Sports City
-
స్పోర్ట్స్ రాజధానిగా రాజమహేంద్రవరం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరం నగరం స్పోర్ట్స్ రాజధానిగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో యెనెక్స్, సన్‌రైజ్ డాక్డర్ వైఎస్సార్– జక్కంపూడి రామ్మోహనరావు మెమోరియల్ 44వ ఇంటర్ స్టేట్, ఇంటర్ జోనల్, జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2019 పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాజమహేంద్రవరంలో ప్రతిభావంతులైన క్రీడాకారులున్నారని, వారికి సరైన ప్రోత్సాహం ఇస్తే మరింత మెరుగ్గా రాణిస్తారని అన్నారు. మూడు రాజధానుల అంశంపై తెలుగుదేశం పార్టీ లేనిపోని రాద్ధాంతం చేస్తోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకూడదన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఇటు విజయవాడ, అటు వైజాగ్ అభివృద్ధి చెంది, మధ్యలో ఉభయ గోదావరి జిల్లాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ స్పోర్ట్స్ హబ్‌గా మారడానికి అన్ని సౌకర్యాలున్నాయన్నారు. కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, బాయ్ కార్యదర్శి ఉమర్ రషీద్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ రఘు కిరణ్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిశోర్, తూర్పు గోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షురాలు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొడాలి తనూజ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకూ జరిగే ఈ పోటీల్లో పాల్గొనడానికి దేశంలోని 29 రాష్ట్రాల క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లాలో జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి. -
స్పోర్ట్స్ సిటీగా కరీంనగర్
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ స్మార్ట్‌సిటీలో నగరం నడిబొడ్డున్న అంబేద్కర్ స్టేడియం అభివృద్ధికి రూ.18 కోట్లు కేటాయించినట్లు మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. ఈ నిధులతో స్టేడియంను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధికి సంబంధించిన నమూన పోస్టర్‌ను ఆవిస్కరించారు. అనంతరం వివరాలను వెల్లడించారు. స్టేడియం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఉన్న మైదానలను తీసివేయకుండా వాటి రూపురేఖలు మారుస్తున్నట్లు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయడమే కాకుండా కొత్తగా సైక్లింగ్‌రింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్టేడియంకు ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు షాపింగ్ కాంప్లె„Šక్స్ నిర్మిస్తామన్నారు. ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీతోపాటు స్పోర్ట్స్ సిటీగా, హెల్తీ సిటీగా మార్చడమే లక్ష్యమన్నారు. క్రీడారంగంలో జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఎంతో కృషి చేశారని తెలిపారు. క్రీడలంటే అందరికీ హైదరాబాద్ గుర్తుకువస్తుందని, అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి తర్వాత అందరూ కరీంనర్‌వైపు చూస్తార పేర్కొన్నారు. స్మార్ట్ స్టేడియాన్ని కరీంనగర్ ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. ఏడాదిలోగా టెండర్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్టేడియం చుట్టూ ఉన్న రహదారులను సైతం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 11న స్మార్ట్ స్టేడియం పనులను జిల్లా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభిస్తారని వివరించారు. సమావేశంలో కార్పొరేటర్ ఎల్.రూప్సింగ్, ఇన్చార్జి డీవైఎస్వో నాగిరెడ్డి సిద్దారెడ్డి పాల్గొన్నారు. -
రాజధానిలో తొమ్మిది ప్రత్యేక నగరాలు
‘మాస్టర్‌ప్లాన్’లో ఇవే అమరావతికి ఆకర్షణలు సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో వివిధ రంగాలకు సంబంధించి తొమ్మిది ప్రత్యేక (థీమ్ సిటీలు) నగరాలను ప్రతిపాదించారు. దేనికదే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న వీటిని అమరావతికే ఆకర్షణ అని చెబుతున్నారు. గవర్నమెంట్ సిటీ 564 హెక్టార్లలో నిర్మించే ప్రభుత్వ నగరంలో రెండు టౌన్‌షిప్‌లు నిర్మించనున్నారు. అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్, విభాగాధిపతుల కార్యాలయాలను ఈ నగరంలో నిర్మిస్తారు. అసెంబ్లీ భవనాన్ని అత్యద్భుత రీతిలో నిర్మించి పర్యాటకులను ఆకర్షించాలని ప్రతిపాదించారు. జస్టిస్ సిటీ ప్రభుత్వ నగరానికి దక్షిణం వైపున జస్టిస్ సిటీని నిర్మించనున్నారు. కోర్టులు, వాటి అనుబంధ సౌకర్యాలతో 566 హెక్టార్లలో ఈ నగరాన్ని ఏర్పాటు చేస్తారు. ఫైనాన్స్ సిటీ వాటర్‌ఫ్రంట్‌కు ఎదురుగా ఆర్థిక కార్యకలాల కేంద్రమైన సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను ఫైనాన్స్ సిటీ పేరుతో ఏర్పాటు చేస్తారు. 566 హెక్టార్లలో నిర్మితమయ్యే ఈ నగరంలో వాణిజ్య భవనాలు, బహుళ ప్రయోజన అభివృద్ధి కార్యకలాపాల కేంద్రాలుంటాయి. రాజధాని నగరంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి చేరుకునేందుకు అనువుగా రెండు ఎంఆర్టీ (మెట్రో) లైన్లు ప్రతిపాదించారు. వాటర్‌ఫ్రంట్ ప్లాజా, రిక్రియేషనల్ ఐల్యాండ్ నగరంలో ప్రత్యేక ఆకర్షణలుగా తీర్చిదిద్దనున్నారు. వాటర్‌ఫ్రంట్ ప్లాజాలో రెండు ఐకానిక్ టవర్లుంటాయి. నాలెడ్జ్ సిటీ జస్టిస్, ఆర్థిక నగరాలకు దక్షిణం వైపు విద్య, విజ్ఞాన నగరాన్ని ప్రతిపాదించారు. నాలెడ్జ్ పార్కు, హౌసింగ్ యూనివర్సిటీ క్యాంపస్, పలు కళాశాలలతో 1,445 హెక్టార్లలో ఈ నగరం ఏర్పాటవుతుంది. 2050 నాటికి ఈ నగరంలో 1.20 లక్షల ఉద్యోగాల కల్పనతోపాటు 5,73,575 మంది నివాసం ఉండేలా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ సిటీ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఈ నగరంలో నెలకొల్పాలని లక్ష్యం. 731 హెక్టార్లలో నిర్మించే ఈ నగరంలో 2,73,500 నైపుణ్య ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం నిర్దేశించారు. హెల్త్ సిటీ 1,349 హెక్టార్లలో నిర్మించే హెల్త్ సిటీలో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యం. స్పోర్ట్స్ సిటీ క్రీడా నగరంలో భారీ స్టేడియాలు, ఈవెంట్ కేంద్రాలు, అంతర్జాతీయ స్థాయి క్రీడా కేంద్రాలను నెలకొల్పుతారు. 650 హెక్టార్లలో ఈ నగరాన్ని నిర్మిస్తారు. మీడియా సిటీ అనంతవరం సమీపంలో మీడియా, కల్చరల్ నగరాన్ని 677 హెక్టార్లలో నిర్మించనున్నారు. సాంస్కృతిక, కళా కేంద్రాలు ఏర్పాటు చేసి 1.5 లక్షల మందికి వాటిల్లో ఉద్యోగాలు కల్పించాలని పేర్కొన్నారు. టూరిజం సిటీ ఉండవల్లి గుహల మీదుగా కృష్ణానదికి అభిముఖంగా 531 హెక్టార్లలో పర్యాటక నగరాన్ని నిర్మిస్తారు. వాటర్ టూరిజం ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. -
అక్రమాలు రూ.కోట్లు దాటుతున్నాయ్!
- నిబంధనలకు నీళ్లు - డిపాజిట్ చేయకముందే పనులు కట్టబెట్టేందుకు సన్నాహాలు - జలమండలి అధికారుల నిర్వాకం సాక్షి,సిటీబ్యూరో: ఒకటీ... రెండూ కాదు... ఏకంగా రూ.20 కోట్ల విలువైన పనుల్లో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. జలమండలి ఆధ్వర్యంలో మాదాపూర్ స్పోర్ట్స్ సిటీకి మంచి నీటి సరఫరాకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రూ.20 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంది. అయితే అంతకుముందేతమకు నచ్చిన వారికి పనులు కట్టబెట్టేం దుకు జలమండలి అధికారులు అత్యుత్సాహం చూపుతుండడం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు రూ.20 కోట్ల విలువైన పనులను సాధారణంగా జలమండలి ప్రాజెక్టు విభాగం పర్యవేక్షిస్తుంది. దీనికి భిన్నంగా ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షణలోనే చేపడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవారికి పనులు కట్టబెట్టేందుకే ఈ తతంగం ఆగమేఘాల మీద జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదీ కథ... మాదాపూర్ సబ్‌డివిజన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ వెనుక వైపున నిర్మిస్తున్న స్పోర్ట్స్ సిటీకి మంచినీటి సరఫరాకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ముందుకొచ్చింది. దీనికి సైబర్ గేట్‌వే ప్రాంతంలోని విప్రో సంస్థ వె నుక వైపున 5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ (జీఎల్ఎస్ఆర్) నిర్మించాల్సి ఉంది. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పోర్ట్స్సిటీకి మంచినీటి సరఫరాకు 800 డయా వ్యాసార్థం గల మైల్డ్‌స్టీల్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రెండు పనులకు రూ.20 కోట్లు వ్యయమవుతుందని అంచనా. నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని టీఎస్ ఐఐసీ సంస్థ జలమండలికి డిపాజిట్ చేయాల్సి ఉంది. మహానగరం పరిధిలో ఏదేని అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీకి నీటి సరఫరా చేయాలంటే ముందుగానే డిపాజిట్ వసూలు చేయడం జలమండలి పాటిస్తున్న నిబంధన. కానీ ఈ విషయంలో కొందరు అధికారులు బోర్డును తప్పుదోవ పట్టించి సదరు సంస్థ నిర్మాణ వ్యయాన్ని డిపాజిట్ చేయకముందే టెండర్లు పిలిచి తమకు నచ్చిన వారికి పనులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధంచేయడం గమనార్హం. మరోవైపు తాజాగా పనులు దక్కించుకుంటున్న వారికి సైతం ఈ రంగంలో అంతగా అనుభవం, అర్హతలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భాగోతంలో తమకు బాగానే గిట్టుబాటవుతుందనే ఉద్దేశంతోనే అధికారులు ఈ తతంగం నడిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాల దారిలో.. సాధారణంగా రూ.కోటి... అంతకంటే ఎక్కువ నిర్మాణ వ్యయమయ్యే పనులను జలమండలి ప్రాజెక్టు విభాగం పర్యవేక్షిస్తుంది. కానీ ఆపరేషన్స్ విభాగం ఆధ్వర్యంలో తమకు సంబంధం లే ని పనులకు టెండర్లు పిలవడంలో ఆంతర్యం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇదే క్రమంలో మారేడ్‌పల్లి నిర్వహణ డివిజన్ పరిధిలో రూ.9.20 కోట్లతో చేపట్టే రిజర్వాయర్ పనులు, ఫతేనగర్, షాపూర్, తార్నాక, ఎస్పీఆర్ హిల్స్ ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.10 కోట్లతో నిర్మించే రిజర్వాయర్ పనులను ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షణలో చేపట్టేందుకు రంగం సిద్ధమవడం గమనార్హం. ఈ విషయంలో విజిలెన్స్ విభాగం జోక్యం చేసుకుంటే అక్రమాల డొంక కదులుతుందని బోర్డు ఉద్యోగ, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. -
రాచకొండ గుట్టల్లో చిత్ర, క్రీడా నగరాలు
* అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాం: సీఎం కేసీఆర్ * విశ్వవిద్యాలయాలు నెలకొల్పే అంశంపైనా పరిశీలన సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి సినిమా, క్రీడా నగరాలను నిర్మిస్తామని.. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో ఉన్న రాచకొండ గుట్టల ప్రాంతం ఇందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇక్కడ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశముందని చెప్పారు. హైదరాబాద్ నుంచి రాచకొండకు రెండు మార్గాల్లో నాలుగు లేన్ల రోడ్డును నిర్మిస్తామని చెప్పారు. ఈ మేరకు రాచకొండ గుట్టల ప్రాంతంపై సోమవారం మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో కలిసి సీఎం ఏరియల్ సర్వే చేశారు. తొలుత హైదరాబాద్ నుంచి ఉదయం 11.30కు హెలికాప్టర్లో వచ్చిన సీఎం కేసీఆర్ రాచకొండ కోటకు సమీపంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. గుట్టల ప్రాంతంలో ఉన్న భూముల వివరాలను నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సీఎం కేసీఆర్‌కు వివరించారు. అనంతరం రాచకొండ, ముచ్చర్ల, ఆమనగల్, కర్తాల్ మీదుగా శ్రీశైలం అడవుల వరకు దాదాపు 25 నిమిషాల పాటు ఏరియల్ సర్వే చేశారు. తిరిగి రాచకొండకు వచ్చిన సీఎం.. దాదాపు గంటసేపు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఆ ప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధి, కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధానికి దగ్గరలో.. రాచకొండ ప్రాంతం దాదాపు 31 వేల ఎకరాల్లో విస్తరించి ఉందని, పరిశ్రమలు, సంస్థలు, విద్యాలయాలు స్థాపించడానికి అనుకూలంగా ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాజధానికి అత్యంత సమీపంలోని ఈ ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, ఈ భూములను ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న దానిపై అధికారులు దృష్టి సారించాలని సీఎం పేర్కొన్నారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో హైదరాబాద్‌కు దగ్గరగా దాదాపు 40 వేల ఎకరాల భూమిని సేకరించి, పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటు చేయాలని... ఇందుకోసం ప్రతిపాదనలు తయారుచేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాచకొండకు ముచ్చర్ల, ఇబ్రహీంపట్నం మీదుగా నాలుగు లేన్ల రోడ్డు, జాతీయ రహదారిపై మల్కాపురం నుంచి మరో నాలుగు లేన్ల రహదారిని ఏర్పాటు చేయడం ద్వారా రవాణా సౌకర్యం కల్పించవచ్చని కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం ఇక్కడ ఫిలిం సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్సిటీలతో పాటు గ్రీన్‌ఫీల్డ్ పరిశ్రమలు, సోలార్‌ఎనర్జీ పరిశ్రమలు, ఇతర సంస్థల ఏర్పాటు విషయాన్ని ఆలోచిద్దామని చెప్పారు. రాళ్లు రప్పలున్న భూమిని కొనాలా? అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఇష్టాగోష్టి సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న సినీమ్యాక్స్ స్థలాన్ని తాను కొని ఉండాల్సిందని సీఎం చెప్పినట్లు సమాచారం. ‘‘గతంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కూడా గుట్టలే. అక్కడకు వెళ్లాలంటేనే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇరవయ్యేళ్ల కింద మా మామ స్నేహితుడు ఒకాయన ఇప్పుడు సినీమ్యాక్స్ ఉన్న స్థలాన్ని గజం రూ. 40 లెక్కన కొనుగోలు చేయాలని నాకు చెప్పడంతో చూసేందుకు వెళ్లాం. అక్కడకు వెళ్లడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. స్కూటర్ మీద వెళ్లడమే గగనమైపోయింది. కానీ ఆ భూమిని చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఈ రాళ్లు, రప్పలున్న భూమి కొనమంటావా? అని అడిగాను. ఇంకోసారి అలాంటి భూములు చూపెట్టవద్దన్నాను. కానీ ఇప్పుడు అదే భూమి కోట్ల రూపాయలు పలుకుతోంది. ఇప్పుడు రాచకొండ గుట్టలను చూస్తే అదే గుర్తుకువస్తోంది..’’ అని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. బీడీఎల్ అనుమతిస్తేనే.. రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీతో పాటు పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా.. అందు కు రక్షణ పరిశోధన సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అనుమతి అవసరం కానుంది. ఎందుకంటే ఈ గుట్ట ల్లో దాదాపు 18 వేల ఎకరాలను క్షిపణి ప్రయోగాల నిమిత్తం బీడీఎల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే లీజుకిచ్చిం ది. క్షిపణి ప్రయోగాలను పరిశీలించే సమయంలో ఆ భూ ములు పూర్తిగా బీడీఎల్ పరిధిలోకి వెళతాయి. మిగతా సమయంలో అటవీశాఖ అధీనంలోనే ఉండాలని, ఆ శాఖే ఆ భూముల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని లీజు ఒప్పందంలో ఉంది. ఇందుకోసం కేంద్రం రూ. 6కోట్లను రాష్ట్రానికి చెల్లించింది కూడా. రాచకొండలో సీఎం పర్యటన సందర్భంగా నల్లగొండ కలెక్టర్ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. కేంద్రంతో మాట్లాడతానని సీఎం చెప్పినట్టు సమాచారం. అయితే కేంద్రం అనుమతిచ్చినా... క్షిప ణి ప్రయోగాల ప్రతిపాదన విరమించకుండా అక్కడ పరిశ్రమల స్థాపన అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది: బీజేపీ విలువైన చారిత్రక సంపద, పర్యావరణ సమతౌల్యం దెబ్బతినేలా రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ నిర్మాణం చేపట్టడం సరికాదని బీజేపీ విమర్శించింది. ఇతర పార్టీలు, స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోకుండా అక్కడ ఫిలిం సిటీ నిర్మిస్తామని సీఎం పేర్కొనడం ఏకపక్షమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యడు పేరాల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. రాచకొండ గుట్టల ప్రాంతంలో వెలకట్టలేని చారిత్రక సంపద, పురాతన దేవాలయాలు, గిరిజన ప్రాంతాలున్నాయని.. వాటిని ధ్వంసం చేస్తూ ఫిలిం సిటీని నిర్మించడం సరికాదని చెప్పారు. -
హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్ సిటీ: కేసీఆర్
-
హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్ సిటీ: కేసీఆర్
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీలను నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మంత్రులతో కలిసి రాచకొండ ప్రాంతంలో హెలికాప్టర్‌తో ఏరియల్ సర్వే చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీల నిర్మాణానికి రంగారెడ్డి -నల్లగొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతం అనువైనదని ఆయన చెప్పారు. రాచకొండలో దాదాపు 31 వేల ఎకరాల భూమి ఉందని, అందువల్ల ఆ ప్రాంతం పరిశ్రమలు, విద్యాలయాలు, ఇతర సంస్థలు స్థాపించేందుకు చాలా అనుకూలమని కేసీఆర్ అన్నారు. -
భాగ్యనగరం.. విశ్వనగరం!
సాక్షి, హైదరాబాద్: నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరం విశ్వనగరంగా మారనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వైఫై సిటీ, ఫార్మా సిటీ, సినిమా సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో నగరంలోని నిర్మాణ రంగంలో ఒక్కసారిగా ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న స్థిరాస్తి రంగానికి మళ్లీ మంచి రోజులొస్తాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. రానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ‘ప్రపంచస్థాయి ఉత్తమ స్థిరాస్తి బిల్లు’ను తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. దేశ, విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి త్వరలోనే ఏకగవాక్ష విధానాన్ని కూడా తీసుకురానున్నారు. ఈ సింగిల్ విండో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ప్రభుత్వ వెబ్సైట్లో ఫార్మా, రియల్టీ, కెమికల్స్.. ఇలా ప్రతి రంగానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలంటాయి. వీటిని పూర్తి చేసి సబ్మిట్ చేస్తే చాలు. అన్ని రకాలుగా తనిఖీ చేసిన తర్వాత పది రోజుల్లో నేరుగా సీఎస్ కార్యాలయం నుంచి సంబంధిత పారిశ్రామికవేత్తలకు ఫోన్ వస్తుంది. ఆపై నేరుగా చర్చించిన తర్వాత.. 15 రోజుల్లో ఓ ఎన్వలెప్లో ప్రాజెక్ట్ అనుమతులు మంజూరవుతాయన్నమాట. వచ్చే యాభై ఏళ్ల నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్లు, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు.. ఇలా అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికలతో కూడిన సరికొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించనున్నారు. అలాగే స్థిరాస్తి అభివృద్ధికి అడ్డంకిగా మారుతోన్న నాలా పన్ను, మైనింగ్ సెస్, ఏవియేషన్ అనుమతులనూ ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సరికొత్త పారిశ్రామిక విధానంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోవైపు ఒక్కో సిటీ.. నగరం చుట్టూ ఒక్కో వైపు ఒక్కో సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే శామీర్‌పేటలో ఫార్మా సిటీని నిర్మిస్తోంది. విదేశీ సంస్థల రాకపోకల నిమిత్తం ఇక్కడే విమానాశ్రయాన్ని కూడా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులతో కలసి ఐటీఐఆర్ విధివిధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు సార్లు సమీక్ష జరిపారు. ఇన్క్యుబేషన్ సెంటర్ ఏర్పాటు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీలతో ఐటీ కంపెనీల కన్సార్టియం ప్రతిపాదన వంటి చర్యల వల్ల హైదరాబాద్ అభివృద్ధిపై సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. విమానాల అడ్డా.. ప్రస్తుత సమయంలో టాటా, రుయాగ్ కంపెనీలు కలసి ఆదిభట్లలో విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి సానుకూల పరిణామంగా బిల్డర్లు అభివర్ణిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇదే బాటలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పయనించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పటిష్టమైన పోలీసింగ్.. పోలీసింగ్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న ప్రకటన దేశ, విదేశీ సంస్థలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఉద్యమ సమయంలో శాంతిభద్రతల సమస్య కారణంగా నగరాన్ని విడిచిన సంస్థలు మళ్లీ నగరానికి రావొచ్చు. స్పోర్ట్స్ సిటీ.. భాగ్యనగరాన్ని అమ్యూజ్మెంట్, స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు దేశ, విదేశీ సంస్థల నుంచి ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే భాగ్యనగరంలో ఆధునిక పరిజ్ఞానం గల ఆసుపత్రుల సంఖ్య ఎక్కువే. అందుకే రకరకాల చికిత్సల కోసం వివిధ దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడికొస్తారు. వీరి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది కార్యరూపం దాల్చితే మెడికల్ టూరిజంగా నగరం అభివృద్ధి చెందుతుంది.