aerial survey
-
దాతలు, ప్రజలే ఆదుకోవాలి
సాక్షి, అమరావతి : వరద ముంపు తగ్గిన తర్వాత బాధితులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అతిపెద్ద సమస్యగా మారిందని, ఖజనా చూస్తే అటువంటి పరిస్థితులు కనిపించడంలేదని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలన్నా అప్పులుచేయడానికి ఎఫ్ఆర్బీఎం పరిధి అడ్డువస్తుండడంతో బ్యాంకులతో దీర్ఘకాలిక రుణాల ద్వారా ప్యాకేజీ ఇప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పూర్తిస్థాయిలో ఆదుకునే అవకాశంలేకపోవడంతో దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు సామాజికసేవలో భాగం పంచుకోవాలన్నారు. ప్రజలకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం కూడా ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రెండ్రోజుల్లో అందరితో మాట్లాడి ఎంతవరకు ఆర్థికసాయం చేయగలమన్న దానిపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై నివేదికను శనివారం కేంద్రానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు.రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ..ఆదివారం నుంచి నిత్యావసర వస్తువుల ప్యాకేజీని రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 80,000 మందికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 15,000 మందికి కూడా ఇవ్వలేకపోయామన్నారు. ఇంటి వద్దకే అందించే విధంగా వాహనాలను అత్యధిక సంఖ్యలో తీసుకురావడం ఇబ్బందిగా మారిందన్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులను అందించాక ఆహారం పంచే కార్యక్రమానికి పూర్తిగా స్వస్తి పలుకుతామన్నారు. ఇక బుడమేరు మూడో గండిని శుక్రవారం అర్థరాత్రి లేదా శనివారం ఉదయానికి పూడ్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం ఆర్మీ కూడా రంగంలోకి దిగిందన్నారు. తాజాగా.. గురువారం కురిసిన వర్షాలతో బుడమేరులో వరద ప్రవాహం 9,000 క్యూసెక్కులకు చేరడంతో నగరంలోకి మళ్లీ నీరు వచ్చిందన్నారు. అంతకుముందు.. హెలికాప్టర్లో వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించానన్నారు. ప్రకాశం బ్యారేజీ 15 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేందుకు కేంద్రంతో కలిసి ఒక ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. రాజధానిలో భాగమైన విజయవాడ కూడా వరదలను తట్టుకునేలా ఒక మాస్టర్‌ప్లాన్‌ను కూడా రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో గిగ్ ఎకానమీని విస్తరిస్తాం..ఇదిలా ఉంటే.. ఈ వరద సంక్షోభం గిగ్ ఎకానమీకి (నచ్చిన సమయంలో పనిచేసుకోవడం) ఒక చక్కటి అవకాశమని, ఈ అవకాశాన్ని తాను అందిపుచ్చుకుంటున్నానంటూ చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేయడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వరదలపై సహాయక వివరాలను తెలియచేయడానికి ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన తీరుపై అందరూ విస్మయం వ్యక్తంచేశారు. ఇప్పుడు కాలం మారిందని.. నచ్చిన సమయంలో నచ్చిన చోట పనిచేసుకోవడానికి గిగ్ వర్కర్లు ముందుకొస్తున్నారని, వీరిని పెద్దఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరికీ ఉబరైజేషన్ (ఆన్లైన్ ద్వారా సేవలు)తో తక్కువ ధరలో సేవలు అందించడం ద్వారా డిజిటల్ ఎంపవర్‌మెంట్‌ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వరదల్లో కార్పెంటర్, ప్లంబర్, టీవీ మెకానిక్, ఆటోమొబైల్ మెకానిక్స్, పెయింటర్స్.. ఇలా నైపుణ్యం కలిగిన వారి అవసరముందని.. ఇంతమందికి ఇక్కడ సేవలు అందించేవారు సరిపడా లేకపోవడంతో గిగ్ వర్కర్ల సేవలను ఆన్లైన్ సేవల సంస్థల ద్వారా అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంక్షోభాన్ని అవకాశం తీసుకుని గిగ్ ఎకానమీని రాష్ట్రంలో విస్తరిస్తామన్నారు. ఎందుకీ సుత్తి అంటూ బాబుపై సెటైర్లు..ఇదిలా ఉంటే.. ప్రాజెక్టుల్లో ఎంత నీరు ఉంది, ఎంత వరద వస్తోందని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా గతంలో తాను వాసర్ ల్యాబ్‌ను అభివృద్ధి చేశానని, కానీ గత ప్రభుత్వం వీరి సేవలను వినియోగించుకోకపోవడంతో తాను శిక్షణ ఇచ్చిన వారు వేరే రాష్ట్రాల్లో కన్సల్టెంట్లుగా ఉన్నారంటూ బాబు తన స్వోత్కర్షను చెప్పుకొచ్చారు. నిజానికి.. వాసర్ల్యాబ్ అనేది ప్రాజెక్టుల నీటి స్థితిగతులపై రియల్ టైమ్‌లో సేవలందించే విధంగా ఒక ఐటీఐ విద్యార్థి పెట్టుకున్న సంస్థ. ఇది మన రాష్ట్రంతోపాటు వేరే రాష్ట్రాల్లో కూడా సేవలందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం అయిపోవడంతో వారిప్పుడు వేరే రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. కానీ, అసలు వాసర్ల్యాబ్ను తానే సృష్టించినట్లు, వారికి తానే శిక్షణ ఇచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంతో విలేకరులు తెల్లమొహం వేశారు. వరదల సమయంలో అసలు విషయాలు వదిలి ఈ సుత్తి ఎందుకంటూ వారు సెటైర్లు వేసుకున్నారు. -
Narendra Modi: అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
వయనాడ్: భీకర వరదలతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల ధాటికి కొట్టుకుపోయిన గ్రామాలు, దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రహదారులు, శిథిలమైన ఇళ్లను పరిశీలించారు. సహాయక శిబిరంలో బాధితులతో స్వయంగా మాట్లాడారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల ఆవేదన విని చలించిపోయారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ తదితరులు ఉన్నారు. బురద దారుల్లో మోదీ నడక ప్రధాని మోదీ తొలుత ఢిల్లీ నుంచి కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వయనాడ్ జిల్లాలోని చూరమల, ముండక్కై, పుంచిరిమట్టామ్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత కాల్పెట్టాలో దిగారు. రోడ్డు మార్గంలో చూరమలకు చేరుకున్నారు. బురద, రాళ్లతో నిండిపోయిన దారుల్లో కాలినడకన కలియదిరిగారు. వరద బీభత్సాన్ని స్వయంగా అంచనా వేశారు. ప్రభుత్వ అధికారులతో, సహాయక సిబ్బందితో మాట్లాడారు. సహాయక చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి మెప్పడిలో సహాయక శిబిరానికి చేరుకొని, బాధితులతో సంభాíÙంచారు. వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. స ర్వం కోల్పోయామంటూ బోరుమని విలపించారు. ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. భుజాలపై చేతులు వేసి మాట్లాడారు. గూడు లేని తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధి తు లు కోరగా, తప్పకుండా ఇస్తామంటూ మోదీ చెప్పారు. పలువురు చిన్నారులతోనూ ఆయ న సంభాíÙంచారు. వరదల తర్వాత భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనపై కాసేపు నడిచారు. మోదీ పర్యటన సందర్భంగా చూరమలలో రహదారికి ఇరువైపులా వందలాది మంది జనం గుమికూడారు. ప్రధానమంత్రి నుంచి సహాయం అరి్థంచడానికి వచ్చామని వారు చెప్పారు. -
భోగాపురం పరుగుల్ని పరిశీలించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
మూలపేట పోర్టు పనులపై సీఎం జగన్ ఏరియల్ సర్వే (ఫొటోలు)
-
ఊరు కాదు వీధి
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఒక ఊరు అనుకుంటే పొరపాటే. అదొక వీధి. అక్కడ ఏకంగా 6 వేల మంది నివసిస్తున్నారు. ఆ వీధి మొదలు ఎక్కడుందో, చివర ఎక్కడుంటుందో అక్కడ నివసించే వారికే సరిగ్గా తెలీదు. ఇలాంటి వీధి పోలండ్‌లో ఉంది. ఈ వీధికి సంబంధించిన ఏరియల్ వ్యూ ఫొటో ఇటీవల వైరల్‌గా మారింది. దక్షిణ పోలండ్‌లో సులోస్జోవా అనే పట్టణంలో ఈ వీధి ఉంది. దీని పొడవు ఏకంగా తొమ్మిది కిలో మీటర్లు. ప్రపంచంలోనే అతి పెద్ద వీధి ఇదే. ఇరువైపులా పచ్చని పంట పొలాలతో, పొందికగా అమర్చిన ఇళ్లతో ఈ వీధి ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. -
లక్ష ఎకరాల్లో పంట నష్టం!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ అగ్రికల్చర్/ మర్పల్లి/ వికారాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు అన్నదాతలను నిండా ముంచాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలను దెబ్బతీశాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానలతో వరి, మామిడి, నిమ్మ, బత్తాయి, పుచ్చ, టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుము పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక చోట్ల వరి నేలవాలగా కొన్ని ప్రాంతాల్లో మక్కలు తడిసి ముద్దయ్యాయి. అలాగే మామాడి, బత్తాయి, నిమ్మ తోటల్లో పిందెలు, కాయలు రాలిపోయాయి. పచ్చిమిరప చేన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధిక పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో 1,060 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ పంటలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాబేజీ, ఉల్లి, మొక్కజొన్న, పుచ్చకాయ, క్యాప్సికం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని మంత్రి పేర్కొన్నారు. సాగు విధానంలో మార్పు అవసరం మన దేశంలో వ్యవసాయానికి ఓ విధానమంటూ లేదని, దీనిని సరిచేసే విషయమై కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని వివరించారు. మార్చి, ఏప్రిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని, ఈలోగా పంటలు చేతికి వచ్చేలా సాగువిధానంలో మార్పులు రావాలన్నారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోకుండా సీజన్లో మార్పులు చేసుకుంటున్నారని, ఈ ప్రాంత రైతులు కూడా ఆ దిశగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ సంచాలకులు హన్మంతారావు, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రైతులకు వ్యవసాయ వర్సిటీ సూచనలు... రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయలు పండించే రైతులు పొలాల్లో అధిక వర్షపు నీరు బయటకు పోవడానికి వీలుగా మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం.వెంకటరమణ సూచించారు. చీడపీడలు, తెగుళ్ల ఉధృతి అధికం కాకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా భూముల కొలత.. దేశంలోనే తొలిసారి
సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన ప్రభుత్వం దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను ఉపయోగించనుంది. ఇప్పటికే డ్రోన్లతో ఆధునిక తరహాలో రీ సర్వే చేయిస్తున్న ప్రభుత్వం.. దాన్ని ఇంకా ఆధునికంగా నిర్వహించేందుకు ఏరియల్ రీ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో 120 మీటర్ల ఎత్తు నుంచి చిత్రాలు (ఓఆర్ఐ) తీస్తున్నారు. అయితే ప్రయోగాత్మకంగా విమానం ద్వారా 1,500 మీటర్ల ఎత్తు నుంచి ఫొటోలు (ఓఆర్ఐ) తీయించారు. అవి మంచి నాణ్యతతో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎక్కువ పిక్సెల్స్‌తో, ఎక్కువ పరిధిని కవర్ చేసే కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఒక రోజులో 200 నుంచి 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని విమానాల ద్వారా రీ సర్వే నిర్వహించారు. ఈ చిత్రాలు ఎక్కువ వ్యాసార్థంలో ఉంటాయి. ఎక్కువ పరిధిలోని భూమి ఒకే చిత్రంలో అత్యంత నాణ్యతగా రావడం వల్ల రీ సర్వే సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయి ఏరియల్ సర్వే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 13,953 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏరియల్ సర్వే నిర్వహించడానికి సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ టెండర్లు పిలిచింది. ఎల్1గా నిలిచిన ముంబైకి చెందిన జెనిసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి ఏరియల్ సర్వే బాధ్యత అప్పగించారు. ఈ సంస్థే నంద్యాలలో ప్రయోగాత్మకంగా ఏరియల్ సర్వే చేపట్టింది. వాటిని హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో పరీక్షించి అనుకున్న దానికంటే ఎక్కువ కచ్చితత్వంతో ఉన్నట్లు నిర్ధారించారు. ఐదు సెంటీ మీటర్ల తేడాతో కొలతలు కచ్చితంగా ఉన్నట్లు తేలింది. దీంతో సెప్టెంబర్ నుంచి ఈ సంస్థ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయి ఏరియల్ సర్వే మొదలు పెట్టనుంది. తనకు అప్పగించిన 13,953 చదరపు కిలోమీటర్లను రెండు విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా కొలవనుంది. రోజుకు 200 – 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కొలవడానికి ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. అంటే 3 నెలల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తంలో ఏరియల్ సర్వే పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏరియల్ సర్వేకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం అవసరాన్ని బట్టి మిగిలిన జిల్లాల్లో ఏరియల్ సర్వే కొనసాగించనున్నారు. గొలుసు నుంచి విమానం వరకు.. ► భూముల సర్వేను పాత కాలంలో చైన్ (గొలుసు), టేపులతో నిర్వహించే వారు. 1900 నుంచి బ్రిటీష్ హయాంలో ఈ విధానంలోనే సర్వే జరిగింది. చాలా కాలం ఈ విధానంలోనే భూములను కొలిచేవారు. ► టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) విధానంలో జియో కో – ఆర్డినేట్స్ ద్వారా భూముల కొలత ప్రారంభమైంది. శాటిలైట్లు వచ్చాక డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా భూముల కొలత నిర్వహిస్తున్నారు. ► శాటిలైట్లను మరింతగా వినియోగించుకునే క్రమంలో జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్) రోవర్స్ అందుబాటులోకి రావడంతో వాటి ద్వారా భూముల సర్వే నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మరింత ఆధునికంగా సీఓఆర్ఎస్ (కంటిన్యుయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్) నెట్వర్క్ ద్వారా జీఎన్ఎస్ఎస్ రోవర్లతో సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో వాటితో సర్వే చేయడం ప్రారంభించారు. తొలిసారి విమానాలతో.. ► గతంలో మైనింగ్, జాతీయ రహదారుల కోసం కొన్ని రాష్ట్రాల్లో విమానాల ద్వారా ఏరియల్ సర్వే చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు అడుగులు ముందుకు వేసి దేశంలోనే తొలిసారిగా ఏకంగా విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా భూముల కొలిచే పద్ధతికి శ్రీకారం చుట్టింది. తద్వారా భూములను కొలిచే విధానాల్లో కొత్త చరిత్రకు నాంది పలికింది. ► ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం కింద చేస్తున్న రీ సర్వేలో ఈటీఎస్ నుంచి విమానాల వరకు అన్నింటినీ వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆధునిక విధానాలతో ముందుకు వెళుతోంది. ఏరియల్ సర్వేతో మంచి ఫలితం ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఏరియల్ సర్వేలో మంచి ఫలితం వచ్చింది. కొలతలు కచ్చితంగా ఉన్నట్లు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. వర్షాలు తగ్గాక, పూర్తి స్థాయిలో ఏరియల్ సర్వే నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే విజయవంతంగా సాగుతోంది. డ్రోన్ల ద్వారా ఇప్పటికే వేగంగా సర్వే నిర్వహిస్తున్నాం. విమానాలతో సర్వే చేయడం ద్వారా ఇంకా వేగంగా సర్వే చేసే అవకాశం ఉంటుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు రీ సర్వే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ -
ముంపు ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్ సర్వే
సాక్షి, రాజమహేంద్రవరం/పాడేరు: భారీ వర్షాలు, గోదావరి వరద కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా తూర్పు గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిందన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించామన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేశారని, వరదలకు సంబంధించి సమగ్రమైన నివేదికను అధికారుల ద్వారా రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని చెప్పారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాల్లో ముంపు పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. మరో 48 గంటలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లంక గ్రామాల్లో చిక్కుకున్న 65 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృంధాలు రక్షించాయని చెప్పారు. ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. బాధిత ప్రజలందరికీ సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరద పూర్తిగా తగ్గే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని, బియ్యం, ఇతర నిత్యావసరాలన్నింటిని పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే విధంగా అప్రమత్తం చేసామని మంత్రులు తెలిపారు. ఏరియల్ సర్వేలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. -
సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే
-
సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గోదావరి వరదలపై మంత్రులు, అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు గుడివాడ అమర్నాథ్, వేణు గోపాలకృష్ణ ఏరియల్ సర్వే చేపట్టారు. చదవండి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మందులు, ఆహార సరఫరా తాగునీరు,పాలు అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, దేవీపట్నం మండలాల్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితులను మంత్రులు సమీక్షించారు. -
KCR Aerial Survey: సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే.. బాధితులను కలిసి..
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆది, సోమవారాలు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతాలను ఆయన హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. వరదలతో ప్రజలకు జరిగిన కష్టనష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి సాంత్వన కలిగించడానికి పునరావాస, ఇతర ఆర్థిక సాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సీఎంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం ఏరియల్ సర్వేలో పాల్గొననున్నారు. సీఎం ఆదేశాలతో ఏరియల్ సర్వేకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. భద్రాచలంలో సీఎం సమీక్ష.. సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో వరంగల్‌కు చేరుకొని అక్కడ వరద పరిస్థితులపై స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదివారం ఉదయం ఆయన వరంగల్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి భద్రాచలం వరకు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన పలుచోట్ల హెలికాప్టర్ నుంచి కిందికి దిగి వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ముఖ్యంగా భద్రాచలంలో పర్యటించి అక్కడ జరిగిన నష్టం, చేపడుతున్న సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయనున్నారు. అక్కడి నుంచి ఏటూరునాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టి అక్కడ కూడా వరద సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. సోమవారం ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం తదితర ముంపు ప్రాంతాల మీదుగా ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ముంపు గ్రామాల్లో వైద్య శిబిరాలు.. గోదావరి పరీవాహకంలోని వరద ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముంపు ప్రాంత ఆస్పత్రుల వైద్యులు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. నేటి పర్యటనకు సంబంధించిన కార్యాచరణపై సమీక్షలో చర్చించారు. ముంపు గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. వైద్యులంతా తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో వైద్య పరీక్షల సదుపాయంతోపాటు మందులను అందుబాటులో ఉంచాలన్నారు. కొత్తగూడెం కేంద్రంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మంచిర్యాల కేంద్రంగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి వైద్య శిబిరాలతోపాటు ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. వరదలపై శాశ్వత ప్రణాళిక: సీఎం సాక్షి ప్రతినిధి, వరంగల్: ఏటా గోదావరి భారీ వరదల నుంచి పరీవాహక ప్రాంత ప్రజలను శాశ్వతంగా రక్షించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు, వరదలు రావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇరిగేషన్ శాఖలో పనిచేసి రిటైరైన ఇంజనీర్ల సలహాలు తీసుకుంటామన్నారు. గోదావరి వరద పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంలో భాగంగా శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగంతో కలిసి రోడ్డు మార్గంలో హనుమకొండకు చేరుకున్నారు. మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి, ఇతర ఉపనదుల వరద ప్రవాహం, కాంటూర్ లెవల్స్, కరకట్టల నాణ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అత్యవసర సహాయం కోసం కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నిర్మల్, జిల్లాల కలెక్టర్లకు రూ. కోటి చొప్పున వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. మందులు, ఆహారం అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, జోగినిపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ వెళ్లేదాకా.. ఏరియల్ సర్వే గుర్తు రాలేదా? కేసీఆర్‌పై బండి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు ప డుతున్న బాధలను స్వయంగా తెలుసుకుని సాయం చేయాలనే ఉద్దేశంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయిస్తే.. ఉలిక్కిపడ్డ సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు బయల్దేరిన విషయం వా స్తవం కాదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. వందలాది గ్రామాలు నీట మునిగి లక్షలాది మంది ఇల్లు వాకిలి కోల్పోయి నిరాశ్రయులైతే, వారిని ఎలా ఆదుకోవాలనే ఆలోచన లే కుండా ఎంపీలతో సమావేశం పేరుతో కేంద్రంపై బురద చల్లే రాజకీయాలు చేయ డం కేసీఆర్ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన సంజయ్ శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ అభివృద్ధి చెందుతోందంటూ సీఎం మాట్లాడటం ఓ వింత అని ఎద్దే వా చేశారు. రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతుంటే ఉద్యోగులకు జీతాలెందుకు సక్రమంగా ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి రూ.390 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం.. కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో రూ.16,500 కోట్ల లోటు బడ్జెట్‌కు దిగజారిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే కస్తూర్బా విద్యాలయాల ఉద్యోగులకు 60% మాత్రమే జీతాలు చెల్లిస్తూ.. రాష్ట్రం వాటా నిధులను కేటాయించకుండా, వారికి పూర్తి జీతా లివ్వకుండా ఇబ్బంది పెడుతోంది నిజం కాదా? అని సంజయ్ ప్రశ్నించారు. -
రైలులో భద్రాచలానికి గవర్నర్ తమిళిసై.. అటు కేసీఆర్ ఏరియల్ సర్వే
తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని జిల్లాల్లో వరద ధాటికి భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమమం అయ్యాయి. ఇక, గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో ప్రవహిస్తుండటంతో భద్రాచలం నీట ముగినింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు(ఆదివారం) ఏరియల్ స్వరే చేపట్టనున్నారు. ఈ సందర్బంగా వరద ముంపు ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా.. రేపు(ఆదివారం) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాచలానికి వెళ్లనున్నారు. వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను పరశీలించనున్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలులో గవర్నర్ తమిళిసై.. భద్రాచలానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయానికి భద్రాచలం చేరుకోనున్నారు. ఇది కూడా చదవండి: ఎగువన శాంతం.. దిగువన మహోగ్రం -
CM YS Jagan: అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం: గోదావరి ముంపు గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రధానంగా లంక గ్రామాలతో పాటు వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని, గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లోతట్టు ప్రాంతాల వారందరినీ సహాయ శిబిరాలకు తరలించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఇది చాలా ప్రధాన అంశమని, వచ్చే 24 గంటలు చాలా కీలకమని (క్రిటికల్), హై అలర్ట్ (అత్యంత అప్రమత్తం)గా ఉండాలని సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లా, యానాం ప్రాంతాల్లో పరిస్థితులను హెలికాప్టర్ ద్వారా సుమారు గంటన్నర పాటు ప్రత్యక్షంగా పరిశీలించారు. ముంపునకు గురైన పొలాలు, ఇళ్లు, రహదారులను పరిశీలించి పరిస్థితిపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయం నుంచి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించినట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, సహాయ చర్యలపై ఆరా తీశారు. ముంపు గ్రామాలు, ఏర్పాటు చేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, వైద్యం.. మందులు సహా అత్యవసర సేవలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులకు సైతం తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అందుబాటులో సీఎంవో కార్యదర్శులు ►వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించాం. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోరినా.. సీఎస్ సహా వీరంతా యుద్ధ ప్రాతిపదికన వారికి ఆ సాయం అందించేలా చూడాలి. సీఎంవో కార్యదర్శులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. ►గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శనివారం కూడా గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ►గట్లు బలహీనంగా ఉన్న చోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన పక్షంలో గండ్లకు ఆస్కారం ఉన్న చోట తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా వీలైనన్ని ఇసుక బస్తాలు తదితర సామగ్రిని సిద్ధం చేయాలి. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రాజమండ్రిలో రెండు హెలికాప్టర్లు సిద్ధం ►రాజమండ్రిలో రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు వీటిని వినియోగించుకోవాలి. గ్రామాల్లో పారిశుధ్య సమస్య రాకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలి. పాము కాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలి. ►వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలి. బాధితులను ఆదుకోవడంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం లేకుండా చూసుకోవాలి. సెల్ టవర్లకు డీజిల్ సరఫరా చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలి. ►వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలి. 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలి. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు ఇవ్వాలి. ►సమీక్షలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేడ్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
ఏపీ వరదలు.. సీఎం జగన్ ఏరియల్ సర్వే (ఫొటోలు)
-
వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి నియామకం
Live Updates: 6:00 PM గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ సమగ్ర సమీక్ష. ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటుచేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించిన సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి నియామకం వచ్చే 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలని సీఎం జగన్ ఆదేశం 4: 24 PM ►గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే పూర్తి చేసుకుని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► వరద సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం వైఎస్ జగన్ ►గోదావరి వరద ఉదృతి, సహాయక చర్యలపై సమీక్ష ►ఆయా జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం ► గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్షించనున్నారు. ► విశాఖపట్నంలో వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బయలుదేరారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం.. ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం వరదలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్షించనున్నారు. ►గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీచేశారు. ఇక గురువారం ఉదయం నాటి గోదావరి వరద పరిస్థితి గురించి సీఎం ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ►రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ సహా బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్లు వారు వివరించారు. దాదాపు 23 నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముందన్నారు. ►ఆ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని.. అలాగే, వారికి తగిన సౌకర్యాలను కల్పించాలన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే
-
AP: వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(జులై 15, శుక్రవారం) మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం జగన్.. అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం చేపట్టిన ఇరిగేషన్ రివ్యూ సందర్భంగా.. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో గోదావరి వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారుల నుంచి సీఎం జగన్.. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయే 48 గంటల్లో వరదనీరు ఇంకా పోటెత్తే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు, సీఎం జగన్‌కు తెలిపారు. ఎగువన తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌సహా బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతోంది. దాదాపు 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్‌కు అధికారులు వెల్లడించారు. దీంతో పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ.. దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయాలని సీఎం జగన్ సూచించారు. వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించిన సీఎం జగన్.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
కొల్లేరు సరస్సు రీసర్వేకు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు రీసర్వేకు రంగం సిద్ధమైంది. దశాబ్దాలుగా కొల్లేరులో ఆక్రమణలకు గురై వెలుగులోకి రాని భూములు వేల ఎకరాలు ఉన్నాయి. చెరువుల సాగుకు అనుకూలమైన భూములైనప్పటికీ ఆక్రమణల పర్వంతో స్థానిక కొల్లేరు ప్రజలకు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఈ క్రమంలో కొల్లేరు రీసర్వే డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది. దీంతో కొల్లేరు ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల ఆకాంక్ష మేరకు కొల్లేరు రీసర్వే చేయిస్తామని గత నెలలో గణపవరంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో సర్వేపై అధికారులు వేగంగా దృష్టి సారించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. సర్వే ప్రక్రియ ఇలా కొల్లేరు అభయారణ్యంలో నిర్వహించనున్న సర్వే ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖాధికారులు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.4 కోట్ల వ్యయంతో సర్వే నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్వే ప్రక్రియను జలవనరుల శాఖ పర్యవేక్షించింది. రాడార్ ల్యాండ్ సర్వే ద్వారా కొల్లేరు భూముల విస్తీర్ణం లెక్క తేల్చనుంది. అభయారణ్యం ఉపరితలంపై రాడార్‌ను అమర్చి డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించనుంది. ఒక్కొక్క కాంటూరు పరిధిలో అభయారణ్యం భూములు ఎంత ఉన్నాయి.. జిరాయితీ భూములు ఎంత ఉన్నాయి.. అనధికారిక చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.. ఆక్రమణ భూములు ఎంత ఉన్నాయి ఇలా కాంటూరుల వారీగా అభయారణ్యం విస్తీర్ణం పక్కాగా లెక్క తేలనుంది. సర్వే ద్వారా ఐదో కాంటూరు లోపే సుమారు 70 వేల ఎకరాల భూమి వెలుగులోకి వస్తుందని, దీనిలో 55 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 10 వేల ఎకరాలు జిరాయితీ భూమి ఉంటుందని అధికారిక అంచనా. ఐదో కాంటూరు వరకు అభయారణ్యంలో 77,340 ఎకరాల భూమి ఉన్నట్టు అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి. రాడార్ సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక సిద్ధం చేసి అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం అనుమతితో వచ్చే నెలాఖరు నాటికి సర్వే ప్రక్రియ జిల్లాలో ప్రారంభం కానుంది. మరోవైపు స్వచ్ఛ కొల్లేరుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రూ.420 కోట్ల వ్యయంతో మూడు చోట్ల రెగ్యులేటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రెగ్యులేటర్ల నిర్మాణం ద్వారా సముద్రం నుంచి వచ్చే ఉప్పు నీటితో కొల్లేరు కలుషితం కాకుండా కట్టడి చేయనున్నారు. సర్వేతో వెలుగులోకి అభయారణ్య, జిరాయితీ భూములు.. మంచినీటి సరస్సుగా కొల్లేరు ప్రపంచ ఖ్యాతిగాంచింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 901 చదరపు కిలోమీటర్ల మేర 2,22,300 ఎకరాల్లో ఉన్న కొల్లేరు రెండు జిల్లాల్లో 12 మండలాల్లో విస్తరించి ఉంది. కొల్లేరుపై ఆధారపడి మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. 1959లో కొల్లేరులో చేపల సాగుకు ప్రభుత్వం మొదటగా అనుమతినిచ్చింది. అప్పటి నుంచి క్రమక్రమంగా చేపల సాగు పెరిగి వేల ఎకరాలకు చేరింది. కొల్లేరు సర్వే వల్ల అభయారణ్య భూములు, జిరాయితీ భూములు వెలుగులోకి రానున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొల్లేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2007లో కొల్లేరులో ప్రక్షాళనలో భాగంగా సుమారు 55 వేల ఎకరాల అనధికారిక చెరువులు కొట్టేసి సాగుదారులకు రూ.55 కోట్ల మేర పరిహారం అందించారు. 2005లోనే సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిత్రా కమిటీలు కొల్లేరులో పర్యటించి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. వాటి ఆధారంగానే కొల్లేరు ప్రక్షాళనకు దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కైకలూరు పరిసర ప్రాంతాల్లో అభయారణ్యంలో 7500 ఎకరాల భూమి వెలుగులోకి వచ్చింది. సమగ్ర సర్వే నిర్వహిస్తాం ప్రభుత్వ ఆదేశాలతో కొల్లేరు రీసర్వేకు ప్రతిపాదనలు, సర్వే నిర్వహించాల్సిన క్రమం, ఇతర అంశాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. రూ.4 కోట్ల వ్యయంతో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అభయారణ్యం భూముల లెక్క తేల్చి ప్రభుత్వానికి నివేదిస్తాం. – ఎస్వీకే కుమార్, ఏలూరు అటవీ శాఖ రేంజర్ -
మృతుల కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షలు ఇవ్వండి: సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, తిరుపతి: వరద ముంపు బాధితులకు తక్షణ ఆర్థిక సాయంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, వరదలకు గురైన వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని ప్రాంతాల్లో శనివారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం 10.32 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి.. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు. వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు. కలెక్టర్ విజయరామరాజు, ప్రత్యేక అధికారి శశిభూషణ్‌కుమార్‌లు వైఎస్సార్ జిల్లాలో పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇరు జిల్లాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్టులో చిత్తూరు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉదారంగా వ్యవహరించండి ► వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఉదారంగా ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల సాయం అందజేయాలి. ఊహించని వరదలతో పంటలు, పంట పొలాలు, ఇళ్లు నష్టపోయిన వారికి అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► చెయ్యేరు ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలి. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికే కాకుండా ఇళ్లల్లోకి నీరు చేరిన ప్రతి కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం తక్షణమే అందించాలి. ► అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఇందుకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేయాలి. కడప నగరంలో బుగ్గవంక పరిధిలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. కడప నగరాన్ని ముంపు నుంచి రక్షించేందుకు రూ.68 కోట్లతో స్వామ్ వాటర్ డ్రైయిన్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. విద్యుత్, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి. ► వివిధ మునిసిపాల్టీల నుంచి ఇప్పటికే రప్పించిన 500 మంది సిబ్బందితో కలిసి తిరుపతి పట్టణంలో వెంటనే పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి. వీధుల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలి. ► తిరుపతిలో డ్రైనేజి వ్యవస్థపై మాస్టర్ ప్లాన్ రూపొందించి తగిన చర్యలు తీసుకోవాలి. వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు రూపొందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. సహాయక శిబిరాలకు రాకున్నా.. ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలి. శిబిరాల నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సందర్భంలో అధికారులు, యంత్రాంగం వారికి తోడుగా నిలవాలి. ► ఈ పర్యటనలో హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం వెంట వచ్చారు. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. వరద ప్రభావిత ప్రాంతం ఏరియల్ వ్యూ సీఎం ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రాంతాలు ► బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాలు. ► పొంగి పొర్లుతున్న పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలు. ► వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు, ముంపునకు గురైన గ్రామాలు. ► పింఛ ప్రాజెక్టు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలు. ► రేణిగుంట, తిరుపతి, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాలు. -
Aerial Survey : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, కడప-తిరుపతి: వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఆ తర్వాత వరదలకు గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు. జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు. చదవండి: ఏపీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్సర్వే నిర్వహించారు. ఆ తర్వాత వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. ముంపునకు గురైన గ్రామాల్లో ఏరియల్ సర్వే చేశారు. పింఛ ప్రాజెక్టుతో పాటు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను, ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు. తర్వాత రేణిగుంట, తిరుపతి టౌన్, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాల్లోను సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్టులో అధికారులతోనూ, ప్రజా ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా తిరుపతి టౌన్లో వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వివిధ మున్సిపాల్టీల నుంచి ఇప్పటికే 500 మంది సిబ్బందిని రప్పించామని అధికారులు వివరించారు. వీధుల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. తిరుపతిలో డ్రైనేజి వ్యవస్థపై మాస్టర్ ప్లాన్ రూపొందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద నీరు తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వెంటనే రూపొందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక శిబిరాలకు రాకున్నా.. ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలని, వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లే సందర్భంలో అధికారులు, యంత్రాంగం వారికి తోడుగా నిలవాలని సీఎం ఆదేశించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే దృశ్యాలు
-
ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటన
-
యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
-
గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన
-
మానవత్వంతో ఆదుకోండి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : వరదల్లో నష్టపోయిన వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని, ప్రతి రైతును ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణం పంట నష్టంపై అంచనా వేసి.. డిసెంబర్ 15లోపు నివేదిక అందించాలని, 31లోగా రైతులకు పరిహారం పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలన్నారు. నివర్ తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో శనివారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సమీక్ష వివరాలను ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్‌బాషా మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సమగ్రంగా పరిశీలన ► పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతి ఒక్క వరద బాధితుడిని మానవతా దృక్పథంతో చూడాలని సీఎం చెప్పారు. ఉదారంగా వ్యవహరించి, నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ► పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం అందించాలన్నారు. పునరావాస కేంద్రాలు విడిచి వెళ్లిపోయినా సరే, అలాంటి వారందరికీ రూ.500 ఇవ్వాలని చెప్పారు. బుగ్గవంకకు రూ.39 కోట్లు ► వైఎస్సార్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బుగ్గవంక సుందరీకరణ పనులకు రూ.39 కోట్లు కేటాయించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.65 కోట్లతో బుగ్గవంక సుందరీకరణ పనులు చేపట్టారు. ఆయన మృతితో ఆ పనులు నిలిచిపోయాయి. పెండింగ్‌లో ఉన్న ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం, అదనంగా 1.2 కిలోమీటర్ల మేర కొత్త నిర్మాణాలకు రూ.39 కోట్లు వెచ్చించాల్సి ఉందని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా, కలెక్టర్ హరికిరణ్‌లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వెంటనే ఆ పనులు చేపట్టాలని ఆదేశించారు. ► అన్నమయ్య ప్రాజెక్టును 10 టీఎంసీలకు విస్తరించాలని, తక్కువ ఖర్చుతో విస్తరణ చేపట్టవచ్చని, అలాగే పింఛా ప్రాజెక్టును 2 టీఎంసీలకు విస్తరించవచ్చని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సూచించగా, ప్రతిపాదనలు చేపట్టాలని సీఎం తెలిపారు. రేణిగుంటలో ఘన స్వాగతం.. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 10.15 గంటలకు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, ఎస్బీ అంజద్ బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు, భూమన కారుణాకర్రెడ్డి, ఆర్కే రోజా, ఆదిమూలం, ఎం.ఎస్ బాబు, ద్వారాకనాథరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పలువురు అధికారులు స్వాగతం పలికారు. సీఎం వెంట రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఉన్నారు. వైఎస్సార్ జిల్లాలో అపార నష్టం ► వైఎస్సార్ జిల్లాలోని మైనర్ ఇరిగేష్ ప్రాజెక్టులలో పూర్తి సామర్థ్యం మేరకు 0.327 టీఎంసీల నీరు ఉందని, అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితిని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ► జిల్లాలో 825 గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 72,755 హెక్టార్లు, ఉద్యాన వన శాఖకు సంబంధించి 3,240 హెక్టార్లలో పంట నీట మునిగిందని, 757 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. ► జిల్లా వ్యాప్తంగా 12,741 మందిని రేస్క్యు ఆపరేషన్‌లో కాపాడామని, పునరావాస కేంద్రాలలో 15,289 మందికి ఆశ్రయం కల్పించామని తెలిపారు. 192.6 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్లు, 1,234 కి.మీ మేర పంచాయతీ రోడ్లు దెబ్బ తిన్నాయని వివరించారు. 8,129 మేకలు, గొర్రెలు, కోళ్లు మృతి ► చిత్తూరు జిల్లాలో 21 మండలాల్లోని 245 గ్రామాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించి 9,658 హెక్టార్లు, ఉద్యానవన శాఖకు సంబంధించి 1,729.52 హెక్టార్లల్లో పంటలు నీట మునిగాయని జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్త ముఖ్యమంత్రికి వివరించారు. ► పశు సంవర్థక శాఖకు సంబంధించి మేకలు, గొర్రెలు, కోళ్లు కలిపి 8,129 మృత్యువాత పడ్డట్లు తెలిపారు. 245 కచ్చా ఇళ్లు దెబ్బ తిన్నాయని, రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించి పలువుర్ని కాపాడామన్నారు. ► 44 పునరావాస కేంద్రాలలో 4,012 మంది ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా 543.8 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్ల ఉపరితలం దెబ్బతినిందని చెప్పారు. రూ.1,082.5 లక్షలు విలువ చేసే బిల్డింగులు, డ్రెయిన్లు, పైప్ లైన్లు దెబ్బ తిన్నాయన్నారు. 34,200 హెక్టార్లలో పంటలు మునక ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి 18 మండలాల్లోని 107 గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 33,269 హెక్టార్లు, ఉద్యానవన శాఖకు సంబంధించి 931 హెక్టార్లలో పంటలు నీట మునిగాయని కలెక్టర్ చక్రధర్‌బాబు సీఎంకు వివరించారు. రేస్క్యూ ఆపరేషన్ ద్వారా 17,163 మందిని కాపాడామని, 155 పునరావాస కేంద్రాల్లో 17,163 మందికి ఆశ్రయం కల్పించామని చెప్పారు. 343.04 లక్షల విలువ చేసే బిల్డింగులు, డ్రెయిన్లు, పైప్ లైన్లు దెబ్బ తిన్నాయని చెప్పారు. 290 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు భరోసా తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించాలని, దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి -
తుపాన్ మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, తిరుపతి : వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం ముగిసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం స్థానిక అధికారులతో పంటనష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ.. పంటనష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతిఒక్క వరద బాధితుడిని మానవతాధృక్పథంతో చూడాలని అన్నారు. తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతిచెందారని వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. (మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే) అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతిఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం ప్రకటించాలన్నారు. పంట నష్టంపై తక్షణం అంచనాలు వేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. కాగా నివర్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం తుపాను ప్రభావిత జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో భేటీ అయ్యారు. నష్టపోయిన రైతులను అదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నివర్ తుపాను : సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన జగన్ ఏరియల్ సర్వే
-
చిత్తూరు,కడప,నెల్లూరు జిల్లాల్లో జగన్ ఏరియల్ సర్వే
-
మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వచ్చారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష చేపట్టారు. అనంతరం సీఎం తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. కాగా, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో భేటీ కానున్న సీఎం జగన్ నివర్ తుపాన్ ఏరియల్ సర్వే అనంతరం సీఎం వైఎస్ జగన్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో భేటీ అయ్యారు. తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు నివేదికలతో సహా సమావేశానికి హాజరు అయ్యారు. ఈ భేటీలో వరద నష్టాలను ప్రజాప్రతినిధులు సీఎం జగన్ దృష్టికి తేనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం 9.45 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సీఎం మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. కాగా, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు చోట్ల రహదారులు, వంతెనలకు గండ్లు పడ్డాయి. స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు, వరదలకు చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా.. వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మూడు గ్రామాల్లో తుపాను ప్రభావంతో వీస్తున్న చలిగాలులకు 465 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. జలదిగ్భంధంలో గ్రామాలు సోమశిల బ్యాక్‌వాటర్‌తో నెల్లూరు జిల్లాలోని అనంత సాగరం, చేజర్ల, ఆత్మకూరు, సంగం, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరు మండలాల్లో 16 లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. 42 చెరువులకు గండ్లు పడ్డాయి. ఒక వంతెన కొట్టుకుపోవడం, సోమశిల బ్యాక్‌వాటర్‌తో రోడ్డు మునిగిపోవడంతో వైఎస్సార్– నెలూరు జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే మనుబోలు వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో నెల్లూరు నుంచి చెన్నై, తిరుపతి మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రాకపోకలను పునరుద్ధరించారు. చెరువులు, వరదల్లో చిక్కుకున్న ఆయా ప్రాంతాల్లోని సుమారు 4,000 మందిని, నెల్లూరు నగరంలో 1100 మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారు. పెన్నా ఉగ్రరూపంతో నెల్లూరు నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. నెల్లూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం రంగనాథస్వామి ఆలయం జలదిగ్భందంలో చిక్కుకుంది. ఎమ్మెల్యేలు.. కాకాణి గోవర్దన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వరప్రసాద్‌రావు, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో రాళ్లపాడు, గుళ్లకమ్మ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారడంతో దిగువకు నీరు వదిలేశారు. యుద్ధప్రాతిపదికన 234 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పాలేరు, ముసి, మన్నేరు, అట్లేరు పొంగిపొర్లుతుండటంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని శివారు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. బాధితులను రక్షించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, అధికారులు చిత్తూరు జిల్లాలో వర్షాలతో వాగులు పొంగడంతో నలుగురు మృతి చెందారు. ఐరాల వద్ద గార్గేయ నదిలో కొట్టుకుపోయి వైఎస్సార్సీపీ కార్యకర్త వినయ్‌రెడ్డి, కేవీపల్లి నూతన కాలువలో గల్లంతై రెడ్డి భాష ప్రాణాలు విడిచారు. శ్రీరంగరాజపురం పుల్లూరు పెద్దవంక వాగులో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. రేణిగుంట రాళ్ల కాలువలో గల్లంతైన రైతు ప్రసాద్ మృతి చెందాడు. శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షల చెక్కును వారికి అందించారు. ప్రసాద్ భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేశారు. ఏర్పేడు మండలం శివగిరి కాలనీకి చెందిన 14 మంది గిరిజనులు కోన కాలువలో చిక్కుకుపోగా బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్వయంగా డ్రోన్‌ను తెప్పించి వారి ఆచూకీని కనిపెట్టారు. వారికి డ్రోన్ ద్వారా బిస్కెట్లు, పండ్లు, రొట్టె, తాగునీళ్లు పంపారు. ప్రస్తుతం గిరిజనులంతా కాలువకు అవతల ఉన్న మామిడి తోటలో సురక్షితంగా ఉన్నారు. అలాగే పీలేరు మండలం ఆకులవారిపల్లెలో పూరి గుడిసె కూలిపోవడం, పింఛా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామంలోకి రాలేకపోయిన ఒక కుటుంబాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కాపాడారు. చిత్తూరు జిల్లాలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న 3,661 మందిని అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన 15 మంది వరదలో చిక్కుకుని సమీపంలోని తోటలో ఉండిపోగా అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని యానాది కాలనీలో విద్యుత్ శాఖకు చెందిన 10 మందితోపాటు మరో 12 మంది మామిడి తోటలో చిక్కకుపోగా ఎస్పీ అన్బురాజన్ స్వయంగా రెస్క్యూ టీం సహకారంతో వారిని కాపాడారు. అలాగే వైజాగ్‌కు చెందిన 200 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సురక్షితంగా చేరుకున్నారు. వీరికి అధికారులు ఫిషింగ్ హార్బల్‌లో వసతి సౌకర్యం కల్పించి తాగునీరు, ఆహారాన్ని అందించారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలో ఉన్న హేమాద్రివారిపల్లి వరద నీటిలో చిక్కుకుంది. అధికారులు, రెస్క్యూ సిబ్బంది బోటులో గ్రామానికి చేరుకుని 130 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రికార్డు స్థాయి వర్షం ఈ నెల 23 – 26 వరకు నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో సగటు సాధారణ వర్షపాతం 31.0 మిల్లీమీటర్లు కాగా 288.8 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో గత రెండు దశాబ్దాల్లోనే లేనంతగా 25 నుంచి 28 సెం.మీ. వర్షం కురిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 99 మండలాల పరిధిలోని 299 గ్రామాలు వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. మొత్తం 15.87 లక్షల మంది ఇబ్బందుల పాలయ్యారు. 664 ఇళ్లు నీట మునగగా 673 ఇళ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 76.7 మి.మీ., కర్నూలు జిల్లాలో 19.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, కడప, బద్వేలు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జిల్లాలోని పాపాఘ్ని, మాండవ్య, బహుదా, పింఛా, జంగమేరు, పెన్నా, సగిలేరు, పాగేరు, మొగమూరుతోపాటు పలు నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పింఛా నీటితో నిండి శుక్రవారం ఉదయం తెగిపోయింది. వరద ఉధృతికి మాండవ్య నదిలో చిన్నమండెం ప్రాంతంలో ప్రయాణికులతో ఉన్న ఓ కారు కొట్టుకుపోయింది. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. బుగ్గవంక నీటిని దిగువకు విడుదల చేయడంతో కడప నగరంలోని లోతట్టు కాలనీలు నీట మునిగాయి. శుక్రవారం ఉదయం డిప్యూటీ సీఎం అంజద్ బాషా వరద బాధిత ప్రాంతాలలో పర్యటించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. తిరుమలలో 300కు పైగా కూలిన చెట్లు తుపానుతో తిరుమలలో దాదాపు 300కు పైగా వృక్షాలు కూలినట్టు ఎఫ్ఆర్వో ప్రభాకరరెడ్డి తెలిపారు. టీటీడీ అటవీ శాఖ ఉద్యోగులు, గార్డెనింగ్ సిబ్బంది 150 మంది బృందాలుగా విడిపోయి ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తున్నారన్నారు. కాగా, తిరుమల కొండల నుంచి ఉబికి వస్తున్న నీటితో తిరుపతిలోని రహదారులు వాగుల్లా మారాయి. లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దెబ్బతిన్న పంటలు క్షేత్రస్థాయి ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అంచనా. జిల్లాల వారీగా గుంటూరులో 1,24,392, కృష్ణాలో 94,464, తూర్పు గోదావరిలో 25,000, పశ్చిమ గోదావరిలో 21,000 చిత్తూరులో 10,166, ప్రకాశంలో 1,06,000, వైఎస్సార్‌లో 4,886, నెల్లూరులో 33,269, కర్నూలులో 15,798, అనంతపురంలో 802 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం హాఫ్‌పేట, ఖాజీపేట గ్రామాల్లో తుపాను తాకిడికి దెబ్బతిన్న మినుము, వరి పంటలను వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, రేపల్లెలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. -
నివర్ తుపాన్: రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
నివర్ తుపాన్: రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న జిల్లాల్లో వరద నష్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (శనివారం) ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 9.45 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. సమీక్షా సమావేశం అనంతరం సీఎం మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. నివర్ తుపానుపై నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటలకు డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (చదవండి: 30 లక్షల ఇళ్ల పట్టాలు: ఏపీ కేబినెట్ ఆమోదం) తుపాను ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ నిన్న తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావం, కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్‌తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు. (చదవండి: ‘నివర్’ బీభత్సం) -
పంట నష్టం త్వరగా అంచనా వేయండి
సాక్షి, అమరావతి: భారీ వరదలు, వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు వెంటనే పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను, లంక భూములు, నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. – వీలైనంత వేగంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలి. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రైతులకు రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుంది. – ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే ఐదు నిత్యావసర సరుకులతో ఉచిత రేషన్‌ను అందిస్తోంది. – మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలి. – సీఎం వెంట హోం మంత్రి మేకతోటి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు. ఆదుకునేందుకు పలు చర్యలు – భారీ వర్షాలు, వరదలపై ఇప్పటికే పలుమార్లు అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే. – ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,450 కోట్ల నష్టం జరిగిందని, బాధితులను ఆదుకోవడానికి రూ.2,250 కోట్ల సాయం అందించాలని కోరారు. తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. – వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. -
సీఎం జగన్ ఏరియల్ సర్వే ఫొటోలు
-
వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారీ వరదలు, వర్షాలు వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రబీలో పంట పెట్టుబడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరద బీభత్సం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిశీలించారు. (చదవండి: అవినీతి లేకుండా పారదర్శక విధానం: సీఎం జగన్) అదే విధంగా, భారీ వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇరువైపులా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన సీఎం, మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న సమయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి కొడాలి నాని సీఎం జగన్ వెంట ఉన్నారు. కాగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 5 నిత్యావసర సరుకులతో ప్రభుత్వం, వరద బాధితులకు ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. -
వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి : వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం పరిశీలించారు. సీఎం వెంట హోమ్ మంత్రి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షాలు, వరదలపై అధికారులు, మంత్రులతో సమీక్షజరిపిన విషయం తెలిసిందే. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ సైతం రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ అవసరా కిందవెంటనే రూ.2250 కోట్లు సాయం అందించాల్సిందిగా సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. (అవినీతి లేకుండా పారదర్శక విధానం: సీఎం జగన్) వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పలు అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముందచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని అమిత్ షా దృష్టికి తీసుకుపోయారు. (హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖ) -
వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
మావోయిస్ట్ ఏరియాలో మరోసారి డీజీపీ పర్యటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆపరేషన్ మావోయిస్టు రెండో రోజు కొనసాగుతోంది. గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు. మావోయిస్టులసంచారం, పోలీసుల చర్యలపై గురువారం విస్తృతంగా సమీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం ఆసిఫాబాద్ మొదలుకొని కొమరంభీమ్, ఉట్నూర్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో గంటన్నర పాటు డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీసులో సుదీర్ఘంగా సమీక్షించారు. మావోయిస్టుల ఏరివేత, కట్టడి చర్యలపై డీజీపీ దిశా నిర్దేశం చేశారు. మరో రెండ్రోజులపాటు ఆసిఫాబాద్‌లోనే డీజీపీ మహేందర్‌రెడ్డి మకాం వేయనున్నారు. క్షేత్ర స్థాయిలో ఏరియల్ సర్వే, సమీక్షలతో స్వయంగా డీజీపీనే రంగంలోకి దిగారు. 45 రోజుల్లో ఆసిఫాబాద్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి రెండోసారి పర్యటించారు. తిర్యాని మండలం మంగి అడవుల్లో మంచిర్యాల కమిటీ కార్యదర్శి భాస్కర్ అలియాస్ అడెల్లు, ఐదుగురు సభ్యులు రెండు సార్లు తప్పించుకున్నారు. పోలీసుల కూంబింగ్‌లో మావోయిస్టుల డైరీ లభ్యమయ్యింది. మావోయిస్టు రిక్రూట్మెంట్కు సంబంధించిన కీలక సమాచారం అందులో లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా కూంబింగ్ ఆపరేషన్‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. పలువురు గ్రే హౌండ్స్ ఏ ఆర్ సివిల్ పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. చదవండి: మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే -
మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే
సాక్షి, అసిఫాబాద్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో మావోయిస్టుల కదలికలపై ఆరాతీస్తున్నారు. నెల రోజుల్లో రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడంతో స్థానికంగా ప్రాధాన్యత నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు విషయమై కూడా చర్చ కొనసాగుతోంది. (మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?) -
గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
మిడతల దండుపై ఆందోళన వద్దు
ఎదులాపురం (ఆదిలాబాద్): మిడతల దండు విషయంలో రాష్ట్ర రైతులు ఆందోళన చెందవద్దని, వివి ధ మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని కీటక శాస్త్రజ్ఞుడు ఎస్జే రహమాన్ అన్నారు. మిడతలు రాష్ట్రంలో ప్రవేశించేలోపు తీసుకోవాల్సిన ముం దస్తు చర్యల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన కమిటీ సభ్యులు ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా ఆదిలాబా ద్ జిల్లాకు చేరుకున్న కమిటీ సభ్యులు రాష్ట్ర సరిహ ద్దు పెన్‌గంగ పరీవాహక ప్రాంతంతోపాటు నిర్మల్ జిల్లాలో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మం దిరంలో కమిటీ సమావేశమైంది. కమిటీ సభ్యుడు, కీటక శాస్త్రవేత్త రహమాన్ మాట్లాడుతూ మిడతలు రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ప్రవేశించేందుకు ఆస్కారం ఉందో అంచనా వేసేందుకు ఈ ఏరియల్ సర్వే చేపట్టామన్నారు. ఆయన వెంట కమిటీ సభ్యురా లు, మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఆర్.సునీత ఉన్నారు. -
మిడతల కదలికలపై ఏరియల్ సర్వే
సాక్షి, ఆదిలాబాద్: మిడతల కదలికలపై ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై మిడతల ప్రభావం లేదని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మిడతల దండు దిశను మార్చుకున్నాయని... తెలంగాణకు ముప్పులేదని స్పష్టం చేశారు. మిడతలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో మిడతల దండు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కమిటీ వెల్లడించింది. -
బెంగాల్‌కు తక్షణ సాయం వెయ్యి కోట్లు
బసీర్హాట్/కోల్‌కతా/భువనేశ్వర్: ఉంపన్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం బెంగాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోదీ వెంట ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్హాట్లో గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తుపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తామన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారిపై పోరాడుతూనే మరోవైపు తుపాను సహాయక చర్యలు చేపట్టడంలో సమర్థంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని ప్రశంసించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశం మొత్తం బెంగాల్ ప్రజలకు అండగా ఉంటుందని మోదీ చెప్పారు. రూ.లక్ష కోట్ల నష్టం: మమతా బెనర్జీ ఉంపన్ తుపాను వల్ల పశ్చిమ బెంగాల్‌కు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. మొత్తం నష్టాన్ని అంచనా వేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. పలు పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.53 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. బెంగాల్లో 77కి చేరిన మరణాలు బెంగాల్లో ఇప్పటిదాకా అంపన్ తుపాను వల్ల మరణించిన వారి సంఖ్య 77కు చేరింది. రాజధాని కోల్‌కతా సహా దాదాపు సగం జిల్లాలు అంపన్ ధాటికి దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, మొబైల్ సేవలను పునరుద్ధరించారు. ఒడిశా సీఎంకు ప్రధాని ప్రశంస సైక్లోన్ వల్ల నష్టపోయిన ఒడిశాకు రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం ఒడిశాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ గణేశీలాల్, సీఎం నవీన్ పట్నాయక్, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను నష్టంపై నివేదిక వచ్చాక తదుపరి ఆర్థిక సాయం ప్రకటిస్తామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడంతో గొప్ప చొరవ చూపారని ఒడిశా ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. తుపాను కారణంగా తమ రాష్ట్రంలో 45 లక్షల మంది ప్రభావితులైనప్పటికీ, వేలాది ఇళ్లు దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలి: విపక్షాలు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అంపన్ తుపాను సృష్టించిన బీభత్సాన్ని వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని 22 ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆయా రాష్ట్రాలను సముచిత రీతిలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాయి. 22 పార్టీల నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా ఉంటామని తీర్మానంలో పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, కమ్యూనిస్టు తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఉంపన్.. కోల్‌కతా వణికెన్
కోల్‌కతా/భువనేశ్వర్/న్యూఢిల్లీ/ఢాకా: కరోనా వైరస్‌తో దేశమంతా అల్లాడిపోతున్న సమయంలో పులి మీద పుట్రలా పశ్చిమబెంగాల్‌ను ఉంపన్ తుపాను గట్టి దెబ్బ తీసింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 72 మంది మరణించారు. వందలాది ఇళ్లు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వంతెనలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి తీవ్ర తుపాను ఉంపన్ దాటికి మహానగరం కోల్‌కతా చిగురుటాకులా వణికిపోయింది. ఒక తుపాను ఈ స్థాయిలో కోల్‌కతాను ధ్వంసం చేయడం వందేళ్ల తర్వాత ఇదే తొలిసారి. గంటకి 190 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తూ ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కోల్‌కతా అతలాకుతలమైంది. నగరంలో పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లు గాలుల ధాటికి తిరగబడ్డాయి. కోల్‌కతాలో తుపాను బీభత్స దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారులకి ఇరువైపులా ఉన్న వందలాది చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. వందలాది విద్యుత్ స్తంభాలు, వెయ్యికిపైగా సెల్ టవర్లు నేలకొరిగాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీసుల కియాస్క్‌లు ధ్వంసమయ్యాయి. కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్లోని కొన్ని జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ ఫోన్లు మూగబోయాయి. కమ్యూనికేషన్ సదుపాయం లేక అంత పెద్ద నగరం అల్లాడిపోతోంది. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు పూర్తిగా ధ్వంసం కాగా, కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, హౌరాలలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఇప్పట్నుంచే అంచనా వెయ్యలేమని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సుందర్బన్ డెల్టాలో కొన్ని కిలో మీటర్ల మేర ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. మరోవైపు తుపాను సహాయకకార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన నాలుగు అదనపు బృందాలు ఢిల్లీ నుంచి కోల్‌కతాకు చేరుకున్నాయి. రెండు జిల్లాలు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడంతో ఈ అదనపు బలగాలు వచ్చాయి. ఢిల్లీలో నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో బెంగాల్, ఒడిశాలో సహాయ కార్యక్రమాలపై చర్చించినట్టు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ప్రధాన్ చెప్పారు. ఒడిశాలో భారీగా పంట నష్టం ఉంపన్ తుపాను ఒడిశాలో కూడా తన ప్రతాపం చూపించింది. తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్, టెలికం వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. పంట నష్టం అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో 44.8 లక్షల మందిపై తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌ను అన్నివిధాల ఆదుకుంటామన్నారు. బంగ్లాదేశ్‌లో 10 మంది మృతి: పెను తుపాను ఉంపన్ బంగ్లాదేశ్‌లోనూ విలయం సృష్టించింది. తీర ప్రాంతాల పల్లెలన్నీ ధ్వంసమయ్యాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 10 మంది వరకు మరణించారని బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. గోడలు, చెట్లు కూలి మీద పడడం వల్లే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. కరోనా కంటే భయంకరమైనది : మమత కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్‌ను వణికించిన ఉంపన్ తుపాను కోవిడ్–19 కంటే భయంకరమైనదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇలాంటి తుపాను బీభత్సాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ‘ఉత్తర దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని పునర్నిర్మించుకోవాలి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చెయ్యాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంపన్ ప్రభావంతో అల్లాడిన ప్రాంతాలను సందర్శించాలి’ అని మమత అన్నారు. అండగా ఉంటాం: మోదీ పశ్చిమ బెంగాల్ తుపాను తీవ్రతపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బెంగాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుపాను బీభత్స దృశ్యాలు చూశానని, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అన్ని విధాల సహాయం అందిస్తామని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసంప్రా«ర్థిస్తున్నామని, జాతియావత్తూ బెంగాల్‌కు అండగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బెంగాల్, ఒడిశాలకు కేంద్రం నుంచి పూర్తి సాయం అందుతుందని చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో ఆయన ఫోన్లో మాట్లాడారు. నేడు ప్రధాని మోదీ ఏరియల్ సర్వే ఉంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను శక్తివంతమైన ఉంపన్ తుపాను వణికిస్తోంది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తీర ప్రాంతాల్లో విద్యుత్, టెలికం, మౌలిక వసతులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చేరిన వరద (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉంపన్ విధ్వంసం : బెంగాల్‌కు ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ : ఉంపన్ తుపాను బీభత్సంతో దెబ్బతిన్న పశ్చిమ బెంగాల్లో తుపాన్ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బెంగాల్లో పర్యటిస్తారు. బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో తుపాను నష్టాన్ని ఏరియల్ సర్వేలో పర్యవేక్షిస్తారు. కాగా తుపాన్ ప్రభావిత బెంగాల్‌ను సందర్శించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతకుముందు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.తుపాన్ ధాటికి పశ్చిమబెంగాల్లో 72 మంది మరణించిన సంగతి తెలిసిందే. పెను తుపాన్‌పై ప్రధాని స్పందిస్తూ దేశమంతా పశ్చిమబెంగాల్‌కు అండగా నిలుస్తుందని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఉంపన్‌తో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడంలో ఏ విధంగానూ వెనుకాడమని స్పష్టం చేశారు. చదవండి : ఉంపన్ విధ్వంసం : 72 మంది మృతి -
పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎం జగన్
-
పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్న సీఎం
-
పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు హెలిప్యాడ్ వద్ద మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, తల్లారి వెంకట్రావు, దేవులపల్లి ధనలక్ష్మి, జీఎస్ నాయుడు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు, ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, కలెక్టర్ ముత్యాల రాజు స్వాగతం పలికారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయడానికి ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్) అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి, గడువులోగా పూర్తి చేయాడానికి తీసుకోవాల్సిన చర్యలపై జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు మార్గనిర్దేశం చేయడానికి సీఎం వైఎస్ జగన్ ప్రాజెక్టుల బాట పట్టారు. -
కాళేశ్వరంపై సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
-
ఉదారంగా సాయం..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘వరదలతో కుందూ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతులు నష్టపోయారు. ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. పశు సంపదకు నష్టం వాటిల్లింది. బాధితులందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజలను, రైతులను ఆదుకునే విషయంలో నిబంధనలను చూడొద్దు. మానవతా దృక్పథంతో ఆలోచించి కాస్త ఉదారంగా పరిహారం అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌తో పాటు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారులెవ్వరూ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, అందరి ముఖంలో చిరునవ్వులు చూడాలని చెప్పారు. కలెక్టరేట్లో ఒక సెల్ ఏర్పాటు చేసి.. ప్రజల ఇబ్బందులను విని, తక్షణమే పరిష్కరించాలని సూచించారు. నంద్యాల డివిజన్లో ఇటీవల సంభవించిన వరదలతో పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి ఆకస్మికంగా వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే (హెలికాఫ్టర్ ద్వారా) ద్వారా పరిశీలించారు. అనంతరం నంద్యాల మునిసిపల్ కార్యాలయానికి చేరుకుని వరద ప్రభావంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత వరద ప్రభావం గురించి నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రాష్ట్రంలో డ్యాములన్నీ నిండాయి. పొలాలు కూడా తడవాలని దేవుడు దయతలిచాడు. అందుకే వర్షాలు సమృద్ధిగా కురిశాయి. ఒక్క అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో సాధారణం కంటే 66 శాతం ఎక్కువగా వర్షం కురిసింది. ఇవన్నీ మంచి పరిణామాలు. అయితే ఎక్కువ వర్షపాతంతో 17 మండలాల్లో కాస్త నష్టం వాటిల్లింది. ఇందులో ఆర్అండ్బీ రోడ్లకు రూ.421 కోట్ల నష్టం జరిగింది. పంచాయతీరాజ్‌లో రూ.103 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా వరదల వల్ల రూ.724 కోట్ల నష్టం వాటిల్లితే.. ఇందులో రోడ్లకు మాత్రమే రూ.524 కోట్ల నష్టం సంభవించింద’ని చెప్పారు. మానవతా దృక్పథంతో వ్యవహరించండి వరదలతో నష్టపోయిన రైతులు, సాధారణ ప్రజలకు సాయం చేసే విషయంలో గిరిగీసుకుని ఇంతే ఇస్తామనే ఆలోచన వద్దని ముఖ్యమంత్రి అన్నారు. ఆదుకోవడమే ధ్యేయంగా వ్యవహరించాలని చెప్పారు. ‘వరదల వల్ల ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీలలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. 33 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 2 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఈ రైతులందరికీ న్యాయం చేస్తామని చెబుతున్నా. బాధిత కుటుంబాలకు 25 కేజీల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో చొప్పున ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఇవ్వండి. దెబ్బతిన్న ఇళ్లు, పశువులకు గాను రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో గతంతో పోలిస్తే 15 శాతం పెంచి ఇవ్వాలి. గతంలో లాగా వరద వచ్చినపుడు పట్టించుకోరనే మాట వినపడకూడదు. వైఖరి మారాలి. గతంలో 10 కేజీల బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు 25 కేజీలు ఇవ్వండని చెబుతున్నా. అలాగే గతంలో జరగని విధంగా ప్రతి ఇంటికీ రూ.2 వేలు అదనంగా ఇవ్వాలని చెబుతున్నా. ఇన్చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడే ఉండి అన్ని శాఖలతో సమీక్ష నిర్వహిస్తారు. అందరికీ అవసరమయ్యే సహాయ సహకారాలు అందిస్తారు. ఆయనతో పాటు మరో మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఇక్కడే ఉంటారు. వర్షాలతో కాస్త కష్టం, నష్టం ఎదురైనా మంచి వర్షాలు కురిపించినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడున్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కుందూ నదికి వరద వస్తే పరివాహక గ్రామాలకు నష్టం వాటిల్లకుండా ప్రణాళిక రూపొందిస్తాం. నంద్యాల నియోజకవర్గంలోని చామకాలవ గురించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచించి రక్షణగోడ నిర్మించేందుకు రూ.వంద కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే శిల్పా రవి చెప్పారు. కొన్ని పనులు కూడా చేశారని చెప్పారు. ఈ పనులకు కూడా తిరిగి అంచనాలు రూపొందించి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం’అని ముఖ్యమంత్రి అన్నారు. ‘సీమ’ ఎడారి కాకూడదనేదే లక్ష్యం రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను నింపేందుకు ప్రస్తుతం 90 నుంచి 120 రోజుల పాటు నీళ్లు తీసుకోవాలంటే కష్టమవుతోందని సీఎం అన్నారు. శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉండటం లేదని, లభ్యత చాలా తక్కువగా (ఈ ఏడాది కాదు) ఉందని చెప్పారు. ‘గత 40 ఏళ్ల సీడబ్ల్యూసీ లెక్కలు పరిశీలిస్తే ఏడాదికి 1,200 టీఎంసీలు వస్తున్నాయని తెలిసింది. కానీ గత పదేళ్ల లెక్కలు తీస్తే అవి కాస్తా 600 టీఎంసీలకే పడిపోయాయి. గత ఐదేళ్లలో చూస్తే 400 టీఎంసీలకే పడిపోయాయని తేలింది. దేవుడి దయతో ఈ ఏడాది ఇబ్బంది లేదు. మామూలుగా రాయలసీమలోని డ్యామ్‌లు, రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపుకోవాలంటే గతంలో లాగా 90 నుంచి 120 రోజుల పాటు నీటిని తెచ్చుకోవాలంటే కుదరదు. కేవలం 40 – 45 రోజుల్లోనే నింపుకునే పరిస్థితి రావాలి. అందుకే రిజర్వాయర్లకు వెళ్లే ప్రధాన కాలువల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడే ‘సీమ’లోని అన్ని డ్యామ్‌లు, రిజర్వాయర్లు నిండుతాయి. ఆ విధంగా ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ►కలెక్టరేట్లో ఒక సెల్ ఏర్పాటు చేయండి. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా.. ఏ అధికారైనా పట్టించుకోకపోయినా ఈ సెల్ దృష్టికి తీసుకెళ్లండి. వెంటనే స్పందించి మీ సమస్యను పరిష్కరిస్తారు. అధికారులంతా కాస్త ఉదారంగా వ్యవహరించండి. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టొద్దు. అందరి ముఖంలో చిరునవ్వు చూడాలి. ►శ్రీశైలం డ్యామ్‌కు 40 ఏళ్ల కిందట 1,200 టీఎంసీలు వస్తే.. గత ఐదేళ్లలో 400 టీఎంసీలకు తగ్గిపోయిన పరిస్థితి. మరోవైపు కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటూ పోతున్నారు. అది పూర్తయితే మరో వంద టీఎంసీలు తగ్గిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కృష్ణా ఆయకట్టును బతికించుకోవడానికి, రాయలసీమ ఎడారి కాకుండా రక్షించుకోవడానికి చాలా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా గోదావరి జలాలను శ్రీశైలం జలాశయంలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రితోనూ చర్చించాం. -
నంద్యాలలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కర్నూలు జిల్లా ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో పర్యటించి ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఐదు రోజులుగా నంద్యాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు నల్లమలలోని ఫారెస్ట్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆ నీరు నంద్యాల పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూకు చేరుకుంది. దీంతో నంద్యాల పట్టణాన్ని వరదనీరు చుట్టుముట్టింది. పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూనది ఉప్పొంగి ప్రవహించడంతో పీవీనగర్, హరిజనపేట, అరుం«ధతినగర్, బైటిపేట, ఘట్టాల్‌నగర్, గాంధీనగర్, బొగ్గులైన్, గుడిపాటిగడ్డ, సలీంనగర్, శ్యాంనగర్, టీచర్స్‌కాలనీ, విశ్వనగర్, ఎన్జీఓ కాలనీ, ఎస్బీఐ కాలనీ, హౌసింగ్‌బోర్డు, తదితర కాలనీలు జలమయమయ్యాయి. పైనుంచి వస్తున్న వరదనీరు అంతా నంద్యాలలోని కుందూనదిలో కలుస్తుండటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మద్దిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పీవీనగర్, హరిజనపేటను నీళ్లు చుట్టు ముట్టాయి. ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన ముంపు ప్రాంతాల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, జయరాం పర్యటించారు. మహానంది మండలం గాజులపల్లెలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి బొత్స అన్నారు. మంత్రుల వెంట ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు. -
బాధితులకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, దేవిపట్నం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం జరిగిన బోటు (లాంచీ) ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న సీఎం వైయస్ జగన్ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఒకొక్క బాధితుడి దగ్గరకు వెళ్లి పరామర్శించి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్ వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, తదితరులు ఉన్నారు. -
సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే
-
చక్కెర్లు కొట్టిన ‘యురేనియం అలజడి’
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి (నల్గొండ) : యురేనియం అలజడితో మండలంలోని పెద్దగట్టు, నంబాపురం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యురేనియం తవ్వకాలు జరుగుతాయా.. ఇందుకోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా అని ఇంతకాలం అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయా గ్రామాల ప్రజలకు ఇటీవల జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడంలేదు. తాజాగా పెద్దగట్టు, నంబాపురం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం 11గంటల సమయంలో హెలికాప్టర్ విహరించడంతో యురేనియం కోసమే ఆకాశమార్గాన సర్వే నిర్వహించినట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దని, యురేనియం కోసం అన్వేషించే ప్రయత్నాలు చేయడం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. యురేనియం ప్లాంట్ ఏర్పాటు వల్ల జరిగే అనార్థాలతో ప్రజలు యురేనియం అంటేనే మండిపడుతున్నారు. వీరికి ప్రజా సంఘాలు సైతం మద్దతు తెలుపుతుండడంతో ప్రజలు యురేనియం ప్లాంట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హెలికాప్టర్ ఏరియల్ సర్వే కోసం వచ్చినట్లు భావించి యురేనియం ప్లాంట్‌ను, యురేనియం కోసం అన్వేషించడం, ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దగట్టు, నంబాపురం గ్రామాల ప్రజలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సమద్‌కు వినతిపత్రం అందించారు. హెలికాప్టర్ యురేనియం సర్వేకు వచ్చిందా లేదా అని చెప్పాల్సిందిగా ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కోరారు. వినతిపత్రం అందించిన వారిలో పెద్దగట్టు సర్పంచ్ నరేందర్‌నాయక్, గ్రామస్తులు నాగయ్య, దూద్య తదితరులున్నారు. -
ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ ఏరియల్ సర్వే
సాక్షి, విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వరద పోటెత్తడంతో అధికారులు ఇప్పటికే హై అలర్డ్ ప్రకటించారు. వరద నేపథ్యంలో రెండు జిల్లాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పడు అంచనా వేస్తూ అధికారులు మందుజాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 12 మంది గ్రామాలు నీట మునగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు జిల్లాల్లోనూ ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి బోట్ల ద్వారా సాయాన్ని అందిస్తున్నారు.వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలతో పాటు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. -
‘బాధిత కుటుంబాలకు రూ. 5వేల అదనపు సహాయం’
సాక్షి, రాజమండ్రి : గోదావరి వరద ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇప్పుడిస్తున్న సహాయంతోపాటు అదనంగా రూ. 5వేల చొప్పున అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు ఈ సహాయం కూడా అందనుంది. గురువారం ముంపు ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజమండ్రి విమానాశ్రయంలోని ఏటీసీ టవర్ బిల్డింగ్‌లో సీఎం వైఎస్ జగన్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష నిర్వహించారు. దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఇళ్లు, పంటలు నష్టపోయినా వారికి నిబంధనల ప్రకారం అందే సాయం కాకుండా ప్రత్యేకంగా రూ. 5 వేల సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70 శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నట్టు తెలిపారు. వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందన్నారు. అందుకోసమే రూ. 5వేల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ముంపుకు గురైన గ్రామాల్లోనే కాకుండా.. వరదల కారణంగా సంబంధాలు తెగిపోయిన గ్రామాలకు కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో సాగుచేసిన పంటలు దెబ్బతింటే.. వారికి పరిహారంతో పాటు ఉచితంగా సబ్సిడీ విత్తనాలు అందజేయాలన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, అనిల్‌కుమార్‌యాదవ్, రంగనాథరాజు, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కండపూడి రాజా, ధనలక్ష్మి, బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పలు అంశాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరిలో 10, 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేది కాదని.. కానీ ఈసారి వరద ముంపు ఎక్కువగా ఉందని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపు పెరిగిందని వారు సీఎం జగన్‌కు వివరించారు. అయితే దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ధవళేశ్వరం వద్ద నీటిమట్టాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా, పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకోని.. అందుకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరిలోకి వచ్చే వరద, ముంపుకు గురయ్యే ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ మేరకు పోలవరం పునరావాస పనులు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. త్వరగా ముంపుకు గురయ్యే ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలన్నారు. పోలవరం పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా, లోపరహితంగా, సమస్యలను పరిష్కరించడానికి వీలుగా ఒక ఐఏఎస్‌ను నియమిస్తున్నట్టు తెలిపారు. చదవండి : పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే -
ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, పోలవరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. వరద ముంపుపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత తాడేపల్లి బయల్దేరి వెళతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం గన్నవరం చేరుకుంటారు. వెంటనే ఆయన పోలవరం ఏరియల్ సర్వేకు బయల్దేరతారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద నీరు భారీగా వస్తోంది. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన పొగిడింపు కారణంగా గురువారం పులివెందుల, పెనుకొండలో సీఎం పర్యటనలు రద్దయ్యాయి. పెనుకొండలో కియా కొత్తకారు విడుదలకు ముఖ్యమంత్రికి బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. -
ఒడిశాకు రూ.1,000 కోట్లు
భువనేశ్వర్: ప్రధాని మోదీ సోమవారం ఒడిశాలోని ‘ఫొని’ తుపాను బాధిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. ప్రకృతి బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ఇప్పటికే అందజేసిన రూ.381 కోట్లకు అదనంగా తక్షణం రూ.1,000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన 34 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు సాయంగా అందిస్తామని ప్రధాని తెలిపారు. ఏటా ప్రకృతి విపత్తులు సర్వసాధారణంగా మారిన ఒడిశా, మిగతా తీరప్రాంత రాష్ట్రాల కోసం దీర్ఘకాలిక పరిష్కారం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దాదాపు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రాణనష్టాన్ని కనిష్టానికి తగ్గించిన సీఎం నవీన్ పట్నాయక్‌ను ఆయన అభినందించారు. అనంతరం భువనేశ్వర్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు.ఫొని కారణంగా రాష్ట్రంలో వాయిదా పడిన నీట్‌ను ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నారు. ఫోన్ చేస్తే మమత మాట్లాడలేదు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ఫోన్‌కాల్‌ను స్వీకరించలేదని, ఆమె తిరిగి తనకు ఫోన్ చేయలేదని మోదీ చెప్పారు. రాష్ట్రంలో ఫొని తుపానుతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు రెండు సార్లు ఫోన్ చేసినా ఆమె మాట్లాడలేదని, తుపాను నష్టంపై సమీక్షించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా ఆమె స్పందించలేదని పేర్కొన్నారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో, జార్ఖండ్‌లోని చైబాసాలో సోమవారం ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. రాష్ట్రంలో తుపాను ప్రభావం తెల్సుకునేందుకు బెంగాల్ సీఎం మమతకు రెండుసార్లు ఫోన్ చేశా. అయినా, ఆమె నాతో మాట్లాడటానికి నిరాకరించారు. ఆమెకు ప్రజల బాగోగులు పట్టవు’ అని అన్నారు. మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ మిగతా విడత ఎన్నికల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరుతో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోదీ సవాల్ విసిరారు. బోఫోర్స్ కుంభకోణం తదితర అంశాలపైనా చర్చకు రావాలన్నారు. ‘కోల్‌కతాలోని నా కార్యాలయానికి మోదీ ఫోన్ చేసినపుడులో ఖరగ్‌పూర్‌లో తుపాను సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా. అందుకే ఫోన్ మాట్లాడలేదు’ అని మమత వివరణ ఇచ్చారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే
సాక్షి, రాజమండ్రి: ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. 2006 తర్వాత అతిపెద్ద వరదలు వచ్చాయన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 19 మండల్లాలో 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని తెలిపారు. 16 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయని వెల్లడించారు. 6,600 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర కాలువ మూలంగా ఎక్కువ నష్టం జరిగింది. ఎర్ర కాలువ ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. ఆర్ అండ్ బీ రోడ్లకు 35 కోట్లు కేటాయిస్తాం. రాయలసీమలో కరువు ఉంది. కోస్తాలో వరదలు వచ్చాయి. కవల పిల్లల మాదిరిగా రెండు సమస్యలు ఉన్నాయి. గోదావరి నుంచి ఇప్పటికే 1500 టీఎంసీల జలాలు సముద్రం పాలయ్యాయి. ఆరు జిల్లాలో కరువు ఉంది. పోలవరం కోసం కేంద్రం నుంచి 2600 కోట్లు రావాల్సి ఉంది. వరదల కారణంగా ఉభయ గోదావరి జిల్లాలో 600 కోట్ల నష్టం జరిగింద’ని తెలిపారు. కాగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. లంక గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. -
ఏరియల్ సర్వేలో పత్రికా వీక్షణం
యశవంతపుర: ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వరద బాధిత జిల్లాల్లో హెలికాప్టర్లో ఏరియల్ సర్వే సమయంలో దినపత్రిక చదవడం విమర్శలకు తావిస్తోంది. విహంగ వీక్షణంలో పేపర్‌ను చూస్తున్న వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో సీఎం వైఖరిపై విమర్శలు తప్పడం లేదు. మైసూరు నుంచి హిరియాపట్టణ వరకు సీఎం ఏరియల్ సర్వే చేశారు. వందలాది గ్రామాలు నీటమునిగాయి, రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి, ఆ సమయంలో పేపర్లో తలదూర్చడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విమర్శలు బీజేపీ పనేనని, తనపై ఆరోపణలు చేయటం అలవాటుగా మారిందని కుమారస్వామి దుయ్యబట్టారు. -
కేరళలో ప్రధాని ఏరియల్ సర్వే
-
తక్షణ సాయం100 కోట్లు
కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేరళ అసాధారణమైన వరదలను ఎదుర్కొంటోంది. స్వతంత్ర భారత చరిత్రలో కేరళలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద సంభవించలేదు. వర్షం, వరదల కారణంగా రాష్ట్రంలో పంటలు, మౌలికవసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కేరళకు తక్షణ సాయంగా రూ.100 కోట్లు అందజేస్తున్నాం’ అని రాజ్‌నాథ్ తెలిపారు. అంతకుముందు ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో కేంద్ర పర్యాటక సహాయ మంత్రి అల్ఫోన్స్, సీఎం పినరయి విజయన్‌తో కలసి ఏరియల్ సర్వే నిర్వహించిన రాజ్‌నాథ్..కేరళను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వరద బాధితులతో మాట్లాడారు. కాగా, ప్రస్తుత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు రూ.1,220 కోట్ల తక్షణ సాయం అందజేయాలని సీఎం విజయన్ రాజ్‌నాథ్‌కు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ రూ.8,316 కోట్ల నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు వీలుగా 14 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను మోహరించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. కేరళలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకూ 37 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇడుక్కి, వయనాడ్, కన్నూర్, ఎర్నాకులం, పాలక్కడ్, మలప్పురం జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళతో పాటు మరో 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో రాజ్‌నాథ్ పర్యటన
తిరువనంతపురం : కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏరియల్ సర్వే చేశారు. రాజ్‌నాథ్ సింగ్ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ ఇతర ఉన్నతాధికారులున్నారు. కేరళలో పోటెత్తిన వరదలతో తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం తోడ్పాటు అందిస్తుందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారని, వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు నష్టాన్ని మదింపు వేశారని సీఎంఓ కేరళ ట్వీట్ చేసింది. భారీ వర్షాలు ముంచెత్తడంతో కేరళ వరద తాకిడికి గురైంది. ఇడుక్కి, ఇదమలయార్ రిజర్వాయర్లలో వరద ఉధృతి కొంత తగ్గుముఖం పట్టినా లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. వరద తీవ్రతతో కేరళలో ఇప్పటివరకూ వివిధ ఘటనల్లో 31 మంది మరణించారని అధికారులు తెలిపారు. -
గడ్డు పరిస్థితి.. 24 జిల్లాలు వరదల్లో..
లకీంపూర్: అసోంలో పరిస్థితి దారుణంగా తయారైంది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలు పలు జిల్లాలను జలమయం చేశాయి. వందల సంఖ్యలో ఊర్లు నీళ్లలో నిలిచిపోయాయి. ఆ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల వారిని పల్లపు ప్రాంతాలవైపునకు తరలిస్తున్నారు. దాదాపు 24 జిల్లాలకు చెందిన 15 లక్షలమంది ఈ వరదల ప్రభావానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. భారీ వరదలు అసోంను ముంచెత్తుతున్న నేపథ్యంలో గురువారం కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు ఏరియల్ సర్వే నిర్వహించారు. నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ పోర్స్, నీతి ఆయోగ్, నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటికీ చెందిన అధికారులతో కలిసి ఆయన ఈ సర్వే నిర్వహించారు. అంతకంటే ముందు ఆయన లకీంపూర్‌లోని జిల్లా అధికారులతో భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితిపై వాకబు చేశారు. అలాగే, బాగా దెబ్బతిన్న పస్నోయి బాలిడాన్ అనే గ్రామాన్ని సందర్శించారు. ఒక్క లకీంపూర్ జిల్లాలోనే మూడు లక్షలమంది వరదల భారీన పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లోని నదులన్నీ కూడా నీటి మట్లాలు పెరిగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. -
కరీంనగర్లో కేసీఆర్ ఏరియల్ సర్వే
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరీంనగర్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులను ఆయన పరిశీలించనున్నారు. మరోవైపు కేసీఆర్ వెంట చీఫ్ సెక్రటరీ, మంత్రి హరీష్ రావు, ఎంపీలు వినోద్, సుమన్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు. గండిపడ్డ మిడ్ మానేర్‌ను పరిశీలించిన అనంతరం సీఎం... అధికారులతో సమీక్షించనున్నారు. కాగా ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు హెలికాప్టర్లో వెళ్లాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రికి వాతావరణం సరిగ్గా లేదని సూచించడంతో.. రోడ్డు మార్గంలో చేరుకున్నారు. మరోవైపు జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. మానేరు, మోయతుమ్మద వాగులతో పాటు ఎల్లమ్మవాగు, మూలవాగు, బిక్కవాగు ఉప్పొంగాయి. సిరిసిల్ల డివిజన్లో అధిక వర్షాలు కురవడంతోపాటు ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతూ మానేరుకు వరద పోటెత్తింది. దీంతో మిడ్ మానేరు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
హరితహారం కోసం సీఎం ఏరియల్ సర్వే
హైదరాబాద్: ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన భూమికి చేరువగా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. జాతీయ రహదారిపై ఒక్క నిమిషంలో లక్ష మొక్కలను నాటే బృహత్తర యజ్ఞాన్ని కేసీఆర్ వీక్షిస్తారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటే ప్రజలకు హెలికాప్టర్ నుంచే అభివాదం చేస్తారని అధికారులు వెల్లడించారు. -
ఏరియల్ సర్వే
► హెలికాప్టర్ నుంచి పుష్కరఘాట్లను ► పరిశీలించిన అదనపు డీజీపీ, ఉన్నతాధికారులు ► జూరాల నుంచి నాగార్జున్‌సాగర్ వరకు పర్యటన ► సర్వేలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ ► పుష్కరాల ఏర్పాట్లు చకచకా ► పూర్తిచేయాలని కోరిన డీజీపీ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జిల్లాలో తొలిసారిగా నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల నిర్వహణ కోసం ఏర్పాటుచేస్తున్న ఘాట్లను రాష్ట్ర అదనపు డీజీపీ(లాఅండ్ ఆర్డర్) అంజన్‌కుమార్, హైదరాబాద్ రీజియన్ ఐజీ నాగిరెడ్డి, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరి గురువారంకృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. మొదట హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన డీజీపీ నేరుగా జూరాల ప్రాజెక్టు మీదుగా బీచుపల్లి, అలంపూర్, సోమశిల తదితర ఘాట్లను పరిశీలించుకుంటూ నాగార్జున్‌సాగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లాలో కృష్ణా పుష్కరాల కోసం ఏర్పాటుచేసిన 32 ఘాట్లమ్యాప్ను అదనపు డీజీపీ స్వయంగా పరిశీలిస్తూ.. హెలిక్యాప్టర్ నుంచి ఆయా ఘాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఘాట్ల వివరాలు తీసుకుని త్వరగా పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. జిల్లాలో కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసుశాఖ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ వద్ద చర్చించినట్లు తెలిసింది. కేవలం పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ కోసం అనువైన స్థలాలు సేకరించాలని సూచించారు. జాతీయ రహదారిపై ఉన్న బీచుపల్లి పుష్కరఘాట్‌కు కిలోమీటర్ దూరంలో వాహనాలు మొత్తం నిలిపివేయాలని కేవలం వీఐపీ తప్ప ఇతర వాహనాలకు లోపలికి అనుమతి లేకుండా అవసరమైన ప్రణాళిక ఏర్పాటుచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. బందోబస్తుపరంగా జిల్లా పోలీసుశాఖ నుంచి పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేయాలని అదనపు డీజీపీ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరిని కోరినట్లు సమాచారం. వారి వెంట ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. -
విహంగ వీక్షణం
♦ నల్లవాగు, గట్టులింగంపల్లి పరిసరాలపై మంత్రి హరీశ్‌రావు ఏరియల్ వ్యూ ♦ తాగు,సాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులతో చర్చలు నారాయణఖేడ్/కల్హేర్/మనూరు: గట్టులింగంపల్లి, నల్లవాగు ప్రాజెక్టులను రాష్ర్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉదయం 10 గంటల కు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుం చి నారాయణఖేడ్ వచ్చారు. తొలుత సింగూరు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మనూరు మండలంలోని గట్టులింగంపల్లి చెరువును, కల్హేర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి నీళ్ల మళ్లింపు, గట్టులింగంపల్లి ప్రాజెక్టులోకి సింగూరు నీరు మళ్లించే విషయమై సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. నల్లవాగు నీటిని సాగు, తాగునీటి అవసరాలకు సరఫరా చేసే విషయమై ఈ సర్వే చేపట్టారు. నల్లవాగు ప్రాజెక్టు పరిసరాలను ఆయన సుల్తానాబాద్, గోసాయిపల్లి, అంతర్గాం, కంగ్టి మండలం నాగన్‌పల్లి, పోట్పల్లి, నిజామాబాద్ జిల్లా తిమ్మనగర్ వరకు పర్యటించి విహంగ వీక్షణం చేశారు. సమస్య పరిష్కారానికి మంత్రి అధికారుల సలహా సూచనలు స్వీకరించారు. అనంతరం మంత్రి గంగాపూ ర్లో మిషన్ కాకతీయ 2వ ఫేజ్ పనులను ప్రారంభించారు. సాయంత్రం 4కి తిరిగి హెలికాప్టర్ ద్వారా మంత్రి వరంగల్ జిల్లా జనగామకు వెళ్లారు. చర్చనీయాంశమైన ‘సాక్షి’ కథనాలు గట్టులింగంపల్లి చెరువు గురించి మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమై న ‘గట్టు కదిలిక’, మంత్రి ఏరియల్ సర్వే కు రానున్నారనే విషయాలను మండల ప్రజలు ఆసక్తిగా చదివారు. ఈ చెరువు ప్రాజెక్టు రూపుదాలిస్తే మనూరు మండలానికి మంచి రోజులు వస్తాయని ప్రజ లు చర్చించుకోవడం కనిపించింది. మం త్రి పర్యటను ఆసక్తిగా తిలకించారు. ‘ఖేడ్’ దుఃఖం తీరుస్తా.. నీటి సమస్యను పరిష్కరిస్తా.. జిల్లాకు రూ.10 కోట్లు వస్తే.. ఖేడ్కే రూ.1.80 కోట్లు చిమ్నీమాయి కొడుకు పెళ్లికి వెళ్దాం మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్: ‘నారాయణఖేడ్ ని యోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి, హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా.. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను.. నా శక్తినంతా ఉపయోగించి ఖేడ్ నియోజకవర్గ ప్రజల దుఃఖం దూరం చేస్తా.. ఖేడ్‌ను దత్తత తీసుకుంటానని చెప్పాను.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా..’ అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉద్వేగంతో అన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా భూపాల్‌రెడ్డి ఎన్నికైన సందర్భంగా స్థానిక రహమాన్ ఫంక్షన్‌హాలులో మంగళవారం అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రేమాభిమానాలతో పనిచేసి ప్రజల ఆదరాభిమానాలను పొందుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారను. నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్యను తీర్చాల్సి ఉందన్నారు. నీళ్ల కోసం గోస పడుతున్న సర్దార్ తండాలోని చిమ్నీమాయి వంటి వారి సమస్యలను పరిష్కరిద్దామని, చిమ్నీమాయి కొడుకు పెళ్లికి కూడా వెళ్దామని మంత్రి అన్నారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడతానని మంత్రి అన్నారు. జిల్లాకు తాగునీటి కోసం రూ.10.80 కోట్లు రాగా తన సిద్దిపేకు కేవలం రూ.50 లక్షలు మాత్రమే తీసుకొని నారాయణఖేడ్‌కు రూ.1.80 కోట్లు ఇచ్చినట్లు తెలి పారు. ప్రాంతంలో గురుకులాలను ఏర్పాటుచేసి ఈ ప్రాంత విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకునేలా చూస్తానని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఖేడ్‌లో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ షురూ ఈ చిత్రంలో కనిపిస్తున్నది నారాయణఖేడ్‌లోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం. బెడ్రూం, డైనింగ్ హాల్ ఇతర ఆధునిక సాంకేతిక హంగులతో దీన్ని రూపొందించారు. మంగళవారం మంత్రి హరీశ్‌రావు దీన్ని ప్రారంభించారు. ప్రతి 15 రోజులకోసారి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఈ క్యాంపు ఆఫీస్‌లోనే బస చేస్తారు. రోజంతా ఇక్కడే గడిపి ఖేడ్ అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. మరోపక్క మంత్రి హరీశ్‌రావు సైతం వీలైతే 15 రోజులకు లేదా నెలకోసారి వస్తానని ప్రకటించారు. ఏళ్లకేళ్లుగా అభివృద్ధి జాడలేక నెర్రెలు బాసిన నారాయణఖేడ్ ఇప్పుడిప్పుడే కొత్తరూపు దాల్చుతోంది. నీళ్లు.. బళ్లు.. రోడ్లు.. భవనాలు ఇలా ప్రతి పనికి లెక్కగట్టి అధికారులు నిధులిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
ఇలా చేయడం పీఐబీకి అలవాటే....
న్యూఢిల్లీ : చెన్నై వరద పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన ఏరియల్ సర్వేకు సంబంధించిన ఫొటోల విషయంలో ఫొటోషాప్ చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) అభాసుపాలైన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ ఇలా అభాసుపాలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ పని చేసిన సమయంలో.. ఆయన ఫొటోలను కూడా ఇదే విధంగా ఫొటోషాప్ చేసి విడుదల చేసిందట. ఈ మేరకు తమ సర్వేలో వెల్లడైందని ఎన్డీటీవీ మంగళవారం వెల్లడించింది. అయితే అందుకు సంబంధించిన చిత్రాలు మాత్రం ప్రస్తుతం పీఐబీ వద్ద లేవని తెలిపింది. చెన్నై మహానగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెన్నై మహానగరంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అందులోభాగంగా ఆయన కిటికిలో నుంచి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆ దృశ్యాలను పీఐబీ ఫొటోషాప్ చేసి విడుదల చేసింది. ప్రధాని చూస్తున్న ఏరియల్ వ్యూలో అపార్టుమెంట్లు, బహుళ అంతస్తు భవనాలు అత్యంత సమీపంలో ఉన్నట్లు మార్చిన ఫొటోలను ఉంచారు. సహజంగా ఏరియల్ వ్యూ ద్వారా సర్వే చేస్తున్న వారికి భూ భాగం పైన అంతా పచ్చగా కనిపిస్తుంది తప్ప, ఇళ్లు, అపార్టుమెంట్ల వంటి భవనాలు స్పష్టంగా కనిపించవు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాలుక కరుచుకున్న పీఐబీలను వెబ్సైట్ నుంచి తొలగించి తిరిగి మామూలు ఫోటోలు పెట్టి వివరణ ఇచ్చుకుంది. అయితే మోదీ ఫొటోను రకరకాలుగా మార్ఫింగ్ చేసి నెట్జనులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యంగోక్తులు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ సర్వే నిర్వహించింది. -
రూ. 5 వేల కోట్లివ్వండి: జయలలిత
చెన్నై: కేంద్రం తమకు వరద సహాయంగా రూ.5000 కోట్లను ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి విన్నవించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఆమె ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆమె మంత్రులు, అధికారులతో సమావేశమై వరద బీభత్సానికి గురైన చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పన్నీర్ సెల్వంతో పాటు ఇతర మంత్రులకు వివిధ జిల్లాల్లో సహాయక చర్యల బాధ్యతలను అప్పగించారు. చెన్నైతో పాటు వరద ప్రభావానికి గురైన తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 460 పునరావాస కేంద్రాల్లో మొత్తం 1.64 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నట్లు జయలలిత ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే బాధితులకు 41 లక్షల ఆహార ప్యాకెట్లను అందించినట్లు తెలిపారు. అపార్టుమెంట్ల నుంచి బయటకు రాలేకపోతున్న వారికి బోట్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టగానే విద్యుత్ పునరుద్ధరిస్తామని తెలిపారు. -
తమిళనాడుకు 1,000 కోట్ల సాయం
అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. వర్షాలకు ఛిన్నాభిన్నమైన చెన్నైతో పాటు పలు జిల్లాల్లో ఆయన గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళనాడులో వర్ష బీభత్సాన్ని, ప్రజల ఇక్కట్లను ఆయన ప్రత్యక్షంగా తిలకించారు. కేంద్ర మంత్రి రాధాకృష్ణన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఐఎన్ఎస్ అడయార్ నావెల్ బేస్‌లో ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. ముందుగా తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ‘‘మీకు మద్దతుగా ఉంటాను’’ అంటూ ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడులో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తాన్ని తక్షణం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు చెప్పారు. ఇంతకు ముందు కేంద్రం తమిళనాడుకు రూ. 940 కోట్ల సాయం ప్రకటించిందని, ఇప్పుడు ప్రకటించిన మొత్తం దానికి అదనమని ఆయన తెలిపారు. తమిళనాడులోని దుర్భర పరిస్థితులను, జరిగిన నష్టాన్ని స్వయంగా చూశానని, ఈ ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ రోశయ్యతో సమావేశమైన ప్రధాని మోదీ రాష్ట్రంలో వరద బీభత్సంపై వారిని అడిగి తెలుసుకున్నారు. వారితో సంప్రదింపులు జరిపిన అనంతరం వరద సాయంపై మోదీ ప్రకటన చేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నైకి సమీపంలోని అరక్కోణంలోని ఐఎన్ఎస్ రాజాలి నావల్ వర్కింగ్ స్టేషన్‌కు చేరుకున్నారు. వరద సహాయ చర్యలు, తమిళనాడులో పరిస్థితులకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. అనంతరం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలైన చెన్నైతో పాటు కాంచీపురం, తిరువల్లురు జిల్లాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళానాడు ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి పనిచేస్తుందని ప్రధాని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు. -
సీఎం ఏరియల్ సర్వే
తిరువళ్లూరు: రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద బాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి జయలలిత అధికారులతో కలిసి హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత అక్టోబర్ 28 నుంచి భారీ వర్షాలు మెదలైన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు, చెన్నై తదితర జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. చెన్నై నగరాన్ని వ రదలు నిలువునా ముంచెత్తడంతో భారీగా ఏర్పడిన నష్టం ఏర్పడింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది. వాస్తవానికి బుధవారమే ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించినా, వాతావరణం అనుకూలించకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి జయలలిత హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. చెన్నై నుంచి ఉదయం 9.30 గంటలకు కొరట్టూరు పురం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి ఈకాడుతాంగెల్, కొలత్తూరు, అడయార్, వేళచ్చేరీ, తిరువొత్తియూర్, ఊరపాక్కం, తాంబరం, ముడిచ్చూర్, మడిపాక్కం, పాపాన్సత్రం, సోలింగనల్లూరు, వ్యాసార్పాడి తదితర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లాలోనీ సడయన్పాక్కం, మడత్తుకుప్పం, రేట్టేరీ, పుళల్, పూండీ, చెమరంబాక్కం, మనలిపుదునగర్ తదితర ప్రాంతాల్లోనూ దాదాపు మూడు గంటల పాటు పర్యటించి సర్వే నిర్వహించారు. అధికారులతో అత్యవసర సమావేశం : చెన్నై , కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న అధికారులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద భాదితులకు అందుతున్న సహయక చర్యలను అధికారుల నుండి అడి గి తెలుసుకున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, నష్టనివారణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను అదేశించారు. సహయక చర్యల్లో విమర్శలు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారినీ వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదేశించారు. ఇప్పటి వరకు ఏర్పాటు ఏర్పాటు చేసిన శిబిరాల్లో వుంటున్న నిరాశ్రయులకు చాప, బెడ్షీట్లను అంద జేయాలని ఆదేశాలు జారీ చేసారు. సహయక చర్యల్లో పాల్గొనండి : వరద బాధితులకు అండగా పార్టీ నేతలు ముందుండాలని ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న వారినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అవసరమైన ఆహారపదార్థాలను అందజేయాలని సూచించారు. చెరువులు, వాగులు వంకలు కొట్టుకు పోతే వాటిని సరిచేయడానికి పార్టీ నేతలు తమ వంతు సహకారాన్ని అందజేయాలని ఆయన సూచించారు. -
తమిళనాడులో మోదీ ఏరియల్ సర్వే
-
చెన్నైలో మోదీ ఏరియల్ సర్వే.. జయతో భేటీ
చెన్నై: భారీ వరదలతో అతలాకుతలమైన చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రత్యేక విమానంలో వేలూర్, రాజాలి ఎయిర్‌బేస్‌కు చేరుకున్న మోదీ, వరద నష్టంపై ఎయిర్‌పోర్టులో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో ఫొటోలను ఆయన పరిశీలించారు. వరదలో వాటిల్లిన నష్టంపై ఆరా తీశారు. ఏరియల్ సర్వే అనంతరం నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితో భేటీ అయ్యారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రాధ్యాన్యం ఇవ్వాలన్నారు. కాగా, తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు కారణంగా చెన్నై వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి భారత వైమానిక దళం సహాయం అందిస్తోంది. ఇప్పటికే వర్షాలతో తమిళనాడులో 269మందికి పైగా మృత్యువాత పడినట్లు సమాచారం. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఫొటోల కోసం క్లిక్ చేయండి