కేసు వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేశ్ భగవత్
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ ఠాణాలో అదృశ్యం కేసుగా నమోదైన రజిత కేసు దృశ్యం సినిమాను తలపించింది. ఆ సినిమా లో తన కూతురును బలవంతం చేయబోయి న వ్యక్తిని మీనా చంపేస్తే ఆ శవాన్ని మాయం చేసేందుకు సుదూర ప్రాంతానికి తీసుకెళ్లి హీరో వెంకటేశ్ ఏ సాక్ష్యం దొరక్కుండా జాగ్ర త్త పడటం చూశాం. ఆ రీల్ లైఫ్‌కు తగ్గట్టుగానే రియల్‌లైఫ్‌లో కాస్త భిన్నంగా తనను బలవంతం చేసిన వ్యక్తి బెదిరింపులకు తలొగ్గి కన్నతల్లి హత్యలో భాగస్వామ్యమై ఎవరికీ ఏ అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేసేందుకు సుదూర ప్రయాణం చేయడం దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా నడిచింది. వీరు ఆధారాలు చెరిపేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిందితురాలి తండ్రికి వచ్చిన అనుమానం కాస్తా ఆమెను ఇప్పుడు ఏకంగా జైలు ఊచలు లెక్కించేలా చేసింది. తల్లి రజితను హత్య చేసిన కూతురు కీర్తితో పాటు కొత్త శశికుమార్‌లను రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అలాగే కీర్తిని ప్రేమించి అత్యాచారం చేశాడని పోక్సో యాక్ట్ కింద నమోదైన మరో కేసులో చిమ్ముల బాల్‌రెడ్డికి కూడా సంకెళ్లు వేశారు. ఇలా ఒక్క మిస్సింగ్ కాస్తా 3 కేసులుగా మారింది. శివకుమార్‌పై కూడా పోక్సోయాక్ట్ కేసు నమోదుచేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సతీశ్‌లతో కలసి సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.
అబార్షన్‌నే అడ్వాంటేజ్‌గా..
కీర్తికి అబార్షన్ అయిన విషయాన్ని ఆమె తల్లికి చెబుతానంటూ శశికుమార్ బెదిరించడం మొదలెట్టాడు. ఈ వేధింపులకు భయపడిన కీర్తి శశికి శారీరకంగా లొంగిపోయింది. ఏకాంతంలో ఉండగా ఫొటోలు, వీడియోలు తీసిన శశి తనతో శారీరక సంబంధం కొనసాగించచాలని బెదిరించాడు. తనతో సన్నిహితంగా ఉన్న విషయాన్ని బాల్‌రెడ్డితో పాటు మీ అమ్మ రజితకు చెప్తానన్నాడు. చివరకు మీ అమ్మ రజితను చంపేస్తే ఆమె నిర్వహిస్తున్న చిట్టీల డబ్బులు, సిటీలో ఉన్న ప్లాట్లు, సొంతూరులో ఉన్న భూములు నీ సొంతమవుతాయని, ఆ తర్వాత తనకు రూ. 10 లక్షలిస్తే హాయిగా బాల్‌రెడ్డిని పెళ్లి చేసుకోవచ్చని నమ్మించాడు. ఇలా అక్టోబరు 16న రజితకు నిద్రమాత్ర లి వ్వగా ఆమెకు ఏమీ కాలేదు. దీంతో 19న రాత్రి ఇంట్లో రజిత బెడ్‌పై పడుకొని ఉండగా ఆమె కళ్లలో కారం చల్లి, కడుపు మీదకు ఎక్కి చేతులు గట్టిగా పట్టుకోవడంతో శశి ఆమె మెడకు చున్నీ బిగించి చంపాడు.
కీర్తి, శశికుమార్
అమ్మగా మాట్లాడిన కీర్తి...
అనంతరం రజిత సెల్‌ఫోన్ నుంచి బాల్‌రెడ్డి తండ్రికి ఫోన్ చేసిన కీర్తి చికిత్స కోసం ఆçస్పత్రికి వెళ్తున్నానని, తిరిగి వచ్చేంత వరకు అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నానని రజితగా గొంతు మార్చి మాట్లాడింది. రెండ్రోజుల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మిద్దామనుకుంది. అప్పటికే శవం దుర్వాసన వస్తుండటంతో దాన్ని బెడ్‌షీట్‌తో చుట్టి శశి కారు డిక్కీలో వేసుకొని చౌటుప్పల్ రైల్వే ట్రాక్ రామన్నపేట పట్టాలపైకి తీసుకొచ్చి పడేశారు. బెడ్‌షీట్, దారాలను తూప్రాన్‌పేట లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. కీర్తి బంధువులు మీ అమ్మ ఎక్కడికెళ్లిందంటూ అడుగు తుండటంతో తాను వైజాగ్ వెళ్లానని, నాన్న తాగొచ్చి తరచూ అమ్మతో గొడవపడేవాడని సమాధానమిచ్చింది. అక్టోబరు 26న రాత్రి హయత్‌నగర్ పీఎస్‌లో మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసింది. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి కూతురిపైనే అనుమానం ఉందంటూ పోలీసులకు చెప్పడంతో కేసు యూటర్న్ తీసుకుంది. బాల్‌రెడ్డి తండ్రిని అడిగితే ‘వైజాగ్ ఎక్కడెళ్లింది.. మా ఇంట్లోనే ఉంది కదా’అని సమాధానమివ్వడంతో కీర్తి అబద్ధం చెబుతున్నట్టుగా పోలీసులు నిర్ధారణకొచ్చి ఆ దిశగా విచారణ చేయగా కేసు చిక్కుముడి వీడింది. కీర్తికి అబార్షన్ చేసిన అమన్‌గల్‌లోని పద్మ నర్సింగ్ హోమ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు.
పరిచయం కాస్తా ప్రేమగా..
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం నెర్నామ్లా గ్రామానికి చెంది న శ్రీనివాస్‌రెడ్డి, రజితల కుటుంబం పదేళ్ల క్రితం హైదరాబాద్ సమీపంలోని మునగనూర్‌కు వలసవచ్చింది. వీరి కుమార్తె కీర్తిరెడ్డి దిల్‌సుఖ్‌నగర్‌లో బీఎస్సీ మైక్రో బయాలజీ సెకండియర్ చదువుతోంది. పొరుగింట్లో ఉంటున్న శశికుమార్ కుటుంబంతో కీర్తి కుటుంబానికి సాన్నిహిత్యం పెరిగింది. కీర్తి ఇంటర్ చదువుతున్న సమయంలో రామాంజనేయనగర్ కాలనీలో ఉంటున్న స్నేహితురాలు శిల్ప వద్దకు వెళ్తుండేది. ఈ క్రమంలో శిల్ప సోదరుడు బాల్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమ వరకు వెళ్లి వివాహం చేసుకోవాలనుకున్నారు. శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. గతే డాది సెప్టెంబర్‌లో కీర్తి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాలని భావించారు. అబార్షన్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరం ఉండటంతో కీర్తి ఇంటిపక్కనే ఉన్న శశి సహాయం తీసుకున్నారు. సంగారెడ్డిలో ఓ ఫంక్షన్‌కు వెళ్తున్నామని, కీర్తిని కూడా పంపించాలంటూ శశి అడగటంతో తల్లి రజిత అంగీకరించింది. ఇలా సంగారెడ్డికి బదులు అమన్‌గల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించిన బాల్‌రెడ్డి మళ్లీ హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment