హైదరాబాద్: పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండా పోయిన తమ కుమారుడు మస్తాన్బాబును గుర్తించేందుకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరారు. మార్చి 24 నుంచి అతడి ఆచూకీ లభ్యం కావడం లేదని మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ బుధవారం మీడియాకు తెలిపింది. 12 ఏళ్ల నుంచి తన సోదరుడు ఎన్నో పర్వతాలు అధిరోహించాడని తెలిపారు.
అత్యధిక పర్వతాలను అధిరోహించిన వ్యక్తిగా రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా ఆ రికార్డులతో అటూ ఆసియాకు, భారత్కు రాష్ట్రానికి పేరు తీసుకురావాలనే తన ఆకాంక్ష అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడని ఆమె వివరించారు. అతడి ఆచూకీకోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపులు చేపట్టాలని అర్జెంటీనా, చీలీ దేశాలనుకోరుతున్నామని అన్నారు. తమను ఆదుకోవాలని తమ సోదరుడిని గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కుటుంబసభ్యులు సాయం కోరారు.
మా మస్తాన్బాబును వెతికిపెట్టండి
Published Wed, Apr 1 2015 1:55 PM | Last Updated on Sat, Jul 28 2018 3:15 PM
Advertisement
Advertisement