నేడు కంతనపల్లి, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులపై విహంగ వీక్షణం
సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రాజెక్టుల సత్వర పూర్తికి తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం కోసం సీఎం కేసీఆర్ ఆదివారం స్వయంగా గోదావరి ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేయనున్నారు. కంతనపల్లి, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించనున్నా రు. కంతనపల్లి ప్రాజెక్టుకింద ముంపు ప్రాం తాల సమస్య తీవ్రంగా ఉండగా, దేవాదుల లో రెండో దశ పూర్తయినా మొదటి దశ ప నులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీకి బదులుగా కాళేళ్వరం వద్ద గోదావరి నీటిని వాడుకునే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు సీఎం అధికారులు, నిపుణులతో చర్చించనున్నారు.
ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
Published Sun, Mar 29 2015 2:54 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement