
రేపు రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రంగారెడ్డి జిల్లా రాచకొండ గుట్టల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఫిలింసిటీ నిర్మాణం కోసం సోమవారం కేసీఆర్ రాచకొండ గుట్టలను పరిశీలించనున్నారు. కేసీఆర్ వెంట రంగారెడ్డి, నల్లగొండ జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. కేసీఆర్ ఇటీవల ఇదే ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఫార్మా కంపెనీ ప్రతినిధులను వెంటతీసుకుని ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.