హైదరాబాద్లో ఫిల్మ్సిటీ, స్పోర్ట్స్ సిటీ: కేసీఆర్ | film city and sports city to be formed in hyderabad, says kcr | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో ఫిల్మ్సిటీ, స్పోర్ట్స్ సిటీ: కేసీఆర్

Published Mon, Dec 15 2014 5:06 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

హైదరాబాద్లో ఫిల్మ్సిటీ, స్పోర్ట్స్ సిటీ: కేసీఆర్ - Sakshi

హైదరాబాద్లో ఫిల్మ్సిటీ, స్పోర్ట్స్ సిటీ: కేసీఆర్

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీలను నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మంత్రులతో కలిసి రాచకొండ ప్రాంతంలో హెలికాప్టర్తో ఏరియల్ సర్వే చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీల నిర్మాణానికి రంగారెడ్డి -నల్లగొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతం అనువైనదని ఆయన చెప్పారు.

రాచకొండలో దాదాపు 31 వేల ఎకరాల భూమి ఉందని, అందువల్ల ఆ ప్రాంతం పరిశ్రమలు, విద్యాలయాలు, ఇతర సంస్థలు స్థాపించేందుకు చాలా అనుకూలమని కేసీఆర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement