ఏరియల్ సర్వేలోనూ దొరకని మస్తాన్ జాడ | Aerial surveys to track down a missing Mastan | Sakshi
Sakshi News home page

ఏరియల్ సర్వేలోనూ దొరకని మస్తాన్ జాడ

Published Sat, Apr 4 2015 8:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

Aerial surveys to track down a missing Mastan

సంగం: పర్వతారోహకుడు మస్తాన్‌బాబు జాడ ఇంకా తెలియరాలేదు. రెండు రోజులుగా ఏరియల్ సర్వే చేసినా ఫలితం దక్కలేదు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంగంకు చెందిన బాబు ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే చేసిందని, అయినా జాడ తెలియరాలేదని భారతీయ రాయబార కార్యాలయ అధికారి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీటర్‌లో తెలిపారు. కొందరు బాబు స్నేహితులు పర్వతాలెక్కి అతని జాడ కోసం వెతుకుతున్నారు. బాబు అదృశ్యమై శుక్రవారానికి పదిరోజులైంది. కుమారుడి జాడ తెలియకపోవడంతో తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement