సాక్షి, హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2018లో మొత్తం 20,820 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శనివారం ఆయన సంవత్సారంతపు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2018లో నమోదైన సంచలన కేసులు, వాటిని ఛేదించిన తీరు తదితర వివరాలను మీడియాకు వెల్లడించారు.
మొత్తం చోరీ కేసులు 2664
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 2664 కేసులు చోరీ కేసులు నమోదయ్యాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. యాదాద్రి లో 36 మంది మైనర్ బాలికలను వ్యభిచార కూపం నుంచి కాపాడామని పేర్కొన్నారు. ఈ కేసులో 12 మంది యువతులు , 29 వ్యభిచార నిర్వహకులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. లింగ నిర్ధారణ కేసుల్లో ఐదుగురు డాక్టర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. లోక్ అదాలత్ కింద 5250 కేసులు పరిష్కారం చేశామన్నారు. రాచకొండలో 12263 కేసులు నమోదు కాగా 3496 మందికి జైలుశిక్ష , అందులో 12 మందికి జీవిత ఖైదు పడినట్లు వెల్లడించారు. 46 బాల్య వివాహాలను రాచకొండ పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఇక ఈవ్ టీజింగ్‌లో షీ టీమ్స్ 516 కేసులు నమోదు చేసాయని పేర్కొన్నారు.
2018 సంచలన కేసులు
ఉప్పల్‌లో నరబలి కేసు
రాజధానిలో సంచలనం సృష్టించిన ఉప్పల్ నరబలి కేసులో రాజశేఖర్, అతని భార్య శ్రీలతను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. వేలిముద్రలు, డీఎన్‌ఏ ఆధారంగా కేసును ఛేదించనట్లు వెల్లడించారు.
మూసీ ఘటన
వలిగొండలో ట్రాక్టర్ మూసీ నదిలో పడిన ఘటనలో 15 మంది మృతి చెందగా, 6 మంది గాయాలు పాలయ్యారని మహేష్ భగవత్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చిన నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
2018లో రాచకొండలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు
రాచకొండలో మొత్తం 2773 రోడ్డు ప్రమాదాలు జరిగాయని సీపీ పేర్కొన్నారు. ఈ ఘటనల్లో 694 మృతి చెందారని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై 34 రోడ్డు ప్రమాదాలు జరుగగా 20 మంది మృతి చెందినట్లు వెల్లడించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
2018లో మొత్తం5692 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా వాటిల్లో పగలు 5002 కేసులు, రాత్రి 690 కేసులు నమోదయ్యాయని మహేష్ భగవత్ పేర్కొన్నారు. చలానా రూపంలో 93 లక్షలు రూపాయలు జరిమానా వసూళ్లు చేసినట్లు తెలిపారు. మొత్తం 897 మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఇక పెట్టీ నేరాల్లో 24425 కేసులు నమోదు చేశామని తెలిపారు. రాచకొండలో 59,222 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆపరేషన్ స్మైల్
ఆపరేషన్ స్మైల్ కింద 530 మంది చిన్నారులను కాపాడినట్లు సీపీ పేర్కొన్నారు. వీరిని ఒడిషా, బిహార్, అసోం, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలలుగా గుర్తించినట్లు తెలిపారు.
డ్రగ్స్
ఈ ఏడాది గంజాయి అక్రమ రవాణా నేరంలో 30 కేసులు నమోదు చేసి.. 63 మంది అరెస్ట్ చేసినట్లు మహేష్ భగవత్ పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 548 కేజీల గంజాయి, 10 గ్రాముల కొకైన్, 20 గ్రాములు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని... ఈ కేసుల్లో పట్టుబడిన 11 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబై, గోవాకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది రికవరీ పెరిగింది
2018లో మొత్తం 685 మందిని స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారని సీపీ వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 746 కేసులు నమోదు కాగా... సీసీఎస్(సైబర్ క్రైమ్ స్టేషన్) 384 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 2018లో 2,09,17, 3031 ప్రాపర్టీలాస్ కాగా 1,30, 26,6620 ఆస్తిని రికవరీ చేసినట్లు తెలిపారు. మొత్తం 62% సొమ్ము రికవరీ అయ్యిందని, ఘటనా స్థలంలో దొరికన ఆధారాలతో 56 మంది నేరస్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రాపర్టీ రికవరీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిందని పేర్కొన్నారు.
చెడ్డీ గ్యాంగ్
చెడ్డీ గ్యాంగ్‌పై మొత్తం 29 కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. ఆ గ్యాంగ్‌లో 23 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక ట్రాఫిక్ వ్యవస్థకు సంబంధించి మొత్తం 11,60,937 నమోదు అయ్యాయని వెల్లడించారు. వీటిలో 5,692 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ- చలానా కింద 7,93,00 కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై 2112 కేసులు, ఓవర్ స్పీడ్‌తో పట్టుబడిన వారిపై 1,19 ,933 కేసులు , సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన నేరంలో 5660, సిగ్నల్ జంప్ కింద 11423 కేసులు నమోదు చేశామని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఫొటో తీసేందుకు ఆటోమేటిక్‌గా కాప్చర్ చేసే కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు మహేష్ భగవత్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment