వారితో ప్రత్యక్షంగా, ఇతర రాష్ట్రాల వారితో ఆన్లైన్ మాధ్యమాల ద్వారా మహేష్‌భగవత్ ఇచ్చిన సూచనలతో సుమారు రెండువందల మందికి పైగా ర్యాంకులు సాధించారు. అందులో తెలంగాణా నుండి అనన్యారెడ్డి సహా ఎన్పీఎలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. సివిల్స్ ప్రిపేరు అయ్యే వారికి వ్యక్తిత్వ వికాసం, పరీక్షా సమయాల్లో వత్తిడి,సమయ పాలన, ఇంటర్వ్యూలో వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై మహేష్ భగవత్ సూచనలు చేశారు. -
ఫోన్ల రికవరీలో దేశంలోనే ప్రథమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో 33.71 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లో 15,024 మొబైల్ ఫోన్లను గుర్తించడంతోపాటు యజమానులకు అప్పగించినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) యాప్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోలీస్ కమిషనర్లు, ఎస్పీలందరి కృషితోనే ఇది సాధ్యమైందని మహేశ్ భగవత్ అభినందించారు. -
డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రలు సేకరించి..
సాక్షి, హైదరాబాద్: సిలికాన్ ఫింగర్‌ప్రింట్స్ (నకిలీ వేలిముద్రల)ను తయారు చేసి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను తెలంగాణ సీఐడీ పోలీస్ బృందం అరెస్టు చేసింది. ఈ ముఠాలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన రంజిత్‌షాను ఆ రాష్ట్రంలోని కిషన్‌గంజ్ జిల్లాలో ఈనెల 24న, మరో నిందితుడు సఫాత్ ఆలంను ఈనెల 14న బెంగళూరులో అరెస్టు చేసినట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ మంగళవారంనాడిక్కడ తెలిపారు. ఈ ముఠాలో కీలక నిందితుడు అక్మల్ ఆలంను సీఐడీ పోలీసులు గతేడాది డిసెంబర్లో బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోని వేలిముద్రలతో... ఈ సైబర్ మోసంలో నిందితులు రిజిస్ట్రేషన్ , రెవెన్యూశాఖల వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఈ ముఠా ముందుగా రిజిసే్ట్రషన్, రెవెన్యూ శాఖల వెబ్సైట్లోకి వెళ్లి సేల్‌డీడ్, ఇతర డాక్యుమెంట్లలో వేలిముద్రలను, ఆధార్ నంబర్లను, బ్యాంక్ ఖాతాల్లో పేర్లను సేకరిస్తుంది. ఈ వేలిముద్రలను ఆధారంగా సిలికాన్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేస్తున్నారు. కస్టమర్ సర్వీస్ పాయింట్స్ (సీఎస్పీ)ల సిబ్బందితో కుమ్మక్కై ఆ సెంటర్లలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) విధానంలో వేలిముద్రలను పెట్టి, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సదరు వ్యక్తులకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును డ్రా చేస్తున్నారు. ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలో పేరు, వేలిముద్ర ఉంటే ఏఈపీఎస్‌ల నుంచి డబ్బులు డ్రా చేసే అవకాశం ఉండటం సైబర్ నేరగాళ్లకు కలిసొచ్చే అంశంగా మారింది. ఇలా వెలుగులోకి వచ్చింది... హైదరాబాద్‌లోని సెయింట్ మేరిస్ రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ఖాతా ఉన్న ఓ రిటైర్డ్ ఉద్యోగి గతేడాది డిసెంబర్లో సీఐడీ పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 4, 5 తేదీల్లో తన బ్యాంకు ఖాతా నుంచి నాలుగు విడతల్లో మొత్తం రూ.24 వేలు తనకు తెలియకుండానే ఎవరో డ్రా చేసినట్టు ఫిర్యాదు చేశారు. దీనిపై దృష్టి పెట్టిన సీఐడీ అధికారులు నగదు విత్‌డ్రా చేసిన ప్రాంతంలో బ్యాంకు ఖాతాలు, అక్కడ నిందితులు వాడిన ఫోన్ నంబర్ల ఆధారంగా కీలక సమాచారం సేకరించారు. కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది డిసెంబర్ 22న కీలక నిందితుడు అక్మల్ ఆలంను అరెస్టు చేశారు. అతడి నుంచి సేకరించిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సీఐడీ సైబర్‌క్రైం ఎస్పీ లావణ్య ఎన్జేపీ, మరో ఎస్పీ బి. రామ్‌రెడ్డిని మహేశ్‌భగవత్ అభినందించారు. -
రూ .231 కోట్లు కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్/బోధన్: బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో ఎట్టకేలకు చార్జి షీట్ దాఖలైంది. 2017 నుంచి ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన తెలంగాణ సీఐడీ అధికారులు ఇటీవల కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 34 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 22 మంది వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అధికారులే.మొత్తం 123 మంది సాక్షులను విచారించినట్టు చార్జిషీట్లో పేర్కొన్నారు. 68 రకాల సాఫ్ట్వేర్ మెటీరియల్‌తో పాటు 143 డాక్యుమెంట్లు, మూడు ఆడిట్ రిపోర్ట్‌లను సాక్ష్యాలుగా కోర్టుకు సమరి్పంచారు. ఈ కుంభకోణంలో నిందితులు మొత్తం రూ.231.22 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టినట్టు తేల్చారు. దీనికి సంబంధించి 2005 నుంచి 2016 వరకు బోధన్, నిజామాబాద్ వాణిజ్య పన్నుల శాఖలో పని చేసిన అధికారుల వివరాలు సీఐడీ సేకరించింది. ఇలా దోచేశారు.. వాణిజ్య పన్నులశాఖ బోధన్ సర్కిల్లో జరి గిన నకిలీ చలాన్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పన్నులు చెల్లించకుండానే నకిలీ చలాన్లు సృష్టించి కోట్ల రూపాయలు కొట్టేశారు. వ్యాపారాలు చేసేవారు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులు చలానా రూపంలో చెల్లిస్తారు. ప్రతి చలానాకు ప్రత్యేక నంబర్ ఉంటుంది. ఖజానా (ట్రెజరీ)లో ఈ నంబర్ వేయించుకుని ప్రభుత్వం అనుమతించిన బ్యాంకులో పన్ను మొత్తాన్ని జమ చేయాలి. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌లు బోధన్ వాణిజ్య పన్నులశాఖ కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కయ్యారు. పన్నులు చెల్లించకుండానే చెల్లించినట్టుగా నకిలీ చలాన్లు సృష్టించారు. కొంత మొత్తాన్ని చెల్లించి ఎక్కువ మొత్తంలో చెల్లించినట్టు చూపారు. ఒకరు చెల్లించిన చలానాతోనే పదుల సంఖ్యలో వ్యాపారులు, పలు వ్యాపార సంస్థలు చెల్లించినట్టుగా రికార్డులు సృష్టించారు. వ్యాపారుల సొమ్మును పక్కదారి పట్టించి తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారు. ఎక్కడికక్కడ అధికారులను తమ దారికి తెచ్చుకుని ఏళ్ల తరబడి ఈ కుంభకోణం కొనసాగించారు. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ సర్కిల్ సీటీఓ ఎల్.విజయేందర్ బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 2017 ఫిబ్రవరి 2న చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దర్యాప్తులో ఉద్యోగుల అవినీతి బాగోతానికి సంబంధించి పక్కా సాక్ష్యాలు లభించాయి. ఫోర్జరీ, మోసం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నేరపూరిత కుట్ర, లంచం తీసుకోవడం వంటి నేరాలు ఉండడంతో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఎన్.శ్యామ్ ప్రసాద్‌రావు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. కేసు నీరుగార్చే యత్నాన్ని బయటపెట్టిన ‘సాక్షి’.. ఈ భారీ కుంభకోణం దర్యాప్తులో ఆద్యంతం అనేక మలుపు చోటు చేసుకున్నాయి. చలాన్లు పెట్టేందుకే నిందితులు ఏకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటి నిండా చలాన్లు ఉండటాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు దర్యాప్తును నీరుగార్చేందుకు ఏకంగా ఐఏఎస్ స్థాయి అధికారి ఒకరు ప్రయత్నించిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాతే కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. తీగలాగితే డొంక కదిలిన చందంగా వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అనేకమంది అధికారుల పాత్ర వెల్లడైంది. ఈ క్రమంలో సీఐడీ విచారణాధికారికి కోటి రూపాయల ఎర వేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అరెస్టు అయ్యింది వీరే.. ఈ కుంభకోణానికి కీలక సూత్రధారులుగా ఉన్న సింహాద్రి లక్ష్మీ శివరాజ్ (ఏడాది క్రితం మరణించాడు), అతని కుమారుడు సింహాద్రి వెంకట సునీల్‌లను సీఐడీ అరెస్టు చేసింది. వీరిద్దరు నిజామాబాద్ పట్టణంలో సేల్స్ ట్యాక్స్ ప్రైవేటు ఆడిటర్లుగా ఉంటూ ఈ కుంభకోణానికి తెగబడ్డారు. వీరితో పాటు వారి సిబ్బంది విశాల్ పాటిల్ అలియాస్ విశాల్ కాంతిపాటిల్, కమ్మర రామలింగం అలియాస్ రామ లింగడు, నారాయణదాస్ వెంకట కృష్ణమాచారి, ఎన్.సత్యవెంకట కృష్ణకుమార్ అలియాస్ పంతులు, ఎం.మల్లేశ్, గంగొనే రాకేశ్, మడపల్లి రమణ, వంగల శ్రీనివాస్, మహ్మద్ నజీముద్దీన్ అలియాస్ అబీబుద్దీన్, అర్రోజుల రాజేశ్ కూడా ఉన్నారు. ఇక వాణిజ్య పన్నుల శాఖ అధికారులు..రాథోడ్ ధర్మ విజయకృష్ణ, అనంతశ్యానం వేణుగోపాల స్వామి, బి.హనుమంతు సింగ్, ధరణి శ్రీనివాసరావు, టి.పూర్ణచంద్రారెడ్డితో పాటు బోధన్ సర్కిల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (ఏసీటీఓలు) ఆర్.కిషన్, కె.నాగేశ్వర్రావు, కె.విజయకుమార్, ఎస్.రత్నకుమారి, బీఎన్ ఇందిర, జె.రాజయ్య, ఎస్.సాయిలు, సీనియర్ అసిస్టెంట్లు సి.స్వర్ణలత, కె. అరుణ్‌రెడ్డి, బి.పీరాజి, రవీంద్రబాబు, ఆర్.బాలరాజు, జూనియర్ అసిస్టెంట్లు చంద్రహాస్, ఆర్.వినోద్‌కుమార్, బి.రంగారావు, ఎల్.భజరంగ్, సి.శ్రీధర్‌లు కూడా కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. -
సివిల్స్ గురుగా మహేశ్ భగవత్ మార్కు.. ఆలిండియా టాపర్లుగా 125 నుంచి 150 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ ‘సివిల్స్ గురూ’గా మరోసారి తన మార్కు చాటారు. సివిల్స్–2022 తుది ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో చాలా మంది ఆయన వద్దే ఇంటర్వ్యూ శిక్షణ పొందారు. తన వద్ద ఇంటర్వ్యూ శిక్షణ పొందిన వారిలో ఆల్ ఇండియా టాపర్లుగా దాదాపు 125 నుంచి 150 మంది నిలిచారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని మహేశ్ భగవత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆలిండియా టాపర్, యూపీ యువతి ఇషితా కిశోర్‌కు తాను మెంటార్‌గా ఉండటం సంతృప్తినిచ్చిందన్నారు. తనతోపాటు మరికొందరు గత పదేళ్లుగా సివిల్స్ అభ్యర్థులకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది టాప్–100 ర్యాంకుల్లో 14వ ర్యాంకర్ కృతికా గోయల్, 22వ ర్యాంకర్, తిరుపతివాసి పవన్ దత్తా, 25వ ర్యాంకర్ కశ్మిరా సంకే, 27వ ర్యాంకు సాధించిన యాదవ్ సూర్యభాన్, 35వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన అజ్మీర సంకేత్ కుమార్, 38వ ర్యాంకర్ అనూప్‌దాస్, 54వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన రిచా కులకర్ణి, 74వ ర్యాంకర్ ఐషి జైన్, 76వ ర్యాంకు సాధించిన దబోల్కర్ వసంత్, 78వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన ఉత్కర్ష కుమార్‌లు తన వద్ద ఇంటర్వ్యూ పొందినవారేనని మహేశ్ భగవత్ తెలిపారు. గత ఐదు నెలలుగా తాను ఇంటర్వూలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. విజేతలు గర్వం పెరగకుండా చూసుకోవాలని, ర్యాంకులు రాని వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఆయన సూచించారు. -
ఫింగర్ ప్రింట్స్ కోసం సీఐడీకి అధునాతన కిట్లు
సాక్షి, హైదరాబాద్: నేరాలు జరిగినప్పుడు వాటిని ఛేదించేందుకు ఫింగర్ ప్రింట్స్ కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి ఫింగర్ ప్రింట్స్ సేకరణ, తరువాత వాటిని విశ్లేషించడానికి అవసరమైన అధునాతన కిట్స్‌ను రాష్ట్ర సీఐడీ విభాగం సమకూర్చుకుంది. రూ.1.33 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఫింగర్ ప్రింట్ కిట్స్‌ను సీఐడీ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆరు జోన్లలోని అధికారులకు అందజేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లోని ఎల్బీ నగర్ జోన్, సైబరాబాద్‌లోని శంషాబాద్ జోన్, హైదరాబాద్ నగరంలోని సౌత్, నార్త్, వెస్ట్, సెంట్రల్ జోన్లకు ఈ కిట్లను అందించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఫింగర్ ప్రింట్ యూనిట్లకు వీటిని అందచేయనున్నట్లు మహే ష్భగవత్ చెప్పారు. సీఐడీలోని ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ తాతా రావు మాట్లాడుతూ ఒక్కో కిట్‌లో మొత్తం తొమ్మిది రకాల వస్తువులు ఉంటాయని తెలిపారు. మాస్టర్ ఎక్స్పర్ట్ లేటంట్ ప్రింట్ కిట్, ఫింగర్ ప్రింట్ కెమికల్ ప్రాసెసింగ్ కిట్, లెటంట్ బ్రషెస్, మాగ్నటిక్ పౌడర్ అప్లికేటర్, పోస్టు మార్టమ్ ఇంక్ టూల్, ఇంక్డ్ స్ట్రిప్స్, మాగ్నటిక్ పౌడర్స్, లెటెంట్ ప్రింట్ బేసిక్ పౌడర్స్, పోర్టబుల్ మల్టీబాండ్ లైట్సోర్స్ ఉంటాయి. కార్యక్రమంలో సీఐడీ అధికారులు ఎం.నారాయణ(అడ్మిన్), ఆర్ వెంకటేశ్వర్లు(ఎస్సీఆర్బీ) రవీందర్(నార్కొటిక్స్), డీఎస్పీ నందుకుమార్(ఎఫ్‌పీబీ) పాల్గొన్నారు. -
తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు.. ఇన్చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. డిసెంబర్ 31వ తేదీతో ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో బదిలీలు జరిగాయి. బదిలీల అనంతరం తెలంగాణ ఇన్చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. - సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్. - రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్. - ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు. - లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్. - హోంశాఖ కార్యదర్శిగా జితేందర్. -
రాచకొండ పోలీసు కమిషనరేట్ మరింత బలోపేతం!
సాక్షి,హైదరాబాద్: పట్టణీకరణ, కొత్త ప్రాంతాల ఏర్పాటుతో రాచకొండ పోలీసు కమిషనరేట్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 5,116 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించిన రాచకొండలో 44 లక్షల మంది జనాభా నివాసం ఉంటోంది. ఏటేటా జనాభా, ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఠాణాలు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు, పోలీసుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాచకొండకు కొత్తగా 763 పోలీసు పోస్టులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం రాచకొండలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, భువనగిరి జోన్లు, ఒక్కో ట్రాఫిక్, ఎస్ఓటీ జోన్లతో కార్యాకలాపాలు సాగిస్తుంది. తాజా నిర్ణయంతో అదనంగా ఒక శాంతి భద్రతల జోన్, రెండు ట్రాఫిక్ జోన్లు, రెండు స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. కొత్తగా మహేశ్వరం జోన్: ఎల్బీనగర్ జోన్ నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్‌ను వేరు చేసి కొత్తగా రానున్న మహేశ్వరం డివిజన్‌తో కలిపి కొత్తగా మహేశ్వరం జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: డీసీపీ–1; అదనపు డీసీపీ–1, పీసీ–2, జేఏ–1 ► ఇబ్రహీంపట్నం డివిజన్ నుంచి మహేశ్వరం, కందుకూరు పోలీసు స్టేషన్లు, వనస్థలిపురం డివిజన్ నుంచి పహాడీషరీఫ్, బాలాపూర్ ఠాణాలను వేరు చేసి కొత్తగా మహేశ్వరం డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: ఏసీపీ–1; పీసీ–2 ► ఇప్పటికే ఉన్న ఎల్బీనగర్, మల్కాజ్గిరి, భువనగిరి జోన్లతో పాటు కొత్తగా రానున్న మహేశ్వరం జోన్‌కు ఒక్కో అదనపు డీసీపీలను నియమించనున్నారు. ఐదు కొత్త ఠాణాలు.. ప్రస్తుతం 43 శాంతి భద్రతలు, రెండు మహిళా పోలీసు స్టేషన్లు ఉండగా.. కొత్తగా మరో ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. చర్లపల్లి, నాగోల్, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, పోచారం ఐటీ కారిడార్ స్టేషన్లుతో పాటు ఉప్పల్‌లో మహిళా ఠాణా రానుంది. అలాగే ప్రస్తుతం ఉన్న కీసర, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్ ఠాణాలను నవీకరించనున్నారు. యాదాద్రిలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కేవలం గట్టు కోసమే ప్రత్యేకంగా ఏసీపీ ర్యాంకు అధికారిని మంజూరు చేశారు. యాదాద్రి టెంపుల్ పీఎస్, రాయగిరి పీఎస్‌లు ఆయన పరిధిలో ఉంటాయి. రెండు ఎస్ఓటీ జోన్లు.. ప్రస్తుతం రాచకొండలో ఒకటే ఎస్ఓటీ జోన్ ఉంది. కొత్తగా ఎల్బీనగర్–మహేశ్వరం, మల్కాజ్గిరి–భువనగిరి ఎస్ఓటీ జోన్లు రానున్నాయి. పోస్టులు: డీసీపీ–2, అదనపు డీసీపీ–1, ఏసీపీ–1, ఇన్స్పెక్టర్లు–2 ► స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విభాగాన్ని కూడా బలోపేతం చేయనున్నారు. ఎస్బీకి కొత్తగా డీసీపీ ర్యాంకు అధికారి రానున్నారు. అదనంగా ఒక డీసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 3 ఎస్ఐలు, ఐదుగురు ఏఎస్ఐలు, 5 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 16 మంది కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. నాలుగు కంట్రోల్ రూమ్‌లు.. రాచకొండలో కొత్తగా నాలుగు జోనల్ కంట్రోల్ రూమ్‌లు రానున్నాయి. ఒక్కో కంట్రోల్ రూమ్‌కు ఒక ఏఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లుంటారు. వీటితో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్)లో 70 మంది, ఐటీ, క్లూస్, సీసీఎస్ వంటి ఇతరత్రా విభాగాలలో 75 మంది, ఐడీ స్టాఫ్‌లో 13 అదనపు పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రాఫిక్‌లో రెండు జోన్లు, జాయింట్ సీపీ.. ఏటేటా వాహనాల సంఖ్య, రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ విభాగాన్ని కూడా విస్తరించనున్నారు. కొత్తగా రాచకొండ ట్రాఫిక్‌కు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (సీపీ)ను పోస్టును భర్తీ చేయనున్నారు. కొత్తగా రానున్న రెండు ట్రాఫిక్ జోన్ల మధ్య సమన్వయం, విధుల కేటాయింపు, ట్రాఫిక్ నియంత్రణ అంశాలను జాయింట్ సీపీ పర్యవేక్షిస్తారు. ఆయనతో పాటు రెండు పీసీలు, ఒక జేఏ పోస్టులు కూడా మంజూరయ్యాయి. కొత్తగా రెండు ట్రాఫిక్ జోన్లు: ► ప్రస్తుతం రాచకొండ మొత్తానికీ ఒకటే ట్రాఫిక్ జోన్ ఉంది. కొత్తగా ఎల్బీనగర్–మహేశ్వరం, మల్కాజ్గిరి–భువనగిరి రెండు జోన్లను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: డీసీపీ–1, అదరపు డీసీపీ–1, పీసీలు–2 ► కొత్తగా మహేశ్వరం ట్రాఫిక్ డివిజన్‌ను కూడా రానుంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ట్రాఫిక్ ఠాణాలను కలిపి ఈ డివిజన్ ఉంటుంది. పోస్టులు: ఏసీపీ–1, పీసీ–1 ► ప్రస్తుతం ఎనిమిది ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉండగా.. అదనంగా మరో నాలుగు ఠాణాలు రానున్నాయి. కొత్తగా ఘట్కేసర్, జవహర్‌నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ స్టేషన్లను ఏర్పాటు, యాదాద్రి ట్రాఫిక్ పీఎస్‌లను నవీకరించనున్నారు. (క్లిక్: సంచలనాల సమాహారం.. ‘ఫామ్‌హౌస్–ఈడీ’ కేసుల వరకు ఎన్నెన్నో..) -
రాచకొండ సీపీగా కమలాసన్?
సాక్షి, సిటీబ్యూరో: కొత్త ఏడాది నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కొత్త బాస్ రానున్నారు. సుదీర్ఘ కాలం నుంచి రాచకొండ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్ బదిలీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా స్థానచలనం కలి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాచకొండ కమిషనరేట్‌కు కొత్త పోలీసు కమిషనర్‌గా 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వీబీ కమలాసన్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కమలాసన్ రెడ్డి హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్ ఇన్చార్జి డీఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పటివరకు కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా ఉన్న కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసి.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్ ఇంచార్జీ డీఐజీగా తాత్కాలిక కాలం పాటు పోస్టింగ్ ఇచ్చారు. పలువురు డీసీపీలు కూడా.. విస్తీర్ణంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద పోలీసు కమిషనరేట్ అయిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్‌ను 2016లో విభజించి.. సైబరాబాద్ ఈస్ట్‌కు రాచకొండ పోలీసు కమిషనరేట్‌గా నామకరణం చేశారు. అనంతరం రాచకొండ తొలి సీపీగా మహేశ్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక పోలీసు కమిషనరేట్‌కు వరుసగా ఆరేళ్ల కంటే ఎక్కువ కాలం పోలీసు కమిషనర్‌గా పనిచేసి మహేశ్ భగవత్ రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా.. సీపీ బదిలీ అనంతరం.. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో సుదీర్ఘ కాలం నుంచి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ)లుగా పనిచేస్తున్న పలువురిని కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. -
క్రూరమృగంలా.. నా జీవితం నాశనం చేశాడు
రంగారెడ్డి : తనను కిడ్నాప్ చేసి క్రూరమృగంలా వ్యవహరించిన నవీన్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని వైద్య విద్యార్థిని వైశాలి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ను కోరింది. సోమవారం తన తండ్రి, మేనమామతో కలిసి సీపీకి ఫిర్యాదు చేసింది. తనకు నవీన్‌రెడ్డితో పరిచయం మాత్రమే ఉందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా అపఖ్యాతి పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భవిష్యత్‌ను నాశనం చేశాడని విలపించింది. నవీన్‌రెడ్డితో తనకు వివాహం కాకపోయినా అయినట్టుగా ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్ట్రాగాంలో పెట్టాడని, తమ ఇంటి వద్ద పోస్టర్లు వేసి తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశాడని వాపోయింది. ఈ నెల9న తమ ఇంటిపైకి రౌడీలను తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాడని, తన తల్లిదండ్రులను కర్రలతో కొట్టాడని చెప్పింది. ఓ మహిళ అని కూడా చూడకుండా కాళ్లు, చేతులు పట్టుకొని తనను కార్లో పడేశారని, కనీసం ఊపిరి ఆడకుండా చేశారని సీపీకి వివరించింది. కారులో గోర్లతో రక్కారని, చేతులు, కాళ్లు విరిచి, మెడపై గాయపరిచి ఘోరంగా ట్రీట్ చేశారని వాపోయింది. తనను వదిలిపెట్టమని ప్రాధేయపడగా, అమ్మనాన్నలను చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. నాలుగు రోజులైనా పోలీసులు అతడిని ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించింది. ఈ కేసు విషయమై ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని త్వరలో పట్టుకుంటామని, ఎంతటివారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కమిషనర్ హామీ ఇచి్చనట్లు తెలిసింది. నవీన్‌రెడ్డి కారు లభ్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఆచూకీ ఇంకా దొరకలేదు. వైశాలిని కిడ్నాప్ చేసేందుకు వాడిన కారును మాత్రం పోలీసులు సోమవారం సాయంత్రం గుర్తించారు. శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి వద్ద ఆ కారును (టీఎస్ 07 హెచ్ఎక్స్ 2111) వదిలేశారు. పార్కింగ్ చేసి, లాక్ వేసుకొని నింది తులు పరారయ్యారు. కానీ కారు లైట్లు వెలుగు తూనే ఉన్నాయి. ఈ వాహనాన్ని ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, నవీన్‌రెడ్డిపై గతంలో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఇందులో 2019లో వరంగల్ ఇంతియార్‌గంజ్ పీఎస్ పరిధిలో చీటింగ్, ఐటీ సెక్షన్ల కింద ఒక కేసు, కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో 2019లోనే యాక్సిడెంట్‌కు సంబంధించి మరో కేసు నమోదైంది. తాజాగా పీడీయాక్ట్ నమోదు చేసేందుకు పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
నాగోల్ కాల్పుల బాధితులను పరామర్శించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్
-
మునుగోడులో కట్టుదిట్టమైన భద్రత
-
అజహారుద్దీన్‌పై సీపీకి ఫిర్యాదు.. ‘తప్పుడు ధ్రువపత్రాలతో..’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఉప్పల్ వేదికగా సెప్టెంబర్ 25న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగిన నాటి నుంచి హెచ్‌సీఏపై వివిధ అంశాలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహారుద్దీన్ పదవీకాలానికి సంబంధించి మరో కేసు నమోదైంది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహారుద్దీన్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 26తోనే ముగిసినప్పటికీ.. అతను తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి చేసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు బృందం రాచకొండ సీపీ మహేష్ భగవత్‌కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు లిఖితపూర్వరంగా సీపీకి కంప్లైంట్‌ను అందజేశారు. పదవీకాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసుకున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 18న జరిగే బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరు అయ్యేందుకు అజహారుద్దీన్ తన పదవీకాలాన్ని పొడిగించుకున్నాడని ఆరోపించారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని సీపీకి కంప్లైంట్ చేశారు. -
నెక్లెస్ రోడ్డు : ఉత్సాహంగా ప్యూరథాన్ 5కే, 2 కే రన్ (ఫోటోలు)
-
రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఫోటోతో ఫేక్ వాట్సాప్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదపు లేకుండ పోతుంది. మరోసారి కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేశారు. కమిషనర్ ఫోటోతో ఫేక్ నంబర్ నుంచి ప్రజలకు మెసేజ్‌లు చేస్తూ, మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించారు. 87647 47849 నంబర్‌తో ఫేక్ వాట్సాప్ డీపీని సైబర్ దొంగలు సృష్టించారని, ఈ వాట్సాప్ నంబర్ నుంచి వస్తున్న మెస్సేజ్‌లను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నిందితుడిని పట్టుకునే పనిలో సైబర్ టీం పనిచేస్తోందని తెలిపారు. -
IND Vs AUS: టి-20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెక్ స్టేడియంలో ఈ నెల 25న ఇండియా–ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న టీ–20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శుక్రవారం స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. దాదాపుగా 40 వేలకు పైగా క్రీడాభిమానులు మ్యాచ్ వీక్షించే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... క్రీడాకారులకు భారీ భద్రత గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులు, మ్యాచ్ రిఫరీకి కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాం. ఎలాంటి సంఘటనలు జరక్కుండా చూస్తాం. అభిమానులు మితిమీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. సాయంత్రం 4.30 నుంచి అనుమతి ►ఆదివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్రీడాభిమానులకు మధ్యాహ్నం 4.30 నుంచి స్టేడియంలోకి అనుమతి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బెస్ట్ ►మ్యాచ్‌కు వచ్చేవారు వ్యక్తిగత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగించుకుంటే మంచిది. ►మ్యాచ్ సందర్భంగా మెట్రో రైల్ సంస్థ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు రైళ్లను నడుపుతుంది. ►ఆర్టీసీ అధికారులు కూడా వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి ప్రత్యేక షటిల్స్‌ను నడుపుతారు. అడుగడుగునా నిఘా.. ►ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. 300 వరకు సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. ►బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వీటిని అనుసంధానం చేశాం. ►మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్లకు మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంది. స్టేడియంలోకి ఇవి తేవొద్దు... ►హెల్మెట్, కెమెరాలు, బైనాక్యులర్స్, ల్యాప్‌ట్యాప్‌లు, సిగరెట్లు, తినుబండారాలు, ఆల్కాహాల్, మత్తు పదార్థాలు, సెల్ఫీ స్టిక్స్, హాల్‌పిన్స్, ఆయుధాలు, బ్లేడ్లు, చాకులు, మంచి నీటి బాటిల్స్‌ను స్టేడియంలోకి అనుమతించరు. ►ఏడు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతున్నాం. వీటితో పాటు మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేస్తున్నాం. ►జీహెచ్ఎంసీ తరపున ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్‌ను అందుబాటులో ఉంచుతాం. ►మ్యాచ్ టికెట్లను బ్లాక్ దందా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నాం. అవసరమైతే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి ►గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మ్యాచ్ రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు తెల్లవారు జాము వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. ►ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే భారీ వాహనాలను అనుమతించమన్నారు. ►సికింద్రాబాద్ నుంచి, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా అనుమతించమన్నారు. ►గేట్–1 వీఐపీ ద్వారం పెంగ్విన్ గ్రౌండ్లో దాదాపు 1400 కార్లు పార్కు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ►స్డేడియం నలువైపులా ఐదు క్రేన్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ►ద్విచక్ర వాహనాలను ఎన్జీఆర్ఐ గేట్–1 నుంచి నాలుగు వరకు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసుకోవచ్చన్నారు. దీంతోపాటు జెన్‌ప్యాక్ట్ వైపు రోడ్డులో కూడా ద్విచక్ర వాహనాలను పార్కు చేసుకోవచ్చన్నారు. రూట్ మ్యాప్‌నకు ప్రత్యేక యాప్ ►టికెట్లు బుక్ చేసుకున్నవారికి రూట్‌ను చూపించే యాప్ మెసేజ్ వస్తుందని, దీని ద్వారా ఏ గేట్‌కు వెళ్లి పార్కు చేసుకోవాలో డైరెక్షన్ చూపుతుందని ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. -
భారత్-ఆసీస్ మ్యాచ్: ప్రతీ వ్యక్తిని జూమ్ చేస్తాం.. వాటికి అనుమతి లేదు: సీపీ
సాక్షి, హైదరాబాద్: భారత్-ఆసీస్ మ్యాచ్‌కు పూర్తి భద్రత కల్పించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభిమానులు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలన్నారు. మ్యాచ్ రోజున మెట్రో అదనపు సర్వీసులు ఉంటాయని వెల్లడించారు. ఆర్టీసీ బస్సులు కూడా అదనంగా ఏర్పాటు చేశారని సీపీ పేర్కొన్నారు. 300 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. చదవండి: అవన్నీ అవాస్తవాలు.. ఒక్కొక్కరు నాలుగు టికెట్లు కొంటే: అజారుద్దీన్ 2500 పోలీస్ సిబ్బంది.. ‘‘ఎల్లుండి జరిగే మ్యాచ్‌కి 2500 పోలీస్ సిబ్బందితో సెక్యురిటి ఏర్పాటు చేశాం. 40 వేలకు పైగా ప్రేక్షకులు వస్తారు. ప్లేయర్స్ రేపు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం ప్రాక్టీస్‌కి వస్తారు. ఎల్లుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఎక్కువ మెట్రో సర్వీసులు నడుస్తాయి. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. 300 సీసీ కెమెరాలు ఉన్నాయి.. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి అనుసంధానం చేస్తామని తెలిపారు. వాటికి అనుమతి లేదు.. గ్రౌండ్లో ఉండే ప్రతీ వ్యక్తిని జూమ్ చేసి చూసే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లకి అనుసంధానం చేస్తాం. ప్రేక్షకుల మొబైల్స్, బ్లూటూత్ హెడ్ సెట్ అనుమతిస్తాం. సిగరెట్, కెమెరాలు, షార్ప్ ఆబ్జెక్ట్, ఆల్కహాల్, వాటర్ బాటిల్స్, హెల్మెట్స్, పెట్స్, ఫైర్ క్రాకర్స్, బయట ఫుడ్, బ్యాగ్స్, సెల్ఫీ స్టిక్స్, డ్రగ్స్‌కి అనుమతి లేదని’’ సీపీ పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో మరో కొత్తరకం మోసం
-
HYD: పోలీసులే ఊహించని బిగ్ స్కామ్.. ఐడియా మామూలుగా లేదు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు కనిపించకుండా సర్జరీలు చేస్తున్న డాక్టర్ సహా సిబ్బందిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ నేరాలపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. ఫింగర్ ప్రింట్ స్కామ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు రిజక్ట్ కావడంతో యువకులు ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో శస్త్ర చికిత్స చేస్తున్న డాక్టర్, సిబ్బందిని అరెస్ట్ చేశాము. కాగా, శ్రీలంకలో మొదటి ఫింగర్ ప్రింట్ ఆపరేషన్ జరిగింది. నిందితులపై 420తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాము. ఇది హ్యోమన్ స్మగ్లింగ్. ఒక్కో సర్జరీకి రూ.25వేలు తీసుకున్నారు. కేరళలో ఆరుగురు, రాజస్థాన్‌లో ఇద్దరు, తెలంగాణలో ఇద్దరికి ఫింగర్ ప్రింట్స్ ఆపరేషన్ జరిగింది. కువైట్‌లో ఉద్యోగాల కోసం ఫింగర్ ప్రింట్స్ మార్చుకున్నారు. ఫింగర్ ప్రింట్స్ మార్చుకున్నవాళ్లు కువైట్ వెళ్లారు అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఆన్లైన్లో ఇంటి వచ్చే కొరియర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి: సీపీ సీవీ ఆనంద్ -
మహేశ్ భగవత్, దేవేందర్ సింగ్‌లకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణలో అత్యుత్తమ సేవలు అందించిన 14 మంది రాష్ట్ర పోలీసులకు కేంద్ర హోంశాఖ పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్ర అడిషనల్ డీజీపీ హోదాలో రాచకొండ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న దేవేందర్ సింగ్ చుంగిలను రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌కు ఎంపిక చేసింది. మరో 12 మంది పోలీసు అధికారులకు మెరిటోరియస్ సర్వీస్ పతకాలను ప్రకటించింది. పోలీసు బలగాల్లో మంచి పనితీరు కనబర్చిన అధికారులు, సిబ్బందికి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ సేవా పతకాలను ప్రకటిస్తుంది. మెరిటోరియల్ మెడల్స్ పొందినది వీరే.. మెరిటోరియల్ మెడల్స్‌కు ఎంపికైనవారిలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో నేర పరిశోధన విభాగం అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఏఆర్ శ్రీనివాస్, సీఐడీ అదనపు ఎస్పీ పాలేరు సత్యనారాయణ, ఎస్ఐబీలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ పైళ్ల శ్రీనివాస్, హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఏసీపీ సాయిని శ్రీనివాసరావు, ఖమ్మం ఏసీబీ డీఎస్పీ సూరాడ వెంకటరమణమూర్తి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ చెరుకు వాసుదేవరెడ్డి, పోలీస్ అకాడమీలో డీఎస్పీగా ఉన్న గంగిశెట్టి గురు రాఘవేంద్ర, రామగుండం సీఎస్బీ ఎస్సై చిప్ప రాజమౌళి, రాచకొండ ఎస్బీ ఏఎస్సై కాట్రగడ్డ శ్రీనివాస్, కామారెడ్డి హెడ్‌క్వార్టర్స్ ఏఆర్ ఎస్సై జంగన్నగారి నీలంరెడ్డి, మామునూర్ బెటాలియన్ ఏఆర్ ఎస్సై సలేంద్ర సుధాకర్, కరీంనగర్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఉండింటి శ్రీనివాస్ ఉన్నారు. మిగతా యూనిఫాం విభాగాల్లో.. • అగ్నిమాపక శాఖ (ఫైర్ సర్వీస్)లో ఉత్తమ సేవలకు సంబంధించి తెలంగాణకు చెందిన ఇద్దరు మెడల్స్‌కు ఎంపికయ్యారు. లీడింగ్ ఫైర్మన్లు ఎర్రగుంట వెంకటేశ్వరరావు, ఫరీద్ షేక్‌లకు ఫైర్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. • హోంగార్డులు చల్లా అశోక్‌రెడ్డి, చంద్ర సురేశ్, అబ్దుల్ షుకూర్బేగ్లకు హోంగార్డ్స్, సివిల్ డిఫెన్స్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. • జైళ్లశాఖకు సంబంధించి హెడ్ వార్డర్ వలదాసు జోసెఫ్, చీఫ్ హెడ్ వార్డర్ జె.వీరాస్వామిలకు కరెక్షనల్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. 34 ఏళ్ల సర్వీసులో 30 రివార్డులు చౌటుప్పల్: కేంద్ర మెరిటోరియస్ పోలీస్ మెడల్‌కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఏఎస్సై కాట్రగడ్డ శ్రీనివాస్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అభినందించారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి.. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై వరకు 34 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాట్రగడ్డ శ్రీనివాస్ ఇప్పటివరకు 30 రివార్డులు పొందారు. తాజాగా ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక మెడల్‌కు ఎంపికవడం సంతోషంగా ఉందని శ్రీనివాస్ పేర్కొన్నారు. మహేశ్ భగవత్‌కు మూడోసారి.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌కు ప్రతిష్టాత్మక పోలీస్ మెడల్స్ దక్కడం ఇది మూడోసారి. 2004లో ప్రెసిడెంట్ పోలీసు మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీపీఎంజీ), 2011లో పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పురస్కారాలను అందుకున్న ఆయన.. తాజాగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ముగ్గురు రైల్వే పోలీసులకు మెడల్స్ విధుల్లో మంచి ప్రతిభ కనబర్చిన దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళానికి చెందిన ముగ్గురు సిబ్బంది పోలీస్ మెడల్స్‌కు ఎంపికయ్యారు. ఇందులో మహబూబ్‌నగర్‌లో ఆర్పీఎఫ్ ఎస్సైగా పనిచేస్తున్న సైదా తహసీన్, మౌలాలి రైల్వే రక్షణ దళం శిక్షణ కేంద్రంలో ఏఎస్సై నాటకం సుబ్బారావు, ఇదే శిక్షణ కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండి విజయ సారథి ఉన్నారు. చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం -
త్వరలోనే పోలీసు ఉద్యోగ ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువతకు రాచ కొండ పోలీస్ కమిషనరేట్ తరుఫున ప్రీ రిక్రూట్మెంట్ ఉచిత శిక్షణను ప్రారంభించ నున్నట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసు ఉద్యోగం సాధించాలన్నారు. గురువారం ఆయన అంబర్‌పేటలోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో డాగ్స్ కెన్నెల్, మెటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు సహకరిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసుల పాత్ర కీలకమైనదని, వారి సంక్షేమమే తొలి ప్రాధాన్యమన్నారు. పీఎస్ఓ డ్యూటీలు, బందోబస్త్, వీఐపీ సెక్యూరిటీ తదితర అంతర్గత భద్రతలో వీరి పాత్ర కీలకమని పేర్కొన్నారు. విధుల పట్ల నిబద్ధతతతో ఉంటూ శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. ఏఆర్ విభాగంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు చేరడం అభినందనీయమన్నారు. వివిధ విభాగాల్లో మహిళా సిబ్బంది తమ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు తగిన సహకారాన్ని అందిస్తామని, త్వరలోనే మహిళా పెట్రోలింగ్ బృందాలను ప్రవేశపెట్టనున్నామని ఈ సందర్భంగా సీపీ వెల్లడించారు. అనంతరం 15 రోజులుగా కొనసాగతున్న వార్షిక డీ–మొబిలైజేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్ బాబు, డీసీపీ క్రైమ్స్ యాదగిరి, డీసీపీలు సన్‌ప్రీత్ సింగ్, రక్షిత కే మూర్తి, సలీమా, అడిషనల్ డీసీపీలు ఎం శ్రీనివాస్, షమీర్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
వారెవ్వా.. కమీషనర్ చేసిన పనికి షబ్బాష్ అనాల్సిందే
-
1993లో ఇంటర్వ్యూలో ఫెయిల్.. నాలాగా ఇబ్బంది పడొద్దనే..
సాక్షి, హైదరాబాద్: వృత్తిరీత్యా ఆయన పోలీస్ కమిషనర్. నిత్యం పనులతో బిజీనే. అయినా సమయం చిక్కించుకుని.. సివిల్స్ రాసే అభ్యర్థులకు శిక్షణ.. గైడెన్స్‌తో అండగా నిలుస్తున్నారు. ఇలా ఇప్పటివరకు వెయ్యికి పైగా అభ్యర్థులు సివిల్స్ సాధించేలా తీర్చిదిద్దారు. తాజాగా 2020 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మొదటి 20 ర్యాంకుల్లో ఆరు మంది (3, 8, 14, 18, 19, 20), వంద ర్యాంక్స్లో 19 మందికి ఈయనే మెంటార్షిప్ వహించారు. ఆయనే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం.భగవత్. మంగళవారం తెలంగాణ టాపర్ పీ శ్రీజ (20వ ర్యాంక్), కనక్నాల రాహుల్ (218వ ర్యాంక్), పీ గౌతమి (317వ ర్యాంక్)లు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... చదవండి: సివిల్స్ టాప్ 20 ర్యాంక్: ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా ► 1993లో యూపీఎస్సీ మెయిన్స్‌లో పాసయ్యా. కానీ సరైన గైడెన్స్ లేకపోవటంతో ఇంటర్వ్యూలో ఫెయిలయ్యా. లోలోపల ఏదో తెలియని భయం. మానసికంగా కృంగదీసింది. స్థానికంగా ఉన్న సీనియర్ ఆఫీసర్ల మార్గనిర్దేశంతో రెండో ప్రయత్నంలో 1994లో విజయం సాధించా. సివిల్స్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేందుకు నాకు ఎదురైన ఇబ్బందులు నేటి యువతకు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో 2014 నుంచి శిక్షణ ఇవ్వటం ప్రారంభించా. చదవండి: సివిల్స్‌లో తెలుగువారి సత్తా ► హోదా వచ్చాక ఎవరైనా గౌరవిస్తారు. సాయం చేస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సరైన మార్గనిర్ధేశం చేసేవాళ్లే చాలా అవసరం. సివిల్స్‌లో ప్రతి ఒక్క మార్కు కూడా కీలకమే. దేశంలో ఏటా 10 లక్షల మంది పోటీపడితే ఉత్తీర్ణలయ్యేది 800 మంది లోపే ఉంటుంది. టాప్ 10 ర్యాంకర్ల మధ్య ఒక్క మార్కు తేడానే ఉంటుంది. మౌఖిక పరీక్షే ముఖ్యం ► సివిల్స్‌లో 275 మార్కులతో ఉండే మౌఖిక పరీక్ష చాలా కీలకం. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. లేకపోతే విజయం సాధించలేం. అందుకే ఇంటర్వ్యూకు ప్రిపేర్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించా. అభ్యర్థుల్లో ఆత్మ విశ్వాసం, మనోధైర్యాన్ని నింపేందుకు మెయిన్స్ పూర్తవగానే 3 నుంచి 4 నెలల పాటు ఉచితంగా ఇంటర్వ్యూపై కోచింగ్ ఇస్తున్నాం. మరికొందరి సాయం.. భద్రాద్రి–కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఐఆర్ఎస్లు (ఏపీ) సాధు నరసింహా రెడ్డి, నితేష్ పాథోడ్, ముకుల్ కులకర్ణి, ఐఆర్ఎస్ రిటైర్డ్ రాజీవ్ రణాదే, ఐఏఎస్‌లు నీల్కాంత్ అవద్, ఆనంద్ పాటిల్, డాక్టర్ శ్రీకర్ పరదేశి, అభిషేక్ సరాఫ్, ఎంయూఏడీ జాయింట్ కమిషనర్ సమీర్ ఉన్హాలే, ఐసీఏఎస్ సుప్రియ దేవస్థలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ శైలేంద్ర డియోలాంకర్, జేపీసీ డైరెక్టర్ డాక్టర్ వివేక్ కులకరి్ణలు కూడా నాతోపాటు సివిల్స్ అభ్యర్థులకు సహకరిస్తున్నారు. రెండు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా, జూమ్, వీడియో కాల్స్ ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులకు భౌతికంగా శిక్షణ ఇస్తున్నాం. ఫారెస్ట్ సర్వీసెస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల పరీక్షలకు కూడా ట్రెయినింగ్ ఉంటుంది. ► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, బీహార్, అసోం, ఒడిశా, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన సివిల్స్ అభ్యర్థులు మా వద్ద శిక్షణ పొందుతున్నారు. నా వద్ద శిక్షణ పొందిన సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (హైదరాబాద్ మాజీ సీపీ ఏకే ఖాన్ కుమారుడు), భైంసా ఏఎస్పీ కిరణ్ ఖరేలు ప్రస్తుతం మన రాష్ట్రంలో విధుల్లో ఉన్నారు. https://t.co/zb1mcIV0OA — Rachakonda Police (@RachakondaCop) September 28, 2021 -
ఫోన్లో మాట్లాడుతోందని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య
సాక్షి, హైదరాబాద్ : వనస్థలీపురంలో భర్త చేతిలో హత్యకు గురైన కవిత అనే యువతి కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మహేశ్ భగవత్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘వనస్థలీపురానికి చెందిన విజయ్(25) ఆటో డ్రైవర్. భార్య కవిత(21)ఎవరితోనో మాట్లాడుతోందన్న అనుమానంతో చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. జూన్ 18న అర్థరాత్రి కవిత పడుకున్న తర్వాత చంపేశాడు. కరోనాతో చనిపోయిందని అందరినీ నమ్మించాడు. ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. మృత దేహాన్ని నల్గొండకి తీసుకొని వెళ్లి అంతిమ కార్యక్రమాలు కూడా చేశారు. ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగింది. కవిత తల్లిదండ్రులకు అనుమానం రావటంతో వాళ్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారిస్తే అసలు విషయం తెలిసింది. రీ పోస్టుమార్టం చేస్తే నెగిటివ్ వచ్చింది’’ అని తెలిపారు. -
యువతులను ట్రాప్ చేసి.. కల్లు తాగించి, ఆపై..
సాక్షి, హైదరాబాద్ : యువతులను ట్రాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న హుస్సేన్ ఖాన్ అలియాస్ అలం ఖాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం నిందితుడిని మీడియా ముందు హాజరు పరిచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నారపల్లికి చెందిన హుస్సేన్ ఖాన్ 2008 నుండి నేరాలకు పాల్పడుతున్నాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో హుస్సేన్‌ను అరెస్ట్ చేశాం. ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. యువతులను ట్రాప్ చేసి అత్యాచారాలు చేసేవాడు. కల్లు కాపౌండ్కు తీసుకెళ్లి వారికి కల్లు తాగించేవాడు. అనంతరం వారిని స్కూటీ మీద బయటకు తీసుకెళ్లేవాడు. అక్కడ అత్యాచారం చేసి వారి దగ్గర ఉన్న బంగారం దోచుకెళ్లేవాడు. మొత్తం ఇతనిపై 17 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్స్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. అతనిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. న్యాయస్థానంలో కఠిన శిక్షలు పడేలా చూస్తాం. హుస్సేన్ అలీ ఖాన్ వద్ద నుండి 90 గ్రాముల బంగారం, 45వేల నగదు, మొబైల్ ఫోన్, హోండా యాక్టీవ్ బైక్ సీజ్ చేశా’’మని తెలిపారు. -
ప్రజలంతా కర్ఫ్యూకి సహకరించాలి: మహేష్ భగవత్
సాక్షి, హైదరాబాద్: నగర వాసులు నైట్ కర్ఫ్యూని విధిగా పాటించాలని రాచకొండ కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ కోరారు. సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. ఇప్పటికే రాష్ట్రంలో 5,900 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఈరోజు నుంచి మే1 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. బార్లు, హోటల్స్, రెస్టారెంట్లు, మాల్స్, షాప్స్ రాత్రి ఎనిమిది గంటలకు ముసివేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, మెడికల్, ఎమర్జెన్సీ సర్విస్, మీడీయా ఉద్యోగులు ఐడికార్డ్స్ వెంట పెట్టుకోవాలి అని సూచించారు. ఇక ‘‘నగరం మొత్తం మీద 46 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. చాలా సీరియస్‌గా కర్ఫ్యూ అమలు ఉంటుంది. కర్ఫ్యూ నిర్వహణలో భాగంగా పాట్రోల్ మోబైల్స్, బ్లూ కోట్స్ రంగంలోకి దింపాము. నిభందనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 51 నుంచి 60 వరకు డిజార్డర్ మానేజ్ మెంట్, ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తాం. మాస్క్ ధరించకుంటే వెయ్యిరూపాలు జరిమానా విధిస్తాం. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలి’’ అని కోరారు. చదవండి: నైట్ కర్ఫ్యూ: మెట్రో సేవల్లో మార్పులివే.. -
విద్యార్థిని కిడ్నాప్ చేయలేదు..అత్యాచారం జరగలేదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం అంతా ఆమె కల్పితమాటలేనని రాచకొండ పోలీసులకు దొరికిన శాస్త్రీయ ఆధారా లతో రుజువైంది. ఈ కేసులో ఆమే సూత్రధారి.. ఆమే పాత్రధారిగా పోలీసులు తేల్చారు. తొలుత భావించినట్లుగా ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేయలేదని, అత్యాచారం కూడా జరగలేదని సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన దృశ్యాలు తేల్చేశాయి. ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు డ్రామా ఆడిన విద్యార్థిని కేసు వివరాలను అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తితో కలసి నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్‌భగవత్ శనివారం మీడియాకు తెలిపారు. అసలేం జరిగిందంటే... మేడ్చల్ కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న ఆ విద్యార్థిని ప్రతిరోజూ లాగానే కాలేజీ రాంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి ఆర్ఎల్ నగర్‌కు వెళ్లేందుకు సెవెన్ సీటర్ ఆటో ఎక్కింది. అప్పటికే ఆమె తండ్రి ఫోన్‌కాల్ చేస్తే మరికొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆమె తల్లి ఫోన్‌కాల్ చేస్తే ఆ బస్టాప్ వద్ద ఆగకుండా ఆటోడ్రైవర్ వేగంతో ముందుకు తీసుకెళుతున్నాడంటూ అరుస్తూ చెప్పింది. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ కనెక్ట్ కాలేదు. దీంతో ఈ విషయాన్ని డయల్ 100కు కాల్ చెప్పారు. దీంతో అప్రమత్తమైన కీసర, ఘట్కేసర్, మల్కాజ్గిరి, ఉప్పల్, మేడిపల్లి పోలీసులతో పాటు ఎస్వోటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ గాలించారు. చివరకు అన్నోజిగూడ చెట్ల పొదల్లో ఆమె పంపిన లైవ్ లోకేషన్‌తో ఆచూకీ లభించడంతో జోడిమెట్లలోని క్యూర్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని చెప్పిన వివరాలతో మొదట కిడ్నాప్, ఆ తర్వాత నిర్భయ చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. వంద మంది పోలీసులు... తొలుత విద్యార్థిని చెప్పిన వివరాల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు నలుగురు ఆటోడ్రైవర్లతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళితే బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కుదరకపోవడంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అలాగే 10న సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో యువతి యామ్నాంపేట, ఘట్కేసర్, అన్నోజిగూడ ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లుగా సీసీటీవీలకు చిక్కిన దృశ్యాలతో తేల్చారు. అలాగే పోలీసుల అదుపులోకి తీసుకున్న అనుమానితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆయా ప్రాంతాల్లో లేనట్లుగా తేలింది. ఈ కేసులో విద్యార్థిని చెప్పినట్లుగా ముఖ్య అనుమానితుడిగా భావించిన ఆటోడ్రైవర్ ఘట్కేసర్ రాకుండానే యామ్నాంపేట నుంచి తిరిగి ఈసీఐఎల్, అక్కడి నుంచి మల్టీప్లెక్స్ థియేటర్, ఆ తర్వాత వైన్‌షాప్‌కు వెళ్లినట్లుగా సీసీటీవీ కెమెరాల ద్వారా తేలింది. చదవండి: (బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం) దీంతో విద్యార్థినిని మరోసారి ప్రశ్నించగా ‘తల్లి పదేపదే ఫోన్‌కాల్ చేస్తుండటంతోనే ఈ డ్రామా ఆడానని, ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే ఇలా చేశాన’ని చెప్పింది. గతంలో కరోనా సమయంలో ఆటో చార్జీల విషయంలో ఓ ఆటోడ్రైవర్‌తో గొడవపడటంతో మనసులో పెట్టుకొని అతని పేరు చెప్పినట్లుగా బాధితురాలు చెప్పిందని సీపీ తెలిపారు. 6 నెలల క్రితం తన స్నేహితునితోనూ తనను కిడ్నాప్ చేశారంటూ కట్టుకథ అల్లిందని, 10 తేదీన కూడా ఆటోలో వచ్చేరోజూ తన సీనియర్ విద్యార్థితోనూ కిడ్నాప్ గురించి విషయాలు మాట్లాడిందని తేలిందన్నారు. కుటుంబ సమస్యలతోనే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుందని, అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు ఛేదించామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కీసర సీఐ జే.నరేందర్‌గౌడ్‌తో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో మహేశ్ భగవత్ సత్కరించారు. 10వ తేదీన ఏఏ సమయాల్లో ఎక్కడుందంటే... ♦సాయంత్రం 5.30: రాంపల్లి ఎక్స్ రోడ్డు నుంచి ఆటోలో ప్రయాణం ♦సాయంత్రం 5.57: యామ్నాంపేట టీస్టాల్ ముందు ఆటో దిగింది ♦సాయంత్రం 6.03: ఒంటరిగా నడుచుకుంటూ తల్లికి ఫోన్‌కాల్ చేసింది. ♦సాయంత్రం 6.15: శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీవైపు వెళ్లింది. ♦సాయంత్రం 6.44: కొండాపూర్ రైల్వే గేట్ ♦సాయంత్రం 6.48: ఘట్కేసర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్డు ♦సాయంత్రం 6.58: సాయి లేడీస్ హాస్టల్ ♦సాయంత్రం 6.59: ఘట్కేసర్ ఓల్డ్ విలేజ్ ♦రాత్రి 7.05: కల్కి ఆసుపత్రి ముందు ఆటో ఎక్కింది ♦రాత్రి 7.23: ఎన్టీపీసీ ఎక్స్‌రోడ్డు, అన్నోజిగూడలో దిగింది. అక్కడి నుంచి 150 మీటర్ల దూరంలోనే ఆమె ఆచూకీ పోలీసులకు దొరికింది. -
విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు : సీపీ
-
ఘట్కేసర్ ఘటన: అంతా కట్టుకథ
సాక్షి, హైదరాబాద్ : ఘట్కేసర్ భీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. యువతి కిడ్నాప్‌ను ఓ కట్టుకథగా తేల్చిచెప్పారు. బీఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారం జరగలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ శనివారం మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. యువతి కావాలనే కట్టుకథలు అల్లిందని, పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవపట్టిందని పేర్కొన్నారు. తొలుత యువతిని కిడ్నాప్ చేశారన్న సమాచారంతో అలర్ట్ అయ్యామని, యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కిడ్నాపు కేసు నమోదు చేశామని తెలిపారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేశామని, విచారణలో యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు వాస్తవాలు బయటపడ్డయన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణలో వాస్తవాలను గుర్తించామన్నారు. యువతి చెప్పినట్టు కేసులో ఆటో డ్రైవర్ పాత్ర లేదని సీపీ స్పష్టం చేశారు. తనపై అత్యాచారం జరిగినట్లు పోలీసులను నమ్మించడానికి తన దుస్తులను తానే చింపుకుందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థిని తనకు తానే ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. కిడ్పాప్ లేదు, రేప్ లేదన్నారు. యువతి అందరినీ తప్పుదోవ పట్టిందని చెప్పారు. యువతి డ్రామాతో మూడు రోజులుగా పోలీసులు నిద్రలేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆటో డ్రైవర్లు తమకు బాగా సహకరించారన్నారు. యువతి కిడ్నాప్, అత్యాచారం కేసును తప్పుడు కేసుగా సీపీ మహేష్ భగవత్ తేల్చిచెప్పారు. కాగా కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ వాసి బుధవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తూ.. నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ బస్టాప్ వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో అక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్లి ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు కిడ్నాప్ చేసేందుకు యత్నించారని చెప్పడంతో తొలుత పోలీసులు కిడ్నాప్‌గా కేసు నమోదు చేశారు. గురువారం బాధితురాలిని లోతుగా విచారించిన పోలీసులు నిర్భయ చట్టం కింద వివిధ కేసులు నమోదు చేశారు. అనంతరం పోలీసులు విచారించిన ఇదంతా కట్టుకథగా తేలింది. ఘట్కేసర్ అత్యాచారం కేసు: కొత్త ట్విస్టు -
అబ్బాయితో అమ్మాయిలా మొదలెడతారు..
సాక్షి, హైదరాబాద్: టీమ్ గిఫ్ట్ పేరుతో ఫ్రాడ్ చేస్తున్న సైబర్ క్రైమ్ ముఠాను అరెస్ట్ చేసినట్ల రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఢిల్లీ నుంచి రాకెట్ నడిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ తయారుచేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. అబ్బాయితో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేయడం మొదలుపెడతారు. ఇదే విధంగా హైదరాబాద్‌కు చెందిన అబ్బాయికి సోఫియా అనే అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ వచ్చింది. అనంతరం మీ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాను అని మెసేజ్ చేసింది. తర్వాత ముంబై ఎయిర్‌పోర్ట్‌లతో ల్యాండ్ అయ్యాను. నా దగ్గర 75 వేల పౌండ్స్ క్యాష్, గోల్డ్ చైన్స్, మొబైల్ ఫోన్స్‌కు కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని బాధితుడితో డబ్బులు వేయించుకున్నారు. చదవండి: (భూ వివాదం: సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు) ముఠా సభ్యులంతా ఢిల్లీలో ఒకే చోట కలిసి ఉంటూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశాము. నిందితులపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాము. డింగ్ టోన్ యాప్‌ని ఉపయోగించి అమాయకులను మోసం చేస్తున్నారు. తమ అకౌంట్లో వేయించుకున్న నగదుతో ఢిల్లీలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. గుర్తు తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకూడదు. ఇలాంటి తరహా మోసాలే మ్యాట్రిమోని పేరుతో కూడా జరుగుతున్నాయి. జేమ్స్ బాండ్ లాగా ప్రొఫైల్ తయారు చేసి మోసం చేస్తున్నారు. రాచకొండ పరిధిలో ఏడుగురు వీరి చేతిలో మోసపోయినట్ల తెలుస్తోంది' అని మహేష్ భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. -
భూ వివాదం: సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
చౌటుప్పల్: భూవివాదంలో తలదూర్చినందున చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్. వెంకన్నగౌడ్, ఎస్ఐ నర్సయ్యపై సస్పెషన్ వేటు పడింది. అదే విధంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు చార్జ్ మెమో జారీ అయింది. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో 2.33 ఎకరాల భూమికి సంబంధిం వివాదం నెలకొంది. దాంతో ఇరువర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో భువనగిరి కోర్టు పట్టాదారుడికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. సదరు కోర్టు ఉత్తర్వులను ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం భూమికి యజమానిగా ఉన్న వ్యక్తి ఇటీవల రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌ను ఆశ్రయించాడు. దాంతో కమిషనర్ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించగా ఆరోపణలు వాస్తవమని తేలడంతో సీఐ, ఎస్ఐని సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పర్యవేక్షణ లోపం కారణంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు మెమో జారీ చేశారు.(చదవండి: అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!) కోర్టు ఉత్తర్వులు ఉన్నా బెదిరించారు: గౌరీబట్ల సురేందర్, బాధితుడు నాకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ స్థానిక సీఐ, ఎస్ఐ బెదిరించారు. తాళ్లసింగారం గ్రామంలో 2012 సంవత్సరంలో కొనుగోలు చేసిన 2.33 ఎకరాల భూమి నాపేరిట ఉంది. నేను ఎవరికీ అగ్రిమెంటు చేయలేదు. కానీ కొంత మంది తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దాంతో స్థానిక పోలీసు లను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో కోర్టుకు వెళ్లాను. భువనగిరి కోర్టు నాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సీఐ, ఎస్ఐ నన్ను బెదిరించారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలను సీపీ మహేష్ భగవత్‌కు అందజేయగా విచారణ నిర్వహించి చర్యలు తీసుకున్నారు. -
రాచకొండలో 12 శాతం తగ్గిన క్రైమ్ రేట్
సాక్షి, హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాచకొండలో 12 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని, కానీ మహిళలపై వేధింపుల కేసులు మాత్రం 11 శాతం పెరిగాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ తెలిపారు. దోపిడీలు, దొంగతనాల కేసుల్లోనూ 53 శాతం రికవరీ అయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ అరికట్టేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ యోదా పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని తెలంగాణలోనే తొలిసారిగా సీపీ మహేష్ భగవత్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూను వెల్లడించారు. (చదవండి:ఫ్లాగ్ మార్చ్‌లో రికార్డు!) రాచకొండలో మర్డర్ 52 , అత్యాచారాలు 323, కిడ్నాప్ 137 కేసులు నమోదు చేశామని కమిషనర్ పేర్కొన్నారు. దొంగతనం 1863, చీటింగ్ 1539, హత్యాయత్నాలు 116 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో 11 892 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డయల్ 100కు రోజూ 1,66,181కు తక్కువ కాకుండా ఫిర్యాదులు వచ్చాయన్నారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ చెందిన కేసులు 892 ఉండగా రూ.5 కోట్ల 95 లక్షల ఆస్తి రికవరీ చేశామన్నారు. 2,525 మిస్సింగ్ కేసులు నమోదవగా, 2233 కేసులు ఛేదించామని తెలిపారు. ఈఏడాది 89 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించామన్నారు. రాచకొండలో నమోదైన కేసుల గురించి సీపీ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. (చదవండి:15 రోజుల్లో పెళ్లి.. ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ) నేరాలు: మానవ అక్రమ రవాణా కేసులు 41 ఎక్స్సైజ్ కేసులు 202 అక్రమంగా పీడీఎస్ రైస్ తరలింపు కేసులు 105 సైబర్ క్రైమ్ కేసులు 704 సోషియల్ మీడియా కేసులు 4, 9026గా ఉన్నాయి. ట్రాఫిక్ : ► డ్రంక్ అండ్ డ్రైవ్ 3, 203, ఇందులో 324 మందిని జైలుకు పంపాము. ► డ్రంక్ డ్రైవ్ చేసిన వారికి రూ. 63 ,79 000 జరిమానాలు విధించాము. ► ఎంవీ యాక్ట్ కింద 15 లక్షల 56 వేల కేసులు నమోదు చేయగా కోటి 70 లక్షల రూపాయల జరిమానాలు విధించాము. ► రాచకొండలో 2047 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 533 మంది మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 31 యాక్సిడెంట్లు జరగ్గా, 15 మంది మృతి చెందారు. ► ఈ ఏడాది షీ టీమ్స్ 332 కేసులు నమోదు చేశాము. ► బాల్య వివాహాలు ఆపి 92 మందిని, ఆపరేషన్ ముస్కాన్ కింద 259 మంది పిల్లలను రెస్క్యూ చేశాము. ► రాచకొండలో 1052 మంది పోలుసులకు కరోనా సోకగా, అందులో 1022 రికవరీ అయ్యారు. 70 మంది పోలుసులు ప్లాస్మా దానం చేశారు. ► రాజా దర్బార్ ద్వారా 1453 ఫిర్యాదులు వస్తే 927 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయి. ► 1186 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము. ► మూఢనమ్మకాలపై కళాబృందాలు ద్వారా 74 గ్రామాల్లో అవగాహన కల్పించాము ► నైజేరియన్ మోసాలు 40 , ఏటీఎం క్లోనింగ్ 15 , లోన్ ఫ్రాడ్స్ 42 కేసులు నమోదు చేశాము. ► సోషియల్ మీడియా ద్వారా అమ్మాయిలని వేధించిన 26 మందిని అరెస్ట్ చేశాము. ► ఈ ఏడాది శంషాబాద్ విమానాశ్రయంలో 35 కిలోల బంగారం పట్టుబడగా దాని విలువ రూ.15 కోట్లుగా ఉంటుందన్నారు. ► 2019 లో రూ.19కోట్లు విలువ చేసే 58.145 కేజీల బంగారం పట్టుకున్నాము. -
ఏటీఎం చోరీలు..నిందితుల హిస్టరీ చూస్తే..
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా రాచకొండ పరిధిలో జరుగుతున్న వరుస ఏటీఎం చోరీలపై నిఘా ఉంచామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బు దొంగలిస్తున్నారని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒక పోలీస్ వాహనం దొంగలించి ఏటీఎం చోరీ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే దుండగులను గుర్తించామని, వీరంతా హర్యానాలోని మోహత్ ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్నారని, ఇప్పటివరకు వీరిపై 11 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసులో మొత్తం 6గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. (అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు ముమ్మరం) 'ఈనెల 15న నాచారంలో రెండు ఇళ్లలో చోరీ జరిగి, 35 వేల 800 నగదు పోయాయని ఫిర్యాదు వచ్చింది. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాను పరిశీలించగా, ఓ వ్యక్తిపై అనుమానం కలిగింది. ఇందులో మహమ్మద్ సద్దర్ అనే వ్యక్తి వేలిముద్రలు లభించాయి. 2015 నుంచి ఇతను దాదాపు 33 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. జైలులో ఉండగానే మొయినాబాద్‌కి చెందిన ఆయుబ్తో సద్దార్ కు జైల్లో పరిచయం అయింది. వీరిద్దరూ కలిసి వరుస దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పటికే 118 కేసుల్లో నిందితుడైన ఆయూబ్‌పై 19 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా లోకల్ వ్యక్తుల పరిచయాలతో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం. కొందరు లారీ డ్రైవర్లు కూడా వీరికి సహకరిస్తున్నట్లు తేలింది. వీరి నుంచి 42తులాల బంగారు ఆభరణాలు, 70తులాల వెండి, 36వేల నగదు, ఒక మారుతి కారు స్వాధీనం చేసుకున్నాం' అని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఏటీఎం సెంటర్లలో గ్యాస్ కట్టర్‌తో వరుస చోరీలు చేస్తున్నారని, ఈ సందర్భంగా ప్రతి ఏటీఎం వద్ద సెక్యూరిటీలను, అలారం సిస్టమ్‌ను పెట్టుకోవాలని బ్యాంక్ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. (పెళ్లి మంటపంపైనే నగలు చోరీ ) -
గ్రేటర్ ఎన్నికలు: భారీ పోలీసు బలగాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. (చదవండి: జీహెచ్ఎంసీ: 13,500 మందితో పటిష్ట భద్రత) హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో.. రేపటి ఎన్నికల పోలింగ్‌కు భద్రతా పరమైన అన్నీ చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో 89 వార్డులు ఉన్నాయని, 4979 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు- 1517, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 167 గుర్తించామని పేర్కొన్నారు. 406 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 4187 గన్స్ డిపాజిట్ అయ్యాయి. 3066 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని పేర్కొన్నారు. (చదవండి: జనతా గ్యారేజ్ X కల్వకుంట్ల గ్యారేజ్) ‘‘పోలీసుల తనిఖీల్లో 1.45 కోట్ల రూపాయల స్వాధీనం చేసుకున్నాం. పలు చోట్ల భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నాం. 63 ఫిర్యాదులో 55 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశాం. సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం. కౌంటింగ్ కేంద్రాల బయట నిరంతర సీసీటీవీ నిఘా ఉంచాం. రేపు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ రోజున ప్రతి అభ్యర్థికి కేవలం ఒక్క వార్డు వద్ద ఒక్క వాహనం మాత్రమే అనుమతి ఇస్తాం. ఎలక్షన్ ఏజెంట్ కూడా అదే వాహనం లో వెళ్ళాలని’’ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మొత్తం 13 పోలీస్స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరగుతాయని తెలిపారు. 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. 15 లక్షలు విలువైన మద్యాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజలు 9490617111 కు సమాచారం అందించాలని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 4,800 మంది రోహింగ్యాలు ఉన్నారని వారిలో 4,500 మందికి బయోమెట్రిక్ నిర్వహించామని పేర్కొన్నారు. 160 మందిపై కేసులు నమోదు చేసామని వెల్లడించారు. నకిలీ పాస్‌పోర్టు కలిగిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ 9,101 పోలింగ్ కేంద్రాలు.. 74,67,256 మంది ఓటర్లు మొత్తం 150 వార్డులు, బరిలో 1,122 మంది అభ్యర్థులు టీఆర్ఎస్-150, బీజేపీ-149, కాంగ్రెస్-146 చోట్ల పోటీ టీడీపీ-106, ఎంఐఎం-51, సీపీఐ-17 డివిజన్లలో పోటీ సీపీఎం-12, స్వతంత్రులు-415, ఇతరులు 76 చోట్ల పోటీ 60 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్‌లు పోలింగ్ విధుల్లో 36,404 వేల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో 45 వేల మంది సిబ్బంది గ్రేటర్లో అతిపెద్ద డివిజన్ మైలార్‌దేవ్‌పల్లి గ్రేటర్లో అతిచిన్న డివిజన్ ఆర్సీపురం గ్రేటర్ ఎన్నికల కోసం 18,202 బ్యాలెట్ బాక్స్‌లు పోస్టల్ బ్యాలెట్ కోసం 2,629 మంది దరఖాస్తు డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు -
గ్రేటర్ పోరు: భారీ బందోబస్తు..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాచకొండ పరిధిలో 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌లోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయని వెల్లడించారు. 1072 సాధారణ, 512 సమస్యత్మక, 53 అతి సమస్యత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. (చదవండి: ఆ వదంతులు నమ్మకండి) 29 చెక్‌పోస్ట్‌లు, 90 పికెట్స్, 104 వాహనాలు ఏర్పాటు చేసి నిఘా పట్టిష్టం చేశామని పేర్కొన్నారు. ఆరు ఫ్లెయింగ్ స్క్వాడ్, ఏసీపీ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 533 నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. సోషల్ మీడియాలో దూషణలు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. 353 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 10 మోంటెడ్ కెమెరా వాహనాలతో నిఘా పటిష్టం చేశామని పేర్కొన్నారు. 89 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని, 140 నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని కమిషనర్ పేర్కొన్నారు. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: ఎస్ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..) -
బల్దియా పోరు; అభ్యర్థులూ తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్ : నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ..ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అధికారులను బాధ్యులుగా నియమించారు. ప్రధాన కమిషనరేట్‌లో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటైంది. నగర సంయుక్త పోలీసు కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) తరుణ్ జోషి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. శాంతిభద్రతల విభాగం అదనపు సీపీ డీఎస్ చౌహాన్ సైతం ఇందులో కీలక భూమిక పోషిస్తారు. కోడ్ అమలులో ఉన్న రోజుల్లో ప్రతిరోజూ ఓ డీఎస్ఆర్ (డెయిలీ సిట్యువేషన్ రిపోర్ట్) తయారు చేసి నివేదించాల్సిన బాధ్యత ఈ సెల్‌పై ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనల్ ఇన్చార్జిలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడం తదితర బాధ్యతలను చౌహాన్ నిర్వహిస్తారు. బుధవారం నుంచి మొదలయ్యే ఎన్నికల నామినేషన్లు పర్వం మొదలుకుని వచ్చే నెల్లో ఫలితాలు ప్రకటించేంత వరకు ఈ విభాగం కొనసాగుతుంది. బందోబస్తు సంబంధిత చర్యలను ఈ విభాగం ద్వారానే నిర్వహిస్తారు. చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలు: అధికారుల కొరడా ఎలక్షన్ సెల్ రెడీ! ‘గ్రేటర్’ ఎన్నికల సైరన్ మోగడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ప్రక్రియలో భాగంగా నగరంలోని పరిస్థితులు బేరీజు వేడానికి, సందర్భానుసారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రధాన కమిషనరేట్‌లో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటైంది. నగర సంయుక్త పోలీసు కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) తరుణ్ జోషి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. శాంతిభద్రతల విభాగం అదనపు సీపీ డీఎస్ చౌహాన్ సైతం ఇందులో కీలక భూమిక పోషిస్తారు. కోడ్ అమలులో ఉన్న రోజుల్లో ప్రతిరోజూ ఓ డీఎస్ఆర్ (డెయిలీ సిట్యువేషన్ రిపోర్ట్) తయారు చేసి నివేదించాల్సిన బాధ్యత ఈ సెల్‌పై ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనల్ ఇన్చార్జిలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడం తదితర బాధ్యతలను చౌహాన్ నిర్వహిస్తారు. బుధవారం నుంచి మొదలయ్యే ఎన్నికల నామినేషన్లు పర్వం మొదలుకుని వచ్చే నెల్లో ఫలితాలు ప్రకటించేంత వరకు ఈ విభాగం కొనసాగుతుంది. ఎన్నికల బందోబస్తుకు అవసరమైన అన్ని చర్యలను ఈ విభాగం ద్వారానే నిర్వహిస్తారు. చదవండి: ‘గ్రేటర్’ వార్ 1న ► నగరంలోని అయిదు జోన్లలో ఎన్నికల విధి నిర్వహణ, అవసరమై బలగాల కేటాయింపు, వారికి అవసరమైన వనరులు, సౌకర్యాలను ఏర్పాటు చేయడం తదితర విధులు కూడా ఎన్నికల సెల్ నిర్వహిస్తుంది. డీజీపీ కార్యాలయంతో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఏర్పాటైన ఎలక్షన్ సెల్‌కు సంబంధించిన హాట్‌లైన్ దీనికి అనుసంధానించి ఉంటాయి. ► జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో ఎన్నికల విధులకు సంబంధించిన పనుల పర్యవేక్షణ, సమన్వయం కోసం ఈ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కోడ్ అమలు, ప్రవర్తన నియమావళి తదితరాలకు సంబంధించి కొత్వాల్ అంజనీకుమార్ అన్ని స్థాయిన అధికారులను సమాయత్తం చేస్తున్నారు. దీనికోసం ఆయన మంగళవారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరాయ భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ►ఇందులో గత ఎన్నికల్లో జరిగిన ఉదంతాలు, ఆ కేసుల స్థితిగతులు, ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలను చర్చించారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలోని లైసెన్డ్ ఆయుధాలు కలిగి ఉన్న వారంతా వాటిని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ►స్థానిక పోలీసుస్టేషన్లు లేదా అధీకృత ఆయుధ డీలర్ల దగ్గర డిపాజిట్ చేయాలి. కౌంటింగ్ తదితర ప్రక్రియలు పూర్తయ్యాక మాత్రమే తమ ఆయుధాలను తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వం సైతం ఊపందుకోనుంది. ఈ ప్రక్రియలో భాగంగా సభలు, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించాలని భావించే రాజకీయ పార్టీలు, వ్యక్తులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ► కోవిడ్ నేపథ్యంలో బహిరంగ సభల్ని ఎస్ఈసీ నిషేధించింది. మిగిలినవీ పరిమిత సంఖ్యలో, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరగనున్నాయి. దీనికోసం ఆయా అభ్యర్థులు, పార్టీలు సంబంధిత జోనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)లకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుని ఈ అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి అనువుగా నిర్ణీత గడువుకు ముందే డీసీపీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ►రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం కోసం ఏర్పాటు చేసే సంచార వాహనాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సైబరాబాద్.. రాచకొండ పరిధిలోనూ.. బల్దియా ఎన్నికలకు నగారా మోగడంతో సైబరాబాద్, రాచకొండ పోలీసులు భద్రతా విధుల్లో తలమునకలయ్యారు. ఆయా కమిషనరేట్లలో ఉన్న 66 డివిజన్లలో అభ్యర్థుల నామినేషన్ దగ్గరి నుంచి ఎన్నికల కౌంటింగ్ వరకు దాదాపు 14,500 మందికిపైగా పోలీసు సిబ్బంది సేవలను వినియోగించనున్నారు. సైబరాబాద్‌లో 38 డివిజన్లు, రాచకొండలో 28 డివిజన్లు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ఫ్లయింగ్ స్క్వాడ్లతో ఇటు నగదు, అటు మద్యం సరఫరాపై ప్రధానంగా నిఘా వేసి ఉంచుతామని ఇరు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు మహేష్ భగవత్, వీసీ సజ్జనార్ తెలిపారు. పక్కా ప్రణాళికతో ముందుకు.. ఎన్నికల వంటి కీలక ఘట్టాల్లో ఎంత పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామో.. అంత సజావుగా ఆ ఘట్టాలను పూర్తి చేసి విజయం సాధించగలం. సిటీ పోలీసులకు ఎన్నికల నిర్వహణలో మంచి అనుభవం ఉంది. 2018, 2019ల్లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్ని సజావుగా పూర్తి చేసి ఈసీ మన్ననలు పొందాం. మరోసారి నాటి విధివిధానాలను మననం చేసుకోవాలి. సమకాలీన అవసరాలకు తగ్గట్టు మార్పు చేర్పులతో కొత్త పంథాలో ముందుకు వెళ్లాలి. – పోలీసు అధికారులతో కొత్వాల్ అంజనీకుమార్ కోడ్ కూసింది గ్రేటర్ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఇక కొత్త పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బంద్ కానున్నాయి. ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్న పనుల్ని మాత్రం యధాతథంగా కొనసాగించనున్నారు. అధికార పార్టీతోపాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని తమ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. కోడ్‌ను ఉల్లంఘించినట్లు తేలితే ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులూ తస్మాత్ జాగ్రత్త! -
నాచారం దోపిడి, అత్యాయత్నం కేసు ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: వృద్దురాలికి మత్తు మందు ఇచ్చి దోపిడికి పాల్పడిన ముఠాను రాచకొండ సీపీ మహేష్ భగవత్ అరెస్టు చేశారు. నేపాలీ గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 19న నాచారం పోలీసుల స్టేషన్ పరిధిలో దోపిడీ, అత్యాయత్నం కేసు నమోదైనట్లు చెప్పారు. నేపాలీ గ్యాంగ్ ఇంట్లో మొదట పనిమనుషులుగా చేరి అదును చూసి దోపిడీకి పాల్పడినట్లు చెప్పారు. ఈ ముఠాను పట్టుకునేందుకు 25 పోలీసు బృందాలతో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పంపి అరెస్టు చేశామన్నారు అయితే ఈ ముఠాలో మొత్తం 8 మంది ఉన్నారన్నారు. గ్యాంగ్‌లోని అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి లక్ష తొంబై వేల నగదు, 9 తులాల బంగారం, గోల్డ్ లాకెట్, గోల్డ్ హారం, నిద్ర మాత్రలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నాచారంలో ప్రదీప్ ఇంట్లో మొదట మాయ, అర్జున్‌లు ఇద్దరూ భార్య భర్తలు అని చెప్పి ఇంట్లో పని మనుషులుగా చేరారని, ఈ నేపథ్యంలో 15 రోజులు పాటు ఇంట్లో పనులు కూడా చేశారన్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒంటరిగా ఉన్న వృద్దురాలికి మత్తు మందు ఇచ్చి ఇంట్లో ఉన్న 10 లక్షల నగదుతో పాటు 9 తులాల బంగారు నగలు దొంగలించారన్నారు. అయితే ప్రదీప్ తన స్నేహితుడు పురుషోత్తంతో నేపాలీకి చెందిన వారే తన ఇంట్లో పని మనుషులుగా కావాలని చెప్పడంతో పురుషోత్తం డ్రైవర్ రాజు సహాయంతో మాయ, అర్జున్‌లను ప్రదీప్ ఇంట్లో పనిమనుషులుగా చేర్పించారని వెల్లడైందన్నారు. వారితో పాటు మరో ఇద్దరూ ఇక్కడికి వచ్చారని మొత్తం 8 మంది ఈ గ్యాంగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ముఠాకు చెందిన అయిదుగురిని అరెస్టు చేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. -
పోలీసుల అదుపులో కోల్ మాఫియా గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: బొగ్గును అక్రమ రవాణా చేస్తున్న కోల్ మాఫియా గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నల్లబొగ్గు అక్రమ రవాణా చేస్తున్న ఎనిమిది నిందితులను అదుపులోకి తీసుకున్నాం. 1,050 టన్నుల బొగ్గును సీజ్ చేశాం. నిందితల నుంచి రెండు లక్షల యాభై వేల నగదు, రెండు లారీలతో సహా దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం బొగ్గు మాఫియాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నాం. ఇబ్రహీంపట్నం రాందాస్‌పల్లిలో డంపింగ్ యార్డ్ తయారు చేసుకుని ముఠా కోల్ మాఫియా కొనసాగిస్తున్నట్లు గుర్తించాం. అక్రమంగా లారీ డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారం నడిపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన బొగ్గును ఈ డంపింగ్ యార్డ్‌కు తెసుకొచ్చి వాటిని కల్తీ చేసి వివిధ ప్రాంతాలకు పంపుతారు. కృష్ణ పట్నం, కొత్తగూడెం నుంచి బొగ్గు సరఫరా ఎక్కువగా అవుతుంది. ఇతర రాష్ట్రాల సిమెంట్, ఐరన్ ఫ్యాక్టరీలకు బొగ్గును సరఫరా చేస్తారు. క్వాలిటీ ఉన్న బొగ్గులో నాణ్యత లేని వాటిని మిక్స్‌చేసి పలు కంపెనీలకు సరఫరా చేస్తారు' అని మహేష్ భగవత్ తెలిపారు. -
‘టాప్‌బాస్’లకు తప్పని బదిలీలు..?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీ అనివార్యంగా మారింది. వివిధ కారణాల నేపథ్యంలో కొన్ని పోస్టులు సుదీర్ఘకాలంగా ఇన్‌చార్జ్‌ల నేతృత్వంలో కొనసాగుతుండగా మరి కొందరు అధికారులు పదోన్నతి పొంది బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఈ నెలాఖరుకు ఇంకొందరు రిటైర్ కానున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో బోనాల పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. సాధారణంగా ఏటా ఈ పండుగకు భారీ స్థాయిలో బందోబస్తు అవసరం కావడంతో ఆ ప్రభావం పోలీసు బదిలీలపై ఉండేది. ఈ ఏడాది అలా కాకపోవడంతో ట్రాన్స్‌ఫర్స్‌కు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాబితాలకు తుదిమెరుగులు దిద్దుతున్న ఉన్నతాధికారులు ఈ నెలాఖరు లోగా ప్రభుత్వానికి నివేదించి ఉత్తర్వులు జారీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పదోన్నతి వచ్చి ఏడాది దాటినా... నగర పోలీసు చరిత్రలో గత ఏడాది ఓ అరుదైన ఘట్టం ఆవిష్క్రృతమైంది. రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నగరంలోని మూడు కమిషనరేట్లలో పని చేస్తున్న వారు అప్పట్లో ఏడుగురు ఉండేవారు. అయితే అప్పట్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పదోన్నతులు ఇవ్వడంతో పాటే బదిలీలు సాధ్యం కాలేదు. ఫలితంగా ప్రతి అధికారినీ వారు పని చేస్తున్న స్థానంలోనే పదోన్నతి పొందిన హోదాతో కొనసాగేలా ఆదేశాలు ఇచ్చింది. కేవలం రాచకొండ జాయింట్ సీపీగా పని చేస్తున్న జి.సుధీర్‌బాబును మాత్రం అదే కమిషనరేట్‌కు అదనపు సీపీగా నియమించారు. మిగిలిన వారంతా పై హోదాలో కింది పోస్టుల్లో కింది పోస్టుల్లో కొనసాగాల్సి వచ్చింది. ఇలా, ఈ స్థాయిలో అధికారులు గతంలో ఎన్నడూ పని చేయకపోవడంతో ఈ అరుదైన అంశం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూపులు... పోలీసు కమిషనరేట్‌కు నేతృత్వం వహించే కమిషనర్ నుంచి పోలీసు స్టేషన్‌కు ఇన్చార్జ్గా ఉండే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వరకు నిర్ధిçష్ట హోదాలు ఉంటాయి. ఆ హోదా దాటి పదోన్నతి వచ్చినప్పుడు వారిని బదిలీ చేయడం అనివార్యం. అదనపు డీజీ ర్యాంకు అధికారి పోలీసు కమిషనర్‌గా ఉంటారు. సిటీ పోలీసు విభాగానికి ఆయనే బాస్ కాబట్టి అదనపు కమిషనర్లు అంతా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) ర్యాంకు వాళ్ళే ఉంటారు. గత ఏడాది ఐపీఎస్‌ల పదోన్నతి నేపథ్యంలో సిటీ కమిషనరేట్‌లో డీసీపీ నుంచి అదనపు సీపీ వరకు వివిధ హోదాల్లో ఉన్న ఆరుగురు అధికారులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో బదిలీలు లేకుండా పాత స్థానాల్లోనే కొనసాగాల్సి వచ్చింది. ఈ హోదాల్లో ఇలా జరగడం అదే తొలిసారి. నగర అదనపు సీపీ (క్రైమ్స్ అండ్ సిట్)గా పని చేస్తున్న షికా గోయల్‌కు అదనపు డీజీగా పదోన్నతి వచ్చినా అక్కడే కొనసాగుతున్నారు. ఎస్పీ హోదాలో వెస్ట్‌జోన్ డీసీపీగా పని చేస్తున్న ఏఆర్ శ్రీనివాస్‌కు డీఐజీగా పదోన్నతి వచ్చింది. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, మధ్య మండల డీసీపీ పి.విశ్వప్రసాద్, తూర్పు మండల డీసీపీ ఎం.రమేష్ పాత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. వీరితో పాటు మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావుకు సీనియర్ ఎస్పీగా పదోన్నతి వచ్చింది. ఈ హోదాలో డీసీపీగానూ పని చేసే ఆస్కారం ఉండటంతో ఆ పోస్టులోనే కొనసాగుతూ ఇటీవలే డీఐజీగానూ పదోన్నతి పొందారు. నెలాఖరులో రిటైర్ అవుతున్న ఈయన మినహా మిగిలిన అధికారులు ఏడాదికి పైగా బదిలీలు కోసం ఎదురుచూస్తున్నారు. ‘టాప్‌బాస్’లకు తప్పని బదిలీలు..? భౌగోళికంగా ఒకటిగా ఉన్న రాజధానిలో పోలీసు పరంగా మూడు కమిషనరేట్లకు ఉన్నాయి. వీటిని ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తుంటారు. హైదరాబాద్‌కు అదనపు డీజీ స్థాయిలో అంజనీకుమర్, సైబరాబాద్, రాచకొండలకు ఐజీ హోదాల్లో వీసీ సజ్జనార్, మహేష్ మురళీధర్ భగవత్ నేతృత్వం వహిస్తున్నారు. సాధారణంగా ఈ పోస్టులను రెండేళ్లను టెన్యూర్ పీరియడ్‌గా పరిగణిస్తూ ఉంటారు. ఆ టైమ్ పూర్తయిన తర్వాత ఏ క్షణమైనా బదిలీలు తప్పవన్నది ప్రతి అధికారికీ తెలిసిన విషయమే. రాజధాని విషయానికి వస్తే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్‌లు ఆ పోస్టుల్లోకి వచ్చి రెండేళ్లు దాటింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్‌కు టెన్యూర్ పూర్తి కావడంతో పాటు ఆయనకు ఇటీవలే అదనపు డీజీగా పదోన్నతి వచ్చింది. దీంతో ఈ మూడు పోస్టుల్లోనూ మార్పు చేర్పులు తప్పవని వినిపిస్తోంది. మరోపక్క సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న దక్షిణ మండల డీసీపీ, నగర సంయుక్త సీపీ (పరిపాలన) ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు స్థాయిల్లోనూ కొత్త అధికారుల్ని నియమించాల్సి ఉంది. ఈ నెలాఖరు లోపు భారీ బదిలీలతో మూడు కమిషనరేట్లలోనూ కొత్త టీమ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘దుకాణం పైనే ఉండి కన్నం వేశాడు’
సాక్షి, హైదరాబాద్: నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడిన ముఠాను రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్ నగర్లో ఉన్న ధనలక్ష్మి జువెలరీ షాప్‌లో ఈ నెల 11 న భారీ చోరీ జరిగింది. దాదాపు పావు కిలో బంగారం, 75 కిలోల వెండి దొంగిలించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు ఎనిమిది రోజుల్లోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 28 తులాల బంగారం, అరవై మూడు కిలోల వెండి, ఒక ట్రాలీ ఆటో, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: భార్యను బ్లాక్మెయిల్.. రూ.కోటి వసూలు!) వీటి విలువ సుమారు రూ.47 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులంతా రాజస్థాన్ చెందినవారే కావడం గమనార్హం. దొంగతనం జరిగిన ధనలక్ష్మి నగల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేసే పప్పు రామ్ దేవాసి ప్రధాన నిందితుడిగా కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు స్నేహితులతో కలిసి తాను పనిచేసే దుకాణానికి పప్పు రామ్ కన్నం వేసాడని చెప్పారు. నిందితుడు పప్పు రామ్ తాను పనిచేసే దుకాణం పైనే నివాసం ఉండేవాడు. దుకాణ యజమానికి అనుమానం రాకుండా నమ్మకంగా ప్రవర్తిస్తూ అతని స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని కమిషనర్ తెలిపారు. -
రోహింగ్యాలకు కరోనా లేదు: రాచకొండ సీపీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. బుధవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరిలో ఒకరు మరణించగా ఆరుగురు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో వైరస్ ప్రభంజనానికి వేదికగా నిలిచిన నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించామన్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. ఎవరూ అపోహలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాచకొండ పరిధిలో జిల్లా సరిహద్దులు ఉన్నందున అక్కడ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యవసర ప్రయాణాలకు అనుమతించే పాస్‌లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే పాస్‌లపై ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. మే 7 వరకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చని సీపీ మహేశ్ భగవత్ సూచించారు. (‘చిరుత’ వీడియో ఆకతాయిల పనే!) -
కరోనా : వారికి సెల్యూట్ తప్ప ఇంకేం చేయలేం
సాక్షి, సిటీబ్యూరో : విధి నిర్వహణలో వారికి వారే సాటి. ఒకవైపు శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతూనే.. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ పోరులో వారు పోషిస్తున్న పాత్ర అపురూపం. రాత్రింబవళ్లూ ప్రజాసేవలో తరిస్తున్నారు ఇద్దరు పోలీస్ బాస్‌లు. ఒకరు రాచకొండ సీపీ మహేశ్ భగవత్, మరొకరు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అటు విధి నిర్వహణలోనూ తమదైన విభిన్నత చాటుతున్నారు. సమాజం నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తమ భర్తల సేవాభావాన్ని చూసి వీరి సతీమణులు సైతం వేనోళ్ల కొనియాడుతున్నారు. వీరి పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పిల్లలకు, కుటుంబానికి సమయం కేటాయించడంలేదనే భావన ఉన్నా.. ప్రజల కోసం పని చేస్తుండడం గర్వంగా ఉందని చెబుతున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ సతీమణి అనూప, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సునీతా భగవత్ తమ మనోగతాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. మహేశ్ ది గ్రేట్ ఓ ఐపీఎస్‌గా ఆయన సేవలకు సెల్యూట్ చేస్తున్నా. ప్రస్తుతం రంగారెడ్డి ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్‌గా పనిచేస్తున్నాను. విధి నిర్వహణలో సామాన్యులకు అండగా ఉండటం నచ్చింది. లాక్డౌన్ సమయంలో సొంతూళ్లకు వెళ్లలేని వలస కార్మికులను గుర్తించి వారికి సహయం అందించడంలో మహేష్ భగవత్ నేతృత్వంలోని బృందం ముందుండడం అభినందనీయం. లాక్‌డౌనే కాదు పండగలు, నూతన సంవత్సర వేడుకలు.. ఇలా ఏదైనా ఫ్యామిలీతో అందరూ చేసుకుంటుంటే పోలీసులు మాత్రం ఆ రోజుల్లో విధుల్లో బిజీగా ఉంటారు. ఇలా ఏ ఆపద వచ్చినా ముందుండే పోలీసులకు కృతజ్ఞతలు. (కరోనా ఆగట్లేదు.. జర జాగ్రత్త) ఇక మా ఫ్యామిలీ విషయానికొస్తే చిన్న పాప ‘అతవరి’కి డాడీ ఎంతో ఇష్టం. సాయంత్రం సమయంలో ఎప్పుడూ వస్తున్నారని అడుగుతూటూంది. అయితే నాన్నను చూపి ప్రేరణ పొందిన అతవరి ఇండస్ అక్షన్ అనే ఎన్జీఓకు వలంటీర్‌గా సేవలు అందిస్తోంది. ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి సహయం అందిందా? లేదా? అని ఫోన్‌కాల్స్ చేసి అడుగుతుంది. అవసరమైతే వాళ్లకు మార్గదర్శనం చేస్తుండడంతో మావారు ఎంతో సంతోషపడుతున్నారు. ఇక పెద్దపాప మైత్రేయి అమెరికాలోని న్యూజెర్సీలోనే ఉండడంతో ప్రతిరోజూ ఇంటికి వచ్చాక ఓ గంటపాటు వాట్సాప్ వీడియో కాల్ చేసి కరోనా వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఓవైపు పోలీసింగ్, మరోవైపు ఫ్యామిలీని సమన్వయం చేస్తుండడం చూస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ముఖ్యంగా ఆదివారం రోజున తనకు నచ్చిన ఆమ్లెట్, ఉప్మా చేస్తుంటారు. ఒత్తిడి నుంచి బయట పొందేందుకు మ్యూజిక్ వింటారు. ముఖ్యంగా దుర్గా జస్రాజ్ ఫేస్బుక్ లైవ్ షో మ్యూజిక్ వారంలో రెండుసార్లైనా వింటారు. (పరమౌషధం కానున్న ప్లాస్మా !) అన్నీ ఫోన్లోనే.. కరోనాపై పోరుకు ప్రజలు సహకరించాలి. స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదు. లాక్డౌన్ ముందు బిజీ షెడ్యూల్ ఉన్న ఫ్యామిలీకి బాగానే సమయం కేటాయించేవాణ్ణి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయంతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. రాత్రి ఇంటికి చేరుకున్నాక అమెరికాలో ఉంటున్న మా పెద్ద కుమార్తెకు వీడియో కాల్ చేస్తున్నా. మహారాష్ట్రలో ఉంటున్న మా నాన్నతో కూడా మాట్లాడుతున్నా. ఇటు విధులు నిర్వహిస్తూనే ఫ్యామిలీని చూసుకుంటున్నా.– మహేష్ భగవత్, రాచకొండ సీపీ సజ్జనార్ ది లీడర్ కరోనా వైరస్ నియంత్రణలో పోలీసు సిబ్బంది సేవలకు సలామ్ చేస్తున్నాం. సిబ్బందికి మావారు నాయకత్వం వహించడం చాలా గర్వంగా ఉంది. ఐపీఎస్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి ఎక్కడ ఉన్నా విధులను అకుంఠిత దీక్షతో చేస్తున్నారు. ఇప్పుడూ కరోనా నియంత్రణలోనూ కష్టపడుతున్నారు. మిగతా పోలీసు సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రజలు కూడా సహకరించాలి. బయట తిరగవద్దు. అప్పుడూ వీళ్లకు కూడా బాగుంటుంది. కుటుంబపరంగా చూసుకుంటే మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త సమయం తక్కువగానే ఉంటారు. ముఖ్యంగా మా అమ్మాయిలు అదితి, నియతి.. డాడీ.. డాడీ అంటూ కలవరించేవారు. అయితే డాడీ విధులు తెలిశాక గ్రేట్ అంటున్నారు. వర్క్‌హాలిక్ మైండ్ సెట్ ఉన్న మావారు.. ప్రజలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇందుకు ఎంతో గర్వంగా ఉంది. ఎప్పుడూ విధులతో బిజీగా ఉండే మావారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువగా ఉడికించిన కోడిగుడ్లు, కూరగాయలు ఇష్టంగా తింటారు. ఉదయం వ్యాయామంతో పాటు యోగా కూడా చేస్తుంటారు. ఆమ్లా జ్యూస్, ఇమ్యూనిట్ బూస్ట్ తీసుకుంటారు. సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. వీలైతే వార్తలు చూస్తుంటారు. విధులకు వెళ్లి లేట్‌గా వచ్చినా పిల్లలతో కొంతసేపు క్యారమ్ ఆడాక నిద్రకు ఉపక్రమిస్తారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి తెల్లవారుజామున మానిటరింగ్ మొదలై అర్ధరాత్రి వరకు టెలీ కాన్ఫరెన్స్‌లతో బిజీగా ఉంటున్నారు. అందుకే మా అమ్మాయిలు డాడీతో కొంతసేపైనా ఉండాలన్న ఉద్దేశంతో ఉదయం లేవగానే డాడీ వాహనంలో ఒక రౌండ్ వేసుకొని ఇంటికి వచ్చేస్తారు. బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా కచ్చితంగా హ్యాండ్ శానిటైజింగ్ చేయాల్సిందే. కాళ్లు, చేతులు కడుక్కొవాల్సిందే. ఇక మావారు బయటి నుంచి ఇంటికి రాగానే యూనిఫాం శానిటైజ్ చేసి సపరేట్గా పెట్టేస్తారు. స్నానం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్వారంటైన్ అవుతారు. చివరగా ఒక మాట ఇంట్లోనే ప్రజలు ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. కరోనాను జయించాలి. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. గతంలో కుటుంబ సభ్యులతో గడిపిన విధంగా పరిస్థితులు ఇప్పుడు లేవు. ఏ సమయంలోనైనా విధి నిర్వహణకు వెళ్లాల్సిందే. గతంలో ప్రతిరోజూ అరగంట పాటు ఆడుకోనేదే ఊరుకునేవారు కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి కాస్త దూరంగా ఉండాల్సి వస్తోంది. సమయంతో సంబంధం లేకుండా సిబ్బందికి మార్గదర్శకాలిస్తున్నాం. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ -
నేరం చేయాలంటే భయపడాలి
మన్సూరాబాద్: నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం నేరస్తుల్లో కలిగినప్పుడు నేరాలు చేయడానికి జంకుతారని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జీఎస్‌ఐటీఐలోని ఎంఎస్.కృష్ణన్ ఆడిటోరియంలో గురువారం కన్వెన్షన్స్ రివార్డ్ మేళాను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులకు రివార్డులు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మాట్లాడుతూ.. పోలీస్, న్యాయ వ్యవస్థల పై సమాజం పెట్టుకున్న నమ్మకాన్ని సాధించిన వాళ్లమయ్యామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, పోలీసు లు, ప్రాసిక్యూటర్స్ క్రిమినల్ జస్టిస్‌లో ఉన్న అన్ని విభాగాలు ప్రజలు ఆశించేలా చట్టప్రకారం నడు చుకోవాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పనిసరిగా దొరికిపోతామనే భయం.. దొరికాక శిక్ష పడుతుందనే నమ్మకాన్ని కలిగించడం మన బాధ్యతన్నారు. నేరం ఎవరు చేసినా నిజాన్ని బ యటకు తెచ్చి న్యాయంగా, ధర్మంగా నేరం చేసిన ప్రతిసారి శిక్ష పడుతుందనే భయం కల్పిస్తే.. సమాజంలో ఎవరైనా నేరం చేయడానికి భయపడతారని తెలిపారు. నేరస్తులను గుర్తించేందుకు, నేరాలను పరిశోధించేందుకు వీలుగా రాష్ట్రంలో 67 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చె ప్పారు. నేరస్తుడిని అరెస్టు చేయడమే కాకుండ శిక్ష పడేలా చేస్తేనే ప్రజలకు పోలీసులపై గౌరవం పె రుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించిన 226 మంది పోలీసు, న్యాయ అధికారులను శాలువాలు, రివార్డులతో సన్మానించా రు. కార్యక్రమంలో ప్రాసిక్యూషన్స్ రాష్ట్ర డైరెక్టర్ జి.వైజయంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు. ప్రాసిక్యూటర్‌ను సత్కరిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి. చి్ర‘తంలో మహేశ్ భగవత్ -
ఆ ఆధారాలతోనే శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడారు. హాజీపూర్ వరుస హత్యల కేసులో శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడని, ముగ్గురు బాలికలను అతను అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించిందిన సీపీ భగవత్ చెప్పారు. అభంశుభం తెలియని బాలికలను శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా చేసుకున్నాడని, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికలకు తన బైక్ మీద లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తీసుకెళ్లేవాడని, తన వ్యవసాయ బావి వద్దకు వారిని తీసుకెళ్లి.. అత్యాచారం చేసి, హత్య చేసేవాడని వివరించారు. అతని వ్యవసాయ బావి వద్ద దొరికిన బాధిత బాలిక స్కూల్ బ్యాగ్ ఆధారంగా ఈ వరుస హత్యల కేసు మిస్టరీని ఛేదించామని, ఈ కేసు విచారణలో సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదిక కీలక పాత్ర పోషించాయని, ఈ ఆధారాలతోనే శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా నిరూపించామని తెలిపారు. కర్నూలులో ఓ మహిళను హత్య చేసిన కేసులోనూ శ్రీనివాస్‌రెడ్డి దోషి అని సీపీ భగవత్ చెప్పారు. -
హయాత్‌నగర్‌లో గుమన్గ్యాంగ్ ఆటకట్టు
-
వారిపై రాచకొండ సీపీ శాఖ పరమైన చర్యలు
సాక్షి, యాదాద్రి: విధి నిర్వహణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కొరడా ఝుళిపించారు. భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, బీబీనగర్ హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్లను నిందితులకు సహకరించారని.. భూ వివాదాలు, వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆలేరు ఎస్ఐ జె.వెంకట్‌రెడ్డిని పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. అలాగే వివిధ కారణాలు, సాధారణ బదిలీల్లో పలువురికి శుక్రవారం స్థానచలనం కలిగింది. పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారని.. పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారన్న ఆరోపణలతో ఇద్దరు పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, బీబీనగర్ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ కరుణాకర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్న పేలుడు పదార్థాల కేసులో నిందితుల పేర్లు మార్చేందుకు, మరో నిందితుడు సోమ రామకృష్ణకు ముందస్తు బెయిల్ రావడానికి సహకరించేందుకు యత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరిపై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి మండలం కూనూరు వద్ద ఈ నెల 18న రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న జిలిటిన్‌స్టిక్స్, డిటోనేటర్లు, అమోనియం నైట్రేట్లను ఎస్ఓటీ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో పోలీస్‌లు పట్టుకున్నారు. ట్రాన్స్‌పోర్టుకు చెందిన వాహనం, బొలేరో వాహనంలో వీటిని తరలిస్తున్నారు. ఆలేరుకు చెందిన రాంపల్లి విక్రం, బొందుగులకు చెందిన రాంగోపాల్‌రెడ్డి, భువనగిరికి చెందిన సోమ రామకృష్ణలతోపాటు మరో ఆరుగురిని కలిపి మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. పట్టుకున్న పేలుడు పదార్థాల వాహనాలతోపాటు నిందితులను ఎస్ఓటీ పోలీసులు భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డికి అప్పగించారు. అనంతరం వాహనాల్లోని సామగ్రిని సీఐ పరిశీలించగా జిలిటిన్‌స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు తేలింది. లారీలో పేలుడు సామగ్రిని తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరిని సీఐ అదుపులోకి తీసుకున్నారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయాల్సి ఉండగా.. సీఐ అంతకు ముందే లారీ పట్టుబడ్డ విషయం ట్రాన్స్‌ఫోర్టు యాజమానికి ఓహెడ్ కానిస్టేబుల్ ద్వారా చేర వేశారు. దీంతో సంబంధిత ముగ్గురు ఓనర్లు సీఐతో బేరసారాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో కేసులో యాజమాన్యానికి సహకరించేందుకు సీఐ నిబంధనలకు విరుద్ధంగా భువనగిరి స్టేషన్లో కాకుండా పరిధి దాటి తనకు అనుకూలంగా ఉన్న బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్ఓటీ అధికారి ఫిర్యాదుతో.. పెద్ద ఎత్తున పట్టుబడ్డ పేలుడు పదార్థాల కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండా, వారికి సహకరిస్తున్నారని ఎస్ఓటీ అధికారి.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ విచారణకు ఆదేశించారు. భువనగిరిలో కేసు నమోదు చేయాల్సి ఉండగా బీబీనగర్‌లో ఎందుకు పెట్టారనే కోణంలో దర్యాప్తు చేపట్టగా పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమోనియం నైట్రేట్ సరఫరా చేస్తున్న సోమ రామకృష్ణతోపాటు మరికొందరు నిందితుల పేర్లు కేసులో లేకుండా తప్పించాడన్న కోణంలో ఒక వైపు, నాన్‌బెయిలబుల్ కేసులో రామకృష్ణను అరెస్ట్ చేయాల్సి ఉండగా ముందస్తు బెయిల్ తీసుకొమ్మని నిందితునికి సీఐ సలహా ఇచ్చి అరెస్ట్ చేయకుండా జాప్యం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఇంటిలిజెన్స్ విచారణలో సైతం ముందస్తు బెయిల్ కోసం సీఐ సహకరిస్తున్నాడన్న విషయం విచారణ అధికారులు గుర్తించి సీపీకి నివేదిక ఇవ్వడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. కాగా ఏడాది క్రితం సీఐగా ఇక్కడికి వచ్చిన సురేందర్‌రెడ్డి గతంలో భువనగిరి రూరల్ ఎస్ఐగా పని చేస్తూ వివాదాల నేపధ్యంతో బదిలీపై వెళ్లారు. మరోవైపు సురేందర్‌రెడ్డికి హెడ్‌కానిస్టేబుల్ కరుణాకర్ సన్నిహితుడిగా ఉన్నాడు. దఫేదార్‌గా కరుణాకర్ చేసిన వసూళ్లపై ఫిర్యాదు అందడంతో సీపీకి అటాచ్ చేయగా 6నెలల క్రితం ఇదే స్టేషన్లో విధుల్లో చేరాడు. కాగా ఇదే సంవత్సరం మార్చి 10న అప్పటి భువనగిరి జోన్ డీసీపీ రామచంద్రారెడ్డి, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నలు సిట్ పరి«ధిలో ఉన్న గ్యాంగ్‌స్టర్ నయీమ్ చెందిన భూముల రిజిస్ట్రేషన్ కేసు నీరుగార్చారని అటాచ్ చేయడం పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆలేరు ఎస్ఐపై.. భూ వివాదాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆలేరు ఎస్ఐ జె.వెంకట్‌రెడ్డిపై కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాచకొండ సీపీ స్పందిస్తూ శుక్రవారం ఆయనను పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు పోలీసు అధికారుల బదిలీ శుక్రవారం జిల్లాలో పలువురు పోలీసులు బదిలీ అయ్యారు. యాదగిరిగుట్ట పట్టణ ఇన్స్పెక్టర్ నర్సింహారావు బదిలీ కాగా ఇ క్కడికి మహబూబ్‌నగర్ జిల్లానుంచి పాండురంగారెడ్డి వచ్చారు. ఆత్మకూర్(ఎం) ఎస్ఐ తుర్కపల్లికి, తుర్కపల్లి ఎస్ఐ వెంకటయ్య ఆత్మకూర్(ఎం)కు, యాదగిరిగుట్ట ఎస్ఐ రమేశ్‌ను ఆలేరుకు బదిలీ చేశారు. నిందితులకు సహకరించారనే చర్యలు పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారనే సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశాం. జిలెటిన్ స్టిక్, డిటోనేటర్లు, అమోనియం అక్రమ రవాణాలో నిందితులకు ముందస్తు బెయిల్‌కు సహకరించారు. ఈ కేసులో విచారణ జరుగుతోంది. –నారాయణరెడ్డి, డీసీపీ -
దిశ కేసు : నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ కేసుపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసింది. ఏడుగురు సభ్యుల ఈ విచారణ బృందానికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వం వహించనున్నారు. వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, రాచకొండ ఐటీ సెల్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, సంగారెడ్డి డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్‌రెడ్డిలు ఈ సిట్‌లో సభ్యులుగా ఉన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వం ఈ సిట్‌ను ఏర్పాటు చేసింది. చటాన్‌పల్లి ఎన్కౌంటర్ జరిగిన తీరు, దానికి దారి తీసిన పరిస్థితులపై సిట్ దర్యాప్తు చేసి కోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. -
‘1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు’
హైదరాబాద్: టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం నగరంలోని ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20తో ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్‌తో కలిసి హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘కొత్తగా ఏర్పడిన హెచ్‌సీఏ నేతృత్వంలో ఇక్కడ ఇది తొలి మ్యాచ్. దాదాపు 40 వేల మంది అభిమానులు మ్యాచ్ హాజరు కావొచ్చు. 1800 మంది పోలీసులతో మ్యాచ్‌కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాం. రేపు బ్లాక్ డే కూడా కావడంతో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశాం. ఆక్టోపస్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, సీసీ కెమెరాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ టీం నడుమ భారీ భదత్ర ఉంటుంది. అభిమానులకు పార్కింగ్ సదుపాయం కూడా కలదు. రేపు మెట్రో రైల్ సమయం రాత్రి గం. 1.00ల వరకూ వినియోగించుకోవచ్చు. సిగరెట్లు , ల్యాప్ టాప్స్, హెల్మెట్లు, కెమెరాలు, మ్యాచ్ బాక్స్, బైనాకులర్స్, బ్యాగ్స్, బ్యానర్స్, లైటర్స్, కాయిన్స్, తిండి పదార్ధాలు, పెన్స్, ఫర్ఫ్యూమ్స్ స్టేడియంలోకి నిషేధం. జాతీయ జెండా తప్పా ఇతర ఏ జెండాలు అనుమతించబడవు. షీ టీం బృందాలు కూడా మహిళల రక్షణ కోసం నియమించాం. స్టేడియం మొత్తం సీసీ కెమెరాలు అధీనంలో ఉంటుంది. ఎవరికీ అసౌకర్యం కల్గినా డయల్ 100కి ఫోన్ చేయండి’ అని భాగవత్, అజహర్లు పేర్కొన్నారు. -
చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్
మేడిపల్లి: దేశంలోనే తొలిసారిగా గ్రేటర్ పరిధిలో ని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం చైల్డ్ ఫ్రెండ్లీ స్టేషన్‌ను ప్రారంభించనున్నా రు. బచ్పన్ బచావో సంస్థ, రాచకొండ పోలీస్ కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 18 ఏళ్ల పిల్లలు.. వారికి ఎదురయ్యే బాధలు, ఈవ్‌టీజిం గ్, ర్యాగింగ్ సమస్యలను ఈ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరించవచ్చని పేర్కొన్నారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా కేటాయించిన రూమ్‌కు చిల్డ్రన్స్ పోలీస్‌స్టేషన్‌గా పేరు పెట్టారు. అందులో ప్రత్యేక శిక్షణ పొందిన యూనిఫాంలో లేని పోలీసులు ఉంటారు. పోలీసులంటే భయం లేకుండా ఈ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పిల్లలు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే పలు ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లలు, విద్యార్థులను ఇక్కడకు తీసుకొస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులు వచ్చే వరకు మంచి వాతావరణంలో ప్రత్యేకంగా చూసుకుంటారు. మానసిక వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉంటారు. ఈ పోలీస్‌స్టేషన్‌లో ఉచిత న్యాయ సలహాలు కల్పిస్తూ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, పచ్చదనం నెలకొ న్న వాల్‌పోస్టర్లు, టేబుళ్లు, కుర్చీలు, మంచాలు తదితర సౌకర్యాలు కల్పించారు. కళాశాలలో, స్కూళ్లలో విద్యార్థుల సమస్యలపై ఎలా ఫిర్యాదు చేయాలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. -
రియల్ ‘దృశ్యం’!
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ ఠాణాలో అదృశ్యం కేసుగా నమోదైన రజిత కేసు దృశ్యం సినిమాను తలపించింది. ఆ సినిమా లో తన కూతురును బలవంతం చేయబోయి న వ్యక్తిని మీనా చంపేస్తే ఆ శవాన్ని మాయం చేసేందుకు సుదూర ప్రాంతానికి తీసుకెళ్లి హీరో వెంకటేశ్ ఏ సాక్ష్యం దొరక్కుండా జాగ్ర త్త పడటం చూశాం. ఆ రీల్ లైఫ్‌కు తగ్గట్టుగానే రియల్‌లైఫ్‌లో కాస్త భిన్నంగా తనను బలవంతం చేసిన వ్యక్తి బెదిరింపులకు తలొగ్గి కన్నతల్లి హత్యలో భాగస్వామ్యమై ఎవరికీ ఏ అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేసేందుకు సుదూర ప్రయాణం చేయడం దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా నడిచింది. వీరు ఆధారాలు చెరిపేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిందితురాలి తండ్రికి వచ్చిన అనుమానం కాస్తా ఆమెను ఇప్పుడు ఏకంగా జైలు ఊచలు లెక్కించేలా చేసింది. తల్లి రజితను హత్య చేసిన కూతురు కీర్తితో పాటు కొత్త శశికుమార్‌లను రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అలాగే కీర్తిని ప్రేమించి అత్యాచారం చేశాడని పోక్సో యాక్ట్ కింద నమోదైన మరో కేసులో చిమ్ముల బాల్రెడ్డికి కూడా సంకెళ్లు వేశారు. ఇలా ఒక్క మిస్సింగ్ కాస్తా 3 కేసులుగా మారింది. శివకుమార్‌పై కూడా పోక్సోయాక్ట్ కేసు నమోదుచేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ సతీశ్‌లతో కలసి సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. అబార్షన్నే అడ్వాంటేజ్‌గా.. కీర్తికి అబార్షన్ అయిన విషయాన్ని ఆమె తల్లికి చెబుతానంటూ శశికుమార్ బెదిరించడం మొదలెట్టాడు. ఈ వేధింపులకు భయపడిన కీర్తి శశికి శారీరకంగా లొంగిపోయింది. ఏకాంతంలో ఉండగా ఫొటోలు, వీడియోలు తీసిన శశి తనతో శారీరక సంబంధం కొనసాగించచాలని బెదిరించాడు. తనతో సన్నిహితంగా ఉన్న విషయాన్ని బాల్‌రెడ్డితో పాటు మీ అమ్మ రజితకు చెప్తానన్నాడు. చివరకు మీ అమ్మ రజితను చంపేస్తే ఆమె నిర్వహిస్తున్న చిట్టీల డబ్బులు, సిటీలో ఉన్న ప్లాట్లు, సొంతూరులో ఉన్న భూములు నీ సొంతమవుతాయని, ఆ తర్వాత తనకు రూ. 10 లక్షలిస్తే హాయిగా బాల్‌రెడ్డిని పెళ్లి చేసుకోవచ్చని నమ్మించాడు. ఇలా అక్టోబరు 16న రజితకు నిద్రమాత్ర లి వ్వగా ఆమెకు ఏమీ కాలేదు. దీంతో 19న రాత్రి ఇంట్లో రజిత బెడ్‌పై పడుకొని ఉండగా ఆమె కళ్లలో కారం చల్లి, కడుపు మీదకు ఎక్కి చేతులు గట్టిగా పట్టుకోవడంతో శశి ఆమె మెడకు చున్నీ బిగించి చంపాడు. కీర్తి, శశికుమార్ అమ్మగా మాట్లాడిన కీర్తి... అనంతరం రజిత సెల్‌ఫోన్ నుంచి బాల్‌రెడ్డి తండ్రికి ఫోన్ చేసిన కీర్తి చికిత్స కోసం ఆçస్పత్రికి వెళ్తున్నానని, తిరిగి వచ్చేంత వరకు అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నానని రజితగా గొంతు మార్చి మాట్లాడింది. రెండ్రోజుల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మిద్దామనుకుంది. అప్పటికే శవం దుర్వాసన వస్తుండటంతో దాన్ని బెడ్‌షీట్‌తో చుట్టి శశి కారు డిక్కీలో వేసుకొని చౌటుప్పల్ రైల్వే ట్రాక్ రామన్నపేట పట్టాలపైకి తీసుకొచ్చి పడేశారు. బెడ్‌షీట్, దారాలను తూప్రాన్‌పేట లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. కీర్తి బంధువులు మీ అమ్మ ఎక్కడికెళ్లిందంటూ అడుగు తుండటంతో తాను వైజాగ్ వెళ్లానని, నాన్న తాగొచ్చి తరచూ అమ్మతో గొడవపడేవాడని సమాధానమిచ్చింది. అక్టోబరు 26న రాత్రి హయత్‌నగర్ పీఎస్‌లో మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసింది. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి కూతురిపైనే అనుమానం ఉందంటూ పోలీసులకు చెప్పడంతో కేసు యూటర్న్ తీసుకుంది. బాల్‌రెడ్డి తండ్రిని అడిగితే ‘వైజాగ్ ఎక్కడెళ్లింది.. మా ఇంట్లోనే ఉంది కదా’అని సమాధానమివ్వడంతో కీర్తి అబద్ధం చెబుతున్నట్టుగా పోలీసులు నిర్ధారణకొచ్చి ఆ దిశగా విచారణ చేయగా కేసు చిక్కుముడి వీడింది. కీర్తికి అబార్షన్ చేసిన అమన్‌గల్‌లోని పద్మ నర్సింగ్ హోమ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. పరిచయం కాస్తా ప్రేమగా.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం నెర్నామ్లా గ్రామానికి చెంది న శ్రీనివాస్‌రెడ్డి, రజితల కుటుంబం పదేళ్ల క్రితం హైదరాబాద్ సమీపంలోని మునగనూర్‌కు వలసవచ్చింది. వీరి కుమార్తె కీర్తిరెడ్డి దిల్‌సుఖ్‌నగర్‌లో బీఎస్సీ మైక్రో బయాలజీ సెకండియర్ చదువుతోంది. పొరుగింట్లో ఉంటున్న శశికుమార్ కుటుంబంతో కీర్తి కుటుంబానికి సాన్నిహిత్యం పెరిగింది. కీర్తి ఇంటర్ చదువుతున్న సమయంలో రామాంజనేయనగర్ కాలనీలో ఉంటున్న స్నేహితురాలు శిల్ప వద్దకు వెళ్తుండేది. ఈ క్రమంలో శిల్ప సోదరుడు బాల్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమ వరకు వెళ్లి వివాహం చేసుకోవాలనుకున్నారు. శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. గతే డాది సెప్టెంబర్‌లో కీర్తి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాలని భావించారు. అబార్షన్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరం ఉండటంతో కీర్తి ఇంటిపక్కనే ఉన్న శశి సహాయం తీసుకున్నారు. సంగారెడ్డిలో ఓ ఫంక్షన్‌కు వెళ్తున్నామని, కీర్తిని కూడా పంపించాలంటూ శశి అడగటంతో తల్లి రజిత అంగీకరించింది. ఇలా సంగారెడ్డికి బదులు అమన్‌గల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించిన బాల్‌రెడ్డి మళ్లీ హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. -
‘దృశ్యం సెకండ్ పార్ట్‌లా ఉంది’
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో రజిత హత్య కేసు నిందితులను పోలీసులు గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. ప్రియుడి సహాయంతో కీర్తి తన తల్లి రజితను హత్య చేసిందన్నారు. 19న రజితను హత్య చేసి మూడు రోజుల తర్వాత రామన్నపేట రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని పడేశారని చెప్పారు. ఆ తర్వాత మిస్సింగ్ కేసు పెట్టి.. తప్పించుకునే ప్రయత్నం చేశారని అన్నారు. కీర్తితో పాటు ఆమెకు సహకరించిన రెండో ప్రియుడు శశిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టమన్నారు. ఈ క్రైమ్.. దృశ్యం సినిమాకు సెకండ్ పార్ట్‌లా ఉందని అభిప్రాయపడ్డారు. ‘కీర్తి, బాల్‌రెడ్డిల మధ్య లవ్ ఎఫైర్ ఉండటంతో.. వారిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే బాల్‌రెడ్డి కీర్తిపై అత్యాచారం చేశాడు. గర్భం దాల్చిన కీర్తికి శశికుమార్ అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కీర్తిని శశికుమార్ బ్లాక్మెయిల్ చేశాడు. అబార్షన్ విషయం ఇంట్లో చెబుతానని వేధించాడు. కీర్తి ఆస్తిపై కన్నేసిన శశి.. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. కీర్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. పెళ్లికి కీర్తి తల్లి అడ్డు చెప్పడంతో ఆమెను హత్య చేసేందుకు పథకం రచించారు. శశికుమార్ సహాయంతో కీర్తి తల్లిని హత్య చేసింది. మృతదేహాం తరలించేటప్పుడు కీర్తికి శశి మద్యం తాగించాడు. రజిత హత్య చేసిన తరువాత ఇంట్లోని రూ.10 లక్షలు తీసుకోవాలని భావించారు. గతంలోనే తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి చంపేందుకు కీర్తి ప్రయత్నించినప్పటికీ.. అది విఫలమైంది. కీర్తిపై అత్యాచారానికి పాల్పడ్డ బాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశాం. నిందితులపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశాం’అని సీపీ తెలిపారు. -
‘అతడిపై హత్య కేసు కూడా ఉంది’
సాక్షి, హైదరాబాద్ : నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగలను కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. దొంగల గ్యాంగ్‌కు నాయకుడిగా వ్యవహరిస్తున్న బాబ్లీ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... సెప్టెంబరు 4న కుషాయిగూడలోని నగల దుకాణంలో ఉన్న చోరీ జరిగిందని తెలిపారు. తెల్లవారుజామున షాపులో చొరబడ్డ దొంగలు వెండి మొత్తం దోచేశారని పేర్కొన్నారు. క్రైమ్‌సీన్ పరిశీలనలో భాగంగా దొరికిన ఓ బ్యాగ్ ద్వారా చోరీ కేసు ఛేదించామన్నారు. దొంగలను బిహార్‌కు చెందిన అరారి గ్యాంగ్‌గా గుర్తించామని... వారిని పట్టుకోవడంలో బిహార్ పోలీసుల సహకారం మరువలేనిదని ధన్యవాదాలు తెలిపారు. చోరీ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడిస్తూ....‘ చోరీ తరువాత దొంగల గ్యాంగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బిహార్‌కు బయల్దేరింది. వారి కోసం పట్నా, బిహార్ రాష్ట్రమంతా గాలింపు మొదలు పెట్టాము. రన్నింగ్ ట్రైన్లోనే వారిని పట్టుకునేందుకు ప్లాన్ చేశాము. అలా ధానాపూర్ రైల్వే స్టేషన్లో గ్యాంగ్‌ని పట్టుకున్నాము. గ్యాంగ్‌కి బాబ్లీ మహుమ్మద్ అనే వ్యక్తి లీడర్‌గా ఉన్నాడు. అతడిపై గతంలో హత్య కేసుతో పాటు అనేక ఇతర కేసులు ఉన్నాయి. మొత్తం రూ. 11 లక్షల 49 వేలు నగదు..11 తులాల బంగారం, చోరికి ఉపయోగించిన పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నాము. ఈ గ్యాంగ్ కీసరలో కూడా చోరికి పాల్పడ్డట్టు గుర్తించాము. గ్యాంగ్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశాము. హైదరాబాద్ వచ్చే ముందు కర్ణాటక, గోవాలో కూడా వీళ్లు తిరిగారు. నిజానికి జ్యూవెలరి షాపు యజమాని సెక్యూరిటీ విధానం వల్ల.. కేసును తొందరగా ఛేదించేందుకు అవకాశం దొరికింది అని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఫొటోలు, వీడియోలు ప్రసారం చేయవద్దని సీపీ మహేశ్ భగవత్ విఙ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు 11వేల 9వందలకు పైగా గణేష్ విగ్రహాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిపారు. నిన్నటి వరకు 9 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారని వెల్లడించారు. రాచకొండ పరిధిలోని 25 ప్రాంతాల్లో అన్ని శాఖ సమన్వయంతో నిమజ్జనం జరుగుతుందన్నారు. గురువారం బాలాపూర్ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఆరు గంటలకు మొదలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 250 సీసీటీవీ ఆధ్వర్యంలో మానిటరింగ్ జరుగుతుందని..మొత్తం 9 వేల కెమెరాలతో జియో ట్యాగింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 5060 సిబ్బంది గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారని సీపీ వెల్లడించారు. -
130 కేజీల గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, మహారాష్ట్ర నుంచి గంజాయిని అక్రమంగా తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును వనస్థలిపురం పోలీసులు రట్టు చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి మొత్తం 130 కేజీల గంజాయి, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. ముఠాలో ప్రధాన సూత్రధారిగా బానోత్ సుధాకర్‌గా గుర్తించామని అన్నారు. మహారాష్ట్రలో గంజాయిని కేజీ రూ. 2 వేలకు ఖరీదు చేసి, నగరంలో రూ. 7వేలకు అతడు విక్రయించేవాడు. ఇందులో భాగంగా 130 కేజీల గంజాయిను తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసు బృందం వీరిని సోమవారం వలపన్ని పట్టుకుంది. అయితే ఎవరి వద్ద నుంచి గంజాయి రిసీవ్ చేసుకున్నారో తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవల పట్టుబడుతున్న ముఠాలు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి సిటీలో అమ్మకాలు చేస్తున్నారనీ, అలాంటి ముఠాలపై 'ఎన్డీపీసీ' యాక్ట్‌తో శిక్షలు పడేలా చూస్తున్నామని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో అనేక కేసుల్లో నిందితులకు శిక్షపడే శాతం పెరిగిందనీ, అలానే గంజాయి అక్రమ రవాణా చేసేవారికి పూర్తి స్థాయిలో చెక్ పెడతామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. -
మాకేదీ న్యాయం? :హాజీపూర్ వాసులు
సాక్షి, యాదాద్రి: పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల కేసులో నిందితుడు సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఇచ్చే తీర్పు కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. వరంగల్‌లో 9నెలల చిన్నారిపై లైంగికదాడి చేసి హత్య చేసిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించడంతో మరోసారి హజీపూర్ ఘటన తెరపైకి వచ్చింది. తమ పిల్ల ఉసురు తీసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సమాజంలో మరెవరికి ఇలాంటి అన్యాయం జరగకూడదని కోర్టు ఇచ్చే తీర్పు కఠినంగా ఉండాలని వారు కోరుతున్నా రు. హన్మకొండ కోర్టులో తీర్పు వచ్చినంత తొం దరంగా హజీపూర్ కేసులో ఎందుకు రావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ పర్యవేక్షణలో భువనగిరిజోన్ డీసీపీ నారాయణరెడ్డి ఇటీవల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న బొమ్మలరామారం మండలం హజీపూర్కు చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై మొదటి కేసు నమోదైంది. అదే నెల 30వ తేదీన పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా శ్రీనివాస్‌రెడ్డి ఉన్నాడు. కాగా వచ్చే నెల మొదటి వారంలో నల్లగొండ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు రానుంది. చార్జి్జషీట్ దాఖలుతో.. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన విషయం విధితమే. ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో పాముల శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టెబావిలో శ్రావణి మృతదేహాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు. ఈఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్ కçస్టడీలో ఉన్న శ్రీని వాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ ఘటనలపై గ్రామ ప్రజలు, ప్రతిపక్షాలు, బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. పోలీసు యంత్రాం గం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండుసార్లు పోలీస్ కస్టడీకి హజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని మూడు హత్య కేసులపై పోలీసులు రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించారు. మొదటిసారి మే 8నుంచి 13వరకు, రెండోసారి జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. సత్వరమే తీర్పు ఇవ్వాలి అపహరణ, లైంగికదాడి, హత్యలు లాంటి కేసుల్లో సత్వరమే తీర్పు ఇవ్వాలి. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష వేయాలి. వరంగల్ నిం దితుడు ప్రవీణ్ కేసులో న్యాయం జరిగిందని, అలాగే శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేస్తే ప్రజలకు మనోధైర్యం కలుగుతుంది. ప్రజ లకు కోర్టుల మీద విశ్వాసం పెరుగుతుంది. ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించే వారికి కోర్టు తీర్పులు చెంపపెట్టుకావాలి. హజీపూర్ బాధితులకు న్యా యం జరగాలి. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయాలి. – కొడారి వెంకటేశ్, సామాజిక ఉద్యమకారుడు ఉరిశిక్ష విధించాలి 9నెలల చిన్నారి శ్రీహిత కేసులో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించడం సరైందే. ముగ్గురు ఆడపిల్లలపై కిరాతకంగా వ్యవహరించిన మర్రి శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఉరిశిక్షే విధించాలి. కోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం నిందితుడి తరఫున అడ్వకేట్‌ను నియమించడం సరికాదు. –పాముల నర్సింహ, శ్రావణి తండ్రి శ్రీనివాస్‌రెడ్డిని ప్రాణాలతో ఉంచొద్దు ఆడ పిల్లలపై మృగంలా ప్రవర్తించిన సైకో శ్రీనివాస్‌రెడ్డిని ప్రాణాలతో ఉంచొద్దు. ఇలాంటి మనుషులు బతికుంటే భూమిపైన ఆడోళ్లకు భద్రత లేదు. సర్కారోళ్లు ఇంకా శ్రీనివాస్‌రెడ్డిని చంపకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలుస్తలేదు. శ్రీనివాస్‌రెడ్డి చస్తనే మా పిల్లల ఆత్మలు శాంతిస్తాయి. – తుంగని భాగ్యమ్మ, కల్పన తల్లి బహిరంగంగా ఉరి తీయాలి మా బిడ్డలపై దారుణాలకు ఒడగట్టిన శ్రీనివాస్‌రెడ్డి బ హిరంగంగా అందురు చూస్తుండగానే ఉరి తీయాలి. శ్రీనివాస్‌రెడ్డి చావును చూసి పాపం చేయాలనుకునే వాళ్లకు భయం పుట్టాలి. ఆడపిల్లలను కనడమే పాపమైంది. ప్రభుత్వం శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష అమలు చేసి నేరస్తులకు భయం పెట్టాలి. లేకుండా సర్కారుపై నమ్మకం లేకుంటాపొతది. – తిప్రబోయిన మల్లేష్, మనీషాతండ్రి అక్టోబర్‌లో తుది తీర్పు హజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో అక్టోబర్‌లో తుది తీర్పు వస్తుంది. సెషన్స్ కోర్టు నల్లగొండలో వచ్చే నెల మొదటి వారంలో విచారణ ప్రారంభంకానుంది. నిందితుడిపై మూడు కేసులు ఒకేసారి నమోదు చేయడం, డీఎన్ఏ నివేదిక, విచారణలో భాగంగా పలు ఆధారాల సేకరించి చార్జిషీట్ దాఖలు చేశాం. – నారాయణరెడ్డి, భువనగిరిజోన్ డీసీపీ -
రవిశంకర్‌ను పట్టిస్తే రూ.లక్ష
కడప అర్బన్: నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న ఐతం రవిశంకర్ అలియాస్ రవి ఆచూకీ కోసం తెలంగాణా రాష్ట్ర పోలీసులు వైఎస్సార్ జిల్లాలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని పోలీసులకు పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ పోలీసుల బృందం ఆదివారం కడపలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన ఐతం రవిశేఖర్ అలియాస్ రవి (45) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఈ నాలుగు రాష్ట్రాల్లో అతనిపై 30 కేసులకు పైగా నమోదయ్యాయి. ఇతను వైజాగ్ కేంద్రకారాగారంలో శిక్షను అనుభవిస్తూ, ఈ ఏడాది మే 21న కోర్టుకు ఎస్కార్ట్‌తో వాయిదాకు వెళుతున్న సమయంలో కన్నుగప్పి పరారయ్యాడు. కర్ణాటకలో ఐ20 కారును దొంగిలించి, దానికి నకిలీ నంబర్ (ఏపీ 39 ఏక్యూ 1686) వేసుకుని ఫార్మసీ చదువుతున్న రంగారెడ్డి జిల్లా రంగన్నగూడకు చెందిన యువతి సోని(21)ని కిడ్నాప్ చేశాడు. అంతకు ముందు ఈనెల 23న ఉదయం సోని తల్లిదండ్రులు నడుపుతున్న హోటల్‌కు టీ తాగేందుకు వెళ్లి వారితో మాటలు కలిపాడు. సోనికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆమె తండ్రితో కలిసి తన కారులో ఎక్కించుకుని మధ్యాహ్నం వరకు తిరిగారు. తరువాత ఆమె తండ్రిని కుమార్తెకు సంబంధించిన సర్టిఫికెట్లను జిరాక్స్ చేయించుకు రమ్మని పంపాడు. ఆయన తిరిగి వచ్చేసరికి కారు వెళ్లిపోయింది. అందులో తన కుమార్తెను తీసుకుని వెళ్లాడని, ఆమె కిడ్నాప్‌నకు గురైందని రాచకొండ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే సీపీ మహేష్ భగవత్ నిందితుడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందం టాస్క్‌ఫోర్స్ సీఐ రాజు ఆధ్వర్యంలో అదే రోజున కారు ఆచూకీని వెతుక్కుంటూ వైఎస్సార్ జిల్లాలోకి వచ్చారు. 24వ తేదీన కడపలో ప్రవేశించిన కారు ఉదయం ఒంటిమిట్ట హరిత హోటల్ వరకు వెళ్లిన పుటేజీలు కనిపించాయి. కడపలో ఓ సీసీ కెమెరా ఫుటేజీలో కారులో వెనుకసీటులో సోని ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం కడపలో విలేకరులతో మాట్లాడిన టాస్క్‌ఫోర్స్ సీఐ రాజు నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతిగా ప్రకటించామన్నారు. -
150 మంది చిన్నారులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్ : చిన్నపిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గ్యాంగ్ సభ్యులను రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బీహార్ నుంచి తెలంగాణకు చిన్న పిల్లలను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ముఠాలో మొత్తం పదకొండు మంది ఉండగా ప్రస్తుతం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 54 మంది చిన్నారులకు విముక్తి కలిగించారు. 15 రోజుల వ్యవధిలో మొత్తం 150 మంది చిన్నారులకు విముక్తి కలిగించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. - -
హాజీపూర్ బాధితులకు భరోసా
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌ను శనివారం కలిశాయి. సైకో శ్రీనివాసరెడ్డి చేతిలో క్రూరంగా హతమైన శ్రావణి, మనీషా కుటుంబసభ్యులు, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కల్పన కుటుంబీకులు నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీపీ వారి కుటుంబపరిస్థితులు, జీవనోపాధులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలు ఏం చదువుతున్నార ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మానవతా దృక్పథంతో మనీషా, కల్పన కుటుంబీకులకు ఒక్కొక్కరికి రూ.25వేల చెక్కును అందజేశారు.కాగా సీపీ ఏప్రిల్ 27న హాజీపూర్ గ్రామానికి వెళ్లినప్పుడు శ్రావణి కుటుంబీకులకు రూ.25వేలు అందజేసిన సంగతి తెలిసిందే.ఈ మూడు కుటుంబాల్లో అర్హత కలిగిన వారికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడంతోపాటు జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధిని వచ్చేలా చూస్తానన్నారు. అలాగే మృతిచెందిన ఓ బాలిక తమ్ముడికి అవసరమైన వైద్య సాయం అందిస్తామని కూడా హమీఇచ్చారు. హాజీపూర్‌లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు... నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలను సేకరించడంతో పాటు కేసు విచారణ పారదర్శకంగా సాగేందుకు విచారణాధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును నియమించామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. హాజీపూర్ గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటుచేయడంతో పాటు సీసీటీవీ కెమెరాలను అమర్చేలా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. హాజీపూర్ నుంచి బీబీనగర్, భువనగిరికి వెళ్లేలా మరొక ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని సీపీని బాధిత కుటుంబాలు కోరాయి. ఏదైనా ఘటనా జరిగిన వెంటనే డయల్ 100కు ఫోన్‌కాల్, 9490617111 నంబర్‌కు వాట్సాప్ చేయడంతో పాటు స్థానిక పోలీసులను సంప్రదించాలన్నారు. మరొకమారు హాజీపూర్‌లో సీపీ పర్యటించి అక్కడి గ్రామస్తుల్లో భరోసాను నింపనున్నారు. -
‘ప్రత్యేక జాకెట్’తో రూ.70 లక్షల రవాణా
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా ఛత్తీస్గడ్ రాజధాని నుంచి గత కొంతకాలంగా రూ.లక్షల్లో సాగుతోన్న హవాలా సొమ్ము రవాణా గుట్టురట్టయింది. సార్వత్రిక ఎన్నికల వేళ రాచకొండ పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేకంగా తయారు చేయించిన జాకెట్లో రవాణా చేస్తున్న రూ.70లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ శనివారం విలేకరులకు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన చంద్రకాంత్ వర్మ(33) కొంత కాలం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి, బేగంబజార్‌లో నివాసం ఉంటున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని డైమండ్ స్టోర్, జువెల్లరి దుకాణంలో పనిచేస్తూ, మార్కెటింగ్ ఏజెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. జువెల్లరి దుకాణం యజమాని కె.చంద్రప్రకాష్ సూచనల ప్రకారం చంద్రకాంత్ పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఇందులో భాగంగా ఈ నెల 14న చంద్రకాంత్ బస్సులో ఛత్తీస్గడ్ రాజధాని రాయపూర్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి ఆటోలో బుధాపూర్కు వెళ్లి శంకర్ అనే వ్యక్తిని కలిశాడు. ఆయన ద్వారా సునీల్ సోనీ అనే మరో వ్యక్తి కలిస్తే అతను రూ.70 లక్షలను అందజేశాడు. ఆ మొత్తాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన జాకెట్లోని రహస్య జేబుల్లో పెట్టుకొని వర్మ తిరిగి బస్సులో హైదరాబాద్ చేరుకొని ఆటోలో వెళుతున్నాడు. మరో వైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం నేరేడ్మెట్లోని ఆర్కే పురం చౌరస్తా చెక్‌పోస్టు వద్ద నేరేడ్మెట్, ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీ లు చేస్తున్నారు. ఆ సమయంలో ఆటోలో ఉన్న చంద్రకాంత్ కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని తనిఖీ చేశారు. దాంతో అతని వద్దనున్న రూ.70 లక్షల నగదు కట్ట లు బయటపడ్డాయి. వీటికి ఎలాంటి పత్రాలు లేకపోవడం తో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు వెల్లడయ్యాయి. అతను ఈ నెల7న కూడా రాయపూర్ నుంచి రూ.33 లక్షలను ఇదే తరహాలో తీసుకువచ్చి చంద్రప్రకాష్‌కు అప్పగించినట్లు వెల్లడైంది. అతన్ని పోలీసు లు అరెస్టు చేశారు. కాగా జువెల్లరి దుకాణం యజమాని చంద్రప్రకాష్‌కు రాయపూర్‌లోని సునీల్సోనీతో సంబంధాలున్నాయని, పలుమార్లు హవాలా సొమ్మును పంపించినట్టు పోలీసుల విచారణలో తేలిందని సీపీ వివరించారు. పరారీలో ఉన్న యజమాని చంద్రప్రకాష్‌పై కేసు నమోదు చేశామని, త్వరలో అరెస్టు చేయనున్నట్టు చెప్పారు. తదుపరి చర్యలకు ఆదాయపన్ను శాఖకు ఈకేసు సిఫారసు చేసినట్టు, రూ.70 లక్షల నగదు, రవాణాకు వినియోగించిన ప్రత్యేక జాకెట్‌తోపాటు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారని చెప్పారు.ఈ నగదును పట్టుకున్న పోలీసులకు క్యాష్ రివార్డులను అందజేస్తామని సీపీ చెప్పారు. ఈ సమావేశంలో క్రైం డీసీపీ నాగరాజు, ఎస్ఓటీ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘నయీం’ భూ విక్రేతల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్యాంగ్‌స్టర్ నయీం బినామీల పేర్లపై ఉన్న భూ విక్రయానికి కొందరు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా భువనగిరిలోని 5 ఎకరాల భూమిని జిరాక్స్ సేల్ డీడ్‌తో విక్రయించారు. ఈ డాక్యుమెంట్లు తీసుకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన ఐదుగురిని రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు అరెస్టు చేశారు. నయీం అనుచరులు పాశం శ్రీనివాస్, మహమ్మద్ అబ్దుల్ నాజర్, నయీం తమ్ముడు మహమ్మద్ అబ్దుల్ ఫహే, భార్య హసీనా బేగమ్, బినామీ తుమ్మ శ్రీనివాస్‌ను శనివారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.88,37,000, మూడు కార్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నాగోల్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్వోటీ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ సురేందర్‌రెడ్డి, భువనగిరి ఏసీపీ భుజంగరావుతో కలసి పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. సిట్ చేతిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా... భూమి యజమానులను బెదిరించి బినామీ పేర్ల మీద ఆ స్థలాలను నయీం రాయించుకున్న ఘటనలు కోకొల్లలు. అప్పట్లో నయీం వెంట దందాల్లో పాశం శ్రీనివాస్ పాల్గొనేవాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆయా ఆస్తుల డాక్యుమెంట్లు, భూముల ఒరిజినల్ సేల్ డీడ్లను ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) స్వాధీనం చేసుకుంది. ఆయా భూముల వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపింది. నయీం ఎన్కౌంటర్ అనంతరం అరెస్టైన శ్రీనివాస్ రెండేళ్లు జైల్లో ఉన్నాడు. బయటికి వచ్చిన తరువాత భువనగిరిలోని నయీం బినామీ ఆస్తులపై దృష్టి సారించాడు. నయీం సోదరుడు అబ్దుల్ ఫహే, భార్య హసీనా బేగమ్, అనుచరుడు అబ్దుల్ నాజర్, బినామీ తుమ్మ శ్రీనివాస్‌తో కలసి భువనగిరిలోని సర్వే నంబర్ 730లో ఉన్న ఐదెకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించాడు. నయీం బాధితుడైన డీవీఆర్ కంపెనీ ఎండీ వెంకటేశ్వరరావు.. ఈ భూమికి రూ.88,37,000 ఇచ్చేందుకు అంగీకరించాడు. భూమి తుమ్మ శ్రీనివాస్ పేరుపై ఉండటంతో అతనికి రూ.5 లక్షలు ఇస్తానని పాశం శ్రీనివాస్ బేరం కుదుర్చుకున్నాడు. 5 ఎకరాల భూమిని మండపల్లి వెంకటేశ్వరరావుకు తుమ్మ శ్రీనివాస్ సేల్ కమ్ జీపీఏ అగ్రిమెంట్ చేయగా, తర్వాత ఇదే భూమిని వెంకటేశ్వరరావు బెంగళూరులోని మోక్ష డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ ఎస్వోటీ పోలీసులు రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకునేందుకు వచ్చిన సమయంలో వారిని అరెస్టు చేసినట్లు సీపీ చెప్పారు. జిరాక్స్ సేల్‌డీడ్‌తో రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల పాత్రపై కూడా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ తెలిపారు. పోలీసుల అదుపులో నయీం భార్య హసీనా బేగమ్, ఇతర నిందితులు -
డాక్టర్ నంద కిషోర్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో లోకల్ షీటీంతో కలిసి ఇబ్రహీంపట్నం, మేడిపల్లిలోని రెండు డయాగ్నోస్టిక్ సెంటర్లపై దాడి చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. డాక్టర్ నందకిషోర్, మరో ఇద్దరు వైద్యులను అరెస్టు చేశామని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల అనంతరం ఆడపిల్ల వద్దనుకునే వారికి అబార్షన్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు. ఆడ సంతానం వద్దనుకునేవారు బలవంతంగా అబార్షన్ చేయించే క్రమంలో గర్భిణీ ప్రాణాల పోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐంఎంఏ) కు పూర్తి నివేదిక ఇవ్వనున్నామని తెలిపారు. ఐంఎంఏ చట్టంలో పేర్కొన్న విధంగా వైద్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
ఈ ఏడాది సంచలన కేసులు అవే!
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2018లో మొత్తం 20,820 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శనివారం ఆయన సంవత్సారంతపు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2018లో నమోదైన సంచలన కేసులు, వాటిని ఛేదించిన తీరు తదితర వివరాలను మీడియాకు వెల్లడించారు. మొత్తం చోరీ కేసులు 2664 రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 2664 కేసులు చోరీ కేసులు నమోదయ్యాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. యాదాద్రి లో 36 మంది మైనర్ బాలికలను వ్యభిచార కూపం నుంచి కాపాడామని పేర్కొన్నారు. ఈ కేసులో 12 మంది యువతులు , 29 వ్యభిచార నిర్వహకులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. లింగ నిర్ధారణ కేసుల్లో ఐదుగురు డాక్టర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. లోక్ అదాలత్ కింద 5250 కేసులు పరిష్కారం చేశామన్నారు. రాచకొండలో 12263 కేసులు నమోదు కాగా 3496 మందికి జైలుశిక్ష , అందులో 12 మందికి జీవిత ఖైదు పడినట్లు వెల్లడించారు. 46 బాల్య వివాహాలను రాచకొండ పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఇక ఈవ్ టీజింగ్‌లో షీ టీమ్స్ 516 కేసులు నమోదు చేసాయని పేర్కొన్నారు. 2018 సంచలన కేసులు ఉప్పల్‌లో నరబలి కేసు రాజధానిలో సంచలనం సృష్టించిన ఉప్పల్ నరబలి కేసులో రాజశేఖర్, అతని భార్య శ్రీలతను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. వేలిముద్రలు, డీఎన్ఏ ఆధారంగా కేసును ఛేదించనట్లు వెల్లడించారు. మూసీ ఘటన వలిగొండలో ట్రాక్టర్ మూసీ నదిలో పడిన ఘటనలో 15 మంది మృతి చెందగా, 6 మంది గాయాలు పాలయ్యారని మహేష్ భగవత్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చిన నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. 2018లో రాచకొండలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు రాచకొండలో మొత్తం 2773 రోడ్డు ప్రమాదాలు జరిగాయని సీపీ పేర్కొన్నారు. ఈ ఘటనల్లో 694 మృతి చెందారని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై 34 రోడ్డు ప్రమాదాలు జరుగగా 20 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2018లో మొత్తం5692 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా వాటిల్లో పగలు 5002 కేసులు, రాత్రి 690 కేసులు నమోదయ్యాయని మహేష్ భగవత్ పేర్కొన్నారు. చలానా రూపంలో 93 లక్షలు రూపాయలు జరిమానా వసూళ్లు చేసినట్లు తెలిపారు. మొత్తం 897 మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఇక పెట్టీ నేరాల్లో 24425 కేసులు నమోదు చేశామని తెలిపారు. రాచకొండలో 59,222 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ స్మైల్ కింద 530 మంది చిన్నారులను కాపాడినట్లు సీపీ పేర్కొన్నారు. వీరిని ఒడిషా, బిహార్, అసోం, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలలుగా గుర్తించినట్లు తెలిపారు. డ్రగ్స్ ఈ ఏడాది గంజాయి అక్రమ రవాణా నేరంలో 30 కేసులు నమోదు చేసి.. 63 మంది అరెస్ట్ చేసినట్లు మహేష్ భగవత్ పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 548 కేజీల గంజాయి, 10 గ్రాముల కొకైన్, 20 గ్రాములు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని... ఈ కేసుల్లో పట్టుబడిన 11 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబై, గోవాకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రికవరీ పెరిగింది 2018లో మొత్తం 685 మందిని స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారని సీపీ వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 746 కేసులు నమోదు కాగా... సీసీఎస్(సైబర్ క్రైమ్ స్టేషన్) 384 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 2018లో 2,09,17, 3031 ప్రాపర్టీలాస్ కాగా 1,30, 26,6620 ఆస్తిని రికవరీ చేసినట్లు తెలిపారు. మొత్తం 62% సొమ్ము రికవరీ అయ్యిందని, ఘటనా స్థలంలో దొరికన ఆధారాలతో 56 మంది నేరస్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రాపర్టీ రికవరీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిందని పేర్కొన్నారు. చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్‌పై మొత్తం 29 కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. ఆ గ్యాంగ్‌లో 23 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక ట్రాఫిక్ వ్యవస్థకు సంబంధించి మొత్తం 11,60,937 నమోదు అయ్యాయని వెల్లడించారు. వీటిలో 5,692 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ- చలానా కింద 7,93,00 కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై 2112 కేసులు, ఓవర్ స్పీడ్‌తో పట్టుబడిన వారిపై 1,19 ,933 కేసులు , సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన నేరంలో 5660, సిగ్నల్ జంప్ కింద 11423 కేసులు నమోదు చేశామని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఫొటో తీసేందుకు ఆటోమేటిక్‌గా కాప్చర్ చేసే కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు మహేష్ భగవత్ వెల్లడించారు. -
పెళ్లి: మతం మార్పించి.. మొహం చాటేశాడు!
మల్కాజిగిరి: ఓ యువతిని పెళ్లి పేరుతో మోసగించి ఏడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుణ్ని ఎల్ఓసీ(లుక్ అవుట్ సర్టిఫికెట్) ద్వారా ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. ఎస్హెచ్ఓ మన్మోహన్ కథనం ప్రకారం..దారుల్‌షిఫాకు చెందిన సఫ్దర్ అబ్బాస్ జైదీ(28) దుబాయిలో 2014 నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అంతకు ముందు 2012 నుంచి దుబాయికి వెళ్లే వరకు హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేశాడు. ఆ సమయంలో పరిచయమైన ఓ హిందూ యువతిని ప్రేమించాడు. అనంతరం దుబాయికి వెళ్లిన అబ్బాస్ కొన్ని రోజుల తర్వాత ఆ యువతిని కూడా అక్కడికి పిలిపించుకొని ఉద్యోగంలో చేర్చాడు. వివాహం చేసుకోవడానికి అబ్బాస్ తన తల్లితండ్రులను ఒప్పిస్తానని అందుకు మతం మారాలని నమ్మించి మత మార్పిడి చేయించాడు. అనంతరం వారిద్దరూ గతేడాది నగరానికి తిరిగి వచ్చారు. తల్లితండ్రులతో మాట్లాడానని ఏప్రిల్ 17న పెళ్లి, 28న రిసెప్షన్ ఏర్పాటు చేశామని ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఆ యువతిని నమ్మించారు. జనవరిలో దుబాయికి వెళ్లిన అనంతరం అబ్బాస్ ఆమెతో మాట్లాడడం మానేశాడు. ఈ సంఘటనపై ఆ యువతి తల్లి ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ కమిషనర్ మహేష్ భగవత్ నిందితునిపై ఎల్ఓసీ జారీ చేశారు. ఈ నెల 27న నగరానికి వచ్చిన అబ్బాస్‌ను ఎయిర్‌పోర్టు పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
తుపాకీతో హల్చల్.. బంగారం చోరికి యత్నం
సాక్షి, మేడ్చల్: తుపాకితో బెదిరించి బంగారు దుకాణంలో చోరికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ ఘటన జవహర్ నగర్, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దుమ్మాయిగూడలోని దుబాయ్ బిల్డింగ్ వద్ద ఉన్న జ్యువెలరీ షాప్‌లో ఆరుగురు అగంతకులు తుపాకితో బెదిరించి చోరికి ప్రయత్నించారు. చోరీ సమయంలో ముఠా సభ్యులు అక్కడ ఉన్నవారిని బెదిరించడానికి గాల్లోకి కాల్పులు జరిపారు. పారిపోతున్న సమయంలో రోడ్డుపైన వెళ్తున్న వ్యక్తిని బెదిరించి బైక్ లాక్కుని ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ చోరికి యత్నించింది అంతర్ రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. అయితే జ్యువెలరీ షాప్‌లో బంగారం ఎంత చోరికి గురైందో తెలియాల్సివుంది. -
ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
సాక్షి, హైదరాబాద్ : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు కాజేసిన నిందితున్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని దల్వింద్ సింగ్ అనే వ్యక్తి పేపర్లో ప్రకటన ఇచ్చారు. ప్రకటన చూసి హైదరాబాద్, మహబూబ్ నగర్‌కు చెందిన కొంత మంది అతన్ని సంప్రదించారు. దీంతో వీసా కోసమే డబ్బుతో ఢిల్లీకి రావాల్సిందిగా వారిని నమ్మబలికారు. ఉద్యోగాల కోసం ఢిల్లీకి వెళ్లిన వారిని ఓ హూటల్‌కి తరలించారు. భోజనంలో మత్తుమందు కలిసి వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బును కాజేసి హుటాయించారు. మత్తు నుంచి తేరుకున్నాక బాధితులు ఢిల్లీలోని ఝాన్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు సరిగా స్పందించకపోవడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు హరిత ఫిర్యాదుతో నిందితుడు దల్విందర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ మహేష్భగ్వత్ మాట్లాడుతూ.. నిందితుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో మోసాలకు పాల్పడ్డాడని, గతంలో కూడా ఇదే తరహాలో మోసం చేసి పోలీసులకు చిక్కాడని పేర్కొన్నారు. -
టెక్నాలజీతో మోసాలు.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : టెక్నాలజీ సహాయంతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు టెక్నాలజీ సహాయంతో మొబైల్ కొనుగోలు చేసేటప్పడు ఆన్లైన్ ద్వారా డబ్బులు చెలించినట్టు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు 5 లక్షల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. ఈ కేసులో అరెస్టయిన నిందితులు గతంలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. వీరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ఐదు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించి వీరు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు వీరు 9 కేసుల్లో నిందితులుగా ఉన్నారని అన్నారు. నిందితుల దగ్గర నుంచి 11 ఒప్పో, 8 వివో, 2 సామ్సంగ్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలిచామని తెలిపారు. -
రెండేళ్లు పూర్తి చేసుకున్న రాచకొండ కమిషనరేట్
సాక్షి, హైదరాబాద్ : నాలుగున్నర కోట్లతో నూతన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ ఏర్పాటయి రెండేళ్లు పూరైనా సందర్భంగా కమిషనరేట్ పరిధిలో సాధించిన విజయాలను మహేశ్ భగవత్ వివరించారు. ‘రాచకొండ కమిషనరేట్ విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దది. కమిషనరేట్ పరిధిలో 3,787 సిబ్బంది పనిచేస్తుండగా.. 3,119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం చేపడుతాం. 2017 జూన్ నుంచి 2018 జూన్ వరకు 20, 817 కేసులు నమోదయ్యాయి. 4,243 ఆర్థిక నేరాలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఏడాది కాలంలో షీ టీమ్ బృందాలు 591 కేసులు నమోదు చేశాయి. మరో 700 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. 40కు పైగా బాల్య వివాహాలను అడ్డుకున్నాం. 760 కుటుంబ సమస్యలను పరిష్కరించాం. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 210 మంది చిన్నారులను రక్షించాం. మైనర్ నేరస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టి తిరిగి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. నాలుగున్నర కోట్లతో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. మేడిపల్లిలో 56 ఎకరాల్లో కమిషనరేట్ భవన నిర్మాణం జరగనుంద’ని మహేశ్ భగవత్ తెలిపారు. -
ఎస్సీ,ఎస్టీ కేసు పేరుతో రూ.15లక్షలు వసూలు
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ,ఎస్టీ చట్టం పేరుతో అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సోమజిగూడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రమేష్, సంజీవ కుమార్, కిరణ్ అనే ముగ్గురు కొద్ది కాలం క్రితం పనిలో చేరారు. అయితే వీరి పనితీరు నచ్చని యజమాని శ్రీనివాస్, పనిలో నుంచి తప్పిస్తానని హెచ్చరించాడు. దీంతో యజమానిపై కోపం పెంచుకున్న ముగ్గురు ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా యజమాని నుంచి ఒక చెక్, ప్రామిసరి నోటు తీసుకొన్నారు. కేసు పేరుతో దాదాపు పదిహేను లక్షల రూపాయలకు పైగా శ్రీనివాస్ నుంచి వసూలు చేశారు. అయితే వీరి వేధింపులను కొద్ది కాలం పాటు భరించిన యజమాని.. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఎల్బీ నగర్ పోలీసులు ముగ్గరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కొద్ది మొత్తంలో డబ్బు, ప్రామిసరి నోటు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎవరైన ఇలాంటి చీటింగ్, బెదిరింపులకు పాల్పడితే 9490617111 ద్వారా తమను సంప్రదించవచ్చని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. -
మహేష్ భగవత్‌పై డీసీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ డీసీపీ పులిందర్ రెడ్డి, తన ఉన్నతాధికారి రాచకొండ పోలీస్ కమీషనర్‌పై మానవహక్కుల కమీషన్లో ఫిర్యాదు చేశారు. కమీషనర్ మహేష్ భగవత్ తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పులీందర్ రెడ్డి తనన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీసీపీ ఫిర్యాదును స్వీకరించిన కమీషన్ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆగస్టు ఒకటో తేదీన రిపోర్టు ఇవ్వాలని తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ మహేందర్ రెడ్డికి మానవహక్కుల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. -
చిన్నారి నరబలి కేసులో షాకింగ్ నిజాలు!
-
చిన్నారి నరబలి కేసులో షాకింగ్ నిజాలు!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్‌లోని చిన్నారి నరబలి కేసులో ఆశ్చర్యకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్య ఆరోగ్యం కోసం రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఆరేళ్ల పాపను నరబలి ఇవ్వడం నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు వారాల కిందట జరిగిన చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. రెండేళ్ల కిందటే నరబలికి బీజం పడింది. రెండేళ్ల కిందట మేడారం జాతరకు రాజశేఖర్, లత దంపతులు వెళ్లగా అక్కడ వారు ఓ కోయదొరను కలిశారు. ఆరోగ్యం బాగుపడాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే నరబలి ఇవ్వడమే మార్గమని ఆ కోయదొర, మాంత్రికుడు ఈ దంపతులకు చెప్పాడు. ఇక అప్పటినుంచీ నరబలి గురించి ఎంతో ఆలోచిస్తున్న రాజశేఖర్, శ్రీలతలు బలి ఇచ్చేందుకు పిల్లలు ఎక్కడ దొరుకుతారని తీవ్రంగా యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత జనవరి 31న రాజశేఖర్ సోదరుడు గణేశ్ బోయగూడలోని ఓ ఫుట్ పాత్ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడు. చార్మినార్‌లోని ఒక బాబా కన్నుసన్నల్లో పూజలు చేయించాడు. నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను సోదరులు ఇద్దరు బండ్లగూడ మూసి సమీపంలో చెట్ల పొదలో పడేశారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను నిందితులు పడేశారు. పాప తలపై చంద్రుని వెలుగు, సూర్య కిరణాలు పడాలని చెప్పడంతో డాబాపై తల పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండేళ్ల నుంచి నరబలి ఇవ్వడానికి నిందితులు యత్నిస్తున్నట్లు తెలియడంతో పోలీసులే షాకయ్యారు. సెక్షన్ 124 , 302, 366, 201, 120 B కింద కేస్ నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నరబలి జరిగినట్లు గుర్తించాం: మహేష్ భగవత్ నరబలి కేసుపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ పలు విషయాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన నరబలి కేసును చేధించాం. చిన్నారి నరబలి కేసులో మొత్తం 122 ఫోన్లు, 54 సెల్ టవర్ ల డేటాను అనలైజ్ చేశాం. మొత్తం 40 మంది సాక్షులను, 45 మంది అనుమానితులను విచారించాం. 100 సీసీ కెమెరాల డేటాను పరిశీలించాం. ప్రధాన నిందితుడు రాజశేఖర్‌తో పాటు భార్య శ్రీలత, ఓ మాంత్రికుడు సహా పాపను తీసుకు వచ్చిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం. మొత్తం ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. భిన్నకోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత నరబలి జరిగినట్లు గుర్తించాం. క్యాబ్ డ్రైవర్, ఇంటి యజమాని రాజశేఖర్ కోయదొర, మాంత్రికుడి సలహా మేరకు పాపను నరబలి ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలో లభ్యం అయిన నమూనాలతో ఫొరెన్సిక్ నివేదిక సమర్పిచింది. డీఎన్ఏ రిపోర్ట్ ద్వారా బలిచ్చింది ఆడ శిశువునే అని నిర్ధారణకు వచ్చినట్లు సీపీ మహేష్ భగవత్ వివరించారు.