mastanbabu
-
శిఖరవీరుడికిచ్చే గౌరవమిదా?
► మల్లి మస్తాన్‌బాబు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ► కుటుంబానికి వివాదాస్పద భూమి కేటాయింపు ► కోర్టుకు వెళ్లిన ఇద్దరు మహిళలు ► అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు సంగం: జాతీయ జెండాను ప్రపంచంలోని అతి క్లిష్టమైన పర్వతాలపై రెపరెపలాడించి భారత కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన మల్లి మస్తాన్‌బాబును గుర్తించడంలో రాష్ట్రప్రభుత్వం ప్రతిసారి తప్పులు చేస్తూనే వస్తుంది. మస్తాన్‌బాబు అంత్యక్రియలకు హాజరైన రాష్ట్రప్రభుత్వ ప్రతిని ధులు ఆయన కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీల వర్షం కురిపించారు. అంత్యక్రియల అనంతరం హామీలను వదిలేశారు. మల్లి మస్తాన్‌బాబు వర్ధంతికి సైతం రాష్ట్రప్రభుత్వానికి చెందిన ప్రతినిధి హాజరుకాకపోగా జిల్లాస్థాయి అధికారులు కూడా రాలే దు. అలాగే మస్తాన్‌బాబు కుటుంబానికి ఐదెకరాల వ్యవసాయభూమి ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రుల మాటలు నీటిమూటలయ్యాయి. సంగం మండలంలోని పడమటిపాళెం సమీపంలో రెండెకరాల ఇసుక దిబ్బలను ప్రభుత్వం మస్తాన్‌బాబు కుటుంబానికి ఇచ్చింది. ఆ ఇసుక దిబ్బలు సైతం వివాదంలో ఉన్నా యి. వివాదాస్పద భూమిని మల్లి మస్తాన్‌బాబు కుటుంబానికి ఇచ్చి ఆ అమర సాహసవీరుడికి రాష్ట్రప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చేసింది. వివరాల్లోకెళితే పర్వతారోహకుడు మస్తాన్‌బాబు మృతి తర్వా త అంత్యక్రియలకు మంత్రులు నారాయణ, రావెల కిషోర్‌బాబు, శిద్దా రాఘవరావులు హాజరై ఐదు ఎకరాల భూమిని ఇస్తామని, మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మకు నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేస్తామని, మస్తాన్‌బాబు విగ్రహాలను సంగం, గాంధీజనసంఘంలో ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఇదేకాక మస్తాన్‌బాబు అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని సృ్మతివనంగా చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అంత్యక్రియల తర్వాత ఎవరూ ఈ హామీలను పట్టించుకోలేదు. వర్ధంతి వస్తుందని హడావుడిగా రెండెకరాల పొలాన్ని మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మకు ఇస్తున్నట్లు ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీరమణ గాంధీజనసంఘం సభలో ప్రకటించారు. అప్పట్లో రెండు ఎకరాలు ఇవ్వటమేంటని మల్లి సుబ్బమ్మ అధికారులను నిలదీశారు. జనవరి 26న గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లి సుబ్బమ్మకు పడమటిపాళెం గ్రామానికి చెందిన సర్వే నెం.551-1లో రెండెకరాల పొలాన్ని పట్టా రూపంలో అందజేశారు. అయితే ఈ పొలం తమకు చెందుతుందంటూ పడమటిపాళెంకు చెందిన పి శ్రీయుతమ్మ, ఆమె అత్త శ్రీనివాసమ్మలు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం మస్తాన్‌బాబు విషయంలో ప్రతిసారి నిర్లక్ష్యం చేయడంపై ప్రజలు, మల్లి మస్తాన్‌బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ పాపమే ఇలా చుట్టుకుంది ఆ రెండెకరాలు వివాదాస్పదం కావడానికి కారణం గతంలో రెవెన్యూ అధికారులు చేసిన పాపమే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నం.551-1లో 1904లో పొలాన్ని ఇనగంటి పోలిరెడ్డి పేరున ఉంది. తదనంతరం పెన్నానదికి వచ్చిన వరదల వల్ల ఈ పొలాలు మొత్తం ఇసుక దిబ్బలుగా మారిపోయాయి. తన భూములు ఇసుక దిబ్బలు అయ్యాయని, పనికిరాని ఇస్తిఫా భూములు కింద పోలిరెడ్డి 1936లో బ్రిటీష్ ప్రభుత్వానికి ఇచ్చి వేశారు. అప్పటినుంచి ఆ భూములు అనాధీనంగానే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. భారతప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డులను చేతితో రాసే సంప్రదాయాన్ని ఆ గ్రామంలోని కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 2007లో అప్పటి తహసీల్దారు ఈ భూములు శ్రీయుతమ్మ, శ్రీనివాసమ్మ పేర్లతో ఉన్నట్లు పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చారు. డైగ్లాట్‌లో వీరి పేరు లేక ఈనాం భూముల పేరుతో ఉండటంతో టైటిల్‌డీడ్‌ను అప్పటి కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ భూములు తమవేనంటూ ఇద్దరు మహిళలు కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారుల అవినీతి వల్లే ఇలా జరిగిందని, వెంటనే మల్లి మస్తాన్‌బాబు కుటుంబాన్ని గౌరవించి వివాదాస్పదం లేకుండా పొలాన్ని అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
మస్తాన్‌బాబుకు గ్యాలంటరీ అవార్డు ఇవ్వాలి
లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ మేకపాటి న్యూఢిల్లీ: ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్వతారోహణలో పేరు గడించిన మస్తాన్‌బాబుకు జాతీయ అవార్డు ప్రకటించాలి. తగిన గ్యాలంటరీ అవార్డుతో సత్కరించాలి. ఈ సూచనతో ఈ సభ ఏకీభవిస్తుందని ఆశిస్తున్నా’ అని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. అలాగే గిన్నిస్ రికార్డులు సాధించిన ఆయనను ఏప్రభుత్వమూ గుర్తించలేదన్నారు. మస్తాన్ భౌతికకాయాన్ని స్వస్థలానికి చేర్చినందుకు కృతజ్ఞతలనీ, అయితే ఆయన కుటుంబ సభ్యులకు పక్కా ఇల్లు లేదనీ వారికి ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ సానుకూలత వ్యక్తం చేశారు. కాగా, మేకపాటి మరికొందరు ఎంపీలు పోలీస్‌స్టేషన్‌లో మౌలిక వసతులపై అడిగిన ప్రశ్నకు త్వరలో ఎంపీఎఫ్ కింద నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతీభాయ్ చౌదరి తెలిపారు. -
మస్తాన్‌బాబు మళ్లీ పుడతాడు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు పూర్తి సంగం: పర్వతారోహణతో దేశకీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మల్లి మస్తాన్‌బాబు మళ్లీ పుడతాడని కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీ జనసంఘంలో శనివారం జరిగిన మస్తాన్‌బాబు అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత స్వగృహం వద్ద మస్తాన్‌బాబుకు పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మస్తాన్‌బాబు గొప్ప దేశభక్తికలవాడని కొనియాడారు. పార్లమెంటు, అసెంబ్లీలో నివాళులర్పించాలి: ఎంపీ మేకపాటి పార్లమెంటు, శాసనసభల్లో మస్తాన్‌బాబుకు నివాళులర్పించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మస్తాన్‌బాబు అంత్యక్రియల్లో పాల్గొని, ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ మస్తాన్‌బాబు అని కొనియాడారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు తొలుత మస్తాన్‌బాబు మృతదేహానికి నెల్లూరు కలెక్టర్ జానకి, ఎస్పీ గజరావు భూపాల్ నివాళులర్పిం చారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ మేకపాటి, రాష్ట్ర మంత్రులు నారాయణ, కిశోర్‌బాబు, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతంరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య పుష్పాంజలి ఘటించారు. తర్వాత ప్రత్యేక వాహనంలో మస్తాన్‌బాబు మృతదేహాన్ని ఆయన సొంతపొలంలోని ఖనన ప్రాంతానికి చేర్చారు. చివరిచూపు అనంతరం పోలీసుల సాయుధ వందనం తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కుటుంబసభ్యులు, ప్రజల అశ్రునయనాల మధ్య మస్తాన్‌బాబు పార్థివదేహాన్ని ఖననం చేశారు. పాఠ్యాంశంగా మస్తాన్‌బాబు జీవితం: రావెల హైదరాబాద్: ప్రముఖ పర్వతారోహకుడు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత మల్లి మస్తాన్‌బాబు జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చుతామని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. సచివాలయంలో శనివారం మస్తాన్‌బాబుకు మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. -
మల్లి మస్తాన్ బాబుకు ప్రముఖుల నివాళి
-
మల్లి మస్తాన్ బాబుకు ప్రముఖుల నివాళి
నెల్లూరు: పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మల్లి మస్తాన్ బాబు పేరు చిరస్థాయిగా నిలిచేలా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. మరోవైపు మల్లి మస్తాన్ బాబు అంతిమయాత్ర కొనసాగుతోంది. అధికార లాంఛనాలతో ప్రభుత్వం మస్తాన్ బాబు అంత్యక్రియలు నిర్వహించనుంది. -
స్నేహానికి చిరునామా మస్తాన్‌బాబు
ఫేస్బుక్లో హెర్నన్ బృందం సంగం: అర్జెంటీనాలోని ఆండిస్ పర్వతాల్లో మృతి చెందిన మస్తాన్‌బాబు స్నేహానికి ప్రతీక అని స్నేహితులైన హెర్నన్ బృందం ఫేస్బుక్లో కొనియాడింది. మల్లి మస్తాన్‌బాబు మృతదేహం కనుగొన్నప్పటి నుంచి భారతదేశానికి తరలించడంలో ఈ బృందం కృషి మరువలేనిది. రెండు దేశాల హెలికాప్టర్లు గాల్లో చక్కర్లు కొట్టినా మస్తాన్‌బాబు జాడను కనుగొనలేకపోయాయి. అయితే హెర్నన్ బృందం రంగంలోకి దిగి మస్తాన్‌బాబు మృతదేహాన్ని కనుగొంది. తమతో అప్పటివరకు గడిపిన మస్తాన్‌బాబు విగతజీవిగా పడివుండడం చూసి జీర్ణించుకోలేకపోయామని ఈ బృందం ఫేస్బుక్లో పేర్కొంది. భారతీయుడైన మస్తాన్‌బాబు అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాడని పేర్కొంది. అగ్నికీలలు ఎగిసిపడుతున్నా అగ్ని పర్వతాలను అవలీలగా అధిరోహించిన ధైర్యశాలి అని మస్తాన్ స్నేహితులు పేర్కొన్నారు. తనను అక్కున చేర్చుకున్న ప్రకృతి అంటే మస్తాన్‌బాబుకు ఎనలేని ఇష్టమని, పర్వతారోహణ సమయంలో వేడి నీళ్లను గాలిలోకి వ దిలి తిరిగి తనపై చల్లని నీరుగా పడటాన్ని తీపి అనుభూతిగా తమతో పంచుకునేవాడని తెలిపింది. సమయపాలన, కార్యదీక్ష, పట్టుదల, కృషికి మారుపేరు మస్తాన్‌బాబు అని గుర్తుతెచ్చుకున్నారు. అటువంటి ధీరుడు ప్రపంచంలో లేడని హెర్నన్ బృందం చెబుతూ కన్నీటపర్యంతమైంది. మృతదేహం తరలింపు నేడు మస్తాన్‌బాబు మృతదేహాన్ని బుధవారం అర్జెంటీనా నుంచి తరలించనున్నారు. హెర్నన్ బృందం తరలింపు ప్రక్రియను పూర్తిచేసింది. మరణ ధ్రువీకరణ పత్రం, భారతదేశానికి పంపే ధ్రువీకరణ పత్రం, పోస్ట్‌మార్టం నివేదికలన్నీ పూర్తిచేశారు. మస్తాన్‌బాబు సోదరి డాక్టర్ దొరసానమ్మకు యూరోపియన్ వీసా లేకపోవడంతో ప్రక్రియ జాప్యమైంది. దీంతో మంగళవారం మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు విమానయానానికి కావాల్సిన ప్రక్రియను పూర్తిచేశారు. బుధవారం మృతదేహాన్ని ఏజియా నుంచి దోహాకు తరలిస్తారు. అక్కడి నుంచి 24వ తేదీన ఉదయం 7 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి తేనున్నారు. అక్కడ భారత విదేశీ వ్యవహారశాఖ ఆధ్వర్యంలో చెన్నై విమానాశ్రయానికి, అక్కడి నుంచి నెల్లూరు జిల్లా సంగం మండలంలోని మస్తాన్‌బాబు స్వగ్రామం గాంధీజనసంఘంకు తరలించనున్నారు. -
‘అధికారిక లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు’
నెల్లూరు(రెవెన్యూ): పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు తెలిపిన సమయం ప్రకారం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్టు ఏపీ సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మస్తాన్‌బాబు మృతదేహం ఈ నెల 20న స్వగ్రామమైన గాంధీజనసంగంకు తేనున్నట్టు అతని సోదరి డాక్టర్ దొరసానమ్మ శనివారం ఫేస్బుక్ ద్వారా తెలిపారు. సోమవారం ఖతార్ ఎయిర్‌లైన్స్ ద్వారా మస్తాన్‌బాబు మృతదేహాన్ని అర్జెంటీనాలోని బ్యూనస్ఎయిర్స్ నుంచి తేనున్నట్లు చెప్పారు. -
మోదీగారూ.. స్పందించండి
మా తమ్ముడి మృతదేహం వెంటనే తెప్పించండి అర్జెంటీనా గవర్నర్‌తో మాట్లాడండి అమెరికాలో అయితేఈపాటికే తెచ్చేవారు! మల్లిబాబు సోదరి దొరసానమ్మ వేడుకోలు సంగం: ఆండీస్ పర్వతారోహణ క్రమంలో ప్రాణాలు విడిచిన మస్తాన్‌బాబు మృతదేహాన్ని స్వదేశానికి చేర్చడంలో జరుగుతున్న జాప్యంపై మస్తాన్‌బాబు అక్క డాక్టర్ దొరసానమ్మ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. మృతదేహం జాడ తెలిసి 2 రోజులు గడిచినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రమూ స్పందించలేదని, అదే అమెరికా పౌరుడై ఉంటే ఆ దేశ ప్రభుత్వం ఈ పాటికే స్పందించి తగు విధంగా చర్యలు తీసుకుని ఉండేదని ఆమె అన్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంగంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మస్తాన్‌బాబు మృతదేహం ఆచూకీ లభ్యమై రెండు రోజులు దాటుతున్నా నేటికీ కిందికి తీసుకురాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అమెరికా దేశస్తులైతే ఈ సమయానికి మృతదేహాన్ని తెచ్చి ఉండేవారన్నారు. అకోకన్గువా పర్వతారోహణలో ఓ పర్వతారోహకుడు మృతిచెందగా, అతని మృతదేహాన్ని ఆయా దేశస్తులు ఆగమేఘాలపై తీసుకువచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ఉదహరించారు. ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే స్పందించి అర్జెంటీనా గవర్నర్‌తో మాట్లాడాలని, మృతదేహాన్ని త్వరితగతిన దేశానికి తీసుకువచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. భారతీయుల సత్తా ప్రపంచానికి చాటాలని తాపత్రయపడిన తన తమ్ముడి విషయంలో కేంద్రం తగువిధంగా స్పందించాలని కోరారు. వాతావరణం అనుకూలించి ఉంటే నేడు 10 పర్వతాలను అధిరోహించిన తొలి భారతీయుడిగా తన తమ్ముడు గుర్తింపు పొంది ఉండేవాడని అన్నారు. ఆ కోరిక నేను నెరవేరుస్తా: తన తమ్ముడు ఆండీస్ పర్వతారోహణ క్రమంలో ప్రాణాలు విడిచాడని, ఈ పర్వతాన్ని తాను అధిరోహిస్తానని దొరసానమ్మ ప్రకటించారు. నేషనల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి పర్వతారోహణపై అవగాహన కల్పించాలని తాను, మస్తాన్‌బాబు అనుకున్నట్టు తెలిపారు. హిమాలయాల నుంచి సిక్కిం వరకు నడిచి వెళ్లిన ఘనత తన తమ్ముడిదని ఆమె గుర్తుచేశారు. తన చివరి నిమిషం వరకు భారతీయతను చాటిచెప్పేలా రుద్రాక్ష, జాతీయ పతాకం, భగవ ద్గీతను పర్వతాల్లో ఉంచి తుదిశ్వాస విడిచాడన్నారు. మస్తాన్‌బాబు బతికున్నంత కాలం పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడైనా అతని మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చి సహకరించాలన్నారు. అర్జెంటీనా గవర్నర్ సంతకం పెడితే ఆర్మీ కమాండర్లు మృతదేహాన్ని తెచ్చేందుకు వెళతారని, ఇది జరిగితే 4 రోజుల్లో మృతదేహం దేశానికి చేరుతుందన్నారు. -
కడదాకా ఆధ్యాత్మిక చింతన...
ఆండీస్ పర్వతారోహణకు భగవద్గీత, రుద్రాక్షమాలను తీసుకెళ్లిన మస్తాన్‌బాబు తెలుగు సహా మూడు భాషల్లో జాతీయ పతాకంపై చివరి సంతకం సంగం (నెల్లూరు): జీవితాంతం ఆధ్యాత్మిక చింతనతో మెలిగిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు తన చివరి మజిలీలోనూ అదే మార్గాన్ని అనుసరించాడు. ఆండీస్ పర్వతారోహణ సమయంలో రుద్రాక్షమాల, భగవద్గీత వెంట తీసుకెళ్లాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తాను చిక్కుకున్నా వాటిని భద్రపరచి అందరికీ కనిపించేలా చేశాడు. భగవద్గీత, రుద్రాక్షమాల చెదరకుండా వాటిని రాళ్లగూటిలో అమర్చాడు. అలాగే జాతీయ పతాకంపై తెలుగు సహా మూడు భాషల్లో తన సంత కం చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తన పేరులోని తొలి రెండు అక్షరాలైన ‘ఎం ఎ’ను ఇంగ్లిష్‌లో, ‘స్తా’ అనే అక్షరాన్ని హిందీలో, ‘న్’ అనే అక్షరాన్ని తెలుగులో రాసి భారతీయతను చాటాడు మస్తాన్‌బాబు. 10 రోజుల్లో భారత్‌కు మృతదేహం మస్తాన్‌బాబు మృతదేహాన్ని 10 రోజుల్లో భారత్‌కు పంపేలా చూస్తామని చిలీలోని భారత ఎంబసీ తెలిపినట్లు అతడి సోదరి డాక్టర్ మస్తానమ్మ చెప్పారు. గాంధీ జనసంగంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ చిలీలో ప్రతికూల వాతావరణం ఉండటంతో మృతదేహాన్ని తెచ్చేందుకు జాప్యం జరుగుతోందన్నారు. మస్తాన్‌బాబు మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించి తగిన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌లను కోరినట్లు చెప్పారు. కాగా, మస్తాన్‌బాబు ఆచూకీ కోసం చేపట్టిన ఏరియల్ సర్వేకు అయిన 50 వేల డాలర్ల ఖర్చును అందరి సహకారంతో అతని స్నేహితులు సమకూర్చారు. అలాగే స్వయంగా పర్వతారోహణ చేసి అతని మృతదేహాన్ని కనుగొన్నారు. -
ఏరియల్ సర్వేలోనూ దొరకని మస్తాన్ జాడ
సంగం: పర్వతారోహకుడు మస్తాన్‌బాబు జాడ ఇంకా తెలియరాలేదు. రెండు రోజులుగా ఏరియల్ సర్వే చేసినా ఫలితం దక్కలేదు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంగంకు చెందిన బాబు ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే చేసిందని, అయినా జాడ తెలియరాలేదని భారతీయ రాయబార కార్యాలయ అధికారి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీటర్లో తెలిపారు. కొందరు బాబు స్నేహితులు పర్వతాలెక్కి అతని జాడ కోసం వెతుకుతున్నారు. బాబు అదృశ్యమై శుక్రవారానికి పదిరోజులైంది. కుమారుడి జాడ తెలియకపోవడంతో తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది. -
మా మస్తాన్‌బాబును వెతికిపెట్టండి
హైదరాబాద్: పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండా పోయిన తమ కుమారుడు మస్తాన్‌బాబును గుర్తించేందుకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరారు. మార్చి 24 నుంచి అతడి ఆచూకీ లభ్యం కావడం లేదని మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ బుధవారం మీడియాకు తెలిపింది. 12 ఏళ్ల నుంచి తన సోదరుడు ఎన్నో పర్వతాలు అధిరోహించాడని తెలిపారు. అత్యధిక పర్వతాలను అధిరోహించిన వ్యక్తిగా రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా ఆ రికార్డులతో అటూ ఆసియాకు, భారత్‌కు రాష్ట్రానికి పేరు తీసుకురావాలనే తన ఆకాంక్ష అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడని ఆమె వివరించారు. అతడి ఆచూకీకోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపులు చేపట్టాలని అర్జెంటీనా, చీలీ దేశాలనుకోరుతున్నామని అన్నారు. తమను ఆదుకోవాలని తమ సోదరుడిని గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కుటుంబసభ్యులు సాయం కోరారు. -
మా మస్తాన్‌బాబును వెతికిపెట్టండి