rachakonda
-
అంతర్ రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు
-
మీర్పేట్ మర్డర్ మిస్టరీ కొత్త టెక్నాలజీతో కేసు విచారణ
-
అందాల రాచకొండ
సంస్థాన్ నారాయణపురం: ప్రకృతి అందాలు.. ప్రాచీన కట్టడాలు, పురాతన దేవాలయాలకు పెట్టింది పేరు రాచకొండ ప్రాంతం. ఎత్తయిన కొండలు, ప్రకృతి సోయగాలు, పక్షుల కిలకిలారావాలు, మయూరాల నాట్యం, సెలయేళ్లు, జలపాతాలు.. అంతులేని ఈ ప్రకృతి అందాలకు చిరునామా రాచకొండ. ఆనాడు తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా వెలసిన గొప్ప నగరం. ఇప్పటి తెలంగాణ ప్రాంతం అంతటికీ పద్మనాయక వంశీయుల ఏలుబడిలో రాజధానిగా చరిత్ర పుటల్లో నిలిచింది. యాద్రాది భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని సంస్థాన్ నారాయణపురం మండలంలో రాచకొండ అటవీ ప్రాంతం 35 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉంది. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఫిలింసిటీ ఏర్పాటు కోసం ఏరియల్ సర్వే నిర్వహించి, అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. రాచకొండలో ఫిలింసిటీ ఏర్పాటు చేస్తానని గత సంవత్సరం జూలైలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద రెండో సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌కు.. గత ప్రభుత్వం రాచకొండ పోలీస్ కమిషనరేట్‌గా నామకరణం చేసింది. రాచకొండలో చూడదగ్గ ప్రదేశాలు.. రాచకొండలో కట్టడాలు, నిర్మాణాలతో పాటు గుహలు, వందల సంఖ్యలో దేవాలయాలు, శిల్ప కళాఖండాలు, చిత్రాలు ఉన్నాయి. ప్రధానంగా కచేరి ప్రదర్శన శాల, ఉత్సవ విగ్రహాల మందిరం, సన్యాసుల దొన, సంకెళ్ల బావి, మెట్ల బావులు, కోనేర్లు, కోట చుట్టూ ఉన్న రాతి కట్టడా లు, కొండలు, గుహలు, గొలుసు కట్టు చెరువులు, దేవలమ్మ నాగారంలోని నాగాంబిక శిలాశాసనం, గొలుసు కట్టు చెరువులు, గన్నేర్లలోని జాలువారు సెలయేళ్లు, మొల్కచెర్వు ప్రాంతంలోని ఎత్తయిన జలపాతాలు, అంతకు మించి పచ్చటి కొండలు, చిట్టడవిలో నెమళ్లు కనువిందు చేస్తాయి. నక్షత్ర తాబేళ్లకు ఈప్రాంతం ప్రత్యేకం. ప్రకృతి ప్రేమికులు వర్షాలు కురిసిన తర్వాత జూలై, ఆగస్ట్ నెలల్లో రాచకొండకు ఎక్కువగా వస్తుంటారు. చారిత్రక కట్టాడాలు, దేవాలయ సందర్శనకు రోజూ వస్తుంటారు. దేవాలయాలకు ప్రసిద్ధి రాచకొండలో వందల సంఖ్యలో దేవాలయాలున్నాయి. ఎంతో ప్రాధాన్యమున్న పురాతన రామాలయం ఉంది. ఆ రామాలయంలో సహజ పాండిత్య బమ్మెర పోతన పూజలు చేశాడని చరిత్ర చెబుతోంది. గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడిన స్వయంభూ లింగేశ్వర శివలింగానికి నిత్యం పూజలు నిర్వహిస్తారు. ఇటీవల పునరి్నరి్మంచిన సరళమైసమ్మ, శ్రీ లక్ష్మీ నర్సింహ దేవాలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. సరళ మైసమ్మ దేవాలయం వద్ద ప్రతి ఆదివారం జాతరలా జరుగుతుండటంతో.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.వీరభద్రస్వామి దేవాలయం, త్రికుటేశ్వర ఆలయం, అమ్మవారి దేవాలయాలు, పురాతన శివాలయంతో పాటు ఆళ్వారుల దేవాలయాలు.. ఇలా రాచకొండ అంతటా విస్తరించి ఉన్నాయి. మహాశివరాత్రికి స్వయంభూ లింగేశ్వర శివలింగం ఉత్సవాలు, గాలిబ్ షాహెద్ హజరత్ ఉర్సు ఒకేరోజు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. చౌటుప్పల్ మండలంలోని ఆదిమహావిష్ణువు దేవాలయల సందర్శనకు భక్తులు వస్తుంటారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల శివాలయంలో ఏకశిల ధ్వజస్తంభంతో పాటు ఇతర శాసనాలు, కట్టడాలు అనేకం ఉన్నాయి. మొల్కచెర్వు ప్రాంతంలో జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా.. రాచకొండ చారిత్రక నేపథ్యం ప్రతిబింబించేలా ప్రణాళికలు రూపొందించారు. రాచకొండ అటవీ శాఖ బీట్‌లో 657 ఎకరాల్లో ఎకో టూరిజం అర్బన్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ రకాల 2500 మొక్కలు నాటారు. పురాతన మెట్ల బావిని అభివృద్ధి చేశారు. రాచకొండ ప్రకృతి అందాలను తిలకించే విధంగా అతి పెద్ద వ్యూ పాయింట్, ప్రధాన ద్వారం అభివృద్ధి. దర్గా నుంచి రాచకొండ కోట వరకు రోడ్డు నిర్మాణం, రోడ్డు వెంట ఉన్న చెరువుల మరమ్మతులు చేశారు. వివిధ రకాల పూల, గడ్డి జాతి మొక్కలతో పాటు విభిన్న రకాల వృక్షాలను పెంచుతున్నారు .ఫిలింసిటీకి అనువైన ప్రాంతం.. హైదరాబాద్‌కు రాచకొండ అతి సమీపంలోని ప్రాంతం. గతంలో అప్పటి సీఎం కేసీఆర్ రెండు వేల ఎకరాల్లో ఫిలిం సిటీ నిర్మించాలని ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. గత సంవత్సరం జూలైలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఫిలింసిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. రాచకొండ గుట్టల్లో ఇప్పటికే పలు సినిమాలను చిత్రీకరించారు.మల్కాపురం ఘాట్ కంచె భూ ముల్లో ‘రెబల్’చిత్రం, పవన్‌కల్యాణ్ నటించిన ‘గబ్బర్‌సింగ్’సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. మహేశ్‌బాబు హీరోగా ‘ఆగడు’చిత్రం క్లైమాక్స్ ఫైట్‌ను కూడా ఇక్క డే చిత్రీకరించారు. రాచకొండలో శ్రీకాంత్ హీరోగా నటించిన ‘విరోధి’, ‘సీ తారాముల కల్యా ణం’ సినిమాలో సుమన్‌పై క్లైమాక్స్ ఫైట్లను చిత్రీకరించారు. ‘జానకిరామా’హిందీ సీరియల్ నిర్మాణంతో పాటు అనేక షార్ట్ ఫిల్మ్‌లు చిత్రీకరించారు. ప్రగతి.. ప్రతిపాదనలకే పరిమితం.. కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు రాచకొండ అభివృద్ధి ప్రతిపాదనలపై ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. కానీ ఆ తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదు. అభివృద్ధి ప్రతిపాదనల్లో భాగంగా రాచకొండలో ఐటీ పార్కు, కృషి విజ్ఞాన కేంద్రం, నెమళ్ల పార్కు, టెంపుల్ సిటీ, ఫిలింసిటీ, పర్వతారోహణం, రోప్‌వే, స్పోర్ట్స్‌సిటీ, ఎడ్యుకేషన్ హబ్, స్మార్ట్‌సిటీ, రైలుబోగీల పరిశ్రమ, ఇండ్రస్టియల్ కారిడార్‌గా అభివృద్ధి తదితర ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చాయి. రాచకొండకు హైదరాబాద్ నుంచి, శంషాబాద్ నుంచి, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి నుంచి నాలుగు లేన్ల రోడ్లను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇవన్నీ ప్రతిపాదనల దశల్లోనే ఉన్నాయి. రాచకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రాచప్ప సమితి సేవలు అమోఘం.. రాచకొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా లన్న ఉద్దేశంతో స్థానిక యువత రాచకొండ చారిత్రక పర్యావరణ పర్యాటక పరిరక్షణ సమితి (రాచప్ప) అనే సంస్థను ఏర్పాటు చేశారు. రాచకొండ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కొన్ని దేవాలయాలను ఎంపిక చేసుకొని, నిత్య దీపారాధన, స్వయంభూ లింగేశ్వర శివలింగం వద్ద సోమవారం అన్నదానం చేస్తున్నారు. రాచకొండ చరిత్రపై ప్రచారం నిర్వహిస్తున్నారు. రాచకొండ పర్యాటక ఉత్సవాలను కూడా రాచప్ప సమితి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. పర్యాటకాభివృద్ధి చేయాలి రాచకొండ ప్రాంతాన్ని ఫిలింసిటీతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. టెంపుల్ సిటీగా తీర్చిదిద్దాలి. మౌలిక వసతులు కల్పించాలి. చారిత్రక కట్టడాలను పరిరక్షించి గోల్కొండ ఖిల్లాను అభివృద్ధి చేయాలి. హైదరాబాద్‌కు అతి సమీపంలోని రాచకొండను అభివృద్ధి చేస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. – సూరపల్లి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి, రాచప్ప సమితి ది కోవ్ రిసార్ట్‌లో రూంల ధరలు ఇలా..» ఈ రిసార్ట్‌లో 21 కాటేజీలు ఉన్నాయి. వీటిలో బస చేయాలంటే పర్యాటక శాఖకు చెందిన వెబ్సైట్లో ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. » 21 కాటేజీలను 7 రకాలుగా విభజించి అద్దెలు నిర్ణయించారు. అద్దెకు 18 శాతం టాక్స్ అదనం. శేయాన్స్ రౌండ్ హౌస్: ఇది ఒక రూమ్ మాత్రమే. ఏసీ ఉంటుంది. దీని అద్దె 15 వేలు. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నవారికి (5 ఏళ్ల లోపు) మాత్రమే అవకాశం ఉంటుంది. అదనంగా ఎవరైనా ఉంటే రూ.5 వేలు చెల్లించాలి. పూల్ హెవెన్ కాటేజీలు: మూడు ఏసీ గదులు ఉంటాయి. అద్దె రూ.12 వేలు. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్న వారికి (5 ఏళ్ల లోపు) మా త్రమే అవకా శం ఉంటుంది. అదనంగా ఉండేవారికి రూ.4 వేలు చెల్లించాలి. 5 నుంచి 12 ఏళ్లలోపు వారు అయితే అదనంగా రూ.3 వేలు చెల్లించాలి. గ్లాంప్ విల్లా: రెండు ఏసీ గదులు ఉంటాయి. ధర రూ.13 వేలు. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్న వారికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉంటే రూ.2,500. 5 ఏళ్ల నుంచి 12 ఏళ్లలోపు ఉన్న వారికి అదనంగా రూ.1500 చెల్లించాలి. ట్విన్ బెడ్ కాటేజేస్: ఒక రూమ్. ఏసీ ఉంటుంది. నలుగురు పెద్దవారు, ఒకరు చిన్నారి ఉండేందుకు రూ.13 వేలు చెల్లించాలి. అదనంగా ఉండే వారికి రూ.2,500. అలాగే 12 ఏళ్ల పిల్లలకు రూ.1,500 అదనంగా చెల్లించాలి. ఫ్లోటింగ్ క్యాబిన్స్: రెండు ఏసీ గదులు ఉంటాయి. రూ.8,500 చెల్లించాలి. ఇద్దరు పెద్ద వారికి, ఒక చిన్నారికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉండే వారికి రూ.2 వేలు, టాక్స్ వేస్తారు. 12 ఏళ్లలోపు వారికి రూ.1500, పన్ను అదనం. పై రూంలలో ఉండే సదుపాయాలు టీవీ, ఫ్రిజ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, బ్రేక్‌ఫాస్ట్. ఫ్లోటింగ్ క్యాబిన్స్: ఒక రూం. నాన్ ఏసీ. రూ.7 వేలు, టాక్స్ అదనం. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్ ఉంటుంది. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్ అదనం. విల్లా బ్రాంచ్ కాటేజెస్: మూడు ఏసీ రూంలు ఉంటాయి. ధర రూ.7,500, టాక్స్ అదనం. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్ చెల్లించాలి. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్ అదనం. విల్లా బ్రాంచ్ కాటేజెస్: ఒక రూం, నాన్ ఏసీ. రూ.6 వేలు, టాక్స్ అదనం. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్ చెల్లించాలి. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం రూమ్స్: రెండు ఏసీ రూంలు. రూ.7,500, టాక్స్ అదనం. ఇద్దరు పెద్దలు, ఒకరు చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్ చెల్లించాలి. 12 ఏళ్లలోపు వారికి రూ.1,500, టాక్స్ అదనం. ప్రీమియం రూమ్స్: నాలుగు రూంలు. నాన్ ఏసీ. రూ.6 వేలు, టాక్స్ అదనం. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారికి అవకాశం. అదనంగా ఉంటే రూ.2 వేలు, టాక్స్ చెల్లించాలి. అదనపు చిన్నవారికి 1,500, టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూంలల్లో అడ్వెంచర్ యాక్టివిటీస్‌తోపాటు బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. -
మంచు ఫ్యామిలీ మెంబర్స్ పై 3 కేసులు : సీపీ సుధీర్ బాబు
-
రాచకొండ కమిషనరేట్ లో మంచు మనోజ్
-
మనోజ్ నుంచి నాకు ప్రాణ హాని.. సీపీకి మోహన్ బాబు లేఖ
తనయుడు మంచు మనోజ్‌పై టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ సీపీకి లేఖ రాశారు. అంతేకాకుండా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని లేఖలో మోహన్ బాబు ప్రస్తావించారు. మంచు మనోజ్, మౌనిక నుంచి తనకు రక్షణ కల్పించాలని లేఖ ద్వారా రాచకొండ సీపీని కోరారు.ఇల్లు విడిచి పెట్టి వెళ్లాడుఇంకా ఏమన్నారంటే.. నేను జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నాను. నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు మనోజ్ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. మాదాపూర్‌లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు. బెదిరింపులుమనోజ్, మౌనిక నా ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయంగా ఉంది. నాకు హాని కలిగించే ఉద్దేశంతో ఉన్నారు. నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయమని బెదిరించారు. సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు. ప్రాణ హానిచట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్, మౌనికలు ప్లాన్ చేశారు. నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్‌ను. మనోజ్, మౌనిక, వీరి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికలను తొలగించండి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి. నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండి అని మోహన్‌బాబు లేఖలో కోరారు.(ఇది చదవండి: పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్)ప్రాణహాని ఉంది.. మంచు మనోజ్ఇదిలా ఉంటే మంచు మనోజ్ తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి తమపై దాడి చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో తనకు గాయాలైనట్లు పోలీసులకు తెలిపారు. ఆదివారం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మనోజ్ ఆ వివరాలు కూడా పోలీసులకు సమర్పించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రాచకొండలో ఫిలింసిటీ: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఎత్తైన కొండలు, గుట్టలు, ఎటుచూసినా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా కనిపించే రాచకొండ గుట్టల్లో అంతర్జాతీయ హంగులతో ఫిలింసిటీని ఏర్పాటు చేస్తాం. ఫార్మాసిటీ కోసం సేకరించిన 20 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఐటీ పార్కులు, కాలుష్య రహిత ఫార్మాస్యూటికల్ కంపెనీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమలు, బ్యాటరీ తయారీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం. న్యూయార్క్ తరహాలో మహేశ్వరంలో మరో విశ్వనగరాన్ని తీర్చిదిద్దుతాం..’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లష్కర్‌గూడలో ‘కాటమయ్య రక్షణ కవచం పథకం’ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కల్లు గీత కార్మీకుల రక్షణ కోసం ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు (ఎవరెస్ట్ అధిరోహించిన మాలోతు పూర్ణతో కూడిన బృందం) రూపొందించిన కిట్లను ఈ సందర్భంగా కల్లు గీత కార్మీకులకు అందజేశారు. కిట్ల పనితీరును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక ప్రదేశంగా రంగారెడ్డి జిల్లా ‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు ఉన్నాయి. ఎకరం రూ.100 కోట్లకు పైగా పలుకుతోంది. రాబోయే రోజుల్లో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు కొత్తగా రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు ఓ మణిహారంగా నిలుస్తుంది. దాని చుట్టూ కొత్తగా పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇటు హయత్‌నగర్, అటు శంషాబాద్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. వెంచర్లలోనూ ఈత, తాటి చెట్లు ‘వృత్తిదారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వీరి కోసం ప్రభుత్వ ఖాళీ భూముల్లో, రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ, చెరువులు, కుంటలు, కాలువగట్లు, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి రహదారులకు ఇరువైపులా ఈత, తాటి చెట్లు నాటిస్తాం. వన మహోత్సవంలో భాగంగా ఈ చెట్లను పెద్ద సంఖ్యలో నాటాల్సిందిగా ఎక్సైజ్, అటవీ శాఖలకు ఇక్కడి నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నా. కొత్తగా పుట్టుకొచ్చే రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల్లోనూ ఈత, తాటి చెట్లకు ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు తీసుకొస్తాం. చేతి వృత్తులకు సమ న్యాయం కల్పిస్తాం. ప్రభుత్వాన్ని నిలబెడతామంటూ పార్టీలో చేరుతున్నారు! ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలే. ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తోంది. ఈ లోపే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని విష ప్రచారం చేస్తున్నారు. ఫాంహౌస్‌లలో పడుకున్నోళ్లు ప్రభుత్వాన్ని కూలుస్తామంటుంటే.. ప్రజాక్షేత్రంలో తిరిగే వారి ఎమ్మెల్యేలు మాత్రం నిలబెడతామంటూ వచ్చి పార్టీలో చేరుతున్నారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ప్రజలు ఆశించే అన్ని పనులు పూర్తి చేసి తీరుతుంది. పోటీ పరీక్షల షెడ్యూల్‌పై నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నేతల మాటలు విని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. అయినదానికి, కాని దానికి ఆవేశపడి రోడ్లెక్కొద్దు. ఏదైనా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడండి. అంతా కలిసి సమస్యను పరిష్కరించుకునేందుకు కృషి చేద్దాం..’ అని సీఎం చెప్పారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, డి.శ్రీధర్‌బాబు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, జిల్లా కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. కల్లెంత?..నీళ్లెంత? – గీత కార్మికులతో సీఎం సరదా సంభాషణ అబ్దుల్లాపూర్‌మెట్: ‘ఏం లక్ష్మయ్యా..రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతావ్? ఎన్ని సీసాల కల్లు తీస్తావ్? తీసేదాంట్లో కల్లెంత.. నీళ్లెంత..? రోజుకు కనీసం రూ.వెయ్యి అయినా మిగులుతుందా? ఊళ్లో బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నాయా..?’ ‘ఏం రంగయ్యా.. ఏం కిష్టయ్యా.. ప్రభుత్వం ఇచ్చిన రక్షణ కిట్టు మంచిగుందా? పనిచేస్తోందా? కిట్టును కనిపెట్టినోళ్లకు ఏమైనా దావత్ ఇచ్చారా..?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి లష్కర్‌గూడలో కల్లుగీత కార్మీకులతో కొద్దిసేపు ముచ్చటించారు. వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు స్పీకర్, మంత్రులతో కలిసి వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. గీత కార్మీకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైఎస్సార్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు 2004 నుంచి 2014 మధ్య కాలంలో దివంగత నేత వైఎస్సార్ నాయకత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కాంగ్రెస్ సృషే్ట. గత ప్రభుత్వం చనిపోయిన గీత కార్మీకులకు రూ.7.90 కోట్లు బకాయిపడింది. పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను తక్షణమే విడుదల చేస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. -
అమ్మకానికి చిన్నారులు బయటపడ్డ సంచలన నిజాలు
-
Swetha: ఫేస్బుక్ ద్వారా మగాళ్లకు రిక్వెస్టులు పంపుతూ..
సాక్షి, చిత్తూరు అర్బన్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటామని నమ్మించి రూ.46 లక్షలు కాజేసిన చిత్తూరుకు చెందిన అపర్ణ అలియాస్ శ్వేత (29)ను తెలంగాణలోని రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గంగనపల్లెకు చెందిన లేట్ నాగభూషణం కుమార్తె అపర్ణ చిత్తూరులోని అనాథ ఆశ్రమంలో పనిచేసేది. ఆశ్రమం మూతబడటంతో సులువుగా డబ్బులు సంపాదించడానికి అలవాటుపడ్డ అపర్ణ, ఫేస్బుక్ ద్వారా మగాళ్లకు రిక్వెస్టులు పంపుతూ డబ్బులు కాజేయడం మొదలుపెట్టింది. ఇలా రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం పెంచుకుంది. త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకుందామని నమ్మించింది. అయితే తన పేరిట రూ.7 కోట్లు బీమా ఉందని.. దీన్ని తీసుకోవాలంటే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని ఫోన్లో నమ్మ బలికింది. ఆ బీమా సొమ్ము కోసం ప్రస్తుతం కొద్దిగా డబ్బు చెల్లించాలని, సాయం చేయాలని ఆ వ్యక్తిని కోరింది. ఆ వ్యక్తి ఈ యువతిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో విడతల వారీగా అపర్ణ ఖాతాకు రూ.46 లక్షలు జమచేశాడు. తీరా పెళ్లికి నిరాకరించి, ఫోన్ ఎత్తక పోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రాచకొండ సైబర్ విభాగం పోలీసులు అపర్ణను అరెస్టు చేసి, ఆమె నుంచి అయిదు సెల్ఫోన్లు, ఓ ట్యాబ్‌ను సీజ్ చేశారు. చదవండి: (ప్రేమ ఎంత కఠినం) -
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
చండూరు మండల కేంద్రంలో ఉద్రికత్త
-
మునుగోడులో కట్టుదిట్టమైన భద్రత
-
భారత, ఆసీస్ మ్యాచ్ కు పూర్తి భద్రత కల్పించాం
-
హైదరాబాద్‌లో మరో కొత్తరకం మోసం
-
హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. ‘త్రి’ పాత్రాభినయం!
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రస్తుతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు స్టీఫెన్ రవీంద్ర, మహేష్ మురళీధర్ భగవత్ సెలవులో ఉండటమే ఇందుకు కారణం. దీంతో రెండు కమిషనరేట్లకూ ఆయనే ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్నారు. ఇలాంటి ఘట్టం ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి. ఈ నెల రెండో వారంలో రాచకొండ కమిషనర్ సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఆ కమిషనరేట్‌కు సైబరాబాద్ సీపీని ఇన్చార్జ్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చదవండి: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు గత వారం సైబరాబాద్ కమిషనర్ సైతం సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఈ పోస్టుకు ఆనంద్‌కు ఇన్చార్జ్ కమిషనర్‌ను చేశారు. దీంతో సాంకేతికంగా ఆయనే రెండు కమిషనరేట్లను ఇన్చార్జ్ సీపీగా మారారు. ఈ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పరిపాలన వ్యవహారాలను ఆనంద్ అదనపు పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం ఆయా కమిషనరేట్ల కమిషనర్లు తమ పరిధిలోని ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులు, పరిణామాలు, కార్యక్రమాలు, నిరసనలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. వీటికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ అధికారులు రూపొందించే పెరిస్కోప్ (నివేదిక) పరిశీలించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్ ప్రతిరోజు మూడు టెలీకాన్ఫరెన్స్‌లను నిర్వహించడంతో పాటు మూడు పెరిస్కోప్‌లను పరిశీలిస్తున్నారు. గురువారం సైబరాబాద్ పరిధిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో (ఐఎస్బీ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆనంద్ దృష్టి ఆ కమిషనరేట్‌పై ప్రత్యేకంగా ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్తు, భద్రత చర్యలపై సైబరాబాద్ ఉన్నతాధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం కావడంతో పాటు ఐఎస్బీని సందర్శించారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులతో సైబరాబాద్ పోలీసులు సమన్వయం ఏర్పాటు చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. -
పెండింగ్ చలాన్ వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్
-
డ్రంకెన్ డ్రైవ్: వారంలో రూ.కోటిన్నర జరిమానా
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ, డ్రంకెన్ డ్రైవ్‌లు, పెండింగ్ చలాన్ల వసూళ్లపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య రాచకొండ పరిధిలో 40,620 కేసులను నమోదు కాగా.. ట్రాఫిక్ ఉల్లంఘనలు, డ్రంకెన్ డ్రైవ్ కలిపి సుమారు రూ.కోటిన్నర జరిమానా విధించారు. ఇందులో అత్యధికంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 26,475 కేసులు నమోదు కాగా.. రూ.48,98,900 ఫైన్లు విధించారు. ఇద్దరికి జైలు శిక్ష రాచకొండ కమిషరేట్ పరిధిలో వారం రోజుల్లో 49 డ్రంకెన్ డ్రైవ్ కేసులను నమోదయ్యాయి. రూ.4,38,500 జరిమానా విధించారు. 176 మందిని కోర్టులో హాజరుపరచగా ఇద్దరికి జైలు శిక్ష పడింది. అత్యధికంగా వనస్థలిపురంలో 10 కేసులు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాలదారులపై 38 కేసులు బుక్కవగా.. త్రీవీలర్స్పై 2, ఫోర్ వీలర్ వాహనాదారులపై 9 కేసులు నమోదయ్యాయి. 54 రోడ్డు ప్రమాదాలు.. 10 మంది దుర్మరణం.. కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 54 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. వీటిలో పది మంది దుర్మరణం చెందగా.. 50 మందికి గాయాలయ్యాయి. తీవ్రత వారీగా చూస్తే 10 కేసులు ఘోరమైన ప్రమాదాలు కాగా.. 44 సాధారణ రోడ్డు ప్రమాదాలున్నాయి. ఆయా డేటాను విశ్లేషించగా మానవ తప్పిదాలు, రహదారి ఇంజనీరింగ్ లోపాలతోనే జరిగాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, వాహనాలు వాటంతటవే ప్రమాదాలకు గురికావడం కారణాలని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్ తెలిపారు. ఏ విభాగంలో ఎన్ని కేసులంటే.. విభాగం కేసుల సంఖ్య జరిమానా (రూపాయల్లో) హెల్మెట్ లేకుండా 26,475 48,98,900 సీట్‌బెల్ట్ లేకుండా 129 12,900 డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 837 4,11,500 అదనపు ప్రయాణికులు 28 7,200 ఎక్స్ట్రా ప్రొజెక్షన్ 415 41,500 అతివేగం 2,023 20,23,000 సిగ్నల్ జంప్ 96 96,000 ప్రమాదకర డ్రైవింగ్ 14 14,000 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 96 96,000 -
సరూర్ నగర్ చెరువు ను సందర్శించిన రాచకొండ సీపీ మహేష్ భగత్
-
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన హోమ్ గార్డ్
-
కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్
-
రాచకొండలో 12 శాతం తగ్గిన క్రైమ్ రేట్
సాక్షి, హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాచకొండలో 12 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని, కానీ మహిళలపై వేధింపుల కేసులు మాత్రం 11 శాతం పెరిగాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ తెలిపారు. దోపిడీలు, దొంగతనాల కేసుల్లోనూ 53 శాతం రికవరీ అయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ అరికట్టేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ యోదా పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని తెలంగాణలోనే తొలిసారిగా సీపీ మహేష్ భగవత్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూను వెల్లడించారు. (చదవండి:ఫ్లాగ్ మార్చ్‌లో రికార్డు!) రాచకొండలో మర్డర్ 52 , అత్యాచారాలు 323, కిడ్నాప్ 137 కేసులు నమోదు చేశామని కమిషనర్ పేర్కొన్నారు. దొంగతనం 1863, చీటింగ్ 1539, హత్యాయత్నాలు 116 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో 11 892 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డయల్ 100కు రోజూ 1,66,181కు తక్కువ కాకుండా ఫిర్యాదులు వచ్చాయన్నారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ చెందిన కేసులు 892 ఉండగా రూ.5 కోట్ల 95 లక్షల ఆస్తి రికవరీ చేశామన్నారు. 2,525 మిస్సింగ్ కేసులు నమోదవగా, 2233 కేసులు ఛేదించామని తెలిపారు. ఈఏడాది 89 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించామన్నారు. రాచకొండలో నమోదైన కేసుల గురించి సీపీ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. (చదవండి:15 రోజుల్లో పెళ్లి.. ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ) నేరాలు: మానవ అక్రమ రవాణా కేసులు 41 ఎక్స్సైజ్ కేసులు 202 అక్రమంగా పీడీఎస్ రైస్ తరలింపు కేసులు 105 సైబర్ క్రైమ్ కేసులు 704 సోషియల్ మీడియా కేసులు 4, 9026గా ఉన్నాయి. ట్రాఫిక్ : ► డ్రంక్ అండ్ డ్రైవ్ 3, 203, ఇందులో 324 మందిని జైలుకు పంపాము. ► డ్రంక్ డ్రైవ్ చేసిన వారికి రూ. 63 ,79 000 జరిమానాలు విధించాము. ► ఎంవీ యాక్ట్ కింద 15 లక్షల 56 వేల కేసులు నమోదు చేయగా కోటి 70 లక్షల రూపాయల జరిమానాలు విధించాము. ► రాచకొండలో 2047 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 533 మంది మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 31 యాక్సిడెంట్లు జరగ్గా, 15 మంది మృతి చెందారు. ► ఈ ఏడాది షీ టీమ్స్ 332 కేసులు నమోదు చేశాము. ► బాల్య వివాహాలు ఆపి 92 మందిని, ఆపరేషన్ ముస్కాన్ కింద 259 మంది పిల్లలను రెస్క్యూ చేశాము. ► రాచకొండలో 1052 మంది పోలుసులకు కరోనా సోకగా, అందులో 1022 రికవరీ అయ్యారు. 70 మంది పోలుసులు ప్లాస్మా దానం చేశారు. ► రాజా దర్బార్ ద్వారా 1453 ఫిర్యాదులు వస్తే 927 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయి. ► 1186 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము. ► మూఢనమ్మకాలపై కళాబృందాలు ద్వారా 74 గ్రామాల్లో అవగాహన కల్పించాము ► నైజేరియన్ మోసాలు 40 , ఏటీఎం క్లోనింగ్ 15 , లోన్ ఫ్రాడ్స్ 42 కేసులు నమోదు చేశాము. ► సోషియల్ మీడియా ద్వారా అమ్మాయిలని వేధించిన 26 మందిని అరెస్ట్ చేశాము. ► ఈ ఏడాది శంషాబాద్ విమానాశ్రయంలో 35 కిలోల బంగారం పట్టుబడగా దాని విలువ రూ.15 కోట్లుగా ఉంటుందన్నారు. ► 2019 లో రూ.19కోట్లు విలువ చేసే 58.145 కేజీల బంగారం పట్టుకున్నాము. -
గ్రేటర్ ఎన్నికలు: భారీ పోలీసు బలగాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. (చదవండి: జీహెచ్ఎంసీ: 13,500 మందితో పటిష్ట భద్రత) హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో.. రేపటి ఎన్నికల పోలింగ్‌కు భద్రతా పరమైన అన్నీ చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో 89 వార్డులు ఉన్నాయని, 4979 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు- 1517, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 167 గుర్తించామని పేర్కొన్నారు. 406 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 4187 గన్స్ డిపాజిట్ అయ్యాయి. 3066 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని పేర్కొన్నారు. (చదవండి: జనతా గ్యారేజ్ X కల్వకుంట్ల గ్యారేజ్) ‘‘పోలీసుల తనిఖీల్లో 1.45 కోట్ల రూపాయల స్వాధీనం చేసుకున్నాం. పలు చోట్ల భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నాం. 63 ఫిర్యాదులో 55 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశాం. సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం. కౌంటింగ్ కేంద్రాల బయట నిరంతర సీసీటీవీ నిఘా ఉంచాం. రేపు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ రోజున ప్రతి అభ్యర్థికి కేవలం ఒక్క వార్డు వద్ద ఒక్క వాహనం మాత్రమే అనుమతి ఇస్తాం. ఎలక్షన్ ఏజెంట్ కూడా అదే వాహనం లో వెళ్ళాలని’’ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మొత్తం 13 పోలీస్స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరగుతాయని తెలిపారు. 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. 15 లక్షలు విలువైన మద్యాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజలు 9490617111 కు సమాచారం అందించాలని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 4,800 మంది రోహింగ్యాలు ఉన్నారని వారిలో 4,500 మందికి బయోమెట్రిక్ నిర్వహించామని పేర్కొన్నారు. 160 మందిపై కేసులు నమోదు చేసామని వెల్లడించారు. నకిలీ పాస్‌పోర్టు కలిగిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ 9,101 పోలింగ్ కేంద్రాలు.. 74,67,256 మంది ఓటర్లు మొత్తం 150 వార్డులు, బరిలో 1,122 మంది అభ్యర్థులు టీఆర్ఎస్-150, బీజేపీ-149, కాంగ్రెస్-146 చోట్ల పోటీ టీడీపీ-106, ఎంఐఎం-51, సీపీఐ-17 డివిజన్లలో పోటీ సీపీఎం-12, స్వతంత్రులు-415, ఇతరులు 76 చోట్ల పోటీ 60 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్‌లు పోలింగ్ విధుల్లో 36,404 వేల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో 45 వేల మంది సిబ్బంది గ్రేటర్లో అతిపెద్ద డివిజన్ మైలార్‌దేవ్‌పల్లి గ్రేటర్లో అతిచిన్న డివిజన్ ఆర్సీపురం గ్రేటర్ ఎన్నికల కోసం 18,202 బ్యాలెట్ బాక్స్‌లు పోస్టల్ బ్యాలెట్ కోసం 2,629 మంది దరఖాస్తు డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు -
కరోనాను జయించిన వారియర్స్‌కు సన్మానం
సాక్షి, హైదరాబాద్ : కరోనాను జయించి తిరిగి విధుల్లోకి చేరిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సన్మానం చేశారు. లాక్డౌన్ సమయంలో విధి నిర్వాహనలో భాగంగా కరోనా వారియర్స్‌గా ముఖ్యపాత్ర పోషించిన పలువురు పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. రాచకొండ కమిసనరేట్ పరిధిలో దాదాపు 500 మంంది పోలీసులు కరోనాను జయించి మళ్లీ విధుల్లోకి చేరారు. వారి సేవలను గుర్తించి సీపీ మహేష్ భగవత్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్ కుమార్, డిసిపి మల్కాజిగిరి రక్షిత మూర్తి సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
రాచకొండలో వీ3 సేఫ్ టన్నెల్ ఏర్పాటు
-
డేగ‘కళ్ల’ కోసం రూ.50 కోట్లు...
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నగర భద్రతకు పెద్దపీట వేసింది. ఆ కోణంలోనే నిధుల కేటాయింపు చేసింది. బంజారాహిల్స్‌లో నిర్మాణమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కమ్ టెక్నాలజీ ప్యూజన్ సెంటర్‌కు రూ.125 కోట్లు కేటాయించింది. దీంతో పాటు మూడు కమిషనరేట్లలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.50 కోట్లు కేటాయించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి ప్రగతి పద్దు కింద రూ.672 కోట్లు కేటాయింగా... దీని నుంచి రాజధానిలోని మూడు కమిషనరేట్లకే రూ.329 కోట్ల కేటాయింపు జరిగింది. అయితే.. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పోలీసుస్టేషన్లకు మాత్రం నామమాత్రపు కేటాయింపులతో మొండిచేయి చూపింది. డేగ‘కళ్ల’ కోసం రూ.50 కోట్లు... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో విస్తరించి ఉన్న నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి పది లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. శరవేగంగా నడుస్తున్న ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం తన తొలి బడ్జెట్లోనే రూ.69 కోట్లు కేటాయించింది. 2017–18లో రూ.225 కోట్లు ఇచ్చింది. 2018–19ల్లో ఈ బడ్జెట్లో రూ.147.5 కోట్లు కేటాయించింది. ఇదే ప్రాజెక్టుకు తాజాగా రూ.50 కోట్లు కేటాయించింది. మరోపక్క ముగ్గురు కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఇప్పటికే అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా సంఖ్య రెండు లక్షలకు చేరుతోంది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద మూడు కమిషనరేట్లలో అవసరమైన పబ్లిక్ ప్లేసుల్లో కెమెరాలు ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో వీటి కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ప్రభుత్వం నిధులు సమకూర్చింది. ఇతర కేటాయింపులు ఇలా... ♦ నగర ట్రాఫిక్ విభాగానికి: రూ.2.56 కోట్లు ♦ గణేష్ ఉత్సవాల నిర్వహణకు: రూ.6.14 కోట్లు ♦ నగర నేర పరిశోధన విభాగానికి: రూ.12 లక్షలు ♦ కమ్యూనిటీ పోలీసింగ్‌కు: రూ.5 లక్షలు ♦ ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు: రూ.10 కోట్లు ♦ టెక్నాలజీ సమీకరణకు: రూ.10 కోట్లు ♦ సైబరాబాద్ ట్రాఫిక్‌కు: రూ.2.22 కోట్లు ♦ సైబరాబాద్ గణేష్ ఉత్సవాలకు: రూ.28 లక్షలు ♦ సైబరాబాద్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌కు: రూ.15 లక్షలు ♦ రాచకొండ గణేష్ ఉత్సవాలకు: రూ.2.05 కోట్లు ♦ టెక్నాలజీ సమీకరణకి: రూ.4 కోట్లు ఐసీసీసీ ఏర్పాటుకు కీలక అడుగు.. బంజారాహిల్స్‌లోని ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న టెక్నాలజీ ప్యూజన్ సెంటర్‌గా ఉండే సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్– క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ) దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.125 కోట్లు కేటాయించింది. ఈ భవనానికి సీఎం కేసీఆర్ 2015 నవంబర్ 22న శంకుస్థాపన చేశారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ పోలీస్ ‘ట్విన్ గ్లాస్ టవర్స్’ నిర్మాణానికి మొత్తం రూ.1002 కోట్లు నిర్మాణ వ్యయమవుతుందని అప్పట్లో అంచనా వేశారు. 2015లోనే రూ.302 కోట్లు మంజూరు చేయగా... 2016–17 బడ్జెట్లో మరో రూ.140 కోట్లు కేటాయించారు. 2017– 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.145 కోట్లు కేటాయించింది. 2018–19లో రూ.280.8 కోట్లు కేటాయింపు జరిగింది. గత ఏడాది ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో పూరిత చేయడం ఆలస్యమైంది. తాజాగా రూ.125 కోట్లు కేటాయించడంతో ఈ ఏడాది చివరి నుంచి దీని సేవలు ప్రారంభంకావడానికి మార్గం సుగమమైంది. రాష్ట్రానికే తలమానికం... దేశంలోనే ప్రతిష్టాత్మకంగా, ‘ట్విన్ టవర్స్’ పేరుతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ రాష్ట్రానికే తలమానికం కానుంది. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఏడెకరాల సంస్థలో ఈ జంట భవనాలను 83.4 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్నాయి. వీటి ద్వారా పోలీసు సింగిల్ విండో, కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం, సిటిజన్ పిటిషన్ మేనేజ్మెంట్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం, లా అండ్ ఆర్డన్ సిస్టం, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఒకే గొడుగు కిందికి రానున్నాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంలో భాగంగా డయల్– 100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోటకు చేరతాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం స్పందించేలా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉండనుంది. జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలతో పాటు ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులతో అనుసంధానమైన వ్యవస్థ ఇది. ‘రాచకొండ’ నిర్మాణం ఇక షురూ.. సైబరాబాద్ నుంచి విడిపడి, నల్లగొండలో ఉన్న భువనగిరి, చౌటుప్పల్ తదితర ప్రాంతాలను తనలో కలుపుకొంటూ ఏర్పడిందే రాచకొండ పోలీసు కమిషనరేట్. 2016లో ఆవిర్భవించిన ఈ కమిషనరేట్ 5091.48 చదరపు కి.మీ విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్దదిగా మారింది. దీనికంటూ ప్రత్యేకంగా కమిషనరేట్ భవనం లేకపోవడంతో గతంలో గచ్చిబౌలిలో ఉన్న సైబరాబాద్ కమిషనరేట్‌లో కొన్నాళ్లు కొనసాగింది. ఆపై నేరేడ్మెట్లోని తాత్కాలిక భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. కమిషనరేట్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటానికి దీని పరిధిలోని అనువైన ప్రాంతంలో ప్రత్యేక కమిషనరేట్ అవసరం ఉందని భావించిన సర్కారు మేడిపల్లిలో 56 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్రస్తుతం ప్రహరీ నిర్మానంలో ఉండగా... ఈ బడ్జెట్లో రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు ప్రగతి పద్దు కింద దీని నిర్మాణానికి రూ.62.95 కోట్లు కేటాయించింది. దీంతో భవన నిర్మాణం ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి.. నగర భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు రూ.125 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి చేసి సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం భారీగా కేటాయింపు జరిగింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 60 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. ఈ కేటాయింపుల్ని సద్వినియోగం చేసుకుని రాజధానిని ప్రథమ స్థానంలో నిలుపుతాం. – అంజనీకుమార్, సిటీ కొత్వాల్ -
రమ్య అనే నేను..
నేరేడ్మెట్: చిన్నతనం నుంచి చలాకీగా తిరుగుతూ..చదువులో చురుకుదనం..ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ బాలికపై విధి చిన్న చూపు చూసింది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఎంతో ఆశించింది. పోలీస్ కమిషనర్ కావాలనేది ఆమె జీవితాశయం. అయితే ప్రాణాంతక వ్యాధి రూపంలో మృత్యువు ఆమెను కబలిస్తోంది. మరణానికి చేరువలో ఉన్న ఆమె కలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్‌భగవత్ నేరవేర్చారు. నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ ఇందుకు వేదికైంది. వివరాల్లోకి వెళితే... ఓల్డ్ అల్వాల్‌కు చెందిన నర్సింహ, పద్మ దంపతుల కుమార్తె రమ్య(17). స్థానిక చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్(ఎంపీసీ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు(ఆంకాలజీ) కిరణ్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతోంది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న రమ్యకు పోలీసు కమిషనర్ కావాలనేది జీవితాశయం. పోలీసు అధికారులు,మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులతో రమ్య ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ నిర్వాహకులు రాచకొండ కమిషనర్ మహేష్‌భగవత్‌ను కలిసి రమ్య కోరికను వివరించారు. ఇందుకు సీపీ సానుకూలంగా స్పందించారు. దీంతో మంగళవారం ఫౌండేషన్ ప్రతినిధులు, తల్లిదండ్రులు, రమ్యను కమిషనరేట్‌కు తీసుకువెళ్లి సీపీ మహేష్‌భగవత్‌ను కలిశారు. పోలీస్ యూనిఫాంలో కమిషరేట్‌కు వచ్చిన రమ్యకు కార్యాలయం సిబ్బంది, అధికారులు గౌరవ వందనం చేశారు. రాచకొండ కమిషనర్‌గా మహేష్‌భగవత్ రమ్యకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం సీపీ ఆమెను స్వయంగా కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టారు. రిజిస్టర్లో సంతకం చేసి, ఒక రోజు కమిషనర్‌గా రమ్య విధులు నిర్వర్తించారు. 2017లో ఎహ్హాన్ అనే బాలుడు ఇదే తరహాలో ఒక రోజు కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీ మహేష్‌భగవత్, అడిషనల్ సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ రమ్య త్వరలోనే కోలుకోవాలని కోరారు. ఆమెకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రమ్య సీపీతో పాటు ఇతర అధికారులకు శెల్యూట్ చేసి, తనకు ఒక రోజు కమిషనర్‌గా అవకాశం కల్పించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన మేక్ ఏ విష్ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శిల్పవల్లి, శామీర్, రమ్య తల్లిదండ్రులు నర్సింహ్మ, పద్మ, ఫౌండేషన్ ప్రతినిధులు ప్రియాజోషి, పవన్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది.. ఒక రోజు రాచకొండ కమిషనర్‌గా పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలి. ఠాణాల్లో 5 ఎస్‌ల అమలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ కమిషనరేట్‌కు పేరు తెచ్చాయి. మహిళల భద్రత, రక్షణకు షీటీంలు బాగా పని చేస్తున్నాయి.–రమ్య -
నిఘానే ‘లక్ష్యంగా..!
సాక్షి,సిటీబ్యూరో: ఏప్రిల్ 19 రాత్రి సమయంలో అల్వాల్‌లోని అక్సిజన్ అర్కెడ్ అపార్ట్మెంట్లోకి చొరబడిన దొంగతలు ఇంటి తాళాలు పగులగొట్టి రూ.24 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఈ బిల్డింగ్‌లోని మెట్ల వద్ద, పార్కింగ్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిందితుల ఫొటోలు, వీడియోలు రికార్డయ్యాయి. కానీ వారి ముఖానికి మాస్క్‌లు ధరించడంతో గుర్తిం చడం కష్టమైంది. అయితే చోరీ చేసి తిరిగి వెళుతున్న దారిలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో వారి ముఖాలు చిక్కాయి. దీంతో వారిని రెండు వారాల వ్యవధిలోనే అరెస్టు చేసి సొత్తు స్వాధీ నం చేసుకొని నిందితులను జైలుకు పంపారు. ♦ ఆగస్టు 20న సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని బైరాంగూడలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ నుంచి ఓ చైన్‌స్నాచర్ బంగారు గొలుసు తెంచుకొని బైక్‌పై పరారయ్యాడు. అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కొత్తపేటలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేసే హర్యానా వాసి కుషరియా దతారామ్గా గుర్తించి ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లోనే కాదు వందల కేసుల్లో నిందితులను గుర్తించడమే కాకుండా వారికి జైలు శిక్షలు పడేలా న్యాయస్థానంలో సాంకేతిక సాక్ష్యంగా ఉపయోగపడుతున్న ఈ సీసీటీవీ కెమెరాలను అవశ్యకతను గుర్తించిన సైబరాబాద్, రాచకొండ పోలీసులు ‘లక్ష’ం వైపుగా సాగుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజ్గిరి, యాదాద్రి జోన్లో ఈ సీసీ కెమెరాల బిగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఓవైపు నేను సైతం ప్రాజెక్ట్, కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌ల ద్వారా ఈ సీసీ కెమెరాల సంఖ్య దాదాపు ఇరు కమిషనరేట్ల అధికారులు లక్ష చేరువలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్‌లో 96 వేలు, రాచకొండలో 90,700 సీసీ కెమెరాలను బిగించారు. అయితే, నేను సైతం ప్రాజెక్టు ద్వారానే అధిక నిఘానేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో బడా ఐటీ కంపెనీలు ముందుకొచ్చి పోలీసుల నేను సైతం ప్రాజెక్టుకు విరాళాలు ఇస్తున్నారు. అంతేగాకుండా సీసీ కెమెరాల నిర్వహణకు కూడా కొన్ని కంపెనీలు ఆర్థిక సాయం ఇస్తూ నేర రహిత సమాజంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ‘చాయ్ పే చర్చ’ ద్వారా జాగృతి లక్షల్లో ఉద్యోగులు పనిచేసే ఐటీ కారిడార్‌లోనూ సీసీటీవీ కెమెరాలను మరింత పెంచేందుకు సైబరాబాద్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్‌సీఎస్‌సీలో సభ్యులుగా ఉన్న ఐటీ కంపెనీలను పోలీసు కమిషనర్ వీసీ సజ ్జనార్ ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం ద్వారా సీసీటీవీ అవశ్యకతను వివరిస్తున్నారు. కంపెనీలతో పాటు రహదారులపై ఏర్పాటు చేసే సీసీ టీవీ కెమెరాల ద్వారా ఎక్కడ ఏం జరిగినా తెలుస్తుందని చెబుతున్నారు. ఫలితంగా ప్ర స్తుతం ఐటీ కారిడార్‌లో ఉన్న 214 సీసీటీవీ కెమెరాల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు శంషాబాద్ జోన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాల ఉండేలా చొరవ చూపుతున్నారు. వచ్చిన విరాళాలతో సైబరాబాద్ ఐటీసెల్ విభాగాధిపతి పి.రవిప్రసాద్ ఆధ్వర్యంలో పాత సీసీటీవీ కెమెరాల నిర్వహణతో పాటు కొత్త సీసీటీవీ కెమెరాల ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ‘మహా’ కమిషనరేట్‌లో నిఘా విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్‌గా ఉన్న రాచకొండ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, యాదాద్రి లా అండ్ అర్డర్ జోన్లు ఉన్నాయి. పట్టణం, గ్రామీణ ప్రాంతాలు మిళితమైన ఈ ప్రాంతంలో నేరాలు నియంత్రించేందుకు సీసీటీవీల అవసరాన్ని తొలినాళ్లలోనే రాచకొండ సీపీ మహేష్ భగవత్ గుర్తించారు. ఆయా జోన్లలో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, నేను సైతం సీసీటీవీ కెమెరాలను బిగింపును ఆయా జోన్ల డీసీపీలకు అప్పగించారు. ఈ సీసీటీవీ కెమెరాలు చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పాటు సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులను ఈజీగా పోలీసులకు పట్టిస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్‌లో అత్యంత ప్రధానమైన యాదాద్రి ఆలయం ఉండటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు జరుగుతుండటంతో ఐటీసెల్ విభాగాధిపతి ఎం.శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షణలో జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు రెండు కమిషనరేట్ల పరిధిలోని నిమజ్జనాలు జరిగే చెరువుల వద్ద 305 సీసీ కెమెరాలు తాత్కాలికంగా బిగిస్తున్నారు. సైబరాబాద్‌లోని హస్మత్‌పేట చెరువుత, పత్తికుంట చెరువు, మల్లెచెరువు, ఐడీఎల్ చోఎరువు, ప్రగతినగర్ చెరువుల వద్ద 100 సీసీటీవీ కెమెరాలు, రాచకొండలోని సరూర్‌నగర్, ఎదులాబాద్, ఇమాంగూడ, కాప్రా, సఫిల్‌గూడ చెరువుల వద్ద 205 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు. ‘రాచకొండలో నిమజ్జనం జరిగే ప్రాంతాలతో పాటు 35 సున్నితమైన ప్రదేశాల్లో కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వివిధ జంక్షన్లలో ఉన్న సీసీటీవీ కెమెరాలను డీజీపీ కార్యాలయానికి, రాచకొండ సీపీ కార్యాలయానికి అనుసంధానిస్తున్నాం’ అని రాచకొండ ఐటీసెల్ విభాగాధిపతి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. నేరాల నియంత్రణ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ఈ నిఘా నేత్రాలు సంచలనాత్మక కేసులు, దొంగతనాలు, చైన్‌స్నా చింగ్‌లు, హత్యలు దితర నేరాల్లో నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నాయి. హజీపూర్ ఘటనతో యాదాద్రి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం. చాలా గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. – మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్ సీసీటీవీలకు విరాళం ఇవ్వాలనుకుంటే... సైబరాబాద్: 949061744కు వాట్సాప్ చేయవచ్చు. లేదా itcell& cyb@tspolice.gov.in మెయిల్ చేయవచ్చు. రాచకొండ: 949061 7111కు వాట్సాప్ చేయవచ్చు. లేదా ఆయా పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలను సంప్రదించవచ్చు. -
రిటైర్మెంట్ సిబ్బందిపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, సిటీబ్యూరో: ఉద్యోగ విరమణ పొందనున్న పోలీసు సిబ్బందికి రాచ‘కొండ’ంత అండగా నిలవనుంది. ఈ ఏడాది పదవీ విరమణ చేసే ఉద్యోగులకు పెన్షన్, బెనిఫిట్స్ మొత్తం ఒకేసారి పొందేందుకు ఉద్దేశించిన ‘పెన్షన్ డెస్క్’ను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ ఆదివారం ప్రారంభించారు. అడ్మిన్ డీసీపీ, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ అధికారులు, పోలీస్ అధికారుల సంఘం సభ్యులుగా ఉండే ఈ డెస్క్ ప్రతి నెలా మూడో శనివారం సమావేశమై పదవీ విరమణ చేసే సిబ్బందిని ఆరు నెలలు ముందుగానే కార్యాలయానికి పిలిపించి వారి సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ‘పెన్షన్ పత్రాలు పూర్తి చేసి పదవీ విరమణ పొందే రోజున అన్ని బెనిఫిట్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల పెన్షన్ సమస్యలను పరిష్కరిస్తార’ని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా రానున్న 6 నెలల్లో పదవీ విరమణ పొందనున్న 29 మంది ఉద్యోగులతో సీపీ మహేష్ భగవత్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ముందస్తుగా పెన్షన్‌కు అప్లై చేసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి బెనిఫిట్స్ సకాలంలో అందేటా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగాæ మొబైల్ నెంబర్ ఏర్పాటు చేయాలని అడ్మిన్ అధికారులను కోరారు. జాయింట్ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ పెన్షన్ డెస్క్ ఏర్పాటుతో ముందస్తుగా పెన్షన్ పేపర్స్ సబ్మిట్ చేయడంతో సర్వీసులో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు. దీంతో పదవీ విరమణ పొందిన రోజే పెన్షన్ తీసుకునే వీలు కలుగుతుందన్నారు. పదవీ విరమణ పొందనున్న, పొందిన, చనిపోయిన పోలీస్ సిబ్బందికి పెన్షన్, బెనిఫిట్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా వచ్చేలా ’పెన్షన్ డెస్క్’ ప్రారంభించిన రాచకొండ సీపీకి పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రా రెడ్డి కృత/æ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాచకొండ అడ్మిన్ ఏసీపీ శిల్పవల్లి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రా రెడ్డి, సభ్యులు జి.క్రిష్ణా రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అర్బన్ అలజడి
సాక్షి,సిటీబ్యూరో: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో చాలా ఏళ్ల తర్వాత ‘మావోయిస్టు’ జాడలు కలకలం రేపుతున్నాయి. నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న మావోయిస్టు సంబంధాల నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. కొన్నేళ్లుగా తెలంగాణలో నిషేధిత మావోయిస్టుల కార్యకలాపాలేవీ లేనప్పటికీ.. నగర శివార్లను షెల్టర్ జోన్‌గా ఉపయోగిస్తూ దేశంలో వివిధ ప్రాంతాల్లో హింసకు కుట్ర పన్నుతున్నారన్న కారణాలతో ఎన్జీఆర్ఐలో పనిచేస్తున్న నక్కా వెంకట్రావుతో పాటు మౌలాలీ హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న ఆత్మకూరి భవాని, అన్నపూర్ణ, అనూషలను విశాఖ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మౌలాలీ హౌసింగ్ బోర్డులో ఉంటూ తెలంగాణ ప్రజాఫ్రంట్, కుల నిర్మూలన సమితిలో పనిచేస్తున్న ఆత్మకూరి రమణయ్య దంపతుల కూతుళ్లు భవాని (అమవీరుల బంధుమిత్రుల కమిటీ), అన్నపూర్ణ (చైతన్య మహిళా సంఘం), అనూష(చైతన్య మహిళా సంఘం) ఆయా సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో అనూష 2017 డిసెంబర్ నుంచి విశాఖ ‘మావో’ దళసభ్యురాలిగా నియమితమై పలుమార్లు ప్రాంతాల్లో కాల్పులతో పాటు, మందుపాతరలను పేల్చిన ఘటనల్లో పాల్గొన్నట్లు విశాఖ పోలీసులు అభియోగం మోపారు. చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్న అన్నపూర్ణ గాలికొండ దళంతో టచ్‌లో ఉన్నారని, భవాని తెలంగాణ, ఏపీ అమరవీరుల బంధుమిత్రుల కమిటీ జాయింట్ సెక్రటరీగా పలు విధ్వంస కార్యక్రమాలకు రెక్కీ నిర్వహించారన్నది అభియోగం. ఇదిలా ఉంటే భవాని, అన్నపూర్ణలు ఇటీవల తెలంగాణ ఎన్నికల్లోనూ విస్తృతంగా ప్రజాచైతన్య యాత్రలు నిర్వహించారు. ఏపీ స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరోకు చిక్కిన మావోయిస్టు కామేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు అనూష ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పోలీసులకు చిక్కారు. ఆమెతో పాటు ఆమె ఇద్దరు అక్కలను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే నగర శివారు ప్రాంతాల్లో తలదాచుకుంటూ వివిధ సంఘాల పేరుతో పనిచేస్తున్న విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాలపై మరింత నిఘా పెంచే యోచనలో నగర పోలీసులు ఉన్నారు. నగరంలో విధ్వంసకర కార్యకలాపాలేవీ చేయకున్నా నిషేధిత సంస్థల ప్రతినిధులు నగరాన్ని షెల్డర్ జోన్‌గా వాడుకోవడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. హక్కుల సంఘాల ఖండన పౌర హక్కులను, ప్రజా సంఘాలను అణిచివేసే క్రమంలోనే విప్లవ రచయిత వరవరావు మొదలుకుని, నక్కా వెంకట్రావు, తాజాగా మౌలాలిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లను అరెస్ట్ చేశారని పౌరహక్కుల సంఘం పేర్కొంది. ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దారుణమని అరెస్ట్ అయినవారి తండ్రి ఆత్మకూరి రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
ఈ ఏడాది సంచలన కేసులు అవే!
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2018లో మొత్తం 20,820 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శనివారం ఆయన సంవత్సారంతపు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2018లో నమోదైన సంచలన కేసులు, వాటిని ఛేదించిన తీరు తదితర వివరాలను మీడియాకు వెల్లడించారు. మొత్తం చోరీ కేసులు 2664 రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 2664 కేసులు చోరీ కేసులు నమోదయ్యాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. యాదాద్రి లో 36 మంది మైనర్ బాలికలను వ్యభిచార కూపం నుంచి కాపాడామని పేర్కొన్నారు. ఈ కేసులో 12 మంది యువతులు , 29 వ్యభిచార నిర్వహకులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. లింగ నిర్ధారణ కేసుల్లో ఐదుగురు డాక్టర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. లోక్ అదాలత్ కింద 5250 కేసులు పరిష్కారం చేశామన్నారు. రాచకొండలో 12263 కేసులు నమోదు కాగా 3496 మందికి జైలుశిక్ష , అందులో 12 మందికి జీవిత ఖైదు పడినట్లు వెల్లడించారు. 46 బాల్య వివాహాలను రాచకొండ పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఇక ఈవ్ టీజింగ్‌లో షీ టీమ్స్ 516 కేసులు నమోదు చేసాయని పేర్కొన్నారు. 2018 సంచలన కేసులు ఉప్పల్‌లో నరబలి కేసు రాజధానిలో సంచలనం సృష్టించిన ఉప్పల్ నరబలి కేసులో రాజశేఖర్, అతని భార్య శ్రీలతను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. వేలిముద్రలు, డీఎన్ఏ ఆధారంగా కేసును ఛేదించనట్లు వెల్లడించారు. మూసీ ఘటన వలిగొండలో ట్రాక్టర్ మూసీ నదిలో పడిన ఘటనలో 15 మంది మృతి చెందగా, 6 మంది గాయాలు పాలయ్యారని మహేష్ భగవత్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చిన నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. 2018లో రాచకొండలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు రాచకొండలో మొత్తం 2773 రోడ్డు ప్రమాదాలు జరిగాయని సీపీ పేర్కొన్నారు. ఈ ఘటనల్లో 694 మృతి చెందారని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై 34 రోడ్డు ప్రమాదాలు జరుగగా 20 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2018లో మొత్తం5692 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా వాటిల్లో పగలు 5002 కేసులు, రాత్రి 690 కేసులు నమోదయ్యాయని మహేష్ భగవత్ పేర్కొన్నారు. చలానా రూపంలో 93 లక్షలు రూపాయలు జరిమానా వసూళ్లు చేసినట్లు తెలిపారు. మొత్తం 897 మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఇక పెట్టీ నేరాల్లో 24425 కేసులు నమోదు చేశామని తెలిపారు. రాచకొండలో 59,222 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ స్మైల్ కింద 530 మంది చిన్నారులను కాపాడినట్లు సీపీ పేర్కొన్నారు. వీరిని ఒడిషా, బిహార్, అసోం, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలలుగా గుర్తించినట్లు తెలిపారు. డ్రగ్స్ ఈ ఏడాది గంజాయి అక్రమ రవాణా నేరంలో 30 కేసులు నమోదు చేసి.. 63 మంది అరెస్ట్ చేసినట్లు మహేష్ భగవత్ పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 548 కేజీల గంజాయి, 10 గ్రాముల కొకైన్, 20 గ్రాములు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని... ఈ కేసుల్లో పట్టుబడిన 11 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబై, గోవాకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రికవరీ పెరిగింది 2018లో మొత్తం 685 మందిని స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారని సీపీ వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 746 కేసులు నమోదు కాగా... సీసీఎస్(సైబర్ క్రైమ్ స్టేషన్) 384 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 2018లో 2,09,17, 3031 ప్రాపర్టీలాస్ కాగా 1,30, 26,6620 ఆస్తిని రికవరీ చేసినట్లు తెలిపారు. మొత్తం 62% సొమ్ము రికవరీ అయ్యిందని, ఘటనా స్థలంలో దొరికన ఆధారాలతో 56 మంది నేరస్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రాపర్టీ రికవరీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిందని పేర్కొన్నారు. చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్‌పై మొత్తం 29 కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. ఆ గ్యాంగ్‌లో 23 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక ట్రాఫిక్ వ్యవస్థకు సంబంధించి మొత్తం 11,60,937 నమోదు అయ్యాయని వెల్లడించారు. వీటిలో 5,692 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ- చలానా కింద 7,93,00 కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై 2112 కేసులు, ఓవర్ స్పీడ్‌తో పట్టుబడిన వారిపై 1,19 ,933 కేసులు , సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన నేరంలో 5660, సిగ్నల్ జంప్ కింద 11423 కేసులు నమోదు చేశామని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఫొటో తీసేందుకు ఆటోమేటిక్‌గా కాప్చర్ చేసే కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు మహేష్ భగవత్ వెల్లడించారు. -
రెండేళ్లు..100 ‘పీడీ’లు
సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్ ఏర్పడిన రెండేళ్లలో 100 మంది నిందితులపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్ ప్రయోగించి నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. చైన్‌స్నాచర్లు, రౌడీషీటర్లు, తరచూ చోరీలకు పాల్పడే దొంగలు, సైబర్ నేరగాళ్లు, మాదక ద్రవ్య నేరగాళ్లు, నకిలీ విత్తనాల కేటుగాళ్లు, భూకబ్జా రాయుళ్లు వరకు ఈ చట్టాన్ని ప్రయోగించి ఊచలు లెక్కించేలా చేస్తున్నారు. తొలుత గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరులపై పీడీ చట్టాన్ని ప్రయోగించిన పోలీసులు.. అభం శుభం తెలియని బాలికలను ఉపాధి పేరిట నగరానికి తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్న వారిపైనా ఈ తరహా కేసులు నమోదు చేశారు. ఈ చట్టం ప్రయోగిస్తే ఏడాదిపాటు జైలుకే పరిమితం కావాల్సి వస్తుండడంతో ఇప్పుడిప్పుడే నేరాలు అదుపులోకివస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన రాపోలు వెంకట శివకుమార్ అలియాస్ శివ బీటెక్ కోర్సు మధ్యలోనే ఆపేసి ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. భార్య శాంతితో కలిసి వ్యభిచారాన్ని వ్యాపారంగా ఎంచుకున్నారు. చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీలో గది అద్దెకు తీసుకొని అమ్మాయిలను ఏపీనుంచి రప్పించి వ్యభిచార దందాకు తెరలేపారు. పోలీసులు దాడులు చేయడంతో మకాన్ని బోడుప్పల్‌లోని రాఘవేంద్రనగర్ కాలనీకి మార్చి వ్యవహారం కొనసాగించారు. ఈ విషయం తెలిసి పోలీసులు దాడులు చేయడంతో తప్పించుకపారిపోయిన ఈ దంపతులు పోలీసులకు ఎట్టకేలకు చిక్కి చర్లపలి జైల్లో ఊచలు లెక్కెడుతున్నారు. వీరు మళ్లీ బయటకు వచ్చినా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉండటంతో ఈ దంపతులపై శనివారం పీడీ యాక్ట్ ప్రయోగించారు. అభం శుభం తెలియని అమ్మాయిలకు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామంటూ నగరానికి తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్న వీరిపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తాజాగా తీసుకున్న చర్యలతో పీడీ యాక్ట్‌లు విధించిన నేరగాళ్ల సంఖ్య 100కు చేరుకుంది. ఉమ్మడి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్ ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడం...ఇప్పటివరకు ఏకంగా 100 మంది నిందితులపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్ ప్రయోగించి నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. చైన్‌స్నాచర్, రౌడీషీటర్లు, తరచూ చోరీలకు పాల్పడే దొంగలు, సైబర్‌నేరగాళ్లు, మాదక ద్రవ్య నేరగాళ్లు, నకిలీ విత్తనాల కేటుగాళ్లు, భూకబ్జారాయుళ్లు, వ్యభిచార గృహ నిర్వాహకులు నుంచి మొదలుకొని బడా నేరస్తుల వరకు జైలు నుంచి బయటకు రాకుండా నియంత్రిస్తూ నేరాలు అదుపు చేసే దిశగా పనిచేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులపై కూడా... 2016 ఆగస్టు ఎనిమిదిన పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులను కూడా వదిలిపెట్టడం లేదు. హత్యలు, మోసాలు, కిడ్నాప్‌లు, బెదిరింపు డబ్బు వసూళ్లు, భూ కబ్జాలకు పాల్పడిన శ్రీధర్ గౌడ్, సామసంజీవరెడ్డి, పొలిమెటి శ్రీహరిపై కూడా సీపీ మహేశ్ భగవత్ అవే చర్యలు తీసుకున్నారు. హత్యలు, మోసాలు, ఫోర్జరీ, భూకబ్జాలు చేస్తూ గుండాయిజం చేస్తున్న బైరు రాములు గౌడ్, లక్ష్మణ్ గౌడ్, యెగ్గె భిక్షపతిలపై పీడీ యాక్ట్ ప్రయోగించి చర్లపల్లి జైలుకే పరిమితం చేశారు. దీనిద్వారా ఎటువంటి కరుడుగట్టిన నేరస్తుడినైనా వదిలేదే లేదని, నేరం చేసి అరెస్టు కావడం, బెయిల్ పొంది బయటకు రావడం, మళ్లీ పంథా కొనసాగించేవారిని ఉపేక్షించేదే లేదని సీపీ తన చర్యల ద్వారా చెబుతున్నారు. జైలుకే పరిమితం చేస్తున్నారు... ఇప్పటికే రాచకొండలో దాదాపు 100 మంది వరకు కరుడు గట్టిన నేరగాళ్లు జైల్లోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ చట్టం ప్రయోగిస్తే ఏడాదిపాటు జైలుకే పరిమితం కావాల్సి వస్తుండడంతో ఇప్పుడిప్పుడే నేరాలు కొంతమేర అదుపులోకి వస్తున్నాయి. ఉమ్మడి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా ఈ వ్యవహరాన్ని తీవ్రంగా పరిగణించి పీడీ యాక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. అయితే రెండేళ్ల క్రితం సైబరాబాద్ కమిషనరేట్ విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన రాచకొండ పోలీసు కమిషనరేట్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ భగవత్ కూడా అదే పంథాతో ముందుకెళుతున్నారు. కోర్టు మానిటరింగ్‌పై ప్రత్యేక దృష్టి... కోర్టుల్లో కేసులను రుజువు చేసే దిశగా ‘కోర్టు మానిటరింగ్ సిస్టమ్’ను అమలు చేయడంపై సీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్, అభియోగపత్రం దాఖలు చేసినప్పటి నుంచి తుది తీర్పు వచ్చేవరకు పకడ్బందీగా పర్యవేక్షణ ఉండేలా ఫోకస్ పెట్టారు. నేరగాళ్లపై కఠిన చర్యలు...రాచకొండలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలు నిరోధించాలనే లక్ష్యంతో పీడీ యాక్ట్‌ను సమర్థంగా అమలుచేస్తున్నాం. ఆన్లైన్ ద్వారా మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు, సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్న రోజువారీ వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ మోసాలకు పాల్పడుతున్నవారిపైనా కూడా ప్రయోగిస్తున్నాం. ఇప్పటికే మహిళల్ని వేధిస్తున్న పొకిరీలపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేశాం. అమాయక యువతులను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న నిర్వాహకులపై పీడీ యాక్ట్‌లు ప్రయోగించి మరోసారి నేరాలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. –మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్ -
అంతర్రాష్ట్ర చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్
రంగారెడ్డి : తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర చెడ్డీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చెడ్డీగ్యాంగ్ దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్‌లోని దావోడ్లో ముగ్గురు చెడ్డీ గ్యాంగ్ సభ్యులను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారం, కిలో వెండి వస్తువులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. -
ఎస్ఐ ఎక్కడికెళ్లాడు ?
సాక్షి హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ మల్కాజిగిరి జోన్ పరిధిలోని నేరేడ్మెట్ ఎస్ఐ నాగరాజు ఏమయ్యాడో అంతుపట్టడం లేదు. ఆయన కనిపించకుండాపోయి దాదాపు మూడు రోజులవుతున్నా ఆచూకీ లభించడంలేదు. క్రైం మీటింగ్ మధ్యలోనే అర్థాంతరంగా వెళ్లిపోయిన ఎస్ఐ తరువాత నుంచి ఠాణాకు అందుబాటులో లేకపోవడం పోలీసు శాఖలో కలకలం రేగింది. కొందరు పైఅధికారుల వేధింపులే వల్లనే ఎస్ఐ అందుబాటులో లేకుండా పోయారని ప్రచారం జోరుగా సాగుతోంది. పని భారం కూడా మరో కారణమనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పుల్లం నాగరాజు మొదటి పోస్టింగ్‌గా ఏడాదిన్నర క్రితం నేరేడ్మెట్ ఠాణాలో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో చురుకుగా వ్యవహారిస్తాడని ఆయనకు పేరుంది. ఇటీవల ఆయనపై పనిభారం పెరిగినట్టు తెలుస్తోంది. కొన్ని వ్యవహారాలను చక్కదిద్దాలని, అందుకు అంగీకరించకపోవడంతో ఓ అధికారి తరుచూ ఎస్ఐని వేధింపులకు గురి చేసేవాడని తెలిసింది. దాంతో కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే సాకుతో ఎస్ఐ పనితీరును సదరు అధికారి తప్పుబట్టేవాడని తెలుస్తోంది. ఈ వేధింపులు తీవ్రమవుతున్న నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ఎస్ఐకి బాలాపూర్‌కు బదిలీ అయ్యాడని పోలీసు వర్గాల్లో ప్రచారం ఉంది. బాలాపూర్‌కు వెళ్లడం ఎస్ఐకి ఆసక్తి లేదని, అందుకే ఇలా చేసిఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలోనే ఈనెల 22వతేదీన జవహర్‌నగర్‌లో సీఐ,ఎస్ఐలతో ఏసీపీ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం సుమారు 10గంటలకు ఈ సమావేశానికి హాజరైన ఎస్ఐ నాగరాజు తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి మధ్యలోనే వెళ్లిపోయాడు. మరో ఎస్ఐ వెంకట్‌రెడ్డి ద్విచక్రవాహనం తీసుకొని ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్‌లో తన ఇంటికి వెళ్లినట్టు,అక్కడి నుంచి ఎస్ఐ నాగరాజు అందుబాటులో లేకుండా పోయారు. అధికారిక సెల్‌ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. మొత్తమ్మీద అధికారుల వేధింపులు, పనిభారం కారణం ఏదైనా ఎస్ఐ అదికారులకు అందుబాటులో లేకపోవడం పోలీసు వర్గాలను కలవరపరుస్తోంది. ఎస్ఐ కోసం పోలీసులు ఆరాతీస్తున్నట్లు తెలుస్తుంది. ఆరోపణల్లో నిజం లేదు.. ఎస్ఐ నాగరాజు అదుబాటులో లేకపోవడం విషయంలో వేధింపులకు గురిచేసినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నేరేడ్మెట్ సీఐ జగదీశ్ చందర్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. గురువారం ఎస్ఐల సమావేశం నుంచి ఎలాంటి సమాచారం లేకుండా నాగరాజు వెళ్లిపోయాడని, అప్పటినుండి ఆయన అందుబాటులో లేరని సిఐ చెప్పారు. ఎస్ఐ కోసం సమాచారం సేకరిస్తున్నామని సీఐ తెలిపారు. వ్యక్తిగత పనులమీద ఊరికి వెళ్లారు.. ఎస్ఐ నాగరాజు వ్యక్తిగత పనులమీద ఊరికి వెళ్లినట్లు ఎస్ఐ మామ అనంతయ్య సాక్షికి ఫోన్లో వివరణ ఇచ్చారు. ఎస్ఐ మిస్సింగ్ అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. -
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
సంస్థాన్ నారాయణపురం(మునుగోడు) : రాచకొండలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, అద్భుతమైన శిలాసంపద ఉన్నందున ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఇబ్రహీంపట్నం నియోజక వర్గ ఇన్చార్జి అమృతసాగర్ అన్నారు. మంగళవారం రాచకొండలోని స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి, మైసమ్మ దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉర్సు ఉత్సవాలనులు పురస్కరించుకుని దర్గాలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. తెలంగాణలో వైఎస్సార్సీపీకి 30సీట్లు వస్తాయన్నారు. ఆమె వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేస రి సాగర్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ప్రభాకర్ జం గయ్య తదితరులు ఉన్నారు. -
మద్యం మత్తులో కారుతో సీఐ హల్చల్!
సాక్షి, మేడ్చల్: మద్యం మత్తులో ఓ సీఐ తన కారుతో హల్ చల్ చేశాడు. యప్రాల్ హనుమాన్ టెంపుల్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు.టెంపుల్ పక్కనున్న బైక్‌లు, ఆటోలపైకి సీఐ గిరీష్ కుమార్ విచక్షణా రహితంగా తన కారును నడుపుతూ దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులకు కాళ్లు విరిగాయి. స్థానికులు వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐ గిరీష్ కుమార్ మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణం కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పందించారు. సీఐ గిరీష్‌కుమార్‌పై చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. -
ఫేస్బుక్లో అసభ్యకర పోస్టింగ్..
హైదరాబాద్ : దేవుళ్లను కించపరుస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఫేస్బుక్లో అసభ్యకరంగా పోస్టులు చేస్తుండటంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్బుక్ లో ఈ మేరకు పోస్ట్ చేసిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వినయ్ అనే యువకుడిని రాచకొండ సైబర్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎమ్మెస్సీ చదువుతున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాచకొండలో గన్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్ సిటీ: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గన్స్ కలకలం చెలరేగింది. పలు ప్రాంతాల్లో గన్లతోపాటు బుల్లెట్లు కలకలం సృష్టించాయి. గత కొంత కాలంలో నగరంలో గన్‌కల్చర్ పెరిగిపోయింది. యధేచ్ఛగా తుపాకులు, గన్నులను విక్రయిస్తున్నారు. ఈ దందాపై గత కొద్దిరోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం ఉదయం తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి వద్ద గన్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో మూడు గన్స్, ఆరు బుల్లెట్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాలడుతున్న గ్యాంగులకు సరఫరా చేయడానికి ఈ గన్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
శిథిల రాజసం.. రాచకొండ!
- మరుగున పడుతున్న 700 ఏళ్ల చరిత్ర - రాచకొండ దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఎత్తయిన కొండలు.. పైన శత్రు దుర్భేద్యమైన కోట.. ముఖ ద్వారాలు, ఈత కొలనులు, మంచినీటి బావులు, ప్రార్థన మందిరాలు.. కనుచూపుమేర రాజ్యం. దేవాలయాలు, నాట్యశాలలు, పురోహితులు, ప్రజల ఆవాస ప్రాంతాలు, దట్టమైన అడవి.. ‘మాహిష్మతి’ని తలపించే రాచకొండ ఠీవికి నిదర్శనాలివి. 700 ఏళ్ల నాటి చారిత్రక అద్భుత ఆనవాళ్లు అవి. తెలంగాణ కీర్తిని దశదిశలా వ్యాప్తింపజేసిన పద్మనాయక వంశ (వెలమ) రాజులు.. సుమారు 150 దేవాలయాలను నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాలు, గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాలతో కళ తప్పినా.. ఆ ‘రాజ’దర్పం మాత్రం చెక్కు చెదరలేదు. శిథిలమవుతున్న ఘన చరిత్రకు నిదర్శనంగా రాచకొండ నిలుస్తోంది. హైదరాబాద్‌కు సమీపంలోని రాచకొండ చరిత్రపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్. – బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ 35 వేల ఎకరాల విస్తీర్ణం రాచకొండ విస్తీర్ణం.. సుమారు 35 వేల ఎకరాలు. ప్రస్తుత యాదాద్రి జిల్లాలో ఉన్న సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలో 14,760 ఎకరాలు. చౌటుప్పల్, రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలంలో మిగతా ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ 4 వేలకు పైగా నెమళ్లు ఉన్నాయి. నక్షత్ర తాబేళ్లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. విలువైన కలపను గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్, ఇబ్రహీంపట్నానికి తరలిస్తున్నారు. ఒకప్పుడు కీకారణ్యంలా ఉన్న ఈ ప్రాంతం చెట్ల నరికివేతతో మైదానంగా మారుతోంది. ఫిలిం సిటీగా కోట 2014 డిసెంబర్ 15న రాచకొండ గుట్టలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. రాచకొండను ఫిలిం సిటీగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర చిత్ర పరిశ్రమకు రానున్న రోజుల్లో పెద్ద దిక్కవుతుందని పేర్కొన్నారు. 2 వేల ఎకరాల్లో íఫిలిం సిటీ, విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాలను కోటకు సమీపంలో ఏర్పాటు చేయిస్తామన్నారు. అయితే మూడేళ్లవుతున్నా అలనాటి రాచరిక ఆనవాళ్లను కాపాడేందుకు, అభివృద్ధి చేసేందుకు బీజం పడలేదు. కోటను íఫిలిం సిటీగా అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా విరాజిల్లే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాచకొండపై ప్రభుత్వం దృష్టి పెడితే అంతరించిపోతున్న ‘రాచ’కీర్తికి పూర్వవైభవం కల్పించినట్లు అవుతుంది. చారిత్రక నేపథ్యం ఇదీ.. కాకతీయుల పతనానంతరం పద్మనాయకులు రాచకొండ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యం స్థాపించారు. రాచకొండ గ్రామానికి సమీపంలో కోటను నిర్మించారు. క్రీ.శ 1325–1475 మధ్య పద్మనాయక వంశీయుల పాలన సాగింది. రాచకొండ, దేవరకొండ దుర్గాలను వీరే నిర్మించారు. రాచకొండ దుర్గాన్ని అనపోతనేడు అనే రాజు కాలంలో నిర్మించారు. ఎర్ర దాచ నాయుడితో ప్రారంభమైన వీరి పాలన సర్వజ్ఞరావు సింగభూపాలుడితో ముగిసింది. తర్వాత ఈ వంశీయులు విజయనగర రాజ్యంలో సామంతులుగా ఉండడం, అనంతరం బహుమనీల రాజ్య విస్తరణతో వారి ఏలుబడిలోకి వెళ్లింది. 7 ముఖ ద్వారాలు.. మంచినీటి బావులు.. ప్రధాన కోటకు కింద నుంచి పైకి 7 ముఖ ద్వారాలున్నాయి. ద్వారాలన్నీ శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. అయితే కోట అంతా నామరూపాలు లేకుండా పోయింది. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి నాశనం చేశారు. కొండపైన ఉన్న ప్రత్యేక ప్రార్థన మందిరం మాత్రమే రాజదర్పానికి ఆనవాలుగా ఉంది. కొండపైన 2 ఈత కొలనులు పెద్దపెద్ద బండలను తొలిచి నిర్మించారు. లోతైన మంచినీటి బావులు ఉన్నాయి. ఇక్కడి సంకెళ్ల బావికి ఓ ప్రత్యేకత ఉంది. పట్టుబడిన దొంగలకు సంకేళ్లు వేసి నీళ్లు తోడించావారట. సుమారు 300 చెరువులు, కుంటలు ఉన్నాయి. పెద్ద చెరువుల వద్ద ప్రత్యేకంగా శాసనాలు వేయించారు. అన్నపోత, నాగసంద్రం, దేవ, రాయ చెరువులు ఇక్కడ ప్రధానమైనవి. గొలసుకట్టుతో ఉన్న ఈ చెరువులు చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. కళాపోషకులు..: రాచకొండ రాజులు కళలకు ప్రాధాన్య మిచ్చారు. తెలుగు కావ్యత్రయంలోని ముఖ్యమైన రెండు కావ్యాలు రామాయణం, మహాభారతం ఇక్కడి నుంచే వెలువడ్డాయి. కొండ కింద కళామందిరాలు నిర్మించారు. వందల ఏళ్లయినా ఈ కళామందిర గోడలపై ఇప్పటికీ కళారూపాలు కనిపిస్తున్నాయి. పర్యావరణం కలుషితంతో ఇవి రానురాను శిథిలమవుతు న్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. 100కు పైగా శివాలయాలు.. రాచకొండలో 150 ఆలయాలుండగా.. అందులో 100కు పైగా శివాలయాలే. సూర్య కిరణాలు శివలింగంపై పడేలా ఆలయాలు నిర్మిం చారు. కొండ చుట్టూ దారి వెంట వినాయక ప్రతిమలు చెక్కించారు. చౌటుప్పల్ సమీపంలో జాతీయ రహదారిపై కొయ్యలగూడెం నుంచి రాచకొండకు వెళ్లే దారిలో కొండకింద ప్రధాన శివాలయం ఉంది. కోటకు అభిముఖంగా ఉన్న ఈ ఆలయానికి వచ్చి రాజులు పూజలు చేసేవారు. కోటకు వెళ్లే ప్రధాన ముఖద్వారం సమీపంలోనే రాముడిని ప్రతిష్టించారు. -
'17 నుంచి 19 వరకు రాచకొండ ఉత్సవాలు'
సాక్షి, హైదరాబాద్: రాచకొండ గొప్పతనాన్ని చాటేందుకు రాచకొండ పర్యాటక ఉత్స వాలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. కొందరు యువకులు రాచప్ప సమితిగా ఏర్పడి ఉత్సవాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. సోమవారం రవీంద్రభారతిలో రాచకొండ ఉత్సవాల పోస్టర్‌ను కర్నె ఆవిష్కరించారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో రాచకొండ శివాలయం వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 13, 14 శతాబ్దాల్లో రాచకొండను రాజధాని గా చేసుకుని పాలించిన రేచర్ల పద్మ నాయ కులు అద్భుత కట్టడాలు నిర్మించారని అన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. -
కార్యాలయాలను పరిశీలించిన రాచకొండ కమిషనర్
భువనగిరి అర్బన్ : యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఏర్పాటు చేయనున్న పలు జిల్లా కార్యాలయాలను గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ పరిశీలించారు. ఇందులో భాగంగా భువనగిరి మండలంలోని పగిడిపల్లి గ్రామంలో ఉన్న యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాన్ని చూశారు. అనంతరం అక్కడి నుంచి హన్మాపురం గ్రామ శివారులో ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయం, భువనగిరిలో ఏర్పాటు అవుతున్న ఎస్పీ క్యాంపు, రాయగిరి గ్రామంలో ఉన్న పోలీస్ ఔట్ పోస్టు కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండగ రోజున కార్యాలయాలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. భువనగిరి, చౌటుప్పల్‌లో ఏసీపీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలపై ఎస్పీ, డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి, డీఎస్పీ ఎస్.మోహన్‌రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ ఎం. శంకర్‌గౌడ్, రూరల్ సీఐ అర్జునయ్య, యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఆ పోలీసు కమిషనరేట్ల పరిధి పెంపు
సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధి మరింత పెరగనుంది. ఇప్పటికే మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లతో కూడిన మల్కాజిగిరి జోన్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం డివిజన్లతో ఎల్బీనగర్ జోన్లతో పాటు భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లతో కూడిన భువనగిరి జోన్‌ను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ విభజన సందర్భంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీసు కమిషనరేట్లోకి, శంషాబాద్ జిల్లాలోకి వచ్చే కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో చేర్చే అంశంపై దృష్టి సారించాలని తాజాగా సీఎం కేసీఆర్ సూచించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు మొదలెట్టారు. భువనగిరి జోన్లోకి మరిన్ని ఠాణాలు... భువనగిరి జోన్లో భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లు ఇప్పటికే ఉండేలా సైబరాబాద్ విభజన సందర్భంలో పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం గవర్నర్ ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. భువనగిరితో పాటు బీబీనగర్, బొమ్మల రామారం, చౌటుప్పల్, వలిగొండ, భూదాన్ పోచంపల్లి, వలిగొండ ఠాణాలు ఇప్పటికే రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉండగా... తాజాగా ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం), గుండాల, రామన్నపేట, మోత్కూరు, ప్రతిపాదిత మండలాలు మోటకొండూరు, అడ్డగుడూరులోకి వచ్చే ఠాణాలు అన్నీ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై అధికారులు దృష్టి సారించారు. దీంతో భువనగిరి జోన్లో మరిన్ని ఠాణాలు కలిసే అవకాశం కనబడుతోంది. అయితే వీటిలో ఎన్ని ఠాణాలు రాచకొండ పరిధిలోకి వస్తాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. సైబరాబాద్ పరిధి మరింత విస్తృతి... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లు ఉన్నాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, షాద్‌నగర్ డివిజన్లతో శంషాబాద్, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్ డివిజన్లతో మాదాపూర్ జోన్, పేట్ బషీరాబాద్, బాలానగర్ డివిజన్లతో బాలానగర్ జోన్లు ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం ప్రకారం... సైబరాబాద్‌లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి నాలుగు మండలాలు వచ్చి చేరుతున్నాయి. వీటిలో ఆమన్‌గల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలు ఉన్నాయి. ఈ ఠాణాలను కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై దృష్టి కేంద్రీకరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అయితే ఈ రెండు కమిషనరేట్ల ఏర్పాటు కోసం గవర్నర్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు సవరణ చేసి మరిన్ని ఠాణాలు కలపడంపై దృష్టి సారించాలని ఆయన సూచించినట్టు తెలిసింది. -
డిప్యుటేషన్‌పై పోలీసుల నియామకాలు
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా నుంచి సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌లో విలీనమైన పోలీస్స్టేషన్లలో జిల్లాకు చెందిన పోలీసులను డిప్యుటేషన్‌పై నియమిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం.భగవత్ తెలిపారు. చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేటలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలోని పోలీస్స్టేషన్లు కూడా సైబరాబాద్‌లో విలీనమైనప్పుడు సిబ్బందిని డిప్యుటేషన్‌పైనే తీసుకున్నారని, వారు ఇప్పటికీ అలాగే పని చేస్తున్నారన్నారు. సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్ల విభజనకు సంబంధించి గవర్నర్ ఆర్డినెన్సు ఇచ్చారని, చట్టసభల్లో ఆమోదం కూడా పొందిందన్నారు. ప్రభుత్వం జీఓ జారీ చేయగానే కమిషనర్ పాలన ప్రారంభమవుతుందని తెలిపారు. భువనగిరి టౌన్, రూరల్, వలిగొండ పోలీస్స్టేషన్లను యాదాద్రి జిల్లాలో, సంస్థాన్ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌ను ఈస్ట్ కమిషనరేట్‌లో కలపాలని విజ్ఞప్తులు వచ్చాయని, ఈమేరకు పరిశీలన జరుగుతుందన్నారు. ఆయన వెంట చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్‌కుమార్ ఉన్నారు. -
విశ్వేశరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి
చౌటుప్పల్ : ఇంజనీరింగ్ విద్యార్థులు మోక్షగుండం విశ్వేశరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. మండలంలోని తుఫ్రాన్‌పేట శివారులోని ధృవ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఇంజనీర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంజనీరింగ్ పట్టభద్రులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం, నైపుణ్యం లేని కారణంగా ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలు రావడం లేదన్నారు. దీంతో ఎంతో మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ చదివింది కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కాదని.. విషయ పరిజ్ఞానం పెంచుకొని ఆ రంగంలో రాణించాలని కోరారు. ఇంగ్లిష్‌పై ప్రావీణ్యం ఉండాలని, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సైబరాబాద్ పరిధిలో సివిల్స్, గ్రూప్–1,2 పరీక్షలకు వారంలో ఒక రోజు శనివారం శిక్షణ ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఘట్కేసర్లోని శ్రీనిధి కళాశాలలో శిక్షణ ప్రారంభమైందన్నారు. విద్యార్థులు తాగి డ్రైవింగ్ చేయవద్దన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడే వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు డీ–అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎగ్జిబిట్ల ప్రదర్శన ఇంజనీరింగ్, డిప్లమా ఫైనలియర్ విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను కమిషనర్ పరిశీలించారు. వారికి బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.పర్వత్‌రెడ్డి, సెక్రెటరీ కె.శశిరేఖ, ప్రిన్సిపాల్ బి.శ్రీధర్‌రెడ్డి, వై.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రాచకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలి
సంస్థాన్ నారాయణపురం : మునుగోడు, దేవరకొండ, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు కలుపుతూ రాచకొండ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ ఆ«ధ్వర్యంలో బుధవారం సంస్థాన్ నారాయణపురంలో రాస్తారోకో నిర్వహించారు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో ఉన్న నారాయణపురం మండలాన్ని రాజకీయ పార్టీల స్వార్థం కోసం యాదాద్రిలో కలపాలని చూడడం సరైంది కాదన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో కూడా తీర్మానం చేశామన్నారు. ఎంతో చారిత్రక ప్రాంతమైన రాచకొండను జిల్లాగా చేయాలని, లేకపోతే ప్రజల అభీష్టం మేరకే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏర్పుల సుదర్శన్, బద్దుల కృష్ణయ్య, రాసమళ్ల యాదయ్య, ఎండీ.రహీంషరీఫ్, మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, జక్కిడి మేఘారెడ్డి, సూరపల్లి శివాజీ, వలిగొండ యాదయ్య, కుందారపు యాదయ్య, బైకని నరేందర్, ఉప్పల శ్రీను, చంద్రారెడ్డి, యాదయ్య, భిక్షం, యాదగిరి తదితరులున్నారు. -
రాచకొండకు చారిత్రక గుర్తింపు
చౌటుప్పల్: రాచకొండకు చారిత్రక గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అతిపెద్ద పోలీస్ కమిషనరేట్ సైబరాబాద్‌ను ఈస్ట్, వెస్ట్ పోలీస్ కమిషనరేట్లుగా ప్రభుత్వం విభజించింది. అందులో ఈస్ట్ కమిషనరేట్‌కు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌గా నామకరణం చేసింది. దాదాపు 600వ సంవత్సరాల చారిత్రక నేపథ్యమున్న రాచకొండ ప్రాంతానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యమిచ్చింది. రాచకొండ ప్రాంతమున్న సంస్థాన్ నారాయణపురం మండలాన్ని కమిషనరేట్‌లో కలిపితేనే, ఆ పేరుకు సార్థకత చేకూరనుంది. రాచకొండ చారిత్రక నేపథ్యమిదీ.. క్రీ.శ 13వ శతాబ్దంలో ప్రస్తుత 10జిల్లాలున్న తెలంగాణ ప్రాంతమంతటిMీ రాచకొండను రాజధానిగా చేసుకుని రేచర్ల పద్మనాయక వంశీయులు పాలించారు. అప్పట్లో రాచకొండకు రాజాద్రి, రాజగిరి అనే పేర్లు కూడా వాడకంలో ఉన్నాయి. కాకతీయ రాజ్య పతనానంతరం పద్మనాయక వంశీయులు స్వతంత్రంగా రాజ్యాన్ని స్థాపించారు. వీరి కాలంలో నిర్మించిన దుర్గములలో రాచకొండ, దేవరకొండ ముఖ్యమైనవి. రాచకొండ దుర్గాన్ని అనపోతనేడు అనే ప్రభువు నిర్మాణం చేయించారు. ఈయన కాలంలోనే రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు తరలించి, రాచకొండను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు. అనంతరం వారి వంశీయులందరూ రాచకొండను రాజధానిగా చేసుకునే పాలన సాగించారు. వీరిపాలనలోనే పతనమవుతున్న హైందవ సంస్కృతిని పునరుద్ధరించారు. దేవాలయాలను నిర్మించారు. శిథిలమైన కళాసంపదను పునరుద్ధరించారు. కవి, పండితులను పోషించారు. సంస్కృతాంధ్ర భాషలను ఆదరించారు. ఏంతో కీర్తిని పొందారు. క్రీ.శ.1360 నుంచి 1475వ సంవత్సరం వరకు పద్మనాయకుల పాలన కొనసాగింది. ఇక్కడ అపురూపమైన కట్టడాలున్నాయి. రాచకొండ పేరుతోనే మావోయిస్టు ఉద్యమం.. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని దాదాపు 35వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి. దట్టమైన గుట్టల ప్రాంతం. దీంతో 1986లో రాచకొండ దళం పేరుతో మావోయిస్టులు(పీపుల్స్‌వార్) నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. దట్టమైన అటవీ ప్రాంతం, ఎల్తైన గుట్టలు, శత్రుదుర్బేద్యమైన రక్షణ స్థావరాలు ఉండడంతో, మావోయిస్టుల ఉద్యమానికి కేంద్ర బిందువైంది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా నడిచింది. రాష్ట్రంలోనే రాచకొండ దళానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రాచకొండ దళం కనుమరుగైంది. రాచకొండపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ.. ఇంతటి ఘన చరిత్ర ఉన్న రాచకొండపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. సమైక్య పాలనలో రాచకొండను పట్టించుకోలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ తాను అధికారం చేపట్టగానే రాచకొండపై దృష్టి సారించారు. రాచకొండకు చారిత్రక గుర్తింపు తేవాలని, హైదరాబాద్‌కు అతిదగ్గరలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలంచారు. ఫిలింసిటీగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో, ఇప్పటికే రెండు మార్లు హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. శంషాబాద్ విమానాశ్రయానికి కేవలం 25కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో స్పోర్ట్‌సిటీ, ఎడ్యుకేషన్‌హబ్, ఇండస్ట్రియల్ కారిడార్లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లుగా విభజించారు. ఇందులో ఈస్ట్ కమిషనరేట్‌కు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌గా నామకరణం చేశారు. కాగా, రాచకొండ ప్రాంతమంతా సంస్థాన్ నారాయణపురం మండల రెవిన్యూ పరిధిలో ఉంది. హైదరాబాద్‌కు 40కి.మీ.ల దూరంలో, శంషాబాద్‌కు 25కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని సైబరాబాద్ పరిధిలో కలిపితేనే, రాచకొండ కమిషనరేట్ అనే పేరుకు సార్థకత చేకూరనుంది. -
ఆంజనేయస్వామి విగ్రహం లభ్యం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతం పల్లగట్టుతండానుంచి ఐదుదొనల తండాకు వెళ్లే దారిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గురువారం తండావాసులు గుర్తించారు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం ఎక్కడో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి, అక్కడి నుంచి ఆంజనేయస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. ఫారెస్ట్ వాచర్ సేవ పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ పి.అశోక్‌కుమార్ స్థలాన్ని పరిశీలించారు. తండావాసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల తండావాసులు వచ్చి విగ్రహానికి పూజలు నిర్వహించారు. -
ఆంజనేయస్వామి విగ్రహం లభ్యం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని రాచకొండ అటవీ ప్రాంత పల్లగట్టుతండా నుంచి ఐదుదొనల తండాకు వెళ్లే దారిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గురువారం తండావాసులు గుర్తించారు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం ఎక్కడో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి, అక్కడి నుంచి ఆంజనేయస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. ఫారెస్ట్ వాచర్ సేవ పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ పి.అశోక్‌కుమార్ స్థలాన్ని పరిశీలించారు. తండావాసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల తండావాసులు వచ్చి విగ్రహానికి పూజలు నిర్వహించారు. -
రాచకొండలో రిజర్వాయర్లు!
నేటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్న నిపుణుల బృందం సాక్షి, హైదరాబాద్: నల్లగొండ-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో విస్తరించిన రాచకొండ గుట్టల్లో పది టీఎంసీల సామర్థ్యంతో రెండు భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం రాజధాని హైదరాబాద్‌కి ప్రస్తుతం కృష్ణా మొదటి, రెండవ, మూడవ దశల ద్వారా నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్న విషయం విదితమే. దీనికి అదనంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి తరలించనున్న పది టీఎంసీల నీటిని ఈ జలాశయాల్లో నిల్వ చే సేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం జరపాలని జలమండలి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సర్కారు ఆదేశాల మేరకు జలమండలి ఇంజినీర్లు సహా పలువురు నిపుణులు శనివారం నుంచి ఐదు రోజుల పాటు రాచకొండ గుట్టలతోపాటు నల్లగొండ జిల్లా మల్కాపురం, నాగారం తదితర ప్రాంతాల్లోని అటవీ, ప్రభుత్వ భూముల్లో క్షేత్రస్థాయి అధ్యయనం జరపనున్నారు. భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అవకాశాలను పరిశీలించనున్నట్లు అధికార వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ముంపు సమస్యలు లేకుండా చూడాలి భారీ రిజర్వాయర్లు నిర్మించేటప్పడు ముంపు సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 40 గ్రామాలు విస్తరించి ఉండే స్థలంలో రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన స్థలాలు సేకరించడం కష్టమే. నగరానికి తరలించేందుకు అవసరమయ్యే వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కార్యాచరణ సిద్ధంచేయాలి. - టి.హనుమంతరావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ జంట జలాశయాల ఎగువ ప్రాంతాల్లో నిర్మించాలి ప్రస్తుతం జలకళలేక వట్టికుండలుగా మారిన జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల ఎగువ ప్రాంతాల్లో ఈ భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించిన పక్షంలో.. అక్కడి నుంచి నీటిని నేరుగా జంట జలాశయాలకు గ్రావిటీ ద్వారా తరలించే అవకాశం ఉంటుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి లక్ష్మీదేవిపల్లి మీదుగా ఈ స్టోరేజి రిజర్వాయర్లలో నీటిని నింపే ఏర్పాట్లు చేస్తే మంచిది. - శ్యాంప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ -
రాచకొండకు రాజయోగం
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని రాచకొండకు మళ్లీ రాజయోగం పట్టనుంది. ఇన్నాళ్లూ ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన రాచకొండకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీఎస్ ఐపాస్ పేరుతో తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో మహర్దశ పట్టనుంది. ఈ పారిశ్రామిక విధానానికి ఆకర్షితులవుతున్న పారిశ్రామికవేత్తలు, ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కు చేరువలోని రాచకొండపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇది పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతమని భావిస్తున్నారు. నల్లగొండ-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో రాచకొండ అటవీ ప్రాంతం ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, సీలింగ్ భూములతో కలుపుకొని 42 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి చేరువలో, శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల లోపు దూరంలో, ఔటర్ రింగ్‌రోడ్డుకు అతి సమీపంలో ఉంది. దీంతో ప్రభుత్వం మూడు జిల్లాల సరిహద్దులోని ప్రాంతమంతటినీ పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రెండుమార్లు ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. పారిశ్రామిక వేత్తలు కూడా పరిశీలించి బాగుందని చెప్పడంతో, మహబూబ్‌నగర్ జిల్లా ముశ్చర్లలో ఫార్మాసిటీకి 11 వేల ఎకరాల భూమిని కేటాయించారు. రాచకొండలో 2 వేల ఎకరాల్లో ఆత్యాధునిక హంగులతో కూడిన సినిమా సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైలు బోగీల పరిశ్రమ రాచకొండలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసింది. 14 వేల ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్టు తేల్చింది. ఈ భూమిని క్లస్టర్లుగా విభజించనున్నారు. ఒక్కో క్లస్టర్‌ను ఒక్కో దానికి కేటాయించే ఆలోచన చేస్తున్నారు. ఓ క్లస్టర్లో 2 వేల ఎకరాలు ఫిలింసిటీకి, మరో 2 వేల ఎకరాలు స్మార్ట్ సిటీకి కేటాయించే ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో రైలు బోగీల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన రుయా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పవన్‌కుమార్ రుయా, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కంపెనీల ప్రతినిధులతో కలసి వారంరోజుల క్రితం రాచకొండ ప్రాంతాన్ని పరిశీలించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, ఎన్‌హెచ్-65లకు రాచకొండ ఎంతదూరంలో ఉందనే విషయంపై ఆరా తీశారు. అనంతరం రాచకొండ పరిశ్రమల ఏర్పాటుకు బాగుందని కితాబునిచ్చారు. ఏడు దేశాల కంపెనీల సహకారంతో 2 వేల ఎకరాల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో స్మార్ట్సిటీతోపాటు, పలు పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే ప్రభు త్వ పరిశీలనలో ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్‌సిటీ, ఎడ్యుకేషన్ హబ్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రతిపాదనల్లో ఉన్నాయి. కాగా ఇప్పటికే, రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే పలు పరిశ్రమలకు ఏపీఐఐసీ భూములను కేటాయించింది. రాచకొండకు నాలుగులేన్ల రోడ్లు రాచకొండకు హైదరాబాద్ నుంచి, శంషాబాద్ నుంచి, 65వ నెంబరు జాతీయ రహదారి నుంచి నాలుగులేన్ల రోడ్లను అభివృద్ది చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానంగా, మెదక్, వరంగల్, కరీంనగర్, శ్రీశైలం, విజయవాడ జాతీయ రహదారులను కలుపుతూ, మరో రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే హైదరాబాద్ నుంచి 60 నుంచి 100 కి.మీ. దూరంతో రింగ్ రోడ్డు ఉంటుందని ప్రకటన కూడా చేసింది. హైవేలను కలపడం ద్వారా, రాజధానికి వాహనాల రద్దీని తగ్గించాలనేది ఈ రింగ్‌రోడ్డు ఉద్దేశం. ఈ రోడ్డుతో రాచకొండ ప్రాంతం రింగురోడ్డు లోపలకు వస్తుంది. ైెహ దరాబాద్‌కు రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. -
రాచకొండలో డిస్నీ వరల్డ్
* ‘సాక్షి’తో పేర్వారం రాములు * తెలంగాణ పర్యాటకాభివృద్ధి * సంస్థ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ * రాష్ట్ర పర్యాటకానికి కొత్త రూపు, ఊపు తెస్తా * కేబీఆర్ పార్కులో‘లండన్ ఐ’ నిర్మిస్తాం * హుస్సేన్‌సాగర్, నాగార్జునసాగర్‌లలో వాటర్‌వరల్డ్ సాక్షి, హైదరాబాద్: ‘రాత్రి వేళ ఆకాశంలోకి చూస్తే నక్షత్రాల చిత్రవిచిత్ర ఆకృతులు అలరిస్తాయి. గోరుకొయ్యలు, సప్తరుషి మండలం, ధ్రువతార... ఇలా వాటికి పేర్లెన్నో. రాత్రివేళ కొన్ని పక్షులు కిలకిలారావాలతో పలకరిస్తాయి. వాటితోపాటు ఇతర జంతుజాలం చేసే శబ్దవిన్యాసాలు ఆస్వాదిస్తూ నక్షత్ర భ్రమణాన్ని పరికిస్తుంటే ఆ అనుభూతే వేరు. కానీ నేటితరానికి వాటి మజానే తెలీదు. వీలు చిక్కితే సెల్ఫోన్లతో గడిపే యువత కు ఆ అనుభూతిని కలిగించాలనేది నా ఆకాంక్ష. దాన్ని పర్యాటక రంగ పురోగతితో ముడిపెట్టి ముందుకు తీసుకెళ్తా’ అని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్, విశ్రాంత ఐపీఎస్ అధికారి పేర్వారం రాములు పేర్కొన్నారు. ఆదివారం కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పేర్వారం తన ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన డిస్నీవరల్డ్‌ను తెలంగాణకు తెప్పించటం, అద్భుతాల్లో అద్భుతంగా భావించే లండన్ ఐ తరహా జెయింట్ ఫెర్రీస్ వీల్‌ను ఆవిష్కరించటం ఆయన ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. కేంద్రం అందించే పర్యాటక నిధులను గరిష్ట స్థాయిలో పొంది, రాష్ట్రప్రభుత్వ నిధుల వాటాను పెంచి రాష్ట్ర పర్యాటకానికి కొత్త రూపు, ఊపు తేవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... * రాచకొండను ఫిల్మ్ స్టూడియోగా అభివృద్ధి చేసే ఆలోచన ఉన్న నేపథ్యంలో అక్కడ దాదాపు 2 వేల ఎకరాల్లో డిస్నీ వరల్డ్ ఏర్పా టు చేయాలనే ఆలోచన ఉంది. దాన్ని ఇక్క డ సాకారం చేసే ప్రతిపాదన చేస్తున్నాం. * దాదాపు 565 అడుగుల ఎత్తుతో ఉండే లండన్ ఐ తరహా జెయింట్ ఫెర్రీస్ వీల్‌ను కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేయాలని ఉం ది. ఆరు ఎకరాల స్థలం దీనికి అవసరం. ఇందుకు 40 కోట్ల వరకు ఖర్చవుతుంది. * భువనగిరి, రామగిరి ఖిల్లా, వికారాబాద్ అనంతగిరుల్లో పారాగ్లైడింగ్ ఏర్పాటు చేస్తాం. * ఆదిలాబాద్-ఖమ్మం మధ్య గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న గుట్టల్లో ట్రెక్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. * మెదక్ జిల్లాలోని ఝరాసంగం, ఏడుపాయల గుడులను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. * హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన తర్వాత అందులో, నాగార్జునసాగర్‌లో నీటి అంతర్భాగంలో వాటర్ వరల్డ్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. * వరంగల్ జిల్లాలోని రామప్ప, పాకాల, లక్నవరం చెరువుల్లో వాటర్ స్కీయింగ్ ఏర్పాటు చేస్తాం. * రాణీ రుద్రమదేవి కన్నుమూసిన నల్లగొండ జిల్లా చెందుపట్లను, కంచర్ల గోపన్న జన్మస్థలం నేలకొండపల్లిని పర్యాటక కేంద్రాలుగా మారుస్తాం. -
కలం కబుర్లు...
సీఎం నంబర్ ఇస్తే పోలే! ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రూపంలో తలనొప్పి వచ్చి పడింది. ప్రభుత్వం రైతు రుణ విముక్తి పథకం గురించి గొప్పగా చెప్పుకుంటోందని, ఆ పథకం డొల్ల మాత్రమేనని విమర్శించిన రఘువీరారెడ్డి ఈ పథకంపై సందేహాలుంటే నేరుగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫోన్ చేయాలని నేరుగా మంత్రి సెల్‌ఫోన్ నంబరు వెల్లడించారు. దీంతో మంత్రికి క్షణం తీరిక లేకుండా వరుసగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు శరపరంపరగా వస్తూనే ఉన్నాయి. రుణ మాఫీ సంగతేంటంటూ ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడమే కాకుండా కనీసం పావుగంట సేపు మాట్లాడుతున్నారట. వారు మాట్లాడే సమయంలో మధ్యలోనే కట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో కొన్ని ఫోన్లు మాట్లాడారట. ఇక లాభం లేదనుకున్న మంత్రివర్యులు ఫోన్లకు సమాధానం చెప్పేందుకు ప్రత్యేకంగా పీఏను కేటాయించారు. అయితే, సందేహాలు తీర్చుకునేందుకు ఫోన్ చేసిన రైతులు పీఏ చెప్పిందంతా విన్న తరువాత మీరెవరని ప్రశ్నించి.. పీఏ అన్న సమాధానం రాగానే రైతులు మంత్రిగారేమయ్యారంటూ నిట్టూరుస్తున్నారట. ఈ విషయం ఆయనే మీడియాకు చెప్పుకోగా, అది విన్న టీడీపీ సహచరుడొకరు విరుగుడు మంత్రం బోధించారు.. మంత్రిగారికెందుకు తంటాలు..! అదేదో ముఖ్యమంత్రి ఫోన్ నంబర్ ఇస్తే పోలే..! మౌనం వెనుక బావ..! ఏపీ శాసనసభ లాబీల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట కలపకుండా మౌనంగా ఉంటున్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో తనదైన శైలిలో మాట్లాడుతున్న బాలయ్య.. మీడియా ప్రతినిధుల మాట మాత్రం వినిపించుకోనట్లు ఉంటున్నారు. దీని వెనుక ఆయన బావ, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ స్వతహాగా మనసులో ఏమీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు. విలేకరులు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై ప్రశ్నిస్తే బాలకృష్ణ సమాధానాలతో పార్టీకి, ప్రభుత్వానికి ఏ తంటా వస్తుందోనన్న ఆందోళనతో.. శాసనసభ సమావేశాల్లో నోరు మెదపొద్దని సీఎం స్పష్టంగా చెప్పటంతో మాట్లాడించేందుకు ఏ విలేకరి ఎంత ప్రయత్నించినా నోరు మెదపడం లేదని ఎమ్మెల్యేలు చెవులు కొరుక్కుంటున్నారు. ‘తెల్గీ’దేశం ఆఫీసుకు వెడదామా..? స్టాంపుల కుంభకోణం కేసులో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన సి.కృష్ణాయాదవ్ ఇప్పుడు హైదరాబాద్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యారు. మధ్యలో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కృష్ణాయాదవ్‌ను ఇప్పుడు హైదరాబాద్ పార్టీ అధ్యక్ష పదవి వరించింది. కానీ, ఆయన నాయకత్వం నచ్చనివారు నగర టీడీపీ కార్యాలయా న్ని ‘తెల్గీ ఆఫీసు’ అంటున్నారు. స్టాంపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీతో పాటు కృష్ణాయాదవ్ చాలాకాలం పూణే జైలులో ఉన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని తెలుగు తమ్ముళ్లు ఆ పార్టీ ఆఫీసును కాస్త తెల్గీ ఆఫీసు అంటూ పేరును కుదించారు. ఇది తెలియని తమ్ముళ్లు తెలుగును కుదించి ‘తెల్గీ’ అని పిలుచుకుంటున్నారా.. ? అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. హమ్మయ్య.. మన సీఎం సారేనట! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు హెలికాప్లర్లు పెద్దశబ్దంతో ఆకాశంలో ఎగురుతూ వస్తుంటే.. ఆ పల్లె వాసులు భయపడ్డారు. ఒక్క హెలికాప్టర్ కిందకు దిగుతుంటేనే పెద్ద శబ్దం వస్తుంది, అలాంటిది నాలుగు హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఆకాశంలో దూసుకువస్తుంటే భయపడరా....మరి? ఇటీవల రాచకొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, సహచర మంత్రులు, ఉన్నతాధికారులు నాలుగు హెలికాప్టర్లలో అక్కడికి వెళ్లారు. మామూలుగా వాహనాల శబ్దం కూడా పెద్దగా ఉండని రాచకొండ పల్లెల్లో ఈ నాలుగు హెలికాప్టర్ల రాకను చూసి పల్లీయులు చాలా కంగారు పడ్డారట. మళ్లీ నక్సలైట్లు ఏమైనా వచ్చి ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసుకున్నారా ...? అదితెలిసి పోలీసులు వస్తున్నారేమో అని పల్లెవాసులు ఉలిక్కిపడ్డారట. వచ్చింది ముఖ్యమంత్రి అని తెలిసి‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారట. ఈ విషయం ఓ ఉన్నతాధికారే స్వయంగా సహచర అధికారులకు చె బుతూ కడుపుబ్బ నవ్వించారు. -
బంగారుకొండ..భలే భలే గుట్టలు
చౌటుప్పల్ / సంస్థాన్ నారాయణపురం :‘‘ఎంతో అద్భుతమైన గుట్టలు.. వేలఎకరాల భూములు.. బేగంపేట నుంచి ఇక్కడకు 11 నిమిషాల్లో వచ్చా.. ఈ భూములను చూస్తే గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లు గుర్తుకొస్తున్నాయి. రాష్ట్ర రాజధానికి సమీపంలోని ఇంత విలువైన భూములను వినియోగించుకోకుండా తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది’’... ఇదీ రాచకొండ గుట్టల్లో ఏరియల్ సర్వే చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. మన జిల్లాతో పాటు రంగారెడ్డి సరిహద్దుల్లో ఉన్న భూములను పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించుకుందామని, ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలో సోమవారం సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. రాచకొండ గుట్టల్లో ఉన్న భూములను ఆయన గాలి మోటార్లో 22 నిమిషాలపాటు పర్యటించి పరిశీలించారు. మంత్రులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మలతో కలిసి ఉదయం 11.35గంటలకు హెలికాప్టర్ దిగారు. పక్కనే అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతం గురించి రెండు జిల్లాల అధికారులు ఆయనకు వివరించారు. రాచకొండ సరిహద్దు మండలాల గురించి కేసీఆర్ ఆరా తీశారు. అనంత రం కేసీఆర్ సూచన మేరకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రెండు జిల్లాల కలెక్టర్లు టి.చిరంజీవులు, శ్రీధర్‌లు మొదట హెలికాప్టర్ ఏరియల్ సర్వేకు వెళ్లారు. వారు తిరిగొచ్చాక సీఎం కేసీఆర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మలు ఇద్దరు కలెక్టర్లతో కలిసి, హెలికాప్టర్లో రాచకొండను చుట్టివచ్చారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ గంటసేపు సమావేశమయ్యారు. అక్కడే భోజనం చేసి, 2.10గంటలకు హెలికాప్టర్లో తిరుగుపయనమయ్యారు. కేసీఆర్ మొత్తంగా రెండున్నర గంటలపాటు రాచకొండలోనే గడిపారు. నోవాటెల్ జొన్నరొట్టె మస్తు..మస్తు రాచకొండలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ ఇష్టాగోష్టి మాట్లాడారు. అనంతరం అక్కడే లంచ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కోసం అధికారులు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ నుంచి ప్రత్యేకంగా ఆహారాన్ని తెప్పించారు. ఆయన జొన్నరొట్టె, చికెన్, చేపలతో తన భోజనాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జొన్నరొట్టెతో కూడిన మెనూ మస్తుందని అన్నట్టు తెలిసింది. అదేవిధంగా తన పర్యటన సందర్భంగా తక్కువ సమయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా ఉన్నతాధికారులను ఆయన అభినందించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. రాచకొండకు కేసీఆర్ ఏరియల్ సర్వేకు వస్తున్నారని పరిసర గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా దగ్గరివరకు అనుమతించలేదు. కేసీఆర్ హెలికాప్టర్ ఎక్కే సమయంలో అభివాదం చేయడంతో, ఒక్కసారిగా ఉత్సాహంతో కే రింతలు కొట్టారు. కట్టుదిట్టమైన బందోబస్తు రాచకొండలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్‌జోన్. దాదాపు 20సంవత్సరాల పాటు రాచకొండ కేంద్రంగా ఉద్యమం నడిచింది. మావోయిస్టుల ప్రాబల్యం కార ణంగా ఇంతవరకు ఎవరూ ఇక్కడ పర్యటించలేదు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు నిర్ణయించడంతో పోలీసులు కొంత ఉత్కంఠకు గురయ్యారు. తొలుత ఈ నెల3నే ఏరియల్ సర్వే చేయాలని తలపెట్టినప్పటికీ, మావోల కదలికల నేపథ్యంలో వాయిదాపడ్డట్టు వార్తలొచ్చాయి. దీంతో పోలీసులు సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పదిహేను రోజుల కాలంగా రాచకొండలో పోలీసుల కూంబింగ్ నడుస్తూనే ఉంది. సోమవారం సీఎం పర్యటన నేపథ్యంలో మరో 10 స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు మూడు రోజులుగా రాచకొండను జల్లెడ పట్టాయి. ఆరుగురు డీఎస్పీలు, 20మంది సీఐలు, 50మంది ఎస్ఐలు, 500మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సీఎం ల్యాండ్ అయిన గుట్టల చుట్టూ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. భద్రతా కారణాల దృష్టా పలు చోట్ల అక్కడికి వచ్చిన వారిని తనిఖీలు చేశాకే పంపారు. జనాన్ని కూడా అర కిలోమీటర్ దూరంలో ఆపేశారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం పర్యటనను డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్ రావులు పర్యవేక్షించారు. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి ఆర్డీఓలు, దేవ రకొండ, భువనగిరి డీఎస్పీలు అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ‘టైం’టేబుల్ ఇదీ.... సీఎం కేసీఆర్ మంత్రులు గుంటకడ్ల జగ దీష్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మలతో కలిసి, రాచకొండలో 11.35గంటలకు హెలికాప్టర్ దిగారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్లు టి.చిరంజీవులు, శ్రీధర్‌లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం 11:40 నిమిషాల నుంచి 11:52 నిమిషాల వరకు రాచకొండ గుట్టల్లోని భూములను నల్లగొండ, రంగారెడ్డి కలెక్టర్లు సీఎంకు మ్యాపుల ద్వారా వివరించారు. మంత్రులు జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్లు చిరంజీవులు, శ్రీధర్‌లు మొదటి విడతలో హెలికాప్టర్లో 12 గంటలకు ఏరియల్ సర్వేకు వెళ్లారు.12.15 గంటలకు కిందకు దిగారు. రెండో విడతలో సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మ, రెండు జిల్లాల కలెక్టర్లు 12.25గంటలకు హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు వెళ్లారు. 12.47గంటలకు కిందికి దిగారు. అనంతరం సీఎం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అధికారులతో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. అనంతరం అక్కడే భోజనం చేశారు. తిరిగి 2.10గంటలకు కేసీఆర్ హెలికాప్టర్లో తిరుగుపయనమయ్యారు. ఇండస్ట్రీయల్ కారిడార్‌గా అభివృద్ధి : బూర నర్సయ్యగౌడ్, ఎంపీ, భువనగిరి తెలంగాణ రాష్ర్టంలో పెట్టబడులు పెట్టేందుకు 60విదేశీ సంస్థలు సీఎం కేసీఆర్‌ను కలిశాయి. సోలార్ పరిశ్రమ, ఫార్మాసిటి, ఫిలింసిటీ, ఎకోటూరిజం, అమెరికాకు చెందిన డిస్నీలాండ్, రోస్కంపెనీ లాంటి ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయి. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో 42వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములున్నాయి. వీటన్నింటినీ కలిపి అతిపెద్ద ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ ఆలోచన. అందులో భాగంగానే ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఇండస్ట్రీయల్ కారిడార్‌లో భాగంగానే ఫార్మాసిటీకి 11వేల ఎకరాల భూమిని కేసీఆర్ కేటాయించారు. సర్వే పూర్తయితే, ఈ భూమిని క్లస్టర్లుగా విభజించి, ఎడ్యుకేషన్ హబ్, ఫిలింసిటీ, డిఫెన్స్సిటీ, ఇలా అనేక రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనువైన స్థలాలను కేటాయించనుంది. మొత్తంగా మరుగునపడ్డ రాచకొండ చరిత్ర ప్రాచుర్యంలోకి రానుంది. రాచకొండకు నాలుగులేన్ల రోడ్లు: కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మునుగోడు వెనుకబడిన నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ వ ద్ద అనేక ఆలోచనలున్నాయి. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న రాచకొండకు మహర్దశ పట్టనుంది. కేసీఆర్ ఏరియల్ సర్వేతో ఈ ప్రాంతాన్ని క్షణ్ణంగా పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ముశ్చర్ల మీదుగా రాచకొండ వరకు, 65వ నంబరు హైవే నుంచి రాచకొండకు నాలుగులేన్ల రోడ్డు వేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ భూములన్నింటినీ సమగ్రంగా సర్వే చేసి, స్వాధీనం చేసుకున్నాక, క్లస్టర్లుగా విభజించనున్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నారు. ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం కనిపిస్తోంది. -
హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్ సిటీ: కేసీఆర్
-
హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్ సిటీ: కేసీఆర్
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీలను నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మంత్రులతో కలిసి రాచకొండ ప్రాంతంలో హెలికాప్టర్‌తో ఏరియల్ సర్వే చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీల నిర్మాణానికి రంగారెడ్డి -నల్లగొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతం అనువైనదని ఆయన చెప్పారు. రాచకొండలో దాదాపు 31 వేల ఎకరాల భూమి ఉందని, అందువల్ల ఆ ప్రాంతం పరిశ్రమలు, విద్యాలయాలు, ఇతర సంస్థలు స్థాపించేందుకు చాలా అనుకూలమని కేసీఆర్ అన్నారు. -
రేపు రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
-
రేపు రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రంగారెడ్డి జిల్లా రాచకొండ గుట్టల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఫిలింసిటీ నిర్మాణం కోసం సోమవారం కేసీఆర్ రాచకొండ గుట్టలను పరిశీలించనున్నారు. కేసీఆర్ వెంట రంగారెడ్డి, నల్లగొండ జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. కేసీఆర్ ఇటీవల ఇదే ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఫార్మా కంపెనీ ప్రతినిధులను వెంటతీసుకుని ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. -
రాచకొండకు రాచఠీవి
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి కేంద్రం సంసిద్ధత రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు పంపిన తెలంగాణ ప్రభుత్వం పానుగల్ ఆలయాలు, ఉదయసముద్రంతో కలిపి టూరిజం సర్క్యూట్ మరుగున పడిన రాచకొండ కోటకు కొత్త వెలుగు సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన కోట.. ఇరవై అడుగుల ఎత్తున్న ప్రాకారాలు.. అంతెత్తున అలరారే దర్వాజాలు.. కాకతీయ శిల్పకళాచాతుర్యం ఉట్టిపడే దేవాలయాలు.. గుట్టల సమూహంలో ప్రకృతి సోయగం.. కనుచూపుమేరలో పరచుకున్న పచ్చదనం.. ఇదంతా రాచకొండ గుట్టల వైభవం. అందమైన గుట్టలు.. వాటిపై గొప్పగా రూపుదిద్దుకున్న కోట.. అసలు ఈ పేరుతో ఓ చారిత్రక అద్భుతం ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. రాష్ర్ట రాజధానికి కూతవేటు దూరంలోనే ఉన్నా ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం త్వరలో పర్యాటక శోభ సంతరించుకోబోతోంది. హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సుందర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలో కొత్తగా అభివృద్ధి చేసే టూరిజం సర్క్యూట్లో భాగంగా దీనిపై కేంద్ర సర్కారు దృష్టి సారించింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ర్ట ప్రభుత్వం మూడు రోజుల క్రితమే కేంద్రానికి పంపింది. రాచకొండ పరిసరాలను ఫిల్మ్‌సిటీగా అభివృద్ధి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడటంతో ఆ ప్రాంతానికి మహర్దశ రావడం ఖాయంగా కనిపిస్తోంది. టూరిజం సర్క్యూట్‌తో కొత్త వెలుగులు తెలంగాణ రాష్ర్టంలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం 8 ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా రూ. 45 కోట్లతో వరంగల్-కరీంనగర్ మెగా సర్క్యూట్‌తో పాటు నల్గొండ జిల్లాలోని మూడు ప్రాంతాలను కలిపి టూరిజం సర్క్యూట్‌గా ఎంపిక చేశారు. కాకతీయుల కాలంలో పానుగల్లో నిర్మితమైన ఛాయ సోమేశ్వర దేవాలయం, పచ్చల సోమేశ్వర దేవాలయాలతోపాటు అక్కడికి చేరువలోని ఉదయసముద్రం రిజర్వాయర్లను కలిపి రాచకొండ కోటను ఓ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు రూ. 8 కోట్లు కేటాయించాలని తాజాగా కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో అధికారులు సూచించారు. కనీసం రూ. 5 కోట్లు మంజూరవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధులతో ఉదయసముద్రం రిజర్వాయర్‌లో బోట్లు ప్రవేశపెట్టాలని, పానుగల్ దేవాలయ సమూహం వద్ద పర్యాటకులకు వసతులు కల్పించాలని యోచిస్తోంది. ఇక ఇప్పటివరకు పెద్దగా ప్రాచుర్యంలోకి రాని రాచకొండపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అక్కడికి పర్యాటకులు సులభంగా చేరుకోవడానికి వీలుగా రోడ్లు వేయడంతో పాటు బస్సులను ఏర్పాటుచేయనున్నారు. పర్యాటకుల బస కోసం భవనాలు, రెస్టారెంట్లు నిర్మించనున్నారు. రక్షిత మంచినీటి వసతి, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఖాళీ ప్రాంతాల్లో ఉద్యానవనాలను తీర్చిదిద్దుతారు. చిన్నపిల్లలను ఆకట్టుకునేలా ఆటవిడుపు కేంద్రాలను కూడా నిర్మిస్తారు. కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించనుంది. తొలిదశలో ఈ పనులు పూర్తి చేసిన తర్వాత గోల్కొండ తరహాలో సౌండ్ అండ్ లైట్ షోతో పాటు రాచకొండ కోట చరిత్రను తెలిపే విజువల్ ఎఫెక్ట్ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలు ఇక్కడ ట్రెక్కింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సాహసాలను ఇష్టపడే వారికి అలాంటి మరిన్ని ఏర్పాట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం నుంచి ఆమోదం రాగానే వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. -
కునుకు లేని ‘రాచకొండ’!
క్షిపణి పేరు చెబితే ఉలిక్కిపడుతున్న ప్రాంతం ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ పేరుతో దండయాత్రలు చేస్తున్న బీడీఎల్ వణుకుతున్న ఐదు దోనెల తండా వాసులు ఒకప్పుడు తూటా చప్పుళ్లతో దద్దరిల్లింది ఇదే తండా సాక్షి, హైదరాబాద్: నిన్నమొన్నటి వరకు.. ఆ ప్రాంతానికి తుపాకులు, తూటాలు, దండయాత్రలు, ఎన్కౌంటర్లు కొత్త కాదు. రాజులు, రజాకార్లు, పోలీసులు, మావోయిస్టులు పేల్చిన తూటాల చప్పుళ్లు ఇప్పటికీ ఈ ప్రాంతవాసుల చెవుల్లో మార్మోగుతుంటాయి. ప్రకృతి సోయగాలు.. నిరంతరం పారే జలపాతాలు.. ఎత్తై గుట్టలు, కొండలతో అలరారే నల్లగొండ జిల్లాలోని ఈ ‘రాచకొండ’ చారిత్రక ఆనవాళ్లకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిపడింది. తిరుగుబాట్లు, విప్లవ రాజకీయాలకు నెలవైన అక్కడి ప్రజలు ఇప్పుడు క్షిపణి పేరు చెబితే ఉలిక్కిపడుతున్నారు. ‘ఫైర్’ సీన్లు పాతవే అయినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అంటేనే వారు వణుకుతున్నారు. ఈ ప్రాంతంలోని అద్భుతమైన అందాలను, చారిత్రక సంపదను సరి‘హద్దు’ల మధ్య బంధించి వేల ఎకరాల్లో నిక్షిప్తమై ఉన్న నాటి ఆంధ్రదేశ రాజధాని ఆనవాళ్లకు శాశ్వతంగా సంకెళ్లు వేసేందుకు రక్షణ శాఖ ఉవ్విళ్లూరుతోంది. అమాయక గిరిజనులను, వారి సంస్కృతిని తమ ప్రయోగశాలగా మార్చుకుని బాంబుల మోతతో కకావికలం చేసేందుకు సిద్ధమైంది. నగరానికి సమీపంలో.. నయా దండయాత్ర హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం, రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాంతాల మధ్య ఉన్న రాచకొండపై రక్షణ శాఖ కన్నుపడింది. క్షిపణి పరీక్షలు చేస్తామని ఓసారి, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేస్తామని మరోసారి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అధికారులు ఈ ప్రాంతంపై నయా దండయాత్రలు చేస్తున్నారు. మొదట 25 ఎకరాలు సరిపోతాయని చెప్పిన బీడీఎల్ యాజమాన్యం ఆ తర్వాత 125 ఎకరాలు.. మళ్లీ 17,430 ఎకరాలకు పైగా ఎసరు పెట్టింది. ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసి సైనికులకు శిక్షణ ఇస్తామని, యుద్ధంలో శత్రుసైన్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే క్షిపణులను ప్రయోగిస్తామని అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మూడు దశాబ్దాల నాటి ఈ ప్రతిపాదనలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదు దోనెలకు ఎంత కష్టం.. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో 300 అడుగుల ఎత్తున ఉంది ఐదు దోనెల తండా. బీడీఎల్ చేసే క్షిపణి ప్రయోగాలు ఈ తండానే లక్ష్యంగా చేసుకోనున్నాయి. వారు చేసిన మార్కింగ్ ప్రకారం రాచకొండ గుట్టల్లోని సరళ మైసమ్మ దే వాలయం సమీపంలోని గుట్టల నుంచి క్షిపణులను ప్రయోగిస్తారు. అవి 2, 4, 6 కిలోమీటర్లలోని లక్ష్యాలను ఛేదించాల్సి ఉంటుంది. 2, 4 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు జనావాసాలకు దూరంగా ఉంటే 6 కిలోమీటర్ల లక్ష్యం మాత్రం ఈ తండాకు కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడ 70 ఇళ్ల వరకు ఉన్నాయి. సింగభూపాలుని కాలంలో ఈ తండాకు సమీపంలో ఐదు నీటి దోనెలను తవ్వారు. ఈ దోనెల వద్దకు క్రూర జంతువులు నీటి కోసం వచ్చినప్పుడు రాజులు వాటిని వేటాడేవారు. దాదాపు వందేళ్ల క్రితమే ఈ తండాకు అంకురార్పణ జరిగింది. సమీపంలోని అటవీప్రాంతంలో ఉన్న తండాల ప్రజలు ఒక్కొక్కరుగా అక్కడ నివాసమేర్పరచుకున్నారు. బీడీఎల్ అధికారుల ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే నెలకోసారి వీరంతా తండాను ఖాళీ చేయాలి. అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో పునరావాసం కింద ఏర్పాటు చేసిన షెడ్లలోకి గొడ్డు గోదాలతో వెళ్లిపోవాలి. క్షిపణి పరీక్షలు పూర్తయిన తర్వాత మళ్లీ తమ తమ నివాసాలకు రావాలి. దీనికి అంగీకరిస్తే తండాకు సకల సౌకర్యాలు కల్పిస్తామని, రోడ్లు వేస్తామని, మరుగుదొడ్లు కట్టిస్తామని బీడీఎల్ ప్రలోభపెడుతోంది. కానీ ఈ ప్రతిపాదనలను అంగీకరించేందుకు స్థానిక గిరిజనులు ససేమిరా అంటున్నారు. రజాకార్లనే తరిమికొట్టాం.. ‘మమ్మల్ని వెళ్లిపొమ్మంటే సహించేది లేదు. మీకు నచ్చింది చేయాలనుకుంటే మరో ప్రాంతాన్ని చూసుకోండి. భూమిపుత్రులను వెళ్లిపోమ్మనే ధైర్యం ఎవరికి ఉందో చూస్తాం. ఇక్కడకు ఎలా వస్తారో.. క్షిపణులు ఎలా ప్రయోగిస్తారో చూస్తాం. రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర మాది. నిజాం గుండెల్లో నిద్దురపోయిన తెగువ మాది. ఈ పోరాటం ఎక్కడి వరకు వెళ్లినా మేం వెనక్కు తగ్గేది లేదు’. - సపావట్ సోమ్లా, ఐదు దోనెల తండా వాసి -
అభివృద్ధి బాటకు ఫైరింగ్ అడ్డు
సంస్థాన్ నారాయణపురం, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఔటర్రింగ్కు 25కిలోమీటర్ల దూరంలో ఉంది రాచకొండ. చారిత్రక సంపద ఇక్కడ ఉంది. రాజధాని చుట్టూ అభివృద్ధి జరుగుతున్నా రాచకొండ వైపు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఎన్నో ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వచ్చినా చివరకు చేతులెత్తేస్తున్నారు. ఇందుకు కారణం ఇక్కడ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తుండడమేనని తెలుస్తోంది. రాచకొండలో వేల ఎకరాల ప్రభుత్వ, ఫారెస్టు భూములున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఆ భూములను నమ్ముకొని గిరిజ నులు బతుకుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గిరి జనుల కోసం అటవీహక్కుల చట్టం తీసుకువచ్చి, మొట్టమొదటగా జిల్లాలోనే ఐదుదొనలతండాలో 48మందికి, రాచకొండ పరిధిలోని మిగతా తండాలలో 131 మందికి 433 ఎకరాలకు పట్టాలందించారు. మూడో విడత నుంచి ఆరో విడత వరకు రాచకొండలో అసైన్డ్ కమిటీ ద్వారా భూపంపిణీ జరగలేదు. రియల్ఎస్టేట్లో జరిగిన అక్రమాలను చూపిస్తూ పేద ప్రజలకు, భూమి లేని రైతులకు భూపంపిణీ చేయలేదు. ఏడో విడత అసైన్డ్ కమిటీ ద్వారానైనా భూపంపిణీ జరుగుతుందనుకుంటే ఇప్పటి వరకూ జరగలేదు. గత ఏడాది సీపీఐ నాయకులు భూములు పంపిణీ చేయాలని రాచకొండలో జెండాలు పాతారు. ఉన్న భూములను ఆక్రమించుకుని దున్నకాలు చేశారు. అయినా భూపంపిణీ జరగలేదు. ప్రాజెక్టులు రాకపోవడానికి, భూపంపిణీ జరగకపోవడానికి ఫీల్డ్ ఫైరింగ్రేంజ్, క్షిపణి ప్రయోగకేంద్రం ఏర్పాటేనని ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు కేంద్రాల కోసమేనా? క్షిపణి ప్రయోగ కేంద్రం, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ప్రాంతంలో అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ భూ పంపిణీ చేస్తే.. క్షిపణి, ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు భూసేకరణ సమస్య ఎదురవుతుంది. అదే విధంగా ఐటీపార్కు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఫీల్డ్ఫైరింగ్ రేంజ్‌కు అవరోధంగా మారుతాయి. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినా, నెమళ్ల పార్క్ ఏర్పాటు చేసినా ఎప్పుడూ బాంబుల మోతతో దద్ధరిల్లే క్షిపణి ప్రయోగ కేంద్రం, ఫీల్డ్ఫైరింగ్ రేంజ్‌ల ఏర్పాటుకు అనుమతులు లభించవనే ముందస్తు ఆలోచనతో అభివృద్ధి చేయకుండా వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా స్థలం సమస్య తీవ్రమవుతుందన్న కారణమని తెలుస్తోంది. ఉద్యమానికి సిద్ధమవుతున్న పార్టీలు.. క్షిపణి ప్రయోగ కేంద్రం, ఫీల్డ్ఫైరింగ్ రేంజ్‌కు వ్యతిరేకంగా ఉద్యమానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఫీల్డ్ైఫైరింగ్ రేంజ్ వ్యతిరేక ఉద్యమ మాజీ కన్వీనర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గులాం రసూల్ ఈ నెల 8న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కాగా రాచకొండ సర్పంచ్ కాట్రోతు సాగర్ శుక్రవారం సంస్థాన్ నారాయణపురంలో సమావేశం నిర్వహించి ఈ నెల 9న మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో అన్ని పార్టీలు ఏకతాటిపై పనిచేసి ఫీల్డ్ఫైరింగ్ రేంజ్ ఏర్పాటును ప్రభుత్వంతో విరమింపజేశాయి. ఇప్పడు కూడా అన్ని పార్టీలు ఏకమై ఉద్యమం నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.