
‘మహా’ ఒప్పందాలను బయటపెట్టాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీపీఎం
సాక్షి, హైదరాబాద్: గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. చారిత్రక ఒప్పందం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుండగా, అలాంటివేమీ జరగలేదని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోందని సీపీఎం పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులను చేపట్టాలని సూచించింది.
కాగా, తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై విద్యుత్ సంస్థలు విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులెవరూ ఈఆర్‌సీ విచారణలో పాల్గొనకూడదని ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నిర్ణయించడం అన్యాయమన్నారు.