godavari projects
-
అంచనా వేయండి.. అందరూ పంచుకోండి..!
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో చాలా రాష్ట్రాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో..ఈ ఏడాది అలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నదీ బేసిన్ల పరిధిలో గుర్తించిన వరద ప్రభావిత ప్రాంతాల పరీవాహక రాష్ట్రాలను ముందుగానే మేల్కొలిపే చర్యలకు దిగింది. గతేడాది మాదిరే ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అందుకు తగ్గట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలంది. వాతావరణ పరిస్థితి, వర్షపాతం, ప్రాజెక్టుల్లో చేరుతున్న ప్రవాహాలు, నదుల్లో నమోదవుతున్న వరద, రిజర్వాయర్లలో నిల్వల సమాచారాన్ని పరీవాహక రాష్ట్రాలతో పంచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిద్వారానే విపత్తు నిర్వహణ సాధ్యమవుతుందని వెల్లడించింది. గత భయానక అనుభవాల దృష్ట్యానే.. దేశ వ్యాప్తంగా గతేడాది భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, అస్సోం, కేరళ, ఉత్తరాఖండ్, పంజాబ్, బిహార్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నదులు, రిజర్వాయర్లు అధిక వర్షాలతో ఉప్పొంగాయి. అధికంగా నమోదైన ఈ వర్షపాతాన్ని అంచనా వేయడంలో విఫలం కావడంతో చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కింద తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సం భవించింది. దీంతోపాటే ఎగువ రాష్ట్రాలు ఎప్పటికప్పుడు వరద సమాచారాన్ని దిగువ రాష్ట్రాలకు ఇవ్వడంలో చూపిన నిర్లక్ష్యం, పూర్తిగా ప్రాజెక్టుల గేట్లు ఎత్తేవరకు దిగువ ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం చేయకపోవడం, ప్రధాన నదుల్లో కలిసే ఉపనదుల ప్రవాహా సామర్థ్య లెక్కలు గణించే యంత్రాంగం లేకపోవడంతో ముంపు ప్రభావం దిగువ రాష్ట్రాలపై అధికంగా పడింది. దక్షిణాదిలో కృష్ణా బేసిన్లోనే ఆల్మట్టి రిజర్వాయర్‌కు ఒకే రోజులో 10 లక్షలకు మించి వరద రావడం, ఎగువ మహారాష్ట్ర నుంచి వచ్చే వరదలపై సరైన అంచనా లేకపోవడంతో దిగువ ప్రాం తాలు ముంపునకు గురయ్యాయి. తుంగభద్ర నదిలోనే అకస్మాత్తుగా వచ్చిన వరదతో మహ బూబ్‌నగర్ జిల్లాలో, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. కృష్ణాబేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టుకు గతం కంటే భిన్నంగా ఆగస్టు నెలలో కేవలం 25 రోజుల్లో ఏకంగా 865 టీఎంసీల మేర వరద వచ్చింది. దీన్ని నియంత్రించేందుకు ఎగువ రాష్ట్రాలతో సమన్వయం అత్యంత కీలకమైంది. సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా... ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ గుర్తించిన నదీ బేసిన్లు, ప్రాజెక్టులతోపాటు ఏవైనా ముప్పు ప్రాంతాలు ఉన్నట్లయితే వాటి వివరాలను తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా వారం కిందట కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ బేసిన్‌లోని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో ఇక్కడి హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ అధికారులు సమీక్షించారు. వరదలపై పొరుగున ఉన్న, లేక ఆ బేసిన్ పరీవాహకం ఉన్న రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలు సమాచార మార్పిడి చేసుకోవాలని, ప్రాజెక్టుల నీటి నిల్వ, ప్రవాహాల పరిస్థితులను ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలకు తెలియజేయాలని ఆదేశించారు. వాతావరణ, విపత్తు నిర్వహణ, నీటి పారుదల శాఖల మధ్య సమన్వయం ఉండేలా లైసెన్సింగ్ అధికారులను నియమించాలని, వారి ఫోన్ నంబర్లను అన్ని రాష్ట్రాల అధికారులకు అందు బాటులో ఉంచాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి, కడెం, మూసీ, మున్నేరు, ప్రాణహిత, ఇంద్రావతి తదితర బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల వరదపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, నిజాంసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, తుపాకులగూడెం, మూసీ ప్రాజెక్టులపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఆటోమేటిక్ రెయిన్ గేజ్ స్టేషన్లు, ఆటోమేటిక్ వాటర్ లెవల్ రికార్డులు, డిజిటల్ వాటర్ లెవల్ రికార్డుల ఏర్పాటు పక్కాగా ఉండాలని తెలిపారు. కాళేశ్వరం పరిధిలో 15 గేజ్ మీటర్లు.. ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఏడాదికి కనీసం 530 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. ఇందులో ప్రధానంగా వరద అంచనా, మోటార్ల ఆపరేషన్‌కు వీలుగా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సెన్సార్ల ద్వారానే గోదావరి ప్రవాహ సామర్థ్యాన్ని అంచనావేసేలా 15 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. సీడబ్ల్యూసీ వద్ద జరిగిన సమీక్షలో మేడిగడ్డ బ్యారేజీతో పాటు కంతనపల్లి వద్ద నమోదయ్యే ప్రవాహ లెక్కలను ఎప్పటికప్పుడు తెలిపేందుకు తెలంగాణ అధికారులు అంగీకరించారు. -
ప్రాజెక్టుల్లోకి ‘గోదావరి’
వర్షాలతో కడెం, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌లోకి ప్రవాహాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి ప్రాజెక్టుల్లోకి ఈ ఏడాదిలో తొలిసారి గరిష్ట ప్రవాహాలు నమోదవు తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కడెం, నిజాంసాగర్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. గోదావరి బేసిన్లో ఎగువ మహారాష్ట్రలో ఉన్న గైక్వాడ్ ప్రాజెక్టులకు గరిష్టంగా 9,238 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో ఇక్కడ 102 టీఎంసీల సామర్థ్యానికి గానూ 64.6 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇక దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 5,116 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ 90 టీఎంసీలకు గానూ ప్రస్తుత లభ్యత 9.66 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎగువ మహారాష్ట్రలో అధిక వర్షాలు కురిస్తేనే శ్రీరాంసాగర్‌కు మరింత ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇక కడెం ప్రాజెక్టుకు సైతం 5,214 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. అక్కడ 7.6 టీఎంసీలకుగానూ 4.7 టీఎంసీల లభ్యత ఉంది. నిజాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి 2,600 క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఇదే బేసిన్‌లోని లోయర్‌మానేరు డ్యామ్‌కు చుక్క కూడా చేరలేదు. సింగూరులోకి 290 క్యూసెక్కుల మేర నీరొస్తోంది. కృష్ణాలో అంతంతే... ఇక కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో ఎక్కడా ప్రవాహాలు పెద్దగా కనిపించడం లేదు. ఎగువ ఆల్మట్టి నుంచి 29వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదలడంతో నారాయణపూర్‌కు 27,600 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నారాయణపూర్ నుంచి దిగువకు చుక్క విడువకపోవడంతో పెద్దగా ప్రవాహాలు లేవు. అయితే జూరాల పరీవాహకం పరిధిలో కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాజెక్టులోకి 2,052 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైంలంకి కూడా 2,238 క్యూసెక్కులు వస్తోంది. సాగర్‌లోకి 705 క్యూసెక్కులు మాత్రమే ప్రవాహం ఉంది. ఇవేవీ ప్రాజెక్టుల పరిధిలోని తాగు, సాగనీటి అవసరాలను తీర్చేలా లేవు. -
ఉగ్ర గోదారి
కుండపోత వర్షాలతో భారీ వరద - శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 4.69 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు - 42 గేట్లు ఎత్తి నీటి విడుదల.. పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తం - సింగూరు, నిజాంసాగర్, ఎల్ఎండీల్లోకీ భారీగా నీటి చేరిక - శ్రీశైలానికి లక్షా 26 వేల క్యూసెక్కుల వరద - నిండుకుండల్లా 25 వేలకు పైగా చెరువులు.. 147 చోట్ల గండి - వరదల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు - జల సౌధలో కంట్రోల్ రూమ్.. ప్రాజెక్టుకో పర్యవేక్షణాధికారి సాక్షి, హైదరాబాద్, బాల్కొండ: భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పరవళ్లు తొక్కుతోంది. భారీగా వస్తున్న వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోగా దిగువకు ఉరకలెత్తుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉప నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జల కళను సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శని వారం రాత్రికి ఏకంగా 4.69 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో 42 గేట్లు ఎత్తి 3.29 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మరోవైపు భారీగా వరదలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరదలు, ప్రాజెక్టుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేం దుకు పర్యవేక్షణాధికారులను నియమించింది. సమన్వయం, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శని వారం ఉదయం సిద్దిపేట కోమటి చెరువు అలుగు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన హరీశ్.. మధ్యాహ్నం లోయర్ మానేరు డ్యామ్ వద్దకు చేరుకున్నారు. వరదల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ఎగువన భారీ వర్షాలతో.. మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం లక్షా 32 వేల క్యూసెక్కుల వరద రాగా.. రాత్రికి అది ఏకంగా 6 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు)కాగా.. శనివారం రాత్రి 11 గంటలకు 1089.7 అడుగుల (84.01 టీఎంసీల)కు చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వరద ఇంకా భారీగా కొనసాగుతుండడంతో 42 గేట్లను ఎత్తి.. 3.29 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఆదివారం ఉదయంకల్లా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుందని అధికారుల అంచనా. ఇక భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతా లకు తరలిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నిండుకుండల్లా గోదావరి ప్రాజెక్టులు గోదావరిపై ఉన్న మరో ప్రధాన ప్రాజెక్టు ఎల్లంపల్లి ఇప్పటికే నిండుకుండలా మారింది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 72,832 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక శ్రీరాంసాగర్ నుంచి విడుదలవుతున్న నీరు ఆదివారం ఉదయానికి ఎల్లంపల్లికి చేరనుంది. దీంతో 57,388 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మానేరు, మోయతుమ్మెద వాగు, మూలవాగులు ఉప్పొంగుతున్నాయి. లోయర్ మానేరు డ్యాంలోకి 60 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రానికి డ్యాంలో 9.26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు మంజీరా నది పొంగి ప్రవహిస్తుండడంతో సింగూరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నిజాంసాగర్‌లో ప్రస్తుతం 1.42 టీఎంసీల నిల్వ ఉంది. 17.80 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ఆదివారం సాయంత్రానికి పూర్తిగా నిండిపోయే అవకాశముంది. మొత్తంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులన్నీ నిండటంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇంద్రావతి, శబరి, సీలేరుల నుంచి పెద్ద ఎత్తున వరద గోదావరిని చేరుతోంది. శనివారం సాయంత్రానికి 3,06,473 క్యూసెక్కుల వరద ధవళేశ్వరం బ్యారేజీకి చేరింది. మహారాష్ట్రలో భారీ వర్షాలతో.. మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరి ఉరకలెత్తుతోంది. దీంతో విష్ణుపురి బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు శనివారం రాత్రి ఎస్సారెస్పీ అధికారులకు మహారాష్ట్ర అధికారులు సమాచారం అందించారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆదివారం సాయంత్రానికి గోదావరి వరద భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా ఆదేశించారు. ముంపునకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. నిండిన చెరువులు రాష్ట్రంలోని 45 వేల చెరువులకు గాను 25 వేలకు పైగా చెరువులు పూర్తి స్థాయిలో నిండినట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 7 వేల చెరువులు 75శాతం నిండాయని, మరో 5 వేల చెరువులు 50 శాతం, 6 వేల చెరువులు 25 శాతం నిండాయని పేర్కొన్నారు. ఇక 147 చోట్ల గండ్లు పడ్డాయని, వాతావరణం అనుకూలించిన చోట మరమ్మతులు ప్రారంభించామని తెలిపారు. జూరాలకు భారీగా వరద ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోవడంతో భారీగా వస్తున్న వరదను అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. దీంతో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జూరాల ప్రాజెక్టుకు 1.2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 170.66 టీఎంసీలకు చేరుకుంది. మరో 45.12 టీఎంసీలు వస్తే శ్రీశైలం పూర్తిగా నిండనుంది. ఇక శ్రీశైలం దిగువన, నాగార్జున సాగర్‌కు ఎగువన వర్షాలు కురవకపోవడంతో సాగర్ డ్యామ్‌లోకి ప్రవాహాలేమీ రావడం లేదు. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న 7,063 క్యూసెక్కులు మాత్రమే సాగర్‌లో చేరుతోంది. ప్రస్తుతం ఈ డ్యామ్‌లో 139.44 టీఎంసీల నిల్వ ఉంది. సాగర్ నిండాలంటే మరో 172.61 టీఎంసీలు అవసరం. హైదరాబాద్, నల్లగొండ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసీ, మున్నేరు, పాలేరు వంటి ఉప నదులు, వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. దాంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. జలసౌధలో కంట్రోల్ రూమ్ (040-23390794) రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నీటి పారుదల శాఖ ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టింది. వరదల పరిస్థితి, రిజర్వాయర్లలో నీటిమట్టాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు ఆ శాఖ ప్రధాన కార్యాలయం ‘జలసౌధ’లో కంట్రోల్ రూం (040-23390794) ఏర్పాటు చేసింది. శనివారం మధ్యాహ్నం నుంచి ప్రతి గంటకోమారు ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ విజయప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్‌రూం పనిచేస్తుంది. నీటిపారుదల శాఖకు చెందిన వివిధ వాట్సప్ గ్రూపుల ద్వారా అందే సమాచారాన్ని విశ్లేషిస్తూ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతుండటంతో నీటి విడుదలపై ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతున్నారు. నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, మిడ్ మానేరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల వద్ద పరిస్థితిపై సమాచారం అందించేందుకు ఆయా ప్రాజెక్టుల వారీగా పర్యవేక్షణ అధికారులను నియమించారు. రాష్ట్రస్థాయిలో తీసుకునే నిర్ణయాల అమలు బాధ్యతను వారికి అప్పగించారు. నిజాంసాగర్‌కు సీఈ మధుసూదన్, ఎల్ఎండీకి సీఈ శంకర్, ఎల్లంపల్లికి సీఈ అనిల్, ఎస్సారెస్పీకి ఎస్ఈ సతీశ్, సింగూరుకు ఎస్ఈ శ్రీకాంత్ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. జలసౌధ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరంగా వరద పరిస్థితిని పర్యవేక్షించే బాధ్యతను ఈఎన్సీ విజయప్రకాశ్, చీఫ్ ఇంజనీర్లు నాగేందర్, సురేశ్‌లకు అప్పగించారు. -
‘ఊత పదాలు కాదు...హుందాగా వ్యవహరించాలి’
హైదరాబాద్ : ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో టీఆర్ఎస్ సర్కారు ప్రతిపక్ష కాంగ్రెస్‌ను విమర్శించడాన్ని తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తప్పుపట్టారు. ప్రశ్నిస్తే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సరికాదని ఆయన అన్నారు. జానారెడ్డి గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని ఆయన అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలని తాను ఇరిగేషన్ మంత్రికి, కార్యదర్శికి లేఖ రాస్తే ఇప్పటి వరకూ సమాధానం లేదన్నారు. రెండేళ్లలో రెండు పంటలకు నీరిస్తామని చెప్పిన కేసీఆర్ అది చేసి చూపించగలరా అని ప్రశ్నించారు. అంచనాలు పెంచి ప్రాజెక్టులు కట్టిస్తున్న టీఆర్ఎస్ సర్కారు తీరును ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో బుద్ధి చెబుతారని జానారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రాజెక్టుల రీ డిజైన్ వల్ల రాష్ట్రంపై 50 నుంచి 60వేల కోట్ల భారం పడుతుందన్నారు. గతంలో తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టును తాము ప్రతిపాదించామన్నారు. తమ ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తామందని, ఆ ప్రతిపాదనపై కేసీఆర్ చర్చించకుండా 148 అడుగులకు ఒప్పందం కుదుర్చుకోవడం చారిత్రక తప్పిదం కాదా? అని జానారెడ్డి ప్రశ్నించారు. లోపాలను ఎత్తిచూపే బాధ్యత ప్రతిపక్షంగా తమకు హక్కు ఉందన్నారు. టెండర్లు పారదర్శకంగా జరగకపోవడంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తన పాదర్శకతను నిరూపించుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చెప్పిన అంశాలను నివృత్తి చేయకుండా కేసీఆర్ ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారన్నారు. వ్యక్తులను టార్గెట్ చేయడం సరికాదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అధికార దర్పంతో మాట్లాడటం సీఎం హోదాకు తగదన్నారు. సీఎం ఉన్న వ్యక్తి ఊతపదాలు కాదని, హుందాగా వ్యవహరించాలన్నారు. గతం అంటూ గందరగోళం చేయడం కాదని, ఇప్పుడేమి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నీళ్ళు ఇస్తే ప్రభుత్వానికి ప్రచారం చేస్తానని మాట నిలబెట్టుకుంటానని..మాటకు మాట మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనన్నారు. కేసీఆర్ చేస్తున్న అవక తవకలను సరిదిద్దడం దేవుడి తరం కూడా కాదన్నారు. గద్వాల పై ప్రజల అభిప్రాయం బలంగా వినిపిస్తున్నారని, పెద్ద జిల్లా అయిన పాలమురును 4 జిల్లాలు చేయలని జానారెడ్డి సూచించారు. -
చంద్రబాబును ఎందుకు క్షమించాలి?
హైదరాబాద్ : గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడరని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆమె శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టులు పూర్తయితే గోదావరి డెల్టాకు ఒక్క చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పందాలు చేసుకుంటుంటే చంద్రబాబు కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా.. కేంద్రంలో భాగస్వామి అయిన చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. రాష్ట్రానికి నీళ్లే తేలేని సీఎం అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఏం పట్టనట్లు చిదానందస్వామిలా, చంద్రబాబు స్వామిగారు టెక్నాలజీ, యాప్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కనబడని పాలన గురించి టెక్నాలజీని అడ్డుపెట్టుకుని ప్రజలను మెప్పించే యత్నం చేస్తున్నారన్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా గురించి కూడా కేంద్రం వద్ద రాజీపడ్డారన్నారు. ఎగువ రాష్ట్రాలు చుక్కనీరు రాకుండా దిగ్బంధనం చేసేలా జలాశయాలపై ప్రాజెక్టులు కట్టేస్తుంటే చంద్రబాబు నాయుడు నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయించుకుంటున్నారన్నారు. ఇటువంటి వ్యక్తి సీఎంగా ఉన్న చంద్రబాబును ప్రజలు ఎందుకు క్షమించాలని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అనాధలా మార్చేశారని ఆమె మండిపడ్డారు. ఏపీ ప్రజలకు ఎందుకింత ఖర్మ?, చంద్రబాబు మీ పౌరుషం ఏమైంది? ఇప్పటికైనా కళ్లు తెరవాలని, లేదంటే చరిత్ర హీనులవుతారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రాజెక్టులు నిర్మాణంపై అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఉందన్నారు. -
చంద్రబాబును ఎందుకు క్షమించాలి?
-
ఒప్పందంతో బాధ్యత పెరిగింది
అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం తో నీటిపారుదల విభాగం బాధ్యత మరింత పెరిగిందని ఆ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చె ప్పారు. ఒప్పంద స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఇక్కడి ఐడీసీ కార్యాలయంలో కాళేశ్వరంతో పాటు కరీంగనర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బాల్క సుమన్, బి.వినోద్, ఎంఎల్ఏలు పుట్ట మధు, విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, కార్యదర్శి వికస్రాజ్, సీఈలు ఎన్.వెంకటేశ్వర్లు, బి.హరిరామ్, అనిల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే హాజరయ్యారు. బ్యారేజీల దగ్గర క్యాంపులను ఏర్పాటు చేసి పనులు ఆరంభించాలని వర్కింగ్ ఏజెన్సీలను మంత్రి కోరారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు చేపట్టిన ప్యాకేజీ-6, 8 లకు చెందిన పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని 2017 జూలై చివరి నాటికి, ప్యాకేజీ 10, 11, 12 పంప్‌హౌస్‌లను 2017 సెప్టెంబర్ నాటికి, ప్యాకేజీ 20 పంప్‌హౌస్ నిర్మాణాన్ని డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. నెలాఖరుకు డ్రై రన్... ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా ఉన్న వేమునూరు, గంగాధర, మేడారం పంప్‌హౌస్‌ల డ్రై రన్‌ను ఈ నెలాఖరులో చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 5న వెట్ రన్ ఆరంభించేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు. ఎల్లంపల్లిలో మిగిలి పోయిన 920 ఎకరాల భూమిని యుద్ధప్రాతిపదికన సేకరించాలని, ఇది పూర్తయితే 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు కింద సేకరించిన 1600 ఎకరాలను గ్రామస్తులకు తిరిగే ఇచ్చే అంశాన్ని సైతం సమీక్షలో చర్చించిన మంత్రి... ఇందులో 117 ఎకరాలు లింక్ కెనాల్ కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, కొడిమ్యాల మండలాల్లో వీలైనంత త్వరగా భూసేకరణ చేయాలని సూచించారు. -
చారిత్రాత్మక తప్పిదం: శివకుమార్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మహా ఒప్పందంగా అభివర్ణించడం సిగ్గు చేటు అని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ధ్వజమెత్తారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ...మహా ఒప్పందం కాదని, మహా మోసం అని అభవర్ణించారు. తెలంగాణ ప్రజల పరువును, ఆత్మగౌరవాన్ని మహారాష్ట్రలో తాకట్టు పెట్టి, కమీషన్ల కోసమే కేసీఆర్ ఎత్తు తగ్గించారని శివకుమార్ విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం, మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తు 102 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గించడం చారిత్రాత్మక ఒప్పందం కాదని, చారిత్రాత్మక తప్పిదమని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని శివకుమార్ అన్నారు. -
'తెలంగాణలో నీటి కరువు తొలగిపోతుంది'
ముంబయి: రాష్ట్రాలు సామరస్య ధోరణిలో వ్యవహరిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మూడు ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం కుదరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒప్పందానికి సహకరించినవారికి పేరు పేరునా కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం వల్ల తెలంగాణలో నీటి కరవు తొలగిపోయే అవకాశం ఏర్పడుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా అంతకు ముందు గోదావరి నదిపై మూడు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ముంబైలోని... సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో గోదావరి అంతర్రాష్ట్ర బోర్డు సమావేశమైంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవిస్‌లతో పాటు మంత్రులు, అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. మేడిగడ్డ, తుమ్మిడిహెట్టి, చనఖా-కొరటా ఆనకట్టల ఎత్తుపై.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. ఇక ఒప్పందానికి సహకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ను కేసీఆర్ సన్మానించారు. శాలువా కప్పి, మెమెంటో ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ముందుకు వెళ్తే కేంద్రం జోక్యాన్ని నివారించవచ్చని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నదీ జలాల కేటాయింపులు, వినియోగంపై నిత్యం వివాదాలే ఉండేవని, తమ వాదనను నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఫడ్నవిస్ చెప్పారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ చొరవతో ఆ సమస్యలకు పరిష్కారం దొరికిందన్నారు. -
ప్రాజెక్టులపై 'మహా' ఒప్పందం
-
ప్రాజెక్టులపై 'మహా' ఒప్పందం
ముంబయి: తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య 'మహా' ఒప్పందం జరిగింది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ, చనాక-కొరాట బ్యారేజీలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మూడు ఒప్పందాలపై కేసీఆర్, ఫడ్నవీస్ సంతకాలు చేశారు. తాజా ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 950 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది. మంత్రులు హరీశ్ రావు, జోగు రామన్న, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డితో పాటు మహారాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. మొదటి ఒప్పందం: 16 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో గోదావరిపై 100 మీటర్ల ఎత్తుతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం. ఆయకట్టు : కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్,వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలు, 18 లక్షల ఎకరాల స్థిరీకరణ. రెండో ఒప్పందం: 1.85 టీఎంసీ నీటినిల్వ సామర్థ్యంతో ప్రాణమితపై తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం ఆయకట్టు: ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్-కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలు. మూడో ఒప్పందం: 0.85 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో పెన్‌గంగపై 213 మీటర్ల ఎత్తులో చనాఖ-కొరాట బ్యారేజీ నిర్మాణం. ఆయకట్టు: ఆదిలాబాద్ జిల్లా తాంసి, జైనథ్, బేలా మండలాల్లో 50 వేల ఎకరాలు. -
ముంబై బయల్దేరిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో తుది ఒప్పందం విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ముంబై బయల్దేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు తుది ఒప్పందం చేసుకోనుంది. తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరట' ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ నేపథ్యంలో ముంబైలో సీఎం కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేయనున్నారు. కాగా, మహా ఒప్పందాన్ని స్వాగతిస్తూ జూలపల్లి నుంచి మేడిగడ్డ వరకు టీఆర్ఎస్ యూత్ నేత రఘువీర్‌సింగ్ ఆధ్వర్యంలో 1500 బైక్‌లతో ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఈ మహా ఒప్పందాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లాలో నల్ల జెండాలతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. -
గోదావరి ప్రాజెక్టులు కళకళ.
-
వచ్చింది రెండు టీఎంసీలే!
- వర్షాకాలం మొదలై 25 రోజులైనా ప్రాజెక్టుల్లోకి నీరు అంతంతే - కృష్ణా, గోదావరి బేసిన్‌లోని రాష్ట్ర ప్రాజెక్టుల్లో వర్షాభావ పరిస్థితులు - గోదావరి ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణం - గతేడాదితో పోలిస్తే 90 టీఎంసీల మేర తక్కువ నీరు సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం మొదలై 25 రోజులైనా కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. రాష్ట్ర పరీవాహకంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతం 2 టీఎంసీల నీరు మాత్రమే రావడం ఖరీఫ్ సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. దిగువకు నీటిని ధారపోసే ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టులే నీటి కొరతను ఎదుర్కోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. కర్ణాటకలో కేవలం 6.5 టీఎంసీల మేర నీరు మాత్రమే వచ్చింది. ఎగువ ప్రాజెక్టులు నిండకుంటే రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఒట్టికుండలుగా మారే ప్రమాదముంది. అదే జరిగితే ఈ ఏడాది ప్రాజెక్టుల కింద 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సకాలంలో నీరివ్వడం గగనంగా మారనుంది. ఎగువన రాకుంటే దిగువకు కష్టమే.. కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గ ణనీయంగా నీటి మట్టాలు పడిపోయాయి. రాష్ట్ర ప్రాజెక్టుల్లో 4-5 టీఎంసీలకు మించి వినియోగార్హమైన నీరు లేదు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగానూ ప్రస్తుతం 504.6 అడుగులకు తగ్గగా నీటి నిల్వ 122.69 టీఎంసీలకు చేరింది. ఇందులో ఒకట్రెండు టీఎంసీలకు మించి వాడుకోవడానికి లేదు. శ్రీశైలంలో వాస్తవ నీటిమట్టం 885 అడుగులకుగానూ ప్రస్తుతం 779 అడుగులకు పడిపోయింది. అక్కడ వాస్తవ నీటి నిల్వ 215.8 టీఎంసీలకుగానూ 20.19 టీఎంసీలకు పడిపోయింది. గతేడాది ఈ సమయానికి 2 ప్రాజెక్టుల్లో కలిపి 25 టీఎంసీల మేర నీరు తక్కువగా ఉంది. జూరాల వాస్తవ సామర్థ్యం 11.9 టీఎంసీలుకాగా గతేడాది 6.17 టీఎంసీలు ఉండగా ఈ ఏడాది కేవలం 2.8 టీఎంసీల నీరు ఉంది. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభమై నెల కావస్తున్నా ఇంతవరకు ఈ ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీరు కేవలం 2 టీఎంసీలు మాత్రమే. తుంగభద్ర పరీవాహకంలో కురిసిన వర్షాల కారణంగా వచ్చిన ప్రవాహాలతో జూరాలలో 0.62 టీఎంసీల నీరు రాగా, శ్రీశైలంలో 1.47 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చింది. జూరాలకు 1,464 క్యూసెక్కులు, శ్రీశైలంలో 1,374 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇది మినహా ఎక్కడా చుక్క నీరు ప్రాజెక్టుల్లో చేరలేదు. దీనికితోడు ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ప్రస్తుతం ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో మొత్తంగా 205 టీఎంసీల నీటి కొరత ఉంది. గత 25 రోజుల్లో ఎగువ ప్రాజెక్టుల్లో మొత్తంగా కేవలం 6.5 టీఎంసీల కొత్త నీరు వచ్చింది. ఇందులో అత్యధికంగా నారాయణపూర్‌లో 4 టీఎంసీల మేర నీరు చేరింది. గతేడాది ఎగువన ప్రాజెక్టుల్లో ఇదే సమయానికి 42 టీఎంసీల మేర కొత్త నీరురాగా ఈ ఏడాది అక్కడా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోదావరిలో చుక్క నీరు లేదు.. గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, కడెం, లోయర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 198 టీఎంసీల మేర ఉండగా ప్రస్తుతం లభ్యతగా ఉన్నది కేవలం 12.23 టీఎంసీలు మాత్రమే. గతేడాది నిల్వలతో పోలిస్తే సుమారు 14 టీఎంసీల మేర తక్కువగా లభ్యత నీరుంది. మహారాష్ట్రలోని జైక్వాడ్ మొదలు రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టులోకి ఇప్పటిరవకు కొత్తగా చుక్క నీరు చేరలేదు. -
‘మహా’ ఒప్పందాలను బయటపెట్టాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీపీఎం సాక్షి, హైదరాబాద్: గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. చారిత్రక ఒప్పందం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుండగా, అలాంటివేమీ జరగలేదని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోందని సీపీఎం పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులను చేపట్టాలని సూచించింది. కాగా, తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై విద్యుత్ సంస్థలు విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులెవరూ ఈఆర్సీ విచారణలో పాల్గొనకూడదని ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నిర్ణయించడం అన్యాయమన్నారు. -
ప్రాజెక్టుల ఎత్తు తగ్గిస్తే తీరని అన్యాయం: గుత్తా
నల్లగొండ: గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిం చేందుకు మహారాష్ర్ట ప్రభుత్వంతో చేసుకుం టున్న ఒప్పందం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలను సంప్రదిస్తే బాగుండేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తుమ్మడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించారన్నారు. దీంతో మహారాష్ట్ర పరిధిలో కేవలం1,800 ఎకరాలు సాగుకు యోగ్యం కాని భూమి మాత్రమే ముం పునకు గురవుతుందన్నారు. ప్రస్తుతం మహారా ష్ట్ర విజ్ఞప్తుల మేరకు ప్రాజెక్టుల ఎత్తు తగ్గించేం దుకు తెలంగాణ అంగీకరించినట్లు తెలుస్తోందన్నారు. దీని వల్ల ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోకి ప్రతిపాదించిన మేరకు గోదావరి నీళ్లు వచ్చే అవకాశం ఉండదన్నారు. -
మన కల సాకారమవుతోంది
♦ మహారాష్ట్రతో ‘గోదావరి’ ఒప్పందంపై సీఎం కేసీఆర్ ♦ బీడు వారిన భూములకు నీళ్లొస్తాయి ♦ తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డానో..ఈరోజు కూడా అంతే సంతోషపడుతున్నా ♦ బేగంపేట విమానాశ్రయంలో సీఎంకు ఘనస్వాగతం సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ సాధించుకున్న నాడు ఎంత సంతోష పడ్డానో.. ఇవ్వాళ కూడా అంతే సంతోష పడుతున్నా. మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండలోని ఆలేరు, భువనగిరి ప్రాంతాలు అద్భుత ఫలితాలు సాధిస్తాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైతులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. కొద్దిపాటి ఇబ్బంది కలిగితే ఆత్మహత్యలు చేసుకోకండి. మన కల సాకారం అవుతోంది. రెండు పంటలకు నీళ్లు వస్తాయి. ఒట్టిపోయి, బీడు బారిన నేలలకూ నీళ్లందుతాయి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి బేగంపేట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు, ఘన స్వాగతం పలికారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద సీఎం మాట్లాడారు. ‘‘ఏడాది కిందట నేనే స్వయంగా మహారాష్ట్ర సీఎంను కలిసి చర్చించిన. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామన్న. మహారాష్ట్రలో వెనకబడిన విదర్భ కోసం మీరూ నీళ్లు తీసుకోమని చెప్పా. వారం రోజుల కిందట మహారాష్ట్ర సీఎం ఫోన్ చేశారు. ‘రావు గారూ.. మనం ప్రాజెక్టులు నిర్మించుకునే సమయం ఆసన్నమైంది. మా అనుమానాలు తీరాయి. అధికారులతో కలిసి రండి.. ఒప్పందం చేసుకుందాం’ అని ఆహ్వానించారు. ఈ ఒప్పందంతో మన కల సాకారం అవబోతోంది. మన భూములకు నీళొస్తాయి. నోరు మంచిదైతే, ఊరు మంచిదైతది అంటరు. ఓర్పు, సహనం, సమన్వయంతో పని చేసుకుంటూ పోతున్నం. ప్రాణహిత, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయితే.. తొమ్మిది జిల్లాలో కోటి ఎకరాలకు నీరు అందుతుంది’’ అని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే నల్లగొండ జిల్లాలో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ప్రజలకు నీరందుతుందన్నారు. రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. జంట నగరాలకు 24 గంటల నీటి సరఫరా చేసే లక్ష్యంతో శామీర్‌పేట్ వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని, కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణ మాగాణి భూముల్లో పారిస్తామన్నారు. బంగారు తెలంగాణ సాధించే వరకు నిద్రపోమని పేర్కొన్నారు. ఈ ఘనత హరీశ్‌దే.. మహారాష్ట్రతో ఒప్పందం కోసం యువ నాయకుడు హరీశ్‌రావు రాత్రింబవళ్లు కష్టపడ్డారని సీఎం చెప్పారు. ‘‘ఈ ఒప్పందం ఘనత మంత్రి హరీశ్‌రావుదే. ప్రాజెక్టుల విషయంలో హరీశ్ ఎంతో కష్టపడుతున్నారు. తెలంగాణ, మహారాష్ట్రతో ఒప్పందం కోసం తీవ్రంగా కృషి చేశారు. పలుమార్లు మహారాష్ట్రకు వెళ్లి సీఎంతో, అక్కడి సాగునీటి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు. హరీశ్ చొరవతోనే మహారాష్ట్ర సానుకూలంగా స్పందించింది. ప్రాజెక్టుల వల్ల ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని మహారాష్ట్ర సర్కారుకు వివరించాం. తెలంగాణ ఇవ్వాళ సస్యశామలం కానుంది. ఈ ఒప్పందంతో తెలంగాణ ప్రజల కల సాకారమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి శుభాకాంక్షలు చెబుతున్నా..’’ అని సీఎం అన్నారు. -
ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
నేడు కంతనపల్లి, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులపై విహంగ వీక్షణం సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రాజెక్టుల సత్వర పూర్తికి తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం కోసం సీఎం కేసీఆర్ ఆదివారం స్వయంగా గోదావరి ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేయనున్నారు. కంతనపల్లి, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించనున్నా రు. కంతనపల్లి ప్రాజెక్టుకింద ముంపు ప్రాం తాల సమస్య తీవ్రంగా ఉండగా, దేవాదుల లో రెండో దశ పూర్తయినా మొదటి దశ ప నులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీకి బదులుగా కాళేళ్వరం వద్ద గోదావరి నీటిని వాడుకునే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు సీఎం అధికారులు, నిపుణులతో చర్చించనున్నారు.